MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode: డాక్టర్ ని కలిసిన దశరథ- తప్పించుకున్న దాసు- జ్యోను ఫాలో అయిన పారు

Karthika Deepam 2 Today Episode: డాక్టర్ ని కలిసిన దశరథ- తప్పించుకున్న దాసు- జ్యోను ఫాలో అయిన పారు

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఫిబ్రవరి 13వ తేదీ)లో తల్లి చేతిని జ్యోత్స్న చేతిలో పెట్టిన కాంచన. జ్యోపై అనుమానంతో డాక్టర్ ని కలిసిన దశరథ. తెలివిగా తప్పించుకున్న దాసు. జ్యోత్స్న నిజ స్వరూపం తెలుసుకున్న పారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

3 Min read
Author : Kavitha G
Published : Feb 13 2026, 02:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో ఏ విషయంలో క్లారీటి వచ్చింది చెప్పు పారిజాతం అంటాడు శివన్నారాయణ. జ్యోత్స్న ఎవరి కూతురు అని అడుగుతుంది పారు. సుమిత్ర కూతురు అంటాడు శివన్నారాయణ. సుమిత్ర ఎవరి తల్లి అంటుంది పారు. జ్యోత్స్న తల్లి అంటాడు శివన్నారాయణ. అదే క్లారిటీ వచ్చింది అంటుంది పారు. గట్టిగానే వచ్చింది పారు అంటాడు కార్తీక్. నేను ఇక వెళ్తాను మామయ్య అంటాడు శ్రీధర్. నువ్వు వస్తావా.. అని కాంచనను అడుగుతాడు. వస్తాను అంటుంది కాంచన. ఈ రోజు ఇక్కడే ఉండండి అంటారు తండ్రి, అన్నయ్య.  లేదు నాన్న రేపు గుడికి వెళ్లాలి అంటుంది కాంచన.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
జ్యోత్స్నపై అనుమానం
Image Credit : Jiohotstar

జ్యోత్స్నపై అనుమానం

జ్యోత్స్నను పిలిచి సుమిత్ర చేయిని జ్యోత్స్న చేతిలో పెడుతుంది. నీ తల్లి బాధ్యత నీదే. తల్లి రుణం తీర్చుకునే అదృష్టం అందరికీ రాదు. నీకు వచ్చింది. నీ తల్లిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తుంది కాంచన. మరోవైపు లోలోపల జ్యోత్స్నపై కోపంతో రగిలిపోతుంది పారు. జ్యోత్స్న వైపు అనుమానంగా చూస్తాడు దశరథ. శ్రీధర్ కార్తీక్ ని కూడా పిలిచి ఇంటికి వెళ్దాం పదండి అంటాడు. మీరు దీపను తీసుకొని వెళ్లండి బావ కార్తీక్ తో నాకు పనుంది అంటాడు దశరథ. దాసును కలిస్తే కానీ రిపోర్ట్స్ విషయంలో క్లారిటీ రాదు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.

38
జ్యోను ఫాలో అయిన పారు
Image Credit : Jiohotstar

జ్యోను ఫాలో అయిన పారు

తాత నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి వెంటనే వస్తాను అంటుంది జ్యోత్స్న. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీ అమ్మను చూస్కో అంటాడు శివన్నారాయణ. సుమిత్ర దగ్గరకు వెళ్లి, అమ్మ నేను త్వరగా వెళ్లి వస్తాను అని చెప్తుంది జ్యోత్స్న. సరే త్వరగా రా.. మీ తాతగారికి తెలిస్తే బాగోదు అంటుంది సుమిత్ర. ఇంతకు ముందు నాకు చెప్పేదానివి. ఇప్పుడు కన్నతల్లికి చెప్పుకుంటానావా.. సుమిత్ర కూతురా అని మనసులో రగిలిపోతుంది పారు. నాకు తెలియకుండా నువ్వేదో చేస్తానవ్. అనుకుంటూ జ్యోత్స్న వెనకాలే వెళ్తుంది.

48
తప్పించుకున్న దాసు
Image Credit : Jiohotstar

తప్పించుకున్న దాసు

దాసు కోసం ఫుడ్ తీసుకొస్తారు రౌడీలు. మీరు తినరా అని వాళ్లను అడిగితే కాస్త మందు తాగాక తింటామంటారు రౌడీలు. మీతోపాటు నేను తాగుతాను కట్లు విప్పండి అంటాడు దాసు. కట్లు విప్పాక పారిపోతే ఎలా అంటారు రౌడీలు. పారిపోనురా అని వాళ్లతో కూర్చొని మందు తాగినట్లు నటించి పారిపోతాడు దాసు.

