MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • TV
  • Illu Illalu Pillalu April 6 Episode: మళ్లీ రామరాజు ఇంటికి పెద్ద కోడలు వల్లి, చందు తప్పతాగి రచ్చ

Illu Illalu Pillalu April 6 Episode: మళ్లీ రామరాజు ఇంటికి పెద్ద కోడలు వల్లి, చందు తప్పతాగి రచ్చ

Illu Illalu Pillalu April 6 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో వల్లి మళ్లీ రామరాజు ఇంటికి వచ్చేందుకు లైన్ క్లియర్ అవుతోంది. ఇక చందు తప్పతాగి ఇంట్లో రచ్చ రచ్చ చేశాడు.ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

3 Min read
Author : Haritha Chappa
Published : Apr 06 2026, 09:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ధీరజ్ వల్ల ప్రేమకు గాయం
Image Credit : Jio hotstar

ధీరజ్ వల్ల ప్రేమకు గాయం

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో ప్రేమ తన మనసులోని ప్రేమను ధీరజ్‌‌కు చెబుతుంది. అయినా కూడా ధీరజ్ ఆమె మాట వినకుండా డ్రామాలు ఆపమని అంటాడు. అమూల్య విషయంలో నువ్వు చేసింది నేను మర్చిపోలేను అని అంటాడు. ప్రేమ ఎంతగా తన తప్పు చేయలేదని చెబుతున్నా కూడా ధీరజ్ వినడు. ప్రేమించానని చెబుతూ ఒక గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాను అని చెబుతుంది. కానీ ధీరజ్ మాత్రం ఆ బొమ్మను తీసుకొని పగలగొట్టేస్తాడు. దాంతో ప్రేమ చాలా బాధపడుతుంది. పగిలిపోయిన ఆ బొమ్మను తీస్తుంటే ప్రేమ చేతికి గాయం తగిలి రక్తం వస్తుంది. అది చూసి అలాగే ఉండిపోతాడు ధీరజ్. మనసులో మాత్రం చాలా బాధపడతాడు. అప్పుడు నర్మద వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. ‘నువ్వు అసలు మనిషిలా ప్రవర్తిస్తున్నావా? నీ భార్యకు దెబ్బ తగిలిస్తుంటే అలా చూస్తూ ఉన్నావేంటి? ఎంత కోపంగా ఉంటే మాత్రం ఇంత బండరాయిలా ఉంటావా? భార్యతో ప్రవర్తించే పద్ధతి ఇదేనా?’ అని అడుగుతుంది. 

దానికి ధీరజ్ ‘నీకు ముంచేవాళ్లంతా మంచి వాళ్ళలా కనిపిస్తారు’ అంటూ ప్రేమ పై ఉన్న ద్వేషాన్ని బయటపెడతాడు. కానీ చందు ఈ విషయం ఇక్కడితో వదిలేయాలని లేకపోతే, తన మీద ఒట్టే అని చెప్పిన సంగతి గుర్తు చేసుకుని ఆగిపోతుంది. ‘నువ్వు అనుకునేది మాత్రమే నిజం కాదు. నీకు తెలియని నిజాలు కూడా చాలా ఉంటాయి. అవి తెలిసిన రోజు మీ కళ్ళు తెరుచుకోవడమే కాదు.. పశ్చాత్తాప పడతావు’ అని అంటుంది నర్మద. ధీరజ్ అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
తల్లిదండ్రులను కొట్టిన వల్లి
Image Credit : Jio hotstar

తల్లిదండ్రులను కొట్టిన వల్లి

ఇక్కడి నుంచి సీన్ వల్లి దగ్గరికి మారుతుంది. నర్మద గుడిలో జరిగింది గుర్తు చేసుకుని కోపంగా ఉంటుంది. మరోపక్క భాగ్యం, ఇడ్లీ బాబాయ్ మిర్చి బజ్జీలు వేసుకొని డాన్సులు వేస్తూ తింటూ ఉంటారు. అది చూసి వల్లికి విపరీతంగా కోపం వస్తుంది. ఇడ్లీ బాబాయి, భాగ్యం ఒకరికొకరుకు మిర్చి బజ్జీలు తినిపించుకుంటూ ఉంటారు. అది చూసి వల్లి చీపురు పట్టుకొని వారిద్దరిని చితక్కొడుతుంది. నాకు కాపురాన్ని కూల్చేసి బజ్జీలు వేసుకొని తింటారా అని చీపురుతో ఉతికారేస్తుంది.

‘నిన్న నర్మద, ప్రేమ కాళ్లు పట్టుకొని నాకు కాపురాన్ని నిలబెట్టాలనుకున్నాను.. నా భర్తకు దూరమైతే నేను బతకలేనన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకొని నన్ను క్షమించి నన్ను మా అత్తరింటికి తీసుకెళ్ళిపోవడానికి రెడీ అయిపోయారు. మధ్యలో నువ్వు వచ్చి ఛాలెంజ్ లు చేసి మొత్తం చెడగొట్టావు’ అని ఇద్దరినీ మళ్లీ ఉతికేస్తుంది వల్లి. మా మావయ్యకి అసలు విషయం తెలిసిందంటే ఏం జరుగుతుందో అని చాలా భయంగా ఉంది అంటుంది వల్లి. దానికి భాగ్యం మాట్లాడుతూ రేపే నిన్ను మీ అత్తారింట్లో అడుగు పెట్టించి నీ భర్తకు దగ్గర చేస్తాను అని అంటుంది భాగ్యం. దానికి వల్లి ఎంతో సంతోషపడుతుంది

33
తప్పతాగిన చందు
Image Credit : Jio hotstar

తప్పతాగిన చందు

ఇక్కడి నుంచి సీన్ చందు దగ్గరికి మారుతుంది. చందు బాగా తాగి బండి నడుపుకుంటూ వస్తాడు. వల్లి చేసిన మోసాలు గుర్తుతెచ్చుకుంటూ ఉంటాడు. ఈ విషయాలన్నీ నాన్నకు చెప్పేస్తా అని అనుకుంటూ ఉంటాడు. చందు తాగి రావడం నర్మద, ప్రేమ చూస్తారు. చందు పరిస్థితి చూసి వాళ్ళిద్దరూ చాలా బాధపడతారు. వల్లి అక్క చేసిన మోసాన్ని చందు బావ తట్టుకోలేకపోతున్నాడు. చందు బావకు నచ్చజెప్పి వల్లి అక్కని తీసుకొచ్చేద్దామని అనుకుంటారు తోటికోడళ్ళు. చందు తాటి ఏదేదో మాట్లాడడం సాగర్, ధీరజ్, తిరుపతి చూస్తారు. ఏమైందని అడుగుతూ ఉంటారు. అయినా కూడా చందు ఏమీ చెప్పడు. నేను ఇప్పుడే మా నాన్న తో మాట్లాడాలి అంటాడు చందు. నర్మద, ప్రేమ ఆపేందుకు ప్రయత్నిస్తారు. ఈలోపు రామరాజు బయటికి వస్తాడు. చందు వల్లి గురించి చెప్పబోతుంటే ప్రేమ అడ్డుకుంటుంది. నర్మద కూడా మళ్లీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. రామరాజు మాట్లాడుతూ నువ్వు తాగేసి వచ్చావా అని అడుగుతాడు. దానికి చందు తను తాగి రావడానికి కారణం వల్లి అని చెబుతాడు. 

చందు మాట్లాడుతూ ‘మీరు చాలా సెన్సిటివ్ మీరు నమ్మిన వాళ్లు మోసం చేసిన మీరు తట్టుకోలేరు. అలాగే వల్లి చేసింది చెబితే మీరు తట్టుకోలేరు. అందుకే గుండెను కాస్త స్ట్రాంగ్ గా చేసుకోండి’ అని అంటాడు. అప్పుడు నర్మద మధ్యలో కల్పించుకొని ఏదేదో కథలు చెప్పేస్తుంది. చందును తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. ఆ సమయంలో సాగర్ వచ్చి ఇక్కడ సెంటిమెంటల్ డ్రామా జరుగుతోంది... పెద్దకొడుకు మీద ప్రేమతో రామరాజు గారి కళ్ళు పూర్తిగా మూసుకుపోయాయి... అదే నేను తాగి వస్తే ఎన్నో మాటలు అనేవారు అని అంటాడు. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Krishnudu Remueration: రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? కూర్చొని లక్షలు సంపాదించాడు
Related Stories
Recommended image1
Illu Illalu Pillalu April 4 Episode: నర్మద, ప్రేమ కాళ్ల మీద పడ్డ వల్లి.. నర్మదకే సవాలు విసిరిన భాగ్యం
Recommended image2
Illu Illalu Pillalu: వల్లి లేకుండా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియలే లేదు, నల్ల పిల్ల అన్నవాళ్లే మెచ్చుకుంటున్నారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved