- Home
- Entertainment
- TV
- Samanlu Controversy: శివాజీ, అనసూయ, రాశిలో ఎవరు కరెక్ట్? వీరి గొడవలో అసలు విషయం పక్కదారి పట్టిందా?
Samanlu Controversy: శివాజీ, అనసూయ, రాశిలో ఎవరు కరెక్ట్? వీరి గొడవలో అసలు విషయం పక్కదారి పట్టిందా?
“సరుకు, సామాన్లు” అనే పదాలు క్షణాల్లో ఎంత కాంట్రవర్సీగా మారాయో మనం చూశాం. ఈ పదాల చుట్టూ మొదలైన చర్చ, వ్యక్తుల మధ్య వాదనలు, వార్స్, ట్రోలింగ్ వరకు వెళ్లింది. కానీ ఈ మొత్తం కాంట్రవర్సీలో ఎవరు కరెక్ట్? వీరి గొడవలో అసలు విషయం పక్కదారి పట్టిందా?

Samanlu Controversy
ఇటీవల సోషల్ మీడియా, టీవీ చర్చలు, యూట్యూబ్ డిబేట్స్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పదాలు “సరుకు, సామాన్లు”. ఫస్ట్ నార్మల్ గా వినిపించిన ఈ మాటలు క్షణాల్లోనే పెద్ద కాంట్రవర్సీగా మారాయి. ముఖ్యంగా నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు, వాటిపై యాంకర్ అనసూయ స్పందన, ఆ తర్వాత నటి రాశి చేసిన కామెంట్స్ అన్నీ కలిసి ఈ అంశాన్ని మరింత వేడెక్కించాయి. అయితే ఈ మొత్తం చర్చను గమనిస్తే, అసలు విషయం పక్కదారి పట్టిందేమో అన్న డౌట్ చాలామందికి రావొచ్చు.
సమస్య ఎక్కడ మొదలైందంటే?
నిజానికి ఈ కాంట్రవర్సీకి కేంద్ర బిందువుగా మారిన వ్యక్తి శివాజీ. ఆయన ఓ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు కొంతమందికి నచ్చగా, మరికొందరికి అభ్యంతరకరంగా అనిపించాయి. శివాజీ తన మాటల్లో ఒక సామాజిక కోణాన్ని చూపించే ప్రయత్నం చేశాడని కొందరు, ఆయన ఉద్దేశం వ్యక్తులను కించపరచడం కాదని మరికొందరు, ఒక ట్రెండ్ లేదా ఆలోచనా విధానాన్ని ప్రశ్నిస్తే తప్పేంటని ఇంకొందరు వాదించారు.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే మాటల ఎంపిక దగ్గర. శివాజీ వాడిన పదాలు కొందరికి అవమానకరంగా అనిపించాయి. ఆయన ఉద్దేశం ఏమైనా సరే, ఉపయోగించిన పదాలు చెప్పాల్సిన విషయం అర్థాన్నే మార్చేశాయి. అందుకు ఆయన బాధపడ్డారు. క్షమాపణ కూడా చెప్పారు. మరి అక్కడితో సమస్య ముగిసిపోయిందా అంటే లేదు.
స్పష్టమైన అభిప్రాయాన్ని..
ఆ తర్వాత యాంకర్ అనసూయ స్పందన తెరపైకి వచ్చింది. అనసూయ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు. కొన్ని పదాలు లేదా వ్యాఖ్యలు మహిళలను తక్కువ చేసేలా ఉంటే వాటిని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. అయితే ఆమె స్పందనలో భావోద్వేగం కనిపించినా, దాని వెనుక వేరే ఆలోచన ఉందనేది కొంతమంది వాదన.
సమాజంలో ఇప్పటికే మహిళలపై ఉన్న స్టీరియోటైప్స్, ట్రోలింగ్, జడ్జ్‌మెంట్ నేపథ్యంలో, ఇలాంటి వ్యాఖ్యలు మరింత నష్టం చేస్తాయనే ఆందోళన ఆమె మాటల్లో కనిపించింది. అందుకే ఆమె స్పందనకు కొందరి నుంచి మద్ధతు లభించింది. అయితే మరికొందరు మాత్రం ఆమె శివాజీ మాటలను వేరే కోణంలో చూడాల్సిందని అభిప్రాయపడ్డారు.
అదే అసలు సమస్య..
ఈ దశలోనే నటి రాశి చేసిన వ్యాఖ్యలు కూడా చర్చకు వచ్చాయి. ఆమె చేసిన కామెంట్స్ ఈ వివాదానికి ఆజ్యం పోశాయి. ఆమె తన అనుభవాన్ని, అభిప్రాయాన్ని చెప్పినట్టే కనిపించినా.. అవి కూడా సోషల్ మీడియాలో డిఫరెంట్ గా పోర్ట్రే అయ్యాయి. కొందరికి ఆమె మాటలు నిజాయతీగా అనిపించగా, మరికొందరికి అవి సమస్యను మరింత పక్కదారి పట్టించినట్టుగా అనిపించాయి. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే ఒకరు మాట్లాడిన ప్రతి మాట, వారి ఉద్దేశం కంటే ఎక్కువగా, సోషల్ మీడియా ఎలా తీసుకుంటుందన్నదే ఈ రోజుల్లో అసలు సమస్యగా మారుతోంది.
డిబేట్ నుంచి వార్
ఈ మొత్తం వివాదం సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత, అది వ్యక్తుల మధ్య డిబేట్ నుంచి వార్ గా మారింది. శివాజీకి మద్ధతు ఇచ్చేవారు అనసూయపై విమర్శలు చేయడం, అనసూయను సపోర్ట్ చేసేవారు శివాజీ మాటలను తీవ్రంగా ఖండించడం... ఇలా రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇందులో అసలు విషయం క్రమంగా మాయమైపోయింది. అభ్యంతరకర పదాల వాడకం మీద చర్చ జరగాల్సిన చోట, వ్యక్తిగత దూషణలు, క్యారెక్టర్ జడ్జ్‌మెంట్స్ మొదలయ్యాయి.
అవి రెండూ ముఖ్యమే..
నిజానికి ఒక పదం లేదా వ్యాఖ్య ఎవరికైనా బాధ కలిగిస్తే, దానిపై ప్రశ్నించడం తప్పా? అలాగే, సమాజంలోని కొన్ని అలవాట్లను విమర్శించడమే తప్పు అయితే, విమర్శ అనే భావనకు స్థానం ఎక్కడ ఉంటుంది? మాట చెప్పే విధానం, వినే విధానం రెండూ ముఖ్యమే. ఉద్దేశం మంచిదైనా, వ్యక్తపరిచే తీరు తప్పుగా ఉంటే అది వివాదానికి దారి తీస్తుంది. అలాగే, ఒక మాటను పూర్తిగా అర్థం చేసుకోకుండా స్పందించినా సమస్యలు పెరుగుతాయి.
ఎవరు కరెక్ట్?
ఈ కాంట్రవర్సీలో ఎవరు పూర్తిగా కరెక్ట్? ఎవరు పూర్తిగా రాంగ్? అని చెప్పడం కష్టం. శివాజీ తన కోణంలో సమాజాన్ని ప్రశ్నించాలనుకున్నారు. అనసూయ తన కోణంలో ఆ వ్యాఖ్యల వల్ల కలిగే ప్రభావాన్ని ప్రశ్నించారు. రాశి తన అనుభవాన్ని పంచుకున్నారు. కానీ దాన్ని సంచలనంగా మార్చి.. అసలు విషయాన్ని పక్కదారి పట్టించింది ఎవరు? మనం కాదా..?

