- Home
- Entertainment
- `కన్నప్ప` ఓటీటీ అప్ డేట్, థియేట్రికల్ బిజినెస్ లెక్కలు.. ఎన్ని వందల కోట్లు వస్తే నిర్మాతలు సేఫ్ అవుతారంటే
`కన్నప్ప` ఓటీటీ అప్ డేట్, థియేట్రికల్ బిజినెస్ లెక్కలు.. ఎన్ని వందల కోట్లు వస్తే నిర్మాతలు సేఫ్ అవుతారంటే
కన్నప్ప చరిత్ర ఆధారంగా రూపొందిన `కన్పప్ప` చిత్రం శుక్రవారం విడుదలైన ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఈ మూవీ ఓటీటీ, బిజినెస్ లెక్కలు, ఎన్ని కోట్ల కలెక్షన్లు రావాలంటే?
- FB
- TW
- Linkdin
Follow Us

`కన్నప్ప` చిత్రానికి అంతా పాజిటివ్ టాక్
మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన `కన్నప్ప` చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం(జూన్ 27న) ఆడియెన్స్ ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది.
మంచు ఫ్యామిలీ హీరోల సినిమాలకు ఇలాంటి పాజిటివ్ టాక్ రావడం చాలా ఏళ్ల తర్వాత జరుగుతోంది. ఇదొక అరుదైన విషయమనే చెప్పాలి. సహజంగా మంచు విష్ణు సినిమాలపై ట్రోల్స్ జరుగుతుంటాయి.
`కన్నప్ప` సినిమాకి అలాంటి ట్రోల్స్ కూడా లేవు. 90శాతం పాజిటివ్ టాక్ రావడం విశేషమనే చెప్పాలి. గురువారం ప్రెస్ మీట్‌లో మంచు విష్ణు ఒక మాట అన్నారు, ఒక్కొక్కరికి ఒక శుక్రవారం వారిది అవుతుంది.
ఈ శుక్రవారం నాది అన్నారు. సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ శుక్రవారం ఆయనదే కాబోతుందని అర్థమవుతుంది.
`కన్పప్ప` సినిమాకి పాజిటివ్ టాక్ రావడానికి కారణాలివే
`కన్నప్ప` సినిమా కోసం వాళ్లు పడ్డ కష్టం, వారి డెడికేషన్, వారి హార్డ్ వర్క్, సిన్సియర్‌గా చేసిన ప్రయత్నం ఇవన్నీ మూవీకి కలిసి వచ్చాయని చెప్పొచ్చు. అంతేకాదు ఇదొక దైవభక్తి మూవీ కావడం, ఇందులో ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ వంటి భారీ తారాగణం నటించడంతో సహజంగానే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది.
అయా హీరోల ఫ్యాన్స్ ఈ మూవీకి సపోర్ట్ చేయడం కూడా పాజిటివ్ టాక్‌కి కారణమని చెప్పొచ్చు. క్రిటికల్‌గానూ ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. అన్ని వర్గాల నుంచి పాజిటివిటీ బిల్డ్ కావడంతో `కన్పప్ప` మంచి టాక్‌తో రన్ అవుతుంది. ఇదంతా కలెక్షన్లు పెరగడానికి దోహదపడతాయి.
`కన్పప్ప` మూవీ ఓటీటీ డిటెయిల్స్
ఇదిలా ఉంటే `కన్పప్ప` సినిమాకి బడ్జెట్ ఎంత, బిజినెస్ ఎంత అయ్యింది? ఓటీటీ రైట్స్ ఏ సంస్థ తీసుకుంది? ఎంతకు తీసుకుంది? అదే సమయంలో నిర్మాతలు సేఫ్ కావాలంటే ఎన్ని వందల కోట్లు రావాలి అనేది ఆసక్తికరంగా మారింది.
వీటికి సంబంధించిన పలు ఆసక్తికర, షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఈ మూవీ ఓటీటీ రైట్స్ కి సంబంధించి హీరో మంచు విష్ణు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. `కన్నప్ప` మూవీ ఏ ఓటీటీ సంస్థకు అమ్మలేదని ఆయన చెప్పకనే చెప్పారు. పది వారాల తర్వాతనే ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందన్నారు.
అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం పలు సంస్థలతో చర్చలు జరిగాయి. `కన్నప్ప` టీమ్ ఓ రేట్ చెప్పారు, అంత అమౌంట్ ఇచ్చేందుకు ఆయా ఓటీటీ సంస్థలు ఒప్పుకోలేదు. దీంతో సినిమా విడుదలైన తర్వాతనే అమ్ముతామని, అప్పుడు మీరే వచ్చి కొనుక్కుంటారని మంచు విష్ణు సవాల్ విసిరారు.
ఇప్పుడు సినిమాకి వస్తోన్న టాక్‌ని చూస్తుంటే ఓటీటీ సంస్థలు పోటీ పడే అవకాశం ఉందని అనిపిస్తుంది. ఇప్పటికైతే ఏ ఓటీటీ సంస్థతోనూ డీల్ కాలేదు. ఒకవేళ అయినా పది వారాల తర్వాతనే ఈ మూవీ ఓటీటీలో రాబోతుందని చెప్పొచ్చు. మంచు విష్ణు కూడా గురువారం ప్రెస్ మీట్‌లో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
`కన్పప్ప` సినిమా బిజినెస్ వివరాలు, ఎన్ని కోట్లు రావాలంటే?
`కన్పప్ప` బిజినెస్ లెక్కలు చూస్తే, ఈ మూవీని ఎవరికీ అమ్మలేదని, సొంతంగానే రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. అయితే రేట్స్ విషయంలోనూ బయ్యర్లకి, నిర్మాతలకు మధ్య డీల్ సెట్ కాలేదని, దీంతో మంచు మోహన్ బాబు సొంతంగానే రిలీజ్ చేస్తున్నారని సమాచారం.
కేరళాలో మోహన్ లాల్ తన ఆశీర్వాద్ బ్యానర్‌పై విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ వాళ్లు రిలీజ్ చేస్తున్నారు. అయితే వాళ్లు కేవలం రిలీజ్ మాత్రమే చేస్తున్నారు. కొనలేదు. దీంతో సినిమా బిజినెస్ అనేది ఏం లేదు అని అంటున్నారు.
థియేటర్లకి రెంట్ కట్టి సినిమాని ప్రదర్శిస్తున్నారని చెప్పొచ్చు. మరి సినిమాకి ఎంత కలెక్షన్లు రావాలి? ఎన్ని కోట్లు వస్తే నిర్మాతలు సేఫ్ అవుతారనేది చూస్తే, ఈ చిత్రానికి రూ.200కోట్ల బడ్జెట్ పెట్టినట్టు నిర్మాతలు, టీమ్ చెబుతుంది.
వారు చెప్పినదాని ప్రకారం నాలుగు వందల కోట్లు వసూలు చేస్తే నిర్మాతలు సేవ్ అవుతారు. కానీ ఈ చిత్రానికి అంత బడ్జెట్ పెట్టలేదని తెలుస్తోంది. సినిమా చూస్తుంటే కూడా ఆ విషయం స్పష్టం అవుతుంది. దాదాపు వందల కోట్ల వరకు పెట్టి ఉంటారని తెలుస్తుంది. ఎందుకంటే ప్రభాస్‌కి పారితోషికం ఇవ్వలేదు, మోహన్‌లాల్‌కి కూడా ఇవ్వలేదు.
అక్షయ్ కుమార్‌తోపాటు మిగిలిన వారికి ఇచ్చారు, వారికి కూడా రిక్వెస్ట్ మెథడ్‌లో అండర్ స్టాండింగ్‌తో మోహన్ బాబు, మంచు విష్ణుతో ఉన్న రిలేషన్‌లో భాగంగా కొంత తగ్గించే ఇచ్చినట్టు తెలుస్తుంది.
మిగిలిన ఖర్చు అంతా ప్రొడక్షన్, సీజీకి అయి ఉంటుంది, సీజీ కూడా తక్కువగానే ఉన్నాయి. ఇలా ఈ మూవీ వంద కోట్ల వరకు బడ్జెట్ అయి ఉంటుందని తెలుస్తుంది. ఈ లెక్కన రెండు వందల నుంచి రూ.250కోట్ల గ్రాస్ వస్తే నిర్మాతలు సేవ్ అవుతారని చెప్పొచ్చు.
మూడు వందల కోట్ల వరకు వసూళు చేసిందంటే ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుంది. మరి అది సాధ్యమవుతుందా అనేది చూడాలి.
`కన్నప్ప` చిత్ర టీమ్, స్టోరీ డిటెయిల్స్
ఇక మంచు విష్ణు కన్పప్పగా, మోహన్ బాబు మహదేవ శాస్త్రిగా, ప్రభాస్ రుద్రగా, మోహన్ లాల్ కీరాతగా, అక్షయ్ కుమార్, కాజల్.. శివపార్వతిగా నటించిన `కన్నప్ప` చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. మోహన్ బాబు నిర్మించారు.
ఇందులో మంచు విష్ణు కూతుళ్లు అరియానా వివియానా, కొడుకు అవ్‌రవ్ చిన్న పాత్రల్లో మెరిశారు. శ్రీకాళహస్తిలో వెలసిన కన్నప్ప చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ మూవీలో ఆదివాసీ ప్రాంతంలో సాధారణ వ్యక్తిలా జన్మించిన తిన్నడు.. కన్నప్పగా ఎలా మారాడు,
దేవుడు అంటే నమ్మని తిన్నడు శివ భక్తుడు ఎలా అయ్యాడనే కథ. భావోద్వేగాలతో సాగే భక్తిరస చిత్రంగా ఇది ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది. టాక్‌ని బట్టి చూస్తే ఈ మూవీ మంచి కలెక్షన్లని సాధిస్తుందని చెప్పొచ్చు.