MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • TV
  • Karthika Deepam 2 Today Episode: దీప కడుపులో బిడ్డకు ఏమైంది? ఇంట్లోంచి వెళ్లిపోయేందుకు సిద్ధమైన కాంచన

Karthika Deepam 2 Today Episode: దీప కడుపులో బిడ్డకు ఏమైంది? ఇంట్లోంచి వెళ్లిపోయేందుకు సిద్ధమైన కాంచన

Karthika Deepam 2 Today Episode: కార్తీకదీపం టుడే ఎపిసోడ్ లో కార్తీక్, దీప టెన్షన్ పడుతూ హాస్పిటల్ లోనే కూర్చుంటారు. మరోవైపు సుమిత్ర హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేస్తుంది. ఇక కాంచన దీపపై చాలా కోపంగా ఉంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమైందో తెలుసుకోండి. 

3 Min read
Author : Haritha Chappa
Published : Mar 23 2026, 09:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇంటికి చేరిన సుమిత్ర
Image Credit : Jio hotstar

ఇంటికి చేరిన సుమిత్ర

కార్తీకదీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ లో హాస్పిటల్ నుంచి వచ్చిన సుమిత్రకు పారిజాతం దిష్టితీస్తుంది. సుమిత్ర మాట్లాడుతూ మళ్ళీ ఇంట్లో అడుగు పెడతానని అనుకోలేదని అంటుంది. అప్పుడు పారిజాతం ‘నీకోసం దశరథ హోమం చేయించాడు. నిన్ను కాపాడింది నీ కూతురు. మీ మామయ్య కూడా నువ్వు ఇంటికి రావాలని బలంగా కోరుకున్నాడు అందుకే ఇంటికి వచ్చావు’ అని అంటుంది. జ్యోత్స్న గురించి మాట్లాడుతూ ‘ఇంజక్షన్ అంటేనే భయపడే నా కూతురు ఇంత పెద్ద ఆపరేషన్ చేయించుకోవడానికి ముందుకు వచ్చింది’ అని జ్యోత్స్న చేతులు పట్టుకొని ఏడుస్తుంది. శివన్నారాయణ కూడా నీ కూతురే నీ ప్రాణగండాన్ని దాటించిందని అంటాడు. అప్పుడు జ్యోత్స్న మనసులో నన్ను ఈ గ్రానీ తప్పుదారి పట్టించిందని అనుకుంటుంది. ఈలోపు దశరథ బయటికి వెళ్లి వస్తానని అంటాడు. దానికి సుమిత్ర ఎవరూ ఎక్కడికీ వెళ్ళొద్దని ఇంట్లోనే ఉండమని అడుగుతుంది. అయినా కూడా దశరథ్ సుమిత్రకు నచ్చజెప్పి బయటకు వెళ్తాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్
Image Credit : Jio hotstar

గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్

ఇక్కడ నుంచి సీన్ కార్తీక్, దీప దగ్గరికి మారుతుంది. ఇద్దరూ బాధపడుతూ హాస్పిటల్ లో కూర్చుని ఉంటారు. కార్తీక్ మాట్లాడుతూ ‘అత్తను డిశ్చార్జ్ చేసేసి ఉంటారు. మనం కూడా ఇప్పుడు ఇంటికి వెళ్తాము. ఆమెకు మన మీద చాలా కోపం ఉంటుంది. మనం చెప్పినా కూడా వినదు. ఏం చేయాలో నాకు అర్థం అవ్వటం లేదు. ఏ తప్పూ చేయని నిన్ను వదులుకోలేను’ అని బాధపడతాడు. ఈలోపు డాక్టర్ హారిక అక్కడికి వస్తుంది. ఆమె మాట్లాడుతూ ‘ఒక తల్లి ప్రాణాన్ని కాపాడేందుకు దీప తన బిడ్డని వదులుకునేందుకు సిద్ధపడింది. కానీ ఆ బిడ్డ మాత్రం అందుకు సిద్ధంగా లేదు. నిజంగా ఇది ఒక అద్భుతమనే చెప్పాలి. మీ బిడ్డ మీతోనే ఆరోగ్యంగా ఉంది’ అని చెబుతుంది. అది వినగానే దీపక్ చాలా ఆనందపడతారు. కార్తీక్ డాక్టర్ కు పదే పదే థాంక్స్ చెప్పి ఇంటికి బయలుదేరుతాడు.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode:పారుతో ఓ రేంజ్‍లో ఆడుకున్న కార్తీక్-ఆపరేషన్ సక్సెస్-బిడ్డ బతికిందా?
Related image2
Karthika Deepam 2 Today Episode: సుమిత్ర సేఫ్-జ్యోతో పారు అబద్ధం- కడుపులో బిడ్డపై వీడని సస్పెన్స్
34
నేను నీకు నచ్చడం లేదు
Image Credit : Jio hotstar

నేను నీకు నచ్చడం లేదు

ఇక్కడ నుంచి సీన్ పారిజాతం దగ్గరికి మారుతుంది. పారిజాతం జోత్స్న కోసం జ్యూస్ పట్టుకొని వస్తుంది. అప్పుడు జ్యోత్స్న ‘నువ్వు మారిపోయావు.. పిలుపు కూడా మారిపోయింది’ అంటుంది. అప్పుడు పారిజాతం మాట్లాడుతూ ‘ఇన్నాళ్లు నువ్వే నా సొంత మనవరాలిని అనుకున్నాను. అందుకే మన మధ్య గట్టి బంధం ఉండేది. ఇప్పుడు దశరథ కూతురవని తెలిసింది. అందుకే నేను నీకు నచ్చకుండా పోయాను’ అంటుంది. జోత్స్న వెటకారంగా నవ్వుతూ నువ్వూ అన్నీ కనిపెడతావు కదా అని అంటుంది. తర్వాత మా డాడీ ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది జ్యోత్న. దానికి పారిజాతం ఏదో పని ఉందని వెళ్ళాడు అని అంటుంది. దానికి ఎక్కడికి వెళ్లారో నాకు తెలుసు, వాళ్ళ చెల్లి ఇంటికి వెళ్ళారు.. నాకు ఒక సహాయం చేస్తావా అంటుంది జ్యోత్స్న. దానికి ఏంటో చెప్పమని అడుగుతుంది పారిజాతం. ఈ లోపు ఇంట్లోంచి బయటికి వెళ్లేందుకు కాంచన రెడీ అవుతుంది.

44
కాంచన చేతిలో దీప చేయి
Image Credit : Jio hotstar

కాంచన చేతిలో దీప చేయి

సరిగ్గా అదే సమయానికి దీప, కార్తీక్ ఇంటికి వస్తారు. కార్తీక్ తో ‘మీరు ఇంట్లోకి రావడం నేను బయటకు వెళ్లడం ఒకేసారి జరగాలి అంటుంది’ కాంచన. అప్పుడు కార్తీక్ మీతో మాట్లాడాలి అని అడుగుతాడు. కాంచనతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తాడు. కానీ కాంచన వినదు. ఇక శ్రీధర్ అలా నడుస్తున్నావేంటి అని దీపని అడుగుతాడు. దానికి కాంచన కడుపు తీయించుకున్న ఆడది అలాగే నడుస్తుంది అని మాట్లాడుతుంది. కార్తీక్ ఏం చెప్పినా వినేందుకు సిద్ధంగా ఉండదు కాంచన. ఈ లోపు దశరథ అక్కడికి వచ్చి చెల్లెమ్మ కార్తీక్ చెప్పేది విను అని చెబుతాడు. హాస్పిటల్ కి నలుగురం వెళ్ళాము, అలాగే నలుగురం తిరిగి వచ్చాము అని కడుపులో బిడ్డ క్షేమంగా ఉందన్న సంగతి కాంచనకు తెలియజేస్తాడు దశరథ్. అది విని అందరూ చాలా సంతోషపడతారు. దీప చేతిని కాంచన చేతిలో పెట్టి నీ కోడల్ని నా కూతురు అనుకుని బాధ్యతగా నాకు అప్పగించావు.. ఇప్పుడు నా బాధ్యత తీరిపోయింది నీ కోడల్ని నీ చేతికే అప్పగిస్తున్నాను.. అంటూ కాంచన చేతిలో దీప చెయ్యిని పెడతాడు దశరథ్. దీప మాట్లాడుతూ మీ కోడలు గాని మీ కొడుకు గాని మీకు ఇచ్చిన మాట తప్పలేదు అంటుంది. దీంతో ఈ నేటి ఎపిసోడ్ ముగిసిపోతుంది

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:పారుతో ఓ రేంజ్‍లో ఆడుకున్న కార్తీక్-ఆపరేషన్ సక్సెస్-బిడ్డ బతికిందా?
Recommended image2
Karthika Deepam 2 Today Episode: సుమిత్ర సేఫ్-జ్యోతో పారు అబద్ధం- కడుపులో బిడ్డపై వీడని సస్పెన్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved