MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode: వీడని కిడ్నాప్ డ్రామా-దీపపై సుమిత్ర కోపం-పోలీసులతో దాసు- అంతా షాక్

Karthika Deepam 2 Today Episode: వీడని కిడ్నాప్ డ్రామా-దీపపై సుమిత్ర కోపం-పోలీసులతో దాసు- అంతా షాక్

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఏప్రిల్ 21వ తేదీ)లో జ్యో కోసం సుమిత్ర ఏడుపు. పోలీసులతో ఎంట్రీ ఇచ్చిన దాసు. దీపను ఇంట్లో నుంచి గెంటేసిన సుమిత్ర. దాసుపై సీరియస్ అయిన శివన్నారాయణ. జ్యోపై పారు డౌట్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...  

3 Min read
Author : Kavitha G
Published : Apr 21 2026, 08:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో నా కూతురిని ఎలాగైనా కాపాడుకోవాలి. మీరు డబ్బులు రెడీ చేయండి మామయ్య అని ఏడుస్తుంది సుమిత్ర. ఈ విషయం పోలీసులకు తెలియకుండా చూసుకోవాలి అంటుంది. అంతలో పోలీసులతో ఎంట్రీ ఇస్తాడు దాసు. అంతా షాక్ అవుతారు. ఏంటి మామయ్య, పోలీసులతో వచ్చావు అని అడుగుతాడు కార్తీక్. జ్యోత్స్నను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పావు కదా అల్లుడు, అందుకే పోలీసులను తీసుకొచ్చాను అంటాడు దాసు. శివన్నారాయణ కలగజేసుకొని మీరు కాసేపు వెయిట్ చేయండి నేనే వచ్చి మీతో మాట్లాడుతాను అని పోలీసులకు చెప్తాడు.

ఆ తర్వాత నిన్ను పోలీసులకు చెప్పమని ఎవరు చెప్పారు? అయినా ఈ ఫ్యామిలీతో నీకు సంబంధం ఏంటి అని సీరియస్ అవుతాడు శివన్నారాయణ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
దీపను గెంటేసిన సుమిత్ర
Image Credit : Jiohotstar

దీపను గెంటేసిన సుమిత్ర

బాబాయి ఏదో తెలియక చెప్పారు అని దీప అంటుంటే.. ముందు నువ్వు బయటకు వెళ్లవే అని దీపను గెంటేస్తుంది సుమిత్ర. కార్తీక్.. అత్త ఏం చేస్తున్నావు అని అడిగితే.. నీ భార్యకు నా కూతురంటే ఇష్టంలేదు. ఇలాంటి వాళ్లు పక్కన ఉటే నా కూతురు ప్రాణాలతో రాదు అని ఏడుస్తుంది సుమిత్ర. ఇదే మనసులో ఏదో కోరుకుంది. అందుకే నా కూతురుకి ఇలా జరిగిందని అంటుంది సుమిత్ర.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode: సుమిత్రకు షాకిచ్చిన దశరథ- జైలు నుంచి బయటకు వచ్చిన వైరా-జ్యో డౌట్
Related image2
Karthika Deepam 2 Today Episode: వైరాతో చేతులు కలిపిన జ్యో- కిడ్నాప్ ప్లాన్‍తో రూ. 30 కోట్లు డిమాండ్
38
సుమిత్ర సీరియస్
Image Credit : Jiohotstar

సుమిత్ర సీరియస్

అమ్మా నేననేందుకు అలా కోరుకుంటాను అంటుంది దీప. నా కూతురిని నువ్వు అన్న ప్రతి మాట నాకు గుర్తుంది. నువ్వు నటించకు అంటుంది సుమిత్ర. దీపకు పారిజాతం సపోర్ట్ గా వస్తే పారుపై కూడా సీరియస్ అవుతుంది సుమిత్ర. నీ కూతురికి ఏం కాదు అంటాడు కార్తీక్. అయితే వెళ్లి తీసుకురా అంటుంది సుమిత్ర. జ్యోత్స్నకు ఏం కాదు చెల్లెమ్మ అనుకుంటూ శ్రీధర్ కూడా వస్తాడు. నీకు ఎవరు చెప్పారు అని అడుగుతాడు శివన్నారాయణ. దాసు చెప్పాడు అంటే, ఇంకా ఎవరితో చెప్పకండీ అని సీరియస్ గా చెప్తాడు శివన్నారాయణ.

48
శివన్నారాయణ ఫైర్
Image Credit : Jiohotstar

శివన్నారాయణ ఫైర్

మరోవైపు బయట నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు దాసు. పారు వెళ్లి.. జ్యోత్స్న కిడ్నాప్ నిజమేనా.. నాకెందుకో అనుమానంగా ఉంది అంటుంది. నా కూతురికి ఏమైందోనని భయంగా ఉందమ్మా అంటాడు దాసు. అది నీ కూతురు కాదు కదా అంటుంది పారు. మొదట్లో తనే నా కూతురు అనుకున్నాను కదా ఆ ప్రేమ, అభిమానం ఎక్కడికి పోతాయి అని కవర్ చేస్తాడు దాసు. జ్యోత్స్న డబ్బు కోసం నాటకం ఆడుతుందేమో అని నా డౌట్ అంటుంది పారు. ఆ మాట విని సీరియస్ అవుతాడు శివన్నారాయణ.

డబ్బు కోసం నాటకం ఆడాల్సిన అవసరం నా మనుమరాలికి ఏంటి? ఈ ఆస్తికి వారసురాలు తను. జ్యోత్స్న అడిగితే నేను డబ్బు ఇవ్వనా? నువ్వు ఆ మాట అన్నావంటే దాని వెనకాల ఏదో ఉంది. నీకు ఏదో తెలుసు చెప్పు అని సీరియస్ గా అడుగుతాడు శివన్నారాయణ. ఇంతలో ఒకసారి లోపలికి రండి నాన్న.. మళ్లీ ఒక వీడియో వచ్చింది అని పిలుస్తాడు దశరథ.

58
జ్యోత్స్న యాక్టింగ్
Image Credit : Jiohotstar

జ్యోత్స్న యాక్టింగ్

వీడియోలో మమ్మీ వీళ్లు నన్ను కొడుతున్నారు. ప్లీజ్ నన్ను కాపాడండి అంటుంది జ్యోత్స్న. మరింత కంగారు పడుతుంది సుమిత్ర. వాడు అంత డబ్బు అడిగాడంటే ఇచ్చాక కూడా జ్యోత్స్నను సేఫ్ గా వదిలేస్తాడని నమ్మకం లేదు అంటాడు శ్రీధర్. అందుకే ఒక స్పెషల్ ఆఫీసర్ ని రమ్మన్నాను. మనం అన్ని వైపుల నుంచి ప్రయత్నం చేయాలి అంటాడు శివన్నారాయణ.

68
సుమిత్ర ఏడుపు
Image Credit : Jiohotstar

సుమిత్ర ఏడుపు

ఆ ఆఫీసర్ వీడియో చూసి, మీరు రీసెంట్ గా ఎవరితో అయినా గొడవ పడ్డారా వంటి ప్రశ్నలు అడుగుతాడు. కిడ్నాప్ చేసినవాళ్లు కచ్చితంగా మీకు తెలియని వాళ్లే. ఒకవేళ తెలిసిన వాళ్లైతే మీ అమ్మాయి వాళ్లను గుర్తుపట్టి చెప్పేది అంటాడు. అప్పుడే మళ్లీ కాల్ చేస్తాడు వైరా. డబ్బు రెడీనా? అని అడుగుతాడు. రెడీగా ఉందని చెప్తాడు దశరథ. మేము మా అమ్మాయితో మాట్లాడాలి అంటాడు దశరథ. నా నెంబర్ ట్రేస్ చేయాలంటే ఆ మాత్రం మాట్లాడాలి. నేను చెప్పినా వినకుండా పోలీసులకు చెప్పారు కదా.. మీ కూతురిపై ఆశలు వదులుకోండి అని ఫోన్ కట్ చేస్తాడు వైరా. డబ్బులు ఇచ్చేస్తే వాడు జ్యోత్స్నను వదిలేస్తాడు కదా, ఇవన్నీ ఎందుకు? అని ఏడుస్తూ గోల చేస్తుంది సుమిత్ర.

78
వైరా డౌట్
Image Credit : Jiohotstar

వైరా డౌట్

మరోవైపు ఫుడ్ తింటూ ఉంటుంది జ్యోత్స్న. డబ్బులు వస్తాయంటావా? అని అడుగుతాడు వైరా. నువ్వు ఇచ్చిన వార్నింగ్ కు మా అమ్మ అక్కడ గుండె పగిలిపోయేలా ఏడుస్తుంటుంది. నేను ఇంటికి వెళ్లేదాకా పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోదు. కాబట్టి కచ్చితంగా డబ్బులు వస్తాయి. నువ్వు టెన్షన్ పడకు అంటుంది జ్యోత్స్న. రాకపోతే నిన్ను కచ్చితంగా చంపేస్తాను అంటాడు వైరా.

88
కాంచన కంగారు
Image Credit : Jiohotstar

కాంచన కంగారు

మరోవైపు జ్యోత్స్నను ఎవరో కిడ్నాప్ చేయడం ఏంటని కంగారు పడుతుంటుంది కాంచన. అప్పుడే శ్రీధర్, దీప వెళ్తారు. ఏమైందని అడిగితే జ్యోత్స్నను కిడ్నాప్ చేసి, రూ. 30 కోట్లు డిమాండ్ చేస్తున్నారని కాంచనతో చెప్తాడు శ్రీధర్. అయ్యో ఇప్పుడు మా అన్నయ్య పరిస్థితి ఏంటి అని అడుగుతుంది కాంచన. మీ అన్నయ్య బాగానే ఉన్నాడు. కానీ జ్యోత్స్నను తీసుకురాకపోతే సుమిత్రే బతికేలా లేదు అంటాడు శ్రీధర్. అయ్యో ఒక సమస్య తీరిపోయింది అనుకునేలోపు ఇంకో సమస్య వస్తోంది అని బాధపడుతుంది కాంచన. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Mukesh Gowda: రిషిగా బుల్లితెరని ఊపేశాడు, ఇప్పుడు బిగ్‌ బాస్‌ హౌజ్‌ షేక్‌.. ముఖేష్‌ గౌడ గ్రాండ్‌ ఎంట్రీ
Recommended image2
Bigg Boss 10 Varshini: ఆ ఘటనతో పెళ్లికి దూరం, క్యాస్టింగ్‌ కౌచ్ కామెంట్‌తో దుమారం.. వర్షిణి గ్రాండ్‌ ఎంట్రీ
Recommended image3
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌తో లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: సుమిత్రకు షాకిచ్చిన దశరథ- జైలు నుంచి బయటకు వచ్చిన వైరా-జ్యో డౌట్
Recommended image2
Karthika Deepam 2 Today Episode: వైరాతో చేతులు కలిపిన జ్యో- కిడ్నాప్ ప్లాన్‍తో రూ. 30 కోట్లు డిమాండ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved