MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode: సూపర్ ట్విస్ట్- కాంచన డౌట్- జ్యో డీఎన్ఏ టెస్ట్- పారుతో దాసు అబద్ధం

Karthika Deepam 2 Today Episode: సూపర్ ట్విస్ట్- కాంచన డౌట్- జ్యో డీఎన్ఏ టెస్ట్- పారుతో దాసు అబద్ధం

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (మార్చి 30వ తేదీ)లో జ్యోకు పారిజాతం బుద్ధులు వచ్చాయన్న కాంచన. డీఎన్ఎ రిపోర్ట్స్ ద్వారా నిజం తెలుసుకున్న జ్యో. పారుతో దీపే నీ మనుమరాలు అని అబద్ధం చెప్పిన దాసు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

3 Min read
Author : Kavitha G
Published : Mar 30 2026, 08:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్ లో కాంచన, కార్తీక్, దీప మాట్లాడుకుంటూ ఉంటారు. మామయ్య వీలునామాలో 15 నెలల తర్వాత ఆస్తి మేనల్లుడి కుటుంబానికి చెందుతుందని రాయకపోతే.. జ్యోత్స్న ఇప్పట్లో పెళ్లి చేసుకోదమ్మా. ఆస్తి ఎప్పటికైనా నాకే కదా అనే ధైర్యంతో అలాగే ఉండిపోతుంది అంటాడు కార్తీక్. నిజమేరా.. అది అలాంటిదే. అయినా తనకి అన్నీ మా పారిజాతం పిన్ని బుద్ధులు వచ్చాయి. 

నాకు ఒక్కోసారి డౌట్ వస్తుంది తను మా అన్నయ్య కూతురేనా అని... అంటుంది కాంచన. మొన్న ఓ వార్త చదివాను చిన్నప్పుడే పిల్లలను మార్చారంటా.. జ్యోత్స్నను కూడా ఎవరైనా మార్చారా అని అంటుంది కాంచన. అయినా మా వదినను కాపాడింది జ్యోత్స్నే కదా.. తనే మా అన్నయ్య కూతురులే అని చెప్తుంది కాంచన. జ్యోత్స్నను నేను సెట్ చేస్తాను కదా అంటాడు కార్తీక్. ఆ పనిచేసి పుణ్యం కట్టుకోరా అంటుంది కాంచన.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
నిజం తెలుసుకున్న జ్యోత్స్న
Image Credit : Jiohotstar

నిజం తెలుసుకున్న జ్యోత్స్న

మరోవైపు ఒకతను వచ్చి జ్యోత్స్నకు డీఎన్ఏ రిపోర్ట్స్ ఇస్తాడు. వీటి ప్రకారం దీప గారి డీఎన్ఏ సుమిత్ర గారెతో మ్యాచ్ అయింది. జ్యోత్స్న గారెతో మ్యాచ్ కాలేదు. అంటే దీపే సుమిత్ర కూతురు అని చెప్తాడు. నా అనుమానమే నిజమైంది. దీప, బావ, దాసు కలిసి డాక్టర్ ని మ్యానేజ్ చేసి ఉంటారు. కానీ ఈ నిజం ఇంకా ఎంతమందికి తెలుసు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. వచ్చిన అతనికి డబ్బులు ఇచ్చి పంపిస్తుంది.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode: జ్యోకు దిమ్మతిరిగే షాక్- కూతురి పిల్లలకు ఆస్తి- దశరథ వీలునామా
Related image2
Karthika Deepam 2 Today Episode: దశరథ ప్రేమ-కార్తీక్ కొత్త ప్లాన్-కాశీకి దాసు సలహా-ఆస్తి వద్దన్న దీప
37
పారుకు దాసు ఫోన్
Image Credit : Jiohotstar

పారుకు దాసు ఫోన్

అది చూసిన పారిజాతం జ్యోత్స్నదగ్గరికి వచ్చి ఎవరతను, ఎందుకు డబ్బులిచ్చావు అని అడుగుతుంది. ఆఫీసులో నాకు నమ్మిన బంటులే.. ఏదో కష్టాల్లో ఉన్నాడట. సాయం చేశాను అని కవర్ చేస్తుంది జ్యోత్స్న. అంతలో పారుకు దాసు ఫోన్ చేస్తాడు. దాసును కలవడానికి వెళ్తుంది.

47
తల్లితో అబద్ధం చెప్పిన దాసు
Image Credit : Jiohotstar

తల్లితో అబద్ధం చెప్పిన దాసు

ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు అంటుంది పారు. ముందు ఈ వాటర్ తాగమ్మా అంటాడు దాసు. ఆ రోజు కూడా ఇలాగే వాటర్ ఇచ్చావు. నేను స్పృహ తప్పి పడిపోయాను. నేను కన్ఫ్యూజన్ లో ఉన్నాను కాబట్టి నిన్ను గట్టిగా అడగలేదు. సరే వదిలెయ్ ఇప్పుడు ఎందుకు పిలిచావో చెప్పు అంటుంది పారు. నీ మనుమరాలు గురించి చెప్పడానికి పిలిచానమ్మా అంటాడు దాసు. 

ఎవరో చెప్పు అని ఆత్రంగా అడుగుతుంది పారు. కాసేపు సస్పెన్స్ తర్వాత.. దీపే నీ మనుమరాలు అని అబద్ధం చెప్తాడు దాసు. ఈ విషయం ఎవ్వరితో చెప్పొద్దు అని కూడా చెప్తాడు. కొడుకు చెప్పిన విషయాన్ని నమ్మిన పారు.. వెంటనే దీపను చూడడానికి బయల్దేరుతుంది.

57
సుమిత్ర సీరియస్
Image Credit : Jiohotstar

సుమిత్ర సీరియస్

మరోవైపు జ్యోత్స్న, సుమిత్ర, దశరథ, శివన్నారాయణ భోజనం చేస్తూ ఉంటారు. జ్యోత్స్న రిపోర్ట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైందని అడుగుతాడు దశరథ. ఏం లేదు డాడీ తినండి మీతో మాట్లాడాలి అంటుంది జ్యోత్స్న. వీలునామా గురించే అయితే నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇందాక చేసింది చాలు అని సీరియస్ అవుతుంది సుమిత్ర. నువ్వు మీ మమ్మీని ప్రశాంతంగా ఉండనివ్వవా అని కోప్పడతాడు దశరథ. తను ఏదో మాట్లాడాలి అంటోంది కదా.. ముందు తినండి.. తర్వాత చూద్దాం అంటాడు శివన్నారాయణ.

67
తండ్రి ఫ్రెండ్లీగా ఉండాలి
Image Credit : Jiohotstar

తండ్రి ఫ్రెండ్లీగా ఉండాలి

మరోవైపు దీప, కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటారు. బుక్స్ బ్యాగ్ లో పెట్టుకోవాలని శౌర్యతో చెప్పాలి కదా అంటాడు కార్తీక్. నువ్వు చెప్పొచ్చు కదా.. తనని ఒక్క మాట కూడా అనవు అంటుంది దీప. కూతురితో తండ్రి ఫ్రెండ్లీగా ఉండాలి. తల్లి స్ట్రిక్ట్ గా ఉండాలి. కొడుకుతో తండ్రి స్ట్రిక్ట్ గా ఉండాలి. తల్లి ఫ్రెండ్లీగా ఉండాలి అంటాడు కార్తీక్. ఇంతలో పారు డోర్ కొడుతుంది. ఇప్పుడు ఆవిడెందుకు వచ్చింది అంటుంది దీప. నువ్వు కాస్త పక్కకు వెళ్లు.. నేను పిలిచినప్పుడు రా.. ఏం జరిగినా ఎంజాయ్ చెయ్ అని చెప్తాడు కార్తీక్.

77
పారు ప్రేమ
Image Credit : Jiohotstar

పారు ప్రేమ

డోర్ తీయగానే పారు లోపలికి వస్తుంది. దీప ఏది రా, ఎక్కడుందని వెతుకుతుంది. కాంచన, అనసూయ ఏమైంది ఈవిడకు అనుకుంటారు. ఏంటి పిన్ని ఇంకా అనాల్సిన మాటలు ఏమైనా మిగిలి ఉన్నాయా అంటుంది కాంచన. నేను అందుకోసం రాలేదు కాంచన అంటుంది పారు. దీపను పిలువురా, నేను తనని చూడాలి అంటుంది పారు. కార్తీక్ పిలవగానే, దీప స్లో మోషన్ లో నడుచుకుంటూ వస్తుంది. దీపను హగ్ చేసుకొని మనుమరాలా అంటుంది పారు. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: జ్యోకు దిమ్మతిరిగే షాక్- కూతురి పిల్లలకు ఆస్తి- దశరథ వీలునామా
Recommended image2
Karthika Deepam 2 Today Episode: దశరథ ప్రేమ-కార్తీక్ కొత్త ప్లాన్-కాశీకి దాసు సలహా-ఆస్తి వద్దన్న దీప
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved