ఎప్పుడు ఏం జరుగుతంది.. నెక్ట్స్ సీన్ ఏంటో అనేలా.. ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తించే సినిమా.. ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయ్యింది. మరి ఈమూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?
డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ట్రైలర్...
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ మేకర్స్ నుంచి రాబోతోన్న మరో ఇంట్రెస్టింగ్, క్రైమ్, థ్రిల్లర్ మూవీ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.
పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ..
‘అమ్మికి ఏమైందో అని భయంగా ఉంది రమేషా’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ను ఓపెన్ చేశారు. ఆ తరువాత కూతురి మీద తండ్రికి ఉన్న ప్రేమను చూపించారు. ‘నాకు జాబ్ ఎక్కడ వచ్చిందో తెలుసా?’.. ‘ఫస్ట్ జీతం రాంగానే తీసుకెళ్లి మా నాన్న చేతిలో పెట్టాలి’ అని చెప్పే డైలాగ్స్‌తో కూతురికి తండ్రి మీదున్న ప్రేమను చూపించే ప్రయత్నం చేశారు. ఆ తరువాత కూతురు మిస్ అవ్వడం, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభమయ్యే సీన్లతో ట్రైలర్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ‘కళ్ల ముందే ఏదో ఉంది.. కానీ నేను ఏదో మిస్ అవుతున్నాను.. నేను ఏం మిస్ అవుతున్నాను’ అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రెబెకా జోసెఫ్ పాత్రలో ఉదయ భాను చెప్పిన డైలాగ్స్‌తో చాలానే ట్విస్టులు సినిమాలో ఉన్నాయని అర్థం అవుతోంది.
ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడు?
ఇక స్వాతి అనే అమ్మాయి ఎలా మిస్ అయింది? దీని వెనుకున్నది ఎవరు? హాస్టల్‌లో స్నేహితులు కారణమా? ఆఫీసులో గొడవలా? ఈ కేసులో తండ్రి పాత్ర ఏంటి? అనే పలు రకాల ప్రశ్నల్ని లేవనెత్తేలా ట్రైలర్‌ను అద్భుతంగా కట్ చేశారు. ఇక ఈ మిస్టరీలు తేలాలంటే ఫిబ్రవరి 27 వరకు ఆగాల్సిందే. ఈ సినిమాకు మైదాల శ్రుతి మాటల్ని రాయగా.. శ్రీ రామ్ మద్దూరి నేపథ్య సంగీతాన్ని అందించారు. ఇక ఈ చిత్రానికి చంద్రశేఖర్ జి.వి. ఎడిటర్‌గా, రామ్ కె మహేష్ కెమెరామెన్‌గా పని చేశారు. మున్ముందు మరింత ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేసేందుకు చిత్రయూనిట్ రెడీ అవుతోంది.


