MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Illu Illalu Pillalu Today April 10 Episode: ప్రేమను ఇంటికి తిరిగి రమ్మని అడిగిన భద్రావతి, దిమ్మదిరిగేలా సమాధానం చెప్పిన ధీరజ్

Illu Illalu Pillalu Today April 10 Episode: ప్రేమను ఇంటికి తిరిగి రమ్మని అడిగిన భద్రావతి, దిమ్మదిరిగేలా సమాధానం చెప్పిన ధీరజ్

Illu Illalu Pillalu Today April 10 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో ప్రేమను ఇంటికి వచ్చేయని అడుగుతుంది భద్రావతి. అప్పుడు ధీరజ్ తన భార్యను చూసుకోవడం తనకు వచ్చని గట్టిగా సమాధానం చెబుతాడు. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

3 Min read
Author : Haritha Chappa
Published : Apr 10 2026, 09:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భద్రావతితో ధీరజ్ ఛాలెంజ్
Image Credit : Jio hotstar

భద్రావతితో ధీరజ్ ఛాలెంజ్

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో ప్రేమను ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొస్తుంది. రామరాజు కుటుంబం అదే సమయానికి సేనాపతి, భద్రావతి కూడా ఇంటి నుంచి బయటికి వస్తారు. ప్రేమను చూసి రామరాజు ఎలా ఉన్నావమ్మా బాగున్నావా అని అడుగుతాడు. అలాగే క్షమించమని కూడా అడుగుతాడు. అప్పుడు ప్రేమ ఎవరో చేసిన యాక్సిడెంట్ కు నువ్వు క్షమించమని ఎందుకు అడుగుతున్నావు? అని అంటుంది. అప్పుడు సేనాపతి మాట మార్చేస్తాడు. ఈలోపు భద్రావతి వచ్చి ‘రామ్మా మన ఇంటికి వెళ్లిపోదాం. ఆ ఇంట్లో నేను చూసుకోవడానికి ఎవరూ లేరు. వేదవతి కూడా అక్కడ లేదు. నువ్వు అక్కడ ఉండటం కన్నా మన ఇంట్లో ఉండడమే మంచిది. నీ మీద మాకు ఉన్న ప్రేమ చాలా ఎక్కువ. నీకు కూడా ఆ విషయం తెలుసు. మా మాట వినక ఇలాంటి పరిస్థితులు తెచ్చుకున్నావు నువ్వు. ఆ ఇంట్లో దిక్కులేని దానిలా ఉండడం ఎందుకు? నిన్ను చూసుకోవడానికి మేమున్నాము కదా.. వచ్చేయి’ అని అడుగుతుంది.

అప్పుడు ధీరజ్ ‘నా భార్యను చూసుకోవడానికి నేను ఉన్నాను. మీకంటే నా భార్యని ఎవరూ ప్రేమగా చూసుకోలేరా? ఆకాశమంత ప్రేమను చూపించడానికి నేను ఉన్నాను. అర్థం అయిందా నా పెళ్ళాం పొగరుబోతు మేనత్తా’ అని అంటాడు. అప్పుడు భద్రావతి ఏంట్రా నీ భాష అని అరుస్తుంది. ఆ సమయంలో ధీరజ్ లేనిపోని మాటలు చెప్పి ప్రేమని ఇంటికి తీసుకు వెళ్లాలని చూస్తే మీ తోకలు కత్తిరించేస్తాను అని చెప్పి ప్రేమపై చెయ్యి వేసి ఇంట్లోకి తీసుకెళతాడు.

రామరాజు మాట్లాడుతూ ‘ప్రేమ.. మా ఇంటి కోడలు. బాగున్నప్పుడు మా దగ్గర పెట్టుకొని ఆరోగ్యం బాలేనప్పుడు మీ దగ్గరికి పంపే మనుషులం కాదు. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా మా కోడలు మాతోనే ఉంటుంది’ అని చెప్పి అందరినీ ఇంట్లోకి తీసుకువెళ్లిపోతాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
భాగ్యం ఇక మారదా?
Image Credit : Jio hotstar

భాగ్యం ఇక మారదా?

ఇక్కడ నుంచి సీన్ భాగ్యం దగ్గరికి మారుతుంది. భాగ్యం ఇంకా ఆ నీచపు ఆలోచనలే చేస్తూ ఉంటుంది. క్యారేజ్ సర్దుతూ కూతురుతో ‘ప్రేమకు జరిగిన యాక్సిడెంట్ ని నువ్వు ఉపయోగించుకోవాలి. ప్రేమకు యాక్సిడెంట్ అయిందని చేసి నా గుండె పగిలిపోయింది. ఇకపై చెల్లిని జాగ్రత్తగా చూసుకుని ఇక్కడే ఉంటాను అని కాకాపట్టు’ అని కూతురుతో చెబుతుంది. అప్పుడు వల్లి మీరు కూడా నాతో వస్తేనే నేను వెళ్తానని చెబుతుంది. అప్పుడు భాగ్యం మేము ఇప్పుడు రాము నువ్వు వెళ్లి సోలో పెర్ఫార్మెన్స్ చేయు అని కూతురుని రెచ్చగొట్టి పంపిస్తుంది. ఇక వల్లి తల్లి ఇచ్చిన క్యారేజ్ పట్టుకొని బయలుదేరుతుంది.

34
భయపడుతున్న సేనాపతి
Image Credit : Jio hotstar

భయపడుతున్న సేనాపతి

ఇక్కడ నుంచి సీన్ భద్రావతి దగ్గరికి మారుతుంది. భద్రావతి ప్రేమ ఎలా ఉందోనని ఏడుస్తూ బయట తిరుగుతూ రామరాజు ఇంటి వైపు చూస్తుంది. అదే సమయానికి సేనాపతి వచ్చి ‘ఎందుకు అక్కా అలా ఉన్నావు’ అని అడుగుతాడు. ‘ప్రేమ ఎలా ఉందో అని బాధనిపిస్తోంది. ఎవరైనా ఇంత ప్రేమ చూపిస్తే చాలు కరిగిపోతుంది. అప్పుడు వేదవతిని వదులుకున్నాము. కానీ ఇప్పుడు ప్రేమని ఎలా వదులుకుంటాము. అసలు ఈ భద్రావతి మేనకోడలకి యాక్సిడెంట్ చేసిన ఆ లారీ ఎవరిది? ఆ డ్రైవర్ ఎవరో కనుక్కో. వాడిని ఎక్కడున్నా వదిలేది లేదు’ అని వార్నింగ్ ఇస్తుంది. ఆ మాటలు విని సేనాపతికి భయం పుడుతుంది.

44
భార్యపై ధీరజ్ కొండంత ప్రేమ
Image Credit : Jio hotstar

భార్యపై ధీరజ్ కొండంత ప్రేమ

ఇక్కడ నుంచి సీన్ ప్రేమ దగ్గరికి మారుతుంది. ప్రేమ కాలు నొప్పితో బాధపడుతూ మందులు వేసుకుంటుంది. ఇక ప్రేమకు డ్రెస్ మార్చుతానని అంటాడు. దానికి ప్రేమ ఏం మాట్లాడుతున్నావు అంటూ ఏవేవో తిడుతుంది. ధీరజ్ ప్రేమకు డ్రెస్ మార్చుకునేందుకు సాయం చేస్తాడు. తర్వాత భోజనం తినేందుకు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడతాడు. అప్పుడే నర్మద వచ్చి ‘వచ్చేశావా ప్రేమ.. ఇంకా నీ కోసం భోజనం పట్టుకుని గదికి వద్దాం అనుకుంటున్నా.. అన్నం తినిపించడానికి’ అని అంటుంది. అప్పుడే ప్రేమ మాట్లాడుతూ ‘మా ఆయన పరువు తీసేస్తావా.. నా పుట్టింటి వాళ్ళతో ఛాలెంజ్ చేశాడు అది నువ్వు కూడా చూసావు కదా’ అంటుంది. అప్పుడు నర్మద కూడా నిజమే అని చెప్పి పక్కకు వెళ్ళిపోతుంది. ఇక ధీరజ్ అన్నం ప్రేమకు తినిపిస్తాడు. దీంతో ఈనాటి ఎపిసోడ్ ముగిసిపోతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
3rd Week Elimination: ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్, 15 లక్షలతో మిథిలేష్‌ జంప్‌.. లక్‌ అంటే వీళ్లదే
Recommended image2
Bigg Boss 10 Elimination: మూడో వారం ఎలిమినేషన్‌, వంశీ ఔట్‌..? ఆమె జస్ట్ లో మిస్‌ ?
Recommended image3
Bigg Boss Telugu 10: సృష్టి, అమన్ ని పీకి పడేసిన అపూర్వ, మిథిలేష్.. రాగానే రచ్చ లేపారుగా
Related Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode: ప్రేమ కోసం బాధతో తలబాదుకున్న వల్లి, సేనాపతే చేయించాడని తెలిసిపోతుందా?
Recommended image2
Illu Illalu Pillalu April 7 Episode: లారీతో యాక్సిడెంట్ ప్లాన్ చేసిన భాగ్యం, చందుకు బదులు బలైన ప్రేమ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved