MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode:పారుతో ఓ రేంజ్‍లో ఆడుకున్న కార్తీక్-ఆపరేషన్ సక్సెస్-బిడ్డ బతికిందా?

Karthika Deepam 2 Today Episode:పారుతో ఓ రేంజ్‍లో ఆడుకున్న కార్తీక్-ఆపరేషన్ సక్సెస్-బిడ్డ బతికిందా?

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (మార్చి 20వ తేదీ)లో దాసు సాయంతో పారును బయటకు పంపిన కార్తీక్. మనుమరాలు దొరికిందని తల్లితో అబద్ధం చెప్పిన దాసు. సుమిత్ర, దీపలకు ఆపరేషన్ చేసిన డాక్టర్. పారుతో ఓ ఆట ఆడుకున్న కార్తీక్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే  

3 Min read
Author : Kavitha G
Published : Mar 20 2026, 08:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో మీరు టెన్షన్ పడకండి డాక్టర్. పారును నేను పంపించేస్తాను అని చెప్తాడు కార్తీక్. అప్పుడే పారిజాతానికి దాసు ఫోన్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా అనుకుంటూనే లిఫ్ట్ చేస్తుంది పారు. నేను కాస్త బిజీగా ఉన్నాను తర్వాత మాట్లాడుతానురా అని చెప్తుంది పారు.

నీకో విషయం చెప్పాలి అనుకున్నాను అమ్మా.. సరే నువ్వు బిజీగా ఉన్నావు కదా వదిలేయ్ అంటాడు దాసు. పర్లేదు చెప్పు అంటుంది పారు. నువ్వు దూరం చేసిన నీ మనుమరాలు దొరికిందమ్మా అని అబద్దం చెప్తాడు దాసు. నేను హాస్పిటల్ బయటే ఉన్నాను అని చెప్పగానే దాసు దగ్గరికి పరిగెడుతుంది పారు.

27
ఆపరేషన్ థియేటర్ కు దీప
Image Credit : Jiohotstar

ఆపరేషన్ థియేటర్ కు దీప

పారు బయటకు వెళ్లిపోవడంతో దీపను ఆపరేషన్ కోసం తీసుకెళ్లాలి అనుకుంటుంది డాక్టర్. శౌర్య ఇచ్చిన బొమ్మను చూసి దీప, కార్తీక్ ఎమోషనల్ అవుతారు. ఆ తర్వాత దీప, డాక్టర్ తో కలిసి ఆపరేషన్ థియేటర్ కి వెళ్తుంది. మరోవైపు పారు బయటకు పరిగెత్తుతూ శివన్నారయణను ఢీ కొడుతుది. ఎందుకు ఇంత హడావిడిగా వెళ్తున్నావు అంటే.. మనుమరాలు దొరికిందని నోరు జారుతుంది. ఏం చెప్పావు అని శివన్నారాయణ గట్టిగా అడిగితే కవర్ చేసి దాసు దగ్గరికి వెళ్లిపోతుంది.

చిన్నగా మత్తులోకి జారుకుంటున్న జ్యోత్స్న.. నాకు ఏమైంది? ఈ డాక్టర్ నాకు ఏం ఇంజక్షన్ ఇచ్చింది? అయినా నేను దీప దగ్గర గ్రానీని కాపలాగా పెట్టాను కదా.. తను చూసుకుంటుందిలే అని దీప, దీప అని కలవరిస్తుంది. ఇంతలో ఆపరేషన్ థియేటర్ కి వచ్చిన దీప.. జ్యోత్స్న నన్ను చూసిందని కంగారు పడుతుంది. ఏం కాదు. తను మత్తులో ఉంది. చూడలేదు, గుర్తుపట్టలేదు అని చెప్తుంది డాక్టర్. ఆ తర్వాత సుమిత్ర, దీపలకు ఆపరేషన్ మొదలుపెడుతుంది డాక్టర్.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode:దీపకు కాపలాగ పారు-దాసు హెల్ప్-కార్తీక్‌కు తప్పిన ప్రమాదం-శౌర్య సేఫ్
Related image2
Karthika Deepam 2 Today Episode:జ్యో మాస్టర్ ప్లాన్-శౌర్య కిడ్నాప్-కార్తీక్ టెన్షన్-జ్యోకు వార్నింగ్
37
స్పృహ తప్పిపడిపోయిన పారు
Image Credit : Jiohotstar

స్పృహ తప్పిపడిపోయిన పారు

మరోవైపు జెట్ స్పీడ్ లో దాసు దగ్గరికి వెళ్తుంది పారు. నా మనుమరాలు ఎక్కడ అని అడుగుతుంది. ఎవరో తెలిసింది అన్నాను కానీ.. తీసుకొచ్చాను అని చెప్పానా.. అంటాడు దాసు. తెలిశాక ఎందుకు తీసుకురాలేదు అంటుంది పారు. తను రానంది. జరిగిన విషయం చెప్పాను. మీలాంటి దుర్మార్గుల దగ్గరకు రాను అని చెప్పింది అంటాడు దాసు. అమ్మ నువ్వు ముందు వాటర్ తాగి అని వాటర్ లో ట్యాబ్లెట్ కలిపి ఇస్తాడు దాసు. ఆ వాటర్ తాగిన పారు మత్తులోకి జారుకుంటుంది.

47
హోమం పూర్తి
Image Credit : Jiohotstar

హోమం పూర్తి

మరోవైపు సుమిత్ర ఆపరేషన్ పూర్తవుతుంది. అటు దశరథ హోమం కూడా పూర్తవుతుంది. నేను హాస్పిటల్ కి వెళ్తాను గురువు గారు అని చెప్తాడు దశరథ. అంతా మంచే జరుగుతుంది వెళ్లమని ఆశీర్వదిస్తాడు గురువు. 

57
దీప ఎక్కడుంది?
Image Credit : Jiohotstar

దీప ఎక్కడుంది?

మరోపక్క జ్యోత్స్న మత్తులో నుంచి బయటకు వస్తుంది. మా మమ్మీ ఎక్కడుంది? దీప ఎక్కడుంది? నేను దీపను ఆపరేషన్ థియేటర్లో చూసినట్లు అనిపించింది అని చెప్తుంది. డాక్టర్ కవర్ చేస్తుంది. నేను మా మమ్మీని చూడాలి అని జ్యోత్స్న లేచేందుకు ప్రయత్నిస్తుంది. లేవలేక డాక్టర్ వైపు చూస్తుంది. మీకు ఇప్పుడే కదా ఆపరేషన్ జరిగింది. రెస్ట్ తీసుకోండని చెప్పి వెళ్లిపోతుంది డాక్టర్.

67
పారుతో ఆడుకున్న కార్తీక్
Image Credit : Jiohotstar

పారుతో ఆడుకున్న కార్తీక్

మరోవైపు పారిజాతం స్పృహలోకి వచ్చేసరికి బెడ్ మీద ఉంటుంది. చుట్టూ కార్తీక్, దాసు, శివన్నారాయణ ఉంటారు. నాకు ఏమైంది. నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అంటుంది పారు. కళ్లు తిరిగి పడిపోతే బెడ్ మీద వేశామని చెప్తాడు శివన్నారాయణ. దాసు ఫోన్ చేశాడు అందుకే బయటకు వెళ్లాను అని చెప్తుంది పారు. నేను ఎప్పుడు ఫోన్ చేశాను? నేను ఇప్పుడే కదా అమ్మా వచ్చాను అని పారుకు షాక్ ఇస్తాడు దాసు. కార్తీక్ కూడా పారుతో ఓ రేంజ్ లో ఆడుకుంటాడు. దీప ఎక్కడుంది, నేను దీపను చూడాలి అనుకుంటూ దీప గదిలోకి వెళ్తుంది పారు.

77
జారుకున్న పారు
Image Credit : Jiohotstar

జారుకున్న పారు

గదిలో దీపను చూసి నువ్వు ఇక్కడే ఉన్నావా? అని రిలాక్స్ అవుతుంది. ఇంతలా పరుగెత్తుకొని వచ్చి దీపను చూడాల్సిన అవసరం ఏంటో అంటాడు పారు. నా అనుమానాలు నాకు ఉన్నాయిలేరా అంటుంది పారు. అంతా ఏదో కలల ఉందిరా.. ఒకసారి నన్ను గిచ్చు అని అడుగుతుంది పారు. కార్తీక్ గట్టిగా గిల్లుతాడు. గట్టిగా అరుస్తుంది పారు.

కొందరు చేసిన తప్పులు, పాపాలు ఎక్కడ బయటపడతాయోనని భయపడుతున్నారు అంటాడు కార్తీక్. నేను ఇంకాసేపు ఇక్కడే ఉంటే శౌర్య గురించి అడిగేలా ఉన్నాడు అని మనసులో అనుకుంటుంది పారు. ఏ ఊకోరా నాకు కాస్త ఇబ్బందిగా ఉంది. వెళ్లి రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి వెళ్లిపోతుంది. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Brahmamudi Serial Today Episode: పవర్ ఆఫ్ అటార్ని నుంచి రేఖను తప్పించాలని అపర్ణ ప్లాన్, ఇందు ఫోన్ పగలగొట్టిన రాజు
Recommended image2
Karthika Deepam 2 Today Episode:దీపకు కాపలాగ పారు-దాసు హెల్ప్-కార్తీక్‌కు తప్పిన ప్రమాదం-శౌర్య సేఫ్
Recommended image3
Brahmamudi Serial Today Episode: బైక్ కోసం తమ్ముడిని ఇరికేంచేసిన రాజు, ఇందును అవమానించిన ఐశ్వర్య
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:దీపకు కాపలాగ పారు-దాసు హెల్ప్-కార్తీక్‌కు తప్పిన ప్రమాదం-శౌర్య సేఫ్
Recommended image2
Karthika Deepam 2 Today Episode:జ్యో మాస్టర్ ప్లాన్-శౌర్య కిడ్నాప్-కార్తీక్ టెన్షన్-జ్యోకు వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved