- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Today Episode:బిగ్ ట్విస్ట్-ఒక్కటైన కాంచన, శ్రీధర్-సుమిత్రను చంపేందుకు జ్యో ప్లాన్
Karthika Deepam 2 Today Episode:బిగ్ ట్విస్ట్-ఒక్కటైన కాంచన, శ్రీధర్-సుమిత్రను చంపేందుకు జ్యో ప్లాన్
కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (జనవరి 9వ తేదీ)లో నిజం చెప్తామన్న దీప. నీ గురించి కార్తీక్ కి తెలిసిపోయిందన్న పారు. ఒక్కటైన శ్రీధర్, కాంచన. సుమిత్రను మాటలతో చంపాలి అనుకున్న జ్యో. తాత దగ్గర అడ్డంగా బుక్ అయిన జ్యో. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో వారసురాలు అత్తను కాపాడుతుందని డాక్టర్ చెప్పారు కదా.. నువ్వు బాధపడకు దీప అంటాడు కార్తీక్. ఎవరు వారసురాలు? ఎవరు కాపాడుతారు? నేను మీ కూతురు అని నాన్నతో చెప్పగలనా? అప్పుడు జ్యోత్స్న ఎవరు అని అడుగుతారు. కథ మొదటికి వస్తుంది. జ్యోత్స్న తనంతట తాను కన్న కూతురు కాదని బయటపెట్టదు అంటుంది దీప. కానీ బయటపడక తప్పదంటాడు కార్తీక్. కన్న కూతురు నేనే అనే విషయం అందరకీ చెప్పేద్దాం అంటుంది దీప.
ఏం మాట్లాడుతున్నావు దీప. ఆ వ్యాధి గురించి తెలిస్తేనే అత్త తట్టుకోలేదు అని భయపడుతుంటే.. ఇంత పెద్ద నిజం చెప్తావా? జ్యోత్స్న నీ కన్న కూతురు కాదని చెప్తే అత్త తట్టుకుంటుందా? రెండు మంచి విషయాలు ఒకేసారి చెప్పిన పర్లేదు కానీ.. రెండు చెడు విషయాలు ఒక్కసారి చెప్పడం మంచిది కాదు. ముందు అత్తకు వ్యాధి గురించి చెప్పి తనని ప్రిపేర్ చేయాలి. ఆ తర్వాత నీ విషయం ఎలాగో తెలియాల్సిందే. ఇప్పటికే జ్యోత్స్న ఇంట్లో నుంచి పారిపోవాలనుకుందని చెప్తాడు కార్తీక్. ఈ విషయం తాతకు తెలుసా అని అడుగుతుంది దీప. అందరికీ తెలుసు. తను ఇలాంటివి ఏవో చేస్తుందనే నిన్ను పంపించి నేను అక్కడే ఉన్నాను అంటాడు కార్తీక్.
కార్తీక్ కి నీగురించి నిజం తెలుసు
మరోవైపు ఏదో చేస్తాను అని చెప్పి చివరకు నువ్వు చేసింది ఇదా? అని జ్యోత్స్నకు చివాట్లు పెడుతుంది పారు. ఇంతకంటే మంచి ఆలోచన నాకు రాలేదు అంటుంది జ్యోత్స్న. వెళ్లేముందు నాకు కూడా చెప్తే బాగుండు. నేను కూడా నీతోపాటు వచ్చేదాన్ని అంటుంది పారు. ఎందుకు అని అడుగుతుంది జ్యోత్స్న. ఎందుకంటే తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి అంటుంది పారు. కార్తీక్ గాడు మాయగాడు. పెళ్లాన్ని ఇంటికి పంపించి మరీ కాపలా కాసి నిన్ను పట్టుకున్నాడంటే... నువ్వు అసలైన వారసురాలివి కాదని వాడికి తెలుసు అంటుంది పారు.
అంత కచ్చితంగా ఎలా చెప్పగలవు గ్రానీ అంటుంది జ్యోత్స్న. ఊహించాను. వాడికి నీ విషయం తెలుసు కాబట్టే.. ఇంట్లో జరిగే రచ్చకు భయపడి నువ్వు పారిపోతావని ముందే గెస్ చేసి కాపలా ఉన్నాడు అంటుంది పారు. బావకు నిజం తెలుసు అంటే నువ్వే చెప్పావేమో అనుకున్న అంటుంది జ్యోత్స్న. నేను అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా అంటుంది పారు.
మీ అమ్మ ఎవరు?
బాధతో ఉన్న నీ ముఖం చూస్తే.. నాకు ఏమైందని అత్త ప్రశ్నలు అడగడం మొదలు పెడుతుంది. నువ్వు ఫేస్ అలాగే పెట్టుకునే పనైతే.. ఇంట్లోనే ఉండు దీప అంటాడు కార్తీక్. నేను మా అమ్మ దగ్గర జాగ్రత్తగా ఉంటానులే అంటుంది దీప. మా అమ్మకు కష్టమొచ్చిందని తెలిసినప్పటి నుంచి తట్టుకోలేకపోతున్నా అంటుంది దీప. మీ అమ్మ ఎవరు? నీకు అమ్మ లేదు కదా అని అడుగుతుంది శౌర్య. చాటుగా ఉండి మా మాటలు వింటున్నావా.. వెళ్లి రెడీ అవ్వు అని శౌర్యను పంపిస్తుంది దీప. సరే వెళ్దాం పదా అంటాడు కార్తీక్.
ఒక్కటైన కాంచన, శ్రీధర్
ఈ రోజు నేను కూడా వస్తాను అంటుంది కాంచన. నిన్ను చూస్తే నాకు ఏమైందని అత్త కచ్చితంగా అడుగుతుంది అంటాడు కార్తీక్. తనతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. నీకు అత్త కాకముందే తను నాకు వదిన అంటుంది కాంచన. నువ్వు బాధతో వ్యాధి గురించి నోరు జారితే అత్త తట్టుకోలేదమ్మా అంటాడు కార్తీక్. నేను జాగ్రత్తగా ఉంటానులే అంటుంది కాంచన. సరే నేను క్యాబ్ బుక్ చేస్తాను. దీప, నువ్వు అందులో రండి అంటాడు కార్తీక్. వద్దు అంటుంది కాంచన.
అత్త వస్తాను అంది కానీ నీతో వస్తాను అనలేదు అంటుంది దీప. అదేంటి అంటాడు కార్తీక్. ఇంతలో శ్రీధర్ వచ్చి నువ్వు రెడీనా కాంచన అని అడుగుతాడు. కార్తీక్ ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టంలేదు. మా నాన్న వాళ్ల ఇంటికి మీరు నన్ను తీసుకెళ్తారా అని నా భార్య మెసేజ్ పెట్టింది రా.. అని సంతోషంగా చెప్తాడు శ్రీధర్. సరే మాస్టారు వెళ్దాం పదండి అంటాడు కార్తీక్. మాస్టారు ఏంటి మాస్టారు సరిగ్గా పిలవలేవా అంటుంది కాంచన. ఏమని పిలవాలో చెప్పమ్మా అంటాడు కార్తీక్. ఏం లేదులే వెళ్దాం పదా అని అందరూ బయల్దేరుతారు.
జ్యో చెంప పగలగొట్టిన పారు
ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఒకటే ఒక మార్గం ఉంది గ్రానీ అంటుంది జ్యోత్స్న. ఏంటది అని అడుగుతుంది పారు. నాకు ఈ ఆస్తి కావాలి. నేను శివన్నారాయణ వారసురాలిగానే బ్రతకాలి అంటే మా అమ్మతో నిజం చెప్పాలి. నీకు బ్లెడ్ క్యాన్సర్ వచ్చిందమ్మా, నువ్వు ఎక్కువకాలం బతకవని చెప్పాలి అంటుంది జ్యోత్స్న. అలా చెప్తే సుమిత్ర నిజంగా చనిపోతుందే అంటుంది పారు. కానీ మనం సేఫ్ గా ఉంటాం కదా అంటుంది జ్యోత్స్న.
కోపంగా జ్యోత్స్న చెంప పగలగొడుతుంది పారు. నీ స్వార్థం కోసం పెంచిన తల్లి ప్రాణాలు తీస్తావా? అంటుంది పారు. నువ్వు ఎవ్వరి ప్రాణాలు తీయలేదా అంటుంది జ్యోత్స్న. ఆ టైంలో నన్ను నేను కాపాడుకోవడానికి అంతకంటే మంచి దారి నాకు దొరకలేదే అంటుంది పారు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే అంటుంది జ్యోత్స్న. నేను ఏమైనా కత్తులతో పొడిచి చంపుతున్నానా? మాటలతో చంపేస్తాం. సాక్ష్యం ఉండదు. భయంతో పోయిందని అందరూ అనుకుంటారు. పదా వెళ్లి నిజం చెప్తామని సుమిత్ర గదిలోకి వెళ్తుంది జ్యోత్స్న.
తల్లిని చంపేందుకు జ్యో ప్లాన్
హాయ్ మమ్మీ, టాబ్లెట్ వేసుకున్నావా అని అడుగుతుంది. నాకు ఏమైందని టాబ్లెట్ వేసుకోవాలి అంటుంది సుమిత్ర. నేను చెప్తాను కదా ముందు టాబ్లెట్ వేసుకో అంటుంది జ్యోత్స్న. నిజంగా చెప్తావు కదా అని వేసుకుంటుంది సుమిత్ర. ఇది వేసుకుంటే నాకు ఎందుకో మత్తుగా ఉంది అంటుంది సుమిత్ర. నువ్వు అలా పడుకొని హాయిగా విను. నేను చెప్తాను అంటుంది జ్యోత్స్న.
మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్లకు ఏమైనా అయితే మనం తట్టుకోలేము. అలాంటిది ఆ వ్యక్తి ఎక్కువకాలం బ్రతకరు అని తెలిస్తే ఎలా ఉంటుంది. ప్రస్తుతం నేనూ అలాంటి బాధనే మోస్తున్నాను అంటుంది జ్యోత్స్న. నీకు బ్లెడ్ క్యాన్సర్ వచ్చింది మమ్మీ. ఈ నిజం చెప్తే నువ్వు ఏమైపోతావోనని భయపడి ఎవరూ నీకు నిజం చెప్పట్లేదు అంటుంది.
దొరికిపోయిన జ్యోత్స్న
నువ్వు ధైర్యవంతురాలివి. నీకొచ్చిన వ్యాధి ప్రాణాంతకమైందైనా సరే నువ్వు తట్టుకొని నిలబడతావు అంటూ సుమిత్ర వైపు చూస్తుంది జ్యోత్స్న. అప్పటికే సుమిత్ర నిద్రపోయి ఉంటుంది. అంటే మమ్మీ నా మాటలు వినలేదా అని చిరాకు పడుతుంది జ్యోత్స్న. ఇదంతా డోర్ దగ్గర ఉండి చూస్తారు కార్తీక్, దీప, శివన్నారాయణ, కాంచన. జ్యోత్స్నపై కోపంతో ఊగిపోతారు.
నువ్వు మా వదిన కూతురివేనా?
ఎందుకు ఇలా చేస్తున్నావు? సమాధానం చెప్పు. నీ ఆలోచనలు ఏంటో మాకు అస్సలు అర్థం కావడం లేదని జ్యోత్స్నపై విరుచుకుపడుతాడు శివన్నారాయణ. దీనికేదో దెయ్యం పట్టింది నాన్న అంటుంది కాంచన. తల్లి మీద నీకు కొంచమైనా ప్రేమ ఉందా? అసలు నువ్వు మా వదిన కూతురివేనా? అని అడుగుతుంది కాంచన. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