58
జ్యోత్స్న మీ కూతురు కాదు
Image Credit : Jiohotstar

జ్యోత్స్న మీ కూతురు కాదు

మరోవైపు కార్తీక్ ని హాస్పిటల్ కి తీసుకొస్తాడు దశరథ. ఏంటి మామయ్య ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతాడు కార్తీక్. రిపోర్ట్స్ విషయంలో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయిరా అంటాడు దశరథ. డాక్టర్ దగ్గరకు వెళ్లి తన అనుమానం బయటపెడతాడు దశరథ. ఇంతకు ముందు మీరే శాంపిల్స్ మ్యాచ్ కాలేదు అన్నారు. ఇప్పుడు మళ్లీ మీరే మ్యాచ్ అయ్యాయని చెప్తున్నారు. ఈ విషయంలో జ్యోత్స్న మిమ్మల్ని బెదిరించిందా అని అడుగుతాడు దశరథ. 

లేదండి అంటుంది డాక్టర్. నా భార్య విషయంలో రిస్క్ చేయలేను ఏదైనా ఉంటే చెప్పండి అంటాడు దశరథ. జ్యోత్స్న మీ కూతురు కాదు అంటుంది డాక్టర్. షాక్ అవుతారు కార్తీక్, దశరథ. మరి లేకపోతే ఏంటండి. మీ కన్నకూతురి శాంపిల్స్ మీ భార్యతో మ్యాచ్ అయ్యాయి. తను ఏ కూతురు చేయలేని త్యాగం చేస్తోంది అని తనను తమాయించుకుంటుంది డాక్టర్. మీరు ఏం టెన్షన్ పడకండి మీ భార్యకు ఏం కాదు అని దశరథను పంపిస్తుంది డాక్టర్.

ఏంటి కార్తీక్ ఇది. మీ మామయ్య వస్తున్నారు అని నాకు ముందే చెప్పాలి కదా అంటుంది డాక్టర్. నాకు కూడా తెలియదండి అంటాడు కార్తీక్. మిమ్మల్ని ఇలా అడగవచ్చో లేదో తెలియదు కానీ నా బిడ్డను కాపాడే అవకాశం ఏమైనా ఉందా అని అడుగుతాడు కార్తీక్. లేదు ఏదో ఒక ప్రాణాన్ని మాత్రమే కాపాడగలం అంటుంది డాక్టర్.

68
దీప ఏడుపు
Image Credit : Jiohotstar

దీప ఏడుపు

శ్రీధర్ కి కాఫీ పెట్టి ఇస్తుంది దీప. పుట్టబోయే బిడ్డ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కాంచన, శ్రీధర్. ఇప్పుడు సడెన్ గా గుడికి ఎందుకు కాంచన అంటాడు శ్రీధర్. దీప కడుపులో బిడ్డకు ఏదో ప్రమాదం జరగబోతున్నట్లు కల వచ్చింది అండి అంటుంది కాంచన. అందుకే దేవుడికి మొక్కుకున్నాను. మా అమ్మకు ఎవరి దిష్టి తగలకూడదు. క్షేమంగా నా దగ్గరికి తిరిగి రావాలి అంటుంది కాంచన. ఆ మాటలు విన్న దీప ఏడుస్తుంది. మీ అమ్మకు నాతోనే గండం వచ్చింది అని బాధపడుతుంది.

78
జ్యో నిజ స్వరూపం తెలుసుకున్న పారు
Image Credit : Jiohotstar

జ్యో నిజ స్వరూపం తెలుసుకున్న పారు

మరోవైపు దాసు ఉన్న ప్లేస్ కి వెళ్తుంది జ్యోత్స్న. అప్పటికే దాసు పారిపోతాడు. రౌడీలు మత్తుగా నిద్రపోయి ఉంటారు. వాళ్లను లేపి అడిగితే ఒకరిపై ఒకరు చెప్పుకుంటారు. జ్యోత్స్నను కిటికిలో నుంచి చూస్తుంది పారు. నీ గురించి కార్తీక్ గాడు చెప్పింది నిజమే అని మనసులో అనుకుంటుంది. నువ్వు తెలివిగా పారిపోయాను అనుకుంటున్నావా నాన్న. నువ్వు ఎక్కడికి వెళ్తావో నాకు తెలుసు అనుకుంటూ బయటకు వస్తుంది జ్యోత్స్న. దాక్కుంటుంది పారు.

88
ఇక ఊరుకోను జ్యోత్స్న..
Image Credit : Jiohotstar

ఇక ఊరుకోను జ్యోత్స్న..

నా కొడుకును నువ్వే కిడ్నాప్ చేసి ఏం తెలియనట్లు నాటకమాడుతావా.. ఇంతకు ముందు నువ్వు నా మనుమరాలు అనుకొని ఏం చేసినా ఊరుకున్నాను. ఇక ఊరుకునేది లేదు అని పారు అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Recommended image3
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: పారుతో ఆడుకున్న కార్తీక్- స్వప్నను లాక్ చేసిన శ్రీధర్- జ్యో నటన
Recommended image2
Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ డ్రైవర్ గా కాశీ- షాక్ నుంచి కోలుకోని జ్యో,పారు- దశరథ డౌట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved