MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • OTT: ఓటీటీలోకి కామెడీ సిరీస్‌.. సేవ్‌ ది టైగర్స్ 3 స్ట్రీమింగ్‌ ఎందులో, ఎప్పట్నుంచి అంటే

OTT: ఓటీటీలోకి కామెడీ సిరీస్‌.. సేవ్‌ ది టైగర్స్ 3 స్ట్రీమింగ్‌ ఎందులో, ఎప్పట్నుంచి అంటే

OTT: కామెడీ, ట్రెండీ అంశాలు, ఫ్యామిలీ ఎలిమెంట్లతో రూపొందిన వెబ్‌ సిరీస్‌ `సేవ్‌ ది టైగర్స్`. ఇప్పటికే రెండు సీజన్లు వచ్చి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడో సీజన్‌ రాబోతుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : May 24 2026, 06:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12
సేవ్‌ ది టైగర్స్ సీజన్‌ 3 రాబోతుంది
Image Credit : Asianet News

సేవ్‌ ది టైగర్స్ సీజన్‌ 3 రాబోతుంది

`సేవ్‌ ది టైగర్స్` అనే వెబ్‌ సిరీస్‌ కామెడీగా సాగుతూ నవ్వులు పూయించింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌ ఇప్పటికే విశేష ఆదరణ పొందింది. రెండు సీజన్లలో సక్సెస్‌ అయ్యింది. ఈ క్రమంలో ఇప్పుడు మూడో సీజన్‌ రాబోతుంది. ఇది జియో హాట్‌ స్టార్‌లో రాబోతుండటం విశేషం. మొదటి రెండు సీజన్లలో సరదా, హాస్యం, అదిరిపోయే డైలాగులు, రిలేషన్‌షిప్ డ్రామాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సిరీస్‌ మూడో సీజన్ రానుండటంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2023లో వచ్చిన ‘సేవ్ ది టైగర్స్’ ఫ్రాంచైజీ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా క‌నెక్ట్ అయ్యింది. తాజాగా రూపొందుతోన్న `సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3` కి మ‌హి వి.రాఘ‌వ్‌, ప్ర‌దీప్ అద్వైతం షో ర‌న్న‌ర్స్‌. ఈ సీజ‌న్ మ‌రింత అస‌క్తిక‌ర‌మైన ట్విస్టులు, కొత్త పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ని రిలీజ్‌ చేశారు.

 కాస్మిక్ ట్విస్ట్‌తో సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3..

తాజాగా రిలీజ్ చేసిన ‘సేవ్ ది టైగ‌ర్స్ సీజ‌న్ 3’ పోస్టర్ చూస్తుంటే కథలో ఆస‌క్తిక‌ర‌మైన కాస్మిక్ ట్విస్ట్ ఉండ‌బోతుంద‌నే విష‌యం తెలుస్తోంది. రెండు వైవిధ్య‌మైన ప్ర‌పంచాల మ‌ధ్య జ‌రిగే ప్ర‌త్యేక‌మైన సోష‌ల్ ఎక్స్‌పెరిమెంట్ క‌థ‌ను ఇందులో హైలైట్‌గా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై టీమ్‌ స్పందిస్తూ, మూడు జంట‌లు.. అందులోని భ‌ర్త‌లు ప‌డే ఇబ్బందులు.. వారి చుట్టూ తిరిగే కామెడీ డ్రామాకు కాస్మిక్ ట్విస్ట్ అనేది ఎగ్జ‌యిటింగ్ కాన్సెప్ట్‌గా మారింది. ఇది క‌థ‌ను స‌రికొత్త విధానం చూపించ‌టంతో పాటు సమాజంపై అర్థవంతమైన కామెంట్‌కి అవకాశం ఉంది. దీంతో ప్రేక్షకులు మ‌రోసారి నవ్వులు, రిలేషన్‌షిప్ సమస్యలు, సరదా, కామెడీ డ్రామా ఇలా అన్నీ అంశాలు క‌లిసున్న ఆల్ ఇన్ వ‌న్ ప్యాకేజ్‌గా సీజ‌న్‌3ని ఎంజాయ్ చేయొచ్చు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
22
సీజ‌న్‌3లో సరికొత్త స‌ర్‌ప్రైజ్‌గా వెన్నెల కిషోర్‌
Image Credit : Asianet News

సీజ‌న్‌3లో సరికొత్త స‌ర్‌ప్రైజ్‌గా వెన్నెల కిషోర్‌

మొదటి రెండు సీజన్లలో ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను గెలుచుకున్న‌ ప్రియ‌ద‌ర్శి-జోర్దార్ సుజాత‌, కృష్ణ చైత‌న్య‌-దేవియాని శ‌ర్మ‌, అభిన‌వ్ గోమ‌టం-పావ‌ని గంగిరెడ్డి జంట‌లు సీజన్ 3లోనూ అల‌రించ‌నున్నారు. ఇక ఈ సీజ‌న్‌3లో అందరికీ పెద్ద సర్‌ప్రైజ్‌గా వెన్నెల కిషోర్ త‌న‌దైన కామెడీతో న‌వ్వించ‌బోతున్నారు. పోస్ట‌ర్ చూస్తుంటే ఆయ‌న పాత్ర చాలా ఆస‌క్తిక‌రంగా క‌నిపిస్తోంది. వెన్నెల కిషోర్ పాత్ర క‌థ‌లో అనూహ్య‌మైన మ‌లుపులు తీసుకురావ‌ట‌మే కాకుండా, అద్భుత‌మైన కామెడీ టైమింగ్‌తో పాటు గుర్తుండిపోయేలా డ్రామ‌టిక్ పెర్ఫామెన్స్‌తో సిరీస్‌ను మ‌రింత ఎంట‌ర్‌టైనింగ్‌గా మార్చ‌బోతున్నారు` అని తెలిపింది. ఈ సిరీస్‌ త్వరలోనే జియోస్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.

న‌టీన‌టులు: ప‌్రియ‌ద‌ర్శి-జోర్దార్ సుజాత‌, కృష్ణ చైత‌న్య‌- దేవియాని శ‌ర్మ‌, అభిన‌వ్ గోమ‌టం-పావ‌ని గంగిరెడ్డి, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు

క్రియేటెడ్ బై మ‌హి వి.రాఘ‌వ్‌, ప్రదీప్ అద్వైతం

ద‌ర్శ‌క‌త్వం: శ్రీరామ్ ఎర‌గం

నిర్మాత‌లు: శివ మేక‌, సాహితి చింత‌ల‌పూడి

సినిమాటోగ్ర‌ఫీ: విశ్వేశ్వ‌ర్ శిల‌కోటి

మ్యూజిక్: అజ‌య్ అర‌సాడ‌

ర‌చ‌న‌: విజ‌య్ న‌మోజు, డిఎస్ గౌత‌మ్

Related Articles

Related image1
Indrajaa: ఆడవారే ఇప్పుడు ఎక్కువగా మోసం చేస్తున్నారు.. నటి ఇంద్రజ షాకింగ్‌ కామెంట్‌
Related image2
Renu Desai: అకీరా నందన్‌కి గాయాలు, చెత్త ప్రభుత్వం వల్లే.. రేణు దేశాయ్‌ సంచలన వ్యాఖ్యలు

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఓటీటీ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Indrajaa: ఆడవారే ఇప్పుడు ఎక్కువగా మోసం చేస్తున్నారు.. నటి ఇంద్రజ షాకింగ్‌ కామెంట్‌
Recommended image2
Rukmini Vasanth: స్విమ్మింగ్ పూల్‌లో రుక్మిణి వసంత్‌.. బికినీ ఫోటోలు వైరల్‌.. అసలు నిజం ఇదే
Recommended image3
Renu Desai: అకీరా నందన్‌కి గాయాలు, చెత్త ప్రభుత్వం వల్లే.. రేణు దేశాయ్‌ సంచలన వ్యాఖ్యలు
Related Stories
Recommended image1
Indrajaa: ఆడవారే ఇప్పుడు ఎక్కువగా మోసం చేస్తున్నారు.. నటి ఇంద్రజ షాకింగ్‌ కామెంట్‌
Recommended image2
Renu Desai: అకీరా నందన్‌కి గాయాలు, చెత్త ప్రభుత్వం వల్లే.. రేణు దేశాయ్‌ సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved