- Home
- Entertainment
- Bigg Boss 10: ఎనిమిదో వారం షాకింగ్ ఎలిమినేషన్, బిగ్ బాస్ తెలుగు 10 హౌజ్ నుంచి రైతు బిడ్డ ఔట్?
Bigg Boss 10: ఎనిమిదో వారం షాకింగ్ ఎలిమినేషన్, బిగ్ బాస్ తెలుగు 10 హౌజ్ నుంచి రైతు బిడ్డ ఔట్?
బిగ్ బాస్ తెలుగు 10 హౌజ్ నుంచి ఎనిమిదో వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో కామనర్ గా వచ్చిన స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేషన్ అయినట్టు సమాచారం.

ట్విస్ట్ లు, టర్న్ లతో సాగుతున్న బిగ్ బాస్ తెలుగు 10
బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ రసవత్తరంగా సాగుతుంది. రోజు రోజుకి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో బిగ్ బాస్ అలరిస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తోంది. శుక్రవారం ఎపిసోడ్‌లో సడెన్ ఎలిమినేషన్‌కి తెరలేపి షాకిచ్చాడు బిగ్ బాస్. రెడ్ జోన్‌లో ఉన్నవారిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. ఇతర కంటెస్టెంట్ల ఓటింగ్ ద్వారా, ఆడియెన్స్ ఓటింగ్ ద్వారా ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి ఉండగా, సుధీర్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే ముఖేష్ వద్ద ఉన్న పవర్‌తో.. ఝాన్సీ వద్ద ఉన్న పవర్‌ని రీ యూజ్ చేసే అవకాశం కల్పించారు. సుధీర్ జస్ట్ లో సేఫ్ అయ్యాడు.
8వ వారం నామినేషన్‌లో ఉన్నది వీళ్లే
ఈ క్రమంలో ఇప్పుడు ఎనిమిదో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం సింగర్ ఝాన్సీ, రోహిత్, వంశీ, రామ్ ప్రసాద్, శివ, సుధీర్, వర్షిణి, రామకృష్ణ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. సుధీర్ సేవ్ అయిన నేపథ్యంలో మిగిలిన వారి మధ్యనే ఈ వారం ఎలిమినేషన్ ఉంటుంది. అయితే ఈ వారంలో వంశీ, రోహిత్, రామ్ ప్రసాద్ టాప్ ఓటింగ్‌లో దూసుకుపోతున్నారు. వర్షిణి, శివ, రామకృష్ఱ, ఝాన్సీ మధ్య ఎలిమినేషన్‌కి ఛాన్స్ ఉంది.
రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్?
ఈ క్రమంలో ఇప్పుడు షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్ ఉండబోతుందట. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా రాణించిన సింగర్ ఝాన్సీ ఎలిమినేట్ అయ్యిందని సమాచారం. తక్కువ ఓటింగ్ వచ్చిన నేపథ్యంలో ఆమెని హౌజ్ నుంచి పంపించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. మరికాసేపట్లో పూర్తి క్లారిటీ రానుంది. ఇప్పటికైతే ఝాన్సీ ఎలిమినేషన్ కన్ఫమ్ అని టాక్. ఏంజరుగుతుందో చూడాలి.
అయితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌కి ఛాన్స్ ఉందట. ఇప్పటికే సుధీర్ సేవ్ అయ్యాడు. మరి మరో ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనేది చూడాలి. మొత్తంగా చాలా స్ట్రాంగ్‌గా ఉన్న రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ ఇలా ఎలిమినేట్ కావడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అదే సమయంలో వరుసగా కామనర్స్ ని హౌజ్ నుంచి పంపిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.





