- Home
- Entertainment
- TV
- Gunde Ninda Gudi Gantalu: మౌనిక మీద సంజూ కుట్ర, బాలు ఫోన్ కొట్టేసిన రోహిణీ, వీడియో దొరికిందా?
Gunde Ninda Gudi Gantalu: మౌనిక మీద సంజూ కుట్ర, బాలు ఫోన్ కొట్టేసిన రోహిణీ, వీడియో దొరికిందా?
Gunde Ninda Gudi Gantalu: బాలు, మీనాలను ఇబ్బంది పెట్టడానికి రోహిణీ తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరోవైపు బాలు చెల్లెలు మౌనికను ఆమె భర్త సంజూ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు.మరి, నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో టీవీ కంటే ముందుగా మీ కోసం...

తండ్రితో కలిసి సంజూ కుట్ర
మౌనికను సంజూ హాస్పిటల్ లో చెకప్ తీసుకొని వెళతాడు. పిల్లలు పుట్టే అవకాశం ఉందో లేదో తేలుసుకోవడానికి వెళతాడు. తనకు నిజంగా పిల్లలు పుట్టరని చెప్పి.. ఇంట్లో నుంచి గెంటేయాలని సంజూ తన తండ్రితో కలిసి ప్లాన్ వేసుకుంటాడు. అందుకే మౌనికను హాస్పిటల్ కి తీసుకొని వెళతాడు. ఈ విషయం తెలిసి సంజూని వాళ్ల అమ్మ తిడుతుంది. అయినా.. సంజూ పెద్దగా పట్టించుకోడు. నీలకంఠం సీరియస్ అవుతాడు. ‘ ఈ కాలం పిల్లలు ఇలానే ఉన్నారు.. విత్తనం వేస్తే మొక్క మొలుస్తుందో లేదో తెలియాలి కదా’ అని నీలకంఠం అంటాడు. ఆ మాటలకు మౌనిక షాక్ అవుతుంది. ‘ అంటే.. మనం హాస్పటల్ కి వెళ్లింది..నాలో లోపం ఉందో లేదో తెలుసుకోవడానికా?’ అని అడుగుతుంది.‘ అవును.. నాకు నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి డౌట్ ఉంది.. అందుకే క్లారిటీ వస్తుందని ఇలా చేశాను. అసలే.. మా నాన్న ఈ ఇంటి వారసుల కోసం ఆశపడుతున్నాడు. వాళ్ల కోరిక కూడా తీర్చాలి కదా’ అని సంజూ అంటాడు. ‘ ఇప్పుడు నీకు ముగ్గురు అన్నలు ఉన్నారు. వాళ్లకు పెళ్లి జరిగి సంవత్సరం అయింది అయినా ఇంకా పిల్లలు లేరు. అంటే.. వాళ్లలో ఏదో లోపం ఉందనే కదా.. అలాగే నీలో కూడా లోపం ఉందేమో అనిపించింది.. అందుకే తెలుసుకోమని పంపించాను’ అని నీలకంఠం అంటాడు. ఆ మాటలకు మౌనిక చాలా బాధపడుతుంది. సంజూ బయటకు వెళ్లిన తర్వాత.. తన అత్తతో బాధను పంచుకుంటుంది. ఆమె.. ధైర్యం చెబుతుంది.
‘ నాకు మాత్రం పిల్లలను కనాలని ఉండదా? పెళ్లైన ప్రతి అమ్మాయి తల్లి కావాలని అనుకుంటుంది. ఆ రోజు కోసమే నేను ఎంత ఎదురు చూస్తున్నానో నాకు తెలుసు. కానీ.. ఏ రోజు అయినా నా దగ్గరకు ప్రేమగా వచ్చారా’ అని మౌనిక ఏడుస్తుంది. ‘ పగతో ఉన్నవాడికి ప్రేమ ఎలా తెలుస్తుంది..? వాడు మారాలని కోరుకోవడం తప్ప మనం ఏం చేయలేం’ అని అత్త చెబుతుంది. తర్వాత.. నీలకంఠం.. హాస్పిటల్ కి ఫోన్ చేసి.. రిపోర్ట్స్ లో మౌనికకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అని వచ్చేలా చేయమని చెబుతాడు. తర్వత.. ఈ కారణం చూపించి ఇంట్లో నుంచి గెంటేయాలని కొడుక్కి చెబుతాడు.
బాలు ఫోన్ కొట్టేసిన రోహిణీ..
సీన్ కట్ చేస్తే.. బాలు, మీనా ఇద్దరూ కలిసి దాచిన డబ్బులను సేవ్ చేస్తూ ఉంటారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్న తర్వాత.. ముసలివాళ్లం అయితే.. ఎలా ఉంటాం అని ఊహించుకుంటారు. ఇద్దరూ ముసలి వాళ్ల గెటప్ లో భలే ఉంటారు. ఆ వయసు వచ్చిన తర్వాత కూడా రూమ్ కట్టేలేకపోయాం అని మాట్లాడుకుంటారు. తర్వాత.. అది తలుచుకొని మీనా నవ్వేస్తుంది.
ఉదయాన్నే బాలు నిద్రపోతూ ఉంటే.. అతని ఫోన్ తీసుకోవడానికి రోహిణీ వస్తుంది. సరిగ్గా ఫోన్ తీసుకునే సమయానికి బాలు నిద్ర లేస్తాడు. ఫోన్ తీసుకొని.. తన మొబైల్ కి ఛార్జింగ్ లేదని.. లేటు అయిపోయిందంటూ మీనాని పిలుస్తాడు. తర్వాత బాలు ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్నానానికి వెళతాడు. అదే కరెక్ట్ టైమ్ అని బాలు ఫోన్ తీసుకోవడానికి రోహిణీ వెళ్తుంది. కానీ.. బాలు.. మీనా ని పిలవడంతో.. రోహిణీ మంచం కింద దాక్కుంటుంది. లోపలికి వచ్చిన మీనాని బాలు బయటకు వెళ్లనివ్వడు. దీంతో.. రోహిణీ అక్కడే ఇరుక్కోవాల్సి వస్తుంది. బాలు, మీనాతో రొమాన్స్ చేస్తుంటే.. ఆ మాటలు వినలేక రోహిణీ తలబాదుకుంటుంది. ఈ లోగా.. బాలు ఫోన్ లో వీడియో వెతుకుతుంది. దానిని తన ఫోన్ కి పంపుకుందా అనుకునేలోగా.. బాలు ఫోన్ స్విచ్ఛాఫ్ అవుతుంది.
తప్పించుకున్న రోహిణీ..
మరోవైపు.. రోహిణీ కోసం మనోజ్ వెతుకుతూ ఉంటాడు. తనకు రూ.500 అవసరం అని.. ఇంట్లో అందరినీ అడుగుతూ ఉంటాడు. ప్రభావతిని అడిగితే తన దగ్గర లేవు అని అంటుంది. సత్యం అని అడిగితే.. ఇవ్వను పొమ్మంటాడు. దీంతో.. రోహిణీని వెతుక్కుంటూ బాలు రూమ్ కి మనోజ్ వెళతాడు. అయితే.. రోహిణీ ఇక్కడ లేదు అని బాలు చెబుతాడు.మనోజ్ అక్కడి నుంచి వెళ్తుంటే.. మీనా బాలు కోసం పూరీ తీసుకొని వస్తుంది. ఇద్దరూ ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. అవన్నీ చూడలేక...రోహిణీ తల బాదుకుంటుంది. ఇక.. బయటకు వెళ్లడానికి బయలుదేరుతూ.. బాలు తన ఫోన్ కోసం వెతుకుతాడు. దొరికిపోయాను దేవుడా అని రోహిణీ భయంతో చచ్చిపోతుంది. ఇక.. బాలు, మీనా ఫోన్ కోసం వెతుకుతుంటే.. అప్పుడు రోహిణీ బయటకు వస్తుంది. వెంటనే ఫోన్ ఛార్జింగ్ లో పెట్టి.. అక్కడి నుంచి జారుకుంటుంది.
ఇక.. ఫోన్ కనపడటం లేదని వెతుకుతూ ఉంటే.. మీనా వచ్చి ఫోన్ అక్కడే ఉందని తెచ్చి ఇస్తుంది. అయితే.. ఇందాక లేదు.. ఇప్పుడు ఎలా వచ్చింది అని బాలు ఆలోచిస్తూ ఉంటాడు. మనోజ్ తన ఫోన్ కొట్టేయాలని చూశాడు అని అంటాడు. అయితే.. అప్పుడే వచ్చిన రోహిణీ.. మనోజ్ కి ఆ అవసరం లేదు అంటూ.. తీసుకొని వెళ్లిపోతుంది.
రవిపై శ్రుతి తల్లికి అనుమానం...
మరోవైపు రవి రెస్టారెంట్ కోసం గ్రాసరీ సెక్షన్ కి వెళతాడు. అక్కడికి వాళ్ల మేడమ్ నీతూ వస్తుంది. ఇద్దరూ కలిసి.. రెస్టారెంట్ లోకి కావాల్సిన వాటిని షాపింగ్ చేయాలని డిస్కస్ చేసుకుంటారు.వీళ్లు షాపింగ్ చేస్తున్న దగ్గరికే శ్రుతి వాళ్ల అమ్మ కూడా వస్తుంది. అల్లుడి గారి పక్కన ఉన్న అమ్మాయి ఎవరా అని ఆలోచిస్తూ ఉంటే.. రవి వెళ్లి మాట్లాడతాడు. అయితే.. నీతూ.. రవిని బేబీ అని పిలుస్తూ లాక్కెళ్లడం చూసి ఆమెకు కోపం వస్తుంది. అల్లుడు గారెని ఈ అమ్మాయి వలలో వేసుకునేలా ఉంది.. వెంటనే శ్రుతికి చెప్పాలి లేకపోతే.. కూతురు జీవితం నాశనం అయిపోతుంది అని భయపడుతుంది. వెంటనే శ్రుతికి ఫోన్ చేసి.. నీతో మాట్లాడాలని చెప్పి వెళ్తుంది.
మరోవైపు శివ కాలేజీకి వెళ్తుంటే.. అదే సమయానికి మీనా తన తల్లి దగ్గరకు వస్తుంది. శివ పూర్తిగా మారిపోయాడు అని వాళ్లు చాలా సంతోషపడతారు. తన తమ్ముడిని ఖర్చులకు ఉంచుకోమని.. మీనా డబ్బులు ఇస్తుంది. తనకు గాయం అయినా.. తన తమ్ముడు మారిపోయాడు అని మీనా సంబరపడుతుంది. అప్పుడే ఒకావిడ వచ్చి.. ఇంట్లో బొమ్మల కొలువు పెట్టడం వల్ల వాళ్ల కూతురికి పిల్లలు పుట్టారు అని చెబుతుంది. అది విన్న పూజారి గారు.. మీనాని కూడా ఇంట్లో బొమ్మల కొలువు పెట్టమని సలహా ఇస్తాడు. సమస్యలన్నీ తీరిపోతాయి అని చెబుతారు.మీనా ఆలోచనలో పడుతుంది. బాలు ఒప్పుకుంటే చేస్తాను అని చెబుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

