MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode: పారుతో ఆడుకున్న కార్తీక్- స్వప్నను లాక్ చేసిన శ్రీధర్- జ్యో నటన

Karthika Deepam 2 Today Episode: పారుతో ఆడుకున్న కార్తీక్- స్వప్నను లాక్ చేసిన శ్రీధర్- జ్యో నటన

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (ఫిబ్రవరి 12వ తేదీ)లో పారును కన్ఫ్యూజ్ చేసి ఆడుకున్న కార్తీక్. జ్యోను అమ్మవారితో పోల్చిన సుమిత్ర. కోపంతో ఊగిపోయిన కార్తీక్. జ్యోను అనుమానించిన దశరథ. స్వప్నను లాక్ చేసిన శ్రీధర్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..  

4 Min read
Author : Kavitha G
Published : Feb 12 2026, 08:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో రెండోసారి శాంపిల్స్ మ్యాచ్ కావాలని మొక్కుకున్నావా పారు అని అడుగుతాడు కార్తీక్. అవునురా అంటుంది పారు. మ్యాచ్ కావు అని నీకెలా తెలుసు అంటాడు కార్తీక్. ఇలా దొరికిపోయాను ఏంటి అని మనసులో అనుకుంటుంది పారు. అంటే మొదటిసారి మ్యాచ్ కాలేదు కదా.. అందుకే రెండోసారైనా మ్యాచ్ కావాలి అని మొక్కుకున్నాను అంటుంది పారు. 

జ్యోత్స్న అత్త కూతురు కాకపోతే కదా.. శాంపిల్స్ మ్యాచ్ కాకుండా ఉండేది. జ్యోత్స్న అత్త కూతురే అయినప్పుడు నువ్వు అలా మొక్కుకోవాల్సిన అవసరం ఏంటి అని అడుగుతాడు కార్తీక్. నీకు ఎందుకు చెప్పాలిరా అని కోపంగా అంటుంది పారు. వాడు కాదు నేను అడుగుతున్నాను చెప్పు.. నీకు శాంపిల్స్ మ్యాచ్ కావనే డౌట్ ఎందుకు వచ్చిందని అడుగుతాడు శివన్నారాయణ. అత్తయ్యను ఎమనకండి మామయ్య గారు అంటుంది సుమిత్ర.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
జ్యోను అమ్మవారితో పోల్చిన సుమిత్ర
Image Credit : Jiohotstar

జ్యోను అమ్మవారితో పోల్చిన సుమిత్ర

ఇన్ని రోజులు నాకు ఏమవుతుందోనని మీ అందరినీ చాలా బాధపెట్టాను. ఇప్పుడు నా మనసు తేలికగా ఉంది. నా కూతురు పెళ్లి చూస్తాననే ఆశ నాలో తిరిగి వచ్చింది. నా కూతురే నా ప్రాణాలు కాపాడబోతోంది అని జ్యోత్స్నను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటుంది సుమిత్ర. జ్యోత్స్న నాకోసం ఓ పనిచేస్తావా అని అడుగుతుంది సుమిత్ర. చెప్పు మమ్మీ ఏం చేయాలి అంటుంది జ్యోత్స్న. రోజు ఉదయాన్నే నన్ను నిద్రలేపుతావా అని అడుగుతుంది సుమిత్ర.

జ్యోత్స్న ఎందుకు నిద్రలేపాలి అని అడుగుతాడు దశరథ. నేను రోజు లేచి అమ్మవారి ముఖం చూస్తాను. ఇప్పుడు నా కూతురే అమ్మవారి రూపంలో నన్ను కాపాడడానికి వచ్చింది. అందుకే నేను రోజు నా కూతురు మొహమే చూడాలి అనుకుంటున్నాను అంటుంది సుమిత్ర. కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. వెనకాలే వెళ్తుంది దీప. జ్యోత్స్న ముఖంలో కొంచెం కూడా సంతోషం లేదు. ఎందుకు నేను నా కూతురిని నమ్మలేకపోతున్నాను అని మనసులో అనుకుంటాడు దశరథ.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode: సుమిత్రకు మతిమరుపు- భార్య చనిపోతుందని దశరథ ఏడుపు- హాస్పిటల్ కి దీప
Related image2
Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ డ్రైవర్ గా కాశీ- షాక్ నుంచి కోలుకోని జ్యో,పారు- దశరథ డౌట్
38
ఇంట్లో నుంచి వెళ్లడానికి సిద్ధపడ్డ స్వప్న
Image Credit : Jiohotstar

ఇంట్లో నుంచి వెళ్లడానికి సిద్ధపడ్డ స్వప్న

మరోవైపు బ్యాగుతో బయటకు వస్తుంది స్వప్న. ఏంటి నిజంగానే వెళ్తున్నావా అని అడుగుతాడు శ్రీధర్. కాశీ ఇక్కడ ఉండటం నిజమే అయినప్పుడు నేను నిజంగానే ఇక్కడి నుంచి వెళ్తాను అంటుంది స్వప్న. కర్మ చూడు స్వప్న. ఆ రోజు కాశీ కోసం ఇంట్లో నుంచి వెళ్లిపోయావు. ఈ రోజు కాశీ ఉంటే ఇంట్లో నుంచి వెళ్తా అంటున్నావు అంటాడు శ్రీధర్. ఆ రోజు తప్పు చేశాను తెలుసుకున్నాను అంటుంది స్వప్న.

ఈ రోజు కూడా తప్పే చేస్తున్నావు. అది కూడా తెలుసుకుంటావు అంటాడు శ్రీధర్. కాశీ మన డ్రైవర్ గా ఇక్కడే ఉంటాడు. నువ్వు తనను చూసి కరిగిపోతాను, మారిపోతాను, నేను వీక్ హార్టెడ్ అని అనుకుంటే ఇక్కడి నుంచి వెళ్లిపో అంటాడు శ్రీధర్. అలా రెచ్చగొడితే ఇక్కడే ఉంటాను అనుకుంటున్నావా అంటుంది స్వప్న. వెళ్లిపోతే మీ అన్నయ్యకు చెప్తాను అంటాడు శ్రీధర్. ఇప్పుడు అన్నయ్యకు ఎందుకు చెప్పడం అంటుంది స్వప్న. కాశీ ఇక్కడే మనతోనే డ్రైవర్ గా ఉంటాడు. నువ్వు కూడా ఇక్కడే ఉండాలి అని తేల్చి చెప్తాడు శ్రీధర్.

48
జ్యోత్స్నను జైల్లో వేయాలన్న కార్తీక్
Image Credit : Jiohotstar

జ్యోత్స్నను జైల్లో వేయాలన్న కార్తీక్

ఏంటి బావ ఎందుకు బయటకు వచ్చావు అని అడుగుతుంది దీప. అత్త ఓ అర్హత లేని మనిషిని పొగుడుతుంటే, ఆకాశానికి ఎత్తుతుంటే చూడలేక వచ్చేశాను అంటాడు కార్తీక్. అమ్మతనాన్ని పణంగా పెట్టి నువ్వు అత్తను కాపాడుతుంటే ప్రశంసలు దక్కేది ఎవరికీ అని బాధపడతాడు కార్తీక్. నీలాంటి కూతురు ఎక్కడైనా ఉంటుందా? అని అడుగుతాడు కార్తీక్. నాకు ఎవరి గుర్తింపు అవసరం లేదు బావ. నా తల్లి చిరునవ్వు చాలు. అదే నాకు గొప్ప కిరీటం అంటుంది దీప. 

నీకు అవసరం లేదు. కానీ ఎలాంటి అర్హత లేని వ్యక్తి వాటిని అందుకుంటుంటే నాకు ఎలా ఉందో తెలుసా? అంటాడు కార్తీక్. అసలు జ్యోత్స్న సుమిత్ర కూతురు కాదని చెప్పి ఫస్ట్ ఇంట్లో నుంచి మెడపట్టి బయటకు తోయాలి. లేదా కేసు పెట్టి జైల్లో వేయాలి. మీవల్ల నేను ఏది చేయలేకపోతున్నాను అని అంటాడు కార్తీక్. చెప్పడం మర్చిపోయాను ఇందాక పారు గన్ తీసుకొచ్చింది. అది కింద పడిపోతే జ్యోత్స్న తీయడం నేను చూశాను అని చెప్తాడు కార్తీక్. గన్ ఎందుకు తెచ్చింది అని అడుగుతుంది దీప. చంపడానికి అంటాడు కార్తీక్. మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి బావ అంటుంది దీప.

58
శివన్నారాయణ ఇంటికి శ్రీధర్, కాంచన
Image Credit : Jiohotstar

శివన్నారాయణ ఇంటికి శ్రీధర్, కాంచన

ఇంతలో శ్రీధర్ కారు రావడం చూస్తుంది దీప. మామయ్య గారి కారు వచ్చింది బావ అంటుంది దీప. అమ్మానాన్న ఇప్పుడు ఎందుకు వచ్చారు అని అంటాడు కార్తీక్. మీరు ఎందుకు వచ్చారు మాస్టారు అని అడుగుతాడు శ్రీధర్ ని. మేము రాలేదు. మీ తాత ఫోన్ చేసి మీ అమ్మను తీసుకొని అర్జెంటుగా ఇంటికి రా అన్నాడని చెప్తాడు శ్రీధర్. అన్నయ్య ఎక్కడున్నాడు అని అడుగుతుంది కాంచన. అందరూ హాల్లోనే ఉన్నారంటాడు కార్తీక్.

68
సంతోషంలో కుటుంబం
Image Credit : Jiohotstar

సంతోషంలో కుటుంబం

సుమిత్రకు ఆపరేషన్ అయ్యాక మనమంతా టూర్ కి వెళ్లాలి అంటాడు శివన్నారాయణ. మీరు మాత్రమేనా మామయ్య గారు అంటూ లోపలికి వెళ్తాడు శ్రీధర్. నువ్వు లేకుండా సందడి ఏముంటుంది శ్రీధర్ అంటాడు శివన్నారాయణ. ఏంటి నాన్న అర్జెంటుగా రమ్మన్నారు అని అడుగుతుంది కాంచన. జ్యోత్స్న శాంపిల్స్ సుమిత్రతో మ్యాచ్ అయ్యాయి. డాక్టర్ స్వయంగా వచ్చి చెప్పి వెళ్లారు అంటాడు శివన్నారాయణ. కాంచన, శ్రీధర్ సంతోషిస్తారు. మా వదినకు ఏం కాకుడదని ఎంతోమంది దేవుళ్లకు మొక్కుకున్నాను. ఇప్పుడు నాకు సంతోషంగా ఉందని వదినకు స్వీట్ తినిపిస్తుంది కాంచన.

78
జ్యోత్స్న నటన
Image Credit : Jiohotstar

జ్యోత్స్న నటన

నీ ముఖంలో సంతోషం కంటే భయమే ఎక్కువగా కనిపిస్తోంది ఏంటి మేనకోడలా అంటాడు శ్రీధర్. శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి కదా.. ఎందుకు అయ్యాయని ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు శ్రీధర్. నాకైతే ఫుల్ క్లారిటీ వచ్చింది. అదే ఇంకా కన్ఫ్యూజన్ లో ఉంది అంటుంది పారు. నీకేం క్లారిటీ వచ్చింది? జ్యోత్స్నకు కన్ఫ్యూజన్ ఎందుకు అని అడుగుతాడు శ్రీధర్. నేను నిజంగానే హ్యాపీగా లేను మామయ్య. ఒకసారి మమ్మీ వేలు కట్ అయితే చాలా బ్లెడ్ వచ్చింది. అది చూసి నేను తట్టుకోలేకపోయాను ఇప్పుడు ఆపరేషన్ అంటే స్కిన్ కట్ చేస్తారు కదా.. అని బాధపడినట్లు నటిస్తుంది జ్యోత్స్న.

88
పారును ఇరికించిన కార్తీక్
Image Credit : Jiohotstar

పారును ఇరికించిన కార్తీక్

పెద్దగా క్లాప్స్ కొడతాడు కార్తీక్. నువ్వెందుకురా క్లాప్స్ కొడుతున్నావు అని అడుగుతాడు శ్రీధర్. పెద్దమేడంకు తల్లిమీద ఉన్న ప్రేమ చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఓ ఆరేడు వందల పేజీల బుక్ రాయాలి అనిపిస్తోంది అంటాడు కార్తీక్. పెద్దమేడం కన్ఫ్యూజన్ లో ఉంది కరెక్టే.. నువ్వు ఏ విషయంలో క్లారీగా ఉన్నావో చెప్పు పారు అంటాడు కార్తీక్. నేను ఇలా దొరికిపోయానెంట్రా అని మనసులో అనుకుంటుంది పారు. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: సుమిత్రకు మతిమరుపు- భార్య చనిపోతుందని దశరథ ఏడుపు- హాస్పిటల్ కి దీప
Recommended image2
Karthika Deepam 2 Today Episode: శ్రీధర్ డ్రైవర్ గా కాశీ- షాక్ నుంచి కోలుకోని జ్యో,పారు- దశరథ డౌట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved