MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Illu Illalu Pillalu April 4 Episode: నర్మద, ప్రేమ కాళ్ల మీద పడ్డ వల్లి.. నర్మదకే సవాలు విసిరిన భాగ్యం

Illu Illalu Pillalu April 4 Episode: నర్మద, ప్రేమ కాళ్ల మీద పడ్డ వల్లి.. నర్మదకే సవాలు విసిరిన భాగ్యం

Illu Illalu Pillalu April 4 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో వల్లి తన కాపురాన్ని నిలబెట్టమని నర్మద, ప్రేమ కాళ్లు పట్టుకుంటుంది. కానీ భాగ్యం మాత్రం నర్మదకు సవాలు విసురుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

3 Min read
Author : Haritha Chappa
Published : Apr 04 2026, 09:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పశ్చాత్తాపం లేని వల్లి
Image Credit : Jio hotstar

పశ్చాత్తాపం లేని వల్లి

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో శ్రీరామనవమి పూజ తర్వాత రామరాజు ఇంట్లో అందరూ కూర్చొని ప్రసాదాలు తింటూ ఉంటారు. సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో పెద్దమ్మ జానకి... రామరాజుతో వేదవతిని వారం రోజులు మా ఊరు పంపిస్తావా అని అడుగుతుంది. దానికి వేదవతి రాలేనని అని చెబుతుంది. అప్పుడు అందరూ ఒక వారం రోజులే కదా పెద్దమ్మతో వెళ్ళమని చెబుతారు. దాంతో వేదవతి ఊరు వెళ్లేందుకు ఒప్పుకుంటుంది. ఇక్కడి నుంచి సీన్ వల్లి దగ్గరకి మారుతుంది. ఒక గుడిలో వల్లి... ప్రేమ, నర్మదతో మాట్లాడుతుంది. మరోపక్క గుడిమెట్ల పైనే భాగ్యం, ఇడ్లీ బాబాయ్ కూర్చొని ఏం జరుగుతుందో చూస్తూ ఉంటారు. ‘ఏదో మాట్లాడాలని ఫోన్ చేసావు కదా.. మాట్లాడకుండా అలా బొమ్మలా నిల్చుంటావ్ ఏంటి’ అని అడుగుతుంది నర్మద. అప్పుడు వల్లి మాట్లాడుతూ ‘పాము కరవడానికి వస్తే ఏం చేస్తాం.. కర్రతోనో చెప్పుతోనో కొడతాము. మన ముగ్గురి మధ్య జరిగింది కూడా అదే. నా బండారం మీరు బయటపెట్టారు. మీ లోపాలని నేను బయట పెట్టాను. చెల్లుకు చెల్లు అయిపోయింది. మనల్ని చంపాలనుకునే వాళ్ళని మనం చంపాలి అనుకోవడం ధర్మమే కాని పాపం కాదు కదా. కాబట్టి మన విషయంలో కూడా అదే జరిగిందనుకొని నన్ను వెనక్కి తీసుకెళ్లండి’ అని అంటుంది.

24
కాళ్ల మీద పడ్డ వల్లి
Image Credit : Jio hotstar

కాళ్ల మీద పడ్డ వల్లి

ప్రేమ మాట్లాడుతూ ‘చూసావా అక్కా.. ఎంత జరిగినా కూడా ఈ వల్లికి బుద్ధి రాలేదు. తను చేసింది తప్పు అని తలదించుకోవట్లేదు. ఇలాంటి వ్యక్తితో మాట్లాడే కన్నా బుద్ధి తక్కువ పని లేదు’ అని అంటుంది. అప్పుడు వల్లి ‘నేను మీ సొంత అక్క అనుకొని పెద్ద మనసుతో క్షమించేసి.. నన్ను మన ఇంటికి తీసుకెళ్లండి’ అని బతిమిలాడుతుంది. దానికి ప్రేమ మాట్లాడుతూ ‘నిన్ను క్షమించడానికి నువ్వు చేసింది ఏమైనా ఒకటి రెండు తప్పులా లేక చిన్న చిన్న తప్పులు అనుకుంటున్నావా? చందు బావ దగ్గర పెళ్లి కోసం మీరు పది లక్షలు తీసుకున్నారు. అప్పుడు క్షమించేసాం. మీకు కోట్ల కోట్ల ఆస్తులు, వ్యాపారాలు ఉన్నాయని అబద్ధాలు చెప్పారు. అది కూడా క్షమించి వదిలేసాం. ఏకంగా ఇంటి ఆడపడుచు జీవితాన్నే నాశనం చేయాలని చూసావ్. ఎన్ని తప్పులు, మోసాలు చేసిన ఎంతైనా అక్కలాంటిది కదా.. కాపురం కూలిపోతుందని వదిలేశాం. మేము క్షమించేస్తే నువ్వు మాత్రం మా కాపురంలో చిచ్చు పెట్టాలని చూసావ్. అందుకే ఈసారి నిన్ను క్షమించేది లేదు’ అని చెప్పేస్తుంది ప్రేమ. అప్పుడు వల్లి చెంపలు వేసుకుంటూ నా కాపురాన్ని నిలబెట్టండి అంటూ నర్మద, ప్రేమల కాళ్ల మీద పడుతుంది.

Related Articles

Related image1
Illu Illalu Pillalu April 2 Episode: వల్లి బాగోతం మొత్తం బట్టబయలు.. ఇంటి నుంచి గెంటేసిన చందు
Related image2
Illu Illalu Pillalu April 3 Episode: నా కాపురం కూల్చేశారంటూ తల్లిదండ్రులను కడిగి పారేసిన వల్లి, పాపం చందు
34
భాగ్యం సవాలు
Image Credit : Jio hotstar

భాగ్యం సవాలు

అప్పుడు భాగ్యం కోపంగా వచ్చి ‘వాళ్ల కాళ్లు పట్టుకుంటావేంటి? బుద్ధి లేకుండా..’ అని అరుస్తుంది. తల్లిని పట్టించుకోకుండా వల్లి వాళ్ళని బతిమిలాడుతుంది. ‘నువ్వు ఎవరివి ఈ భాగ్యం కూతురువి. భాగ్యం కూతురు ఈ పిల్ల బచ్చాల కాళ్లు పట్టుకోవడం ఏంటి?’ అని ఓవరాక్షన్ చేస్తుంది భాగ్యం. అంతే కాదు నర్మద, ప్రేమలను తిడుతుంది. ‘నా కూతురు చేత కాలు పట్టించుకుంటారా? ఒళ్లు దగ్గర పెట్టుకొని వినండి.. మీరు క్షమించేసి ఆ ఇంట్లోకి తీసుకెళ్లేదేంటి బోడి... నేనే నా కూతురిని ఆ ఇంట్లో అడుగుపెట్టేలా చేస్తాను’ అంటుంది భాగ్యం. దానికి నర్మద మాట్లాడుతూ ‘ఇంత వరకు పరిస్థితి రావడానికి కారణం నువ్వే. నువ్వు చేసిన తప్పులు, మోసాల వల్ల నీ కూతురు కాపురం కూలిపోయి రోడ్డు మీద పడింది. కూతురు కాపురం పట్టించుకెకుండా ఇది చేస్తాను, అది చేస్తాను అంటున్నావు. ఇంతవరకు వల్లి బాధపడుతుంటే చందు బావతో మాట్లాడి తనని ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ నువ్వు పొగరు చూపించిన తర్వాత నీ కూతుర్ని ఆ ఇంట్లో ఈ జన్మలో అడుగు పెట్టనివ్వం’ అని అంటుంది.

అప్పుడు వల్లి మధ్యలో కల్పించుకొని మా అమ్మ పిచ్చిది ఏదేదో మాట్లాడుతుంది మనం మన ఇంటికి వెళ్ళిపోదాం పదండి అంటూ నర్మద, ప్రేమలతో అంటుంది. అయినా సరే బాగ్యం తగ్గకుండా ‘ఆగు నువ్వు. ఆ ఇంటి పెద్ద కోడలివి నువ్వు. వాళ్ళ ముందు తక్కువ కాకూడదు. నీ కాపురం నేను నిలబడతాను. నిన్ను ఆ ఇంట్లో ఎలా అడుగు పెట్టించాలో నాకు తెలుసు. పదే రోజుల్లో నా కూతురుని ఆ ఇంట్లో అడుగు పెట్టించకపోతే నా పేరు భాగ్యలక్ష్మి కాదు’ అని సవాలు విసురుతుంది భాగ్యం. నర్మద మాట్లాడుతూ ‘ ఇంత దూరం వచ్చింది కాబట్టి.. నీ కూతుర్ని ఎలా ఇంట్లోకి తీసుకొస్తావో నేను కూడా చూస్తాను’ అని అంటుంది. ఇక భాగ్యం వల్లిని చెయ్యి పట్టుకొని లాక్కొని ఇంటికి తీసుకెళ్ళి పోతుంది.

44
ప్రేమపై ధీరజ్ ద్వేషం
Image Credit : Jio hotstar

ప్రేమపై ధీరజ్ ద్వేషం

ఇక ఇక్కడి నుంచి శీను రామరాజు ఇంటికి మారుతుంది ధీరజ్ తీరంగా ఆలోచిస్తూ ఉంటాడు ప్రేమ తన మనసులోని లవ్ ను ధీరథకు చెప్పాలని ఒక గిఫ్ట్ కొనుక్కొని వస్తుంది కానీ ధీరస్ మాత్రం కోపంగా తోసేస్తాడు నిన్ను చూస్తుంటేనే కంపరంగా ఉంది మామ మనసు బాధ పెట్టడం ఇష్టం లేక నీ పక్కన కూర్చున్నాను నిన్ను క్షమించి కాదు నా చెల్లెలు విషయంలో నువ్వు చేసిన నమ్మకద్రోహం నేను మర్చిపోలేను నీ మీద నాకు జీవితాంతం కోపం పోదు అని అంటాడు దానికి ప్రేమ చాలా బాధపడుతూ నీ కోపాన్ని భరించడం చాలా కష్టం అంటూ ఏడుస్తుంది మన మధ్య దూరాన్ని పెరిగేలా చేయకు అని ప్రార్థిస్తుంది అయినా కూడా ధీరజ్ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode:కేక్‌లో విషం కలిపిన జ్యో-దీపకు తినిపించిన సుమిత్ర-దీపకు ఏం జరిగింది?
Recommended image2
Jabardasth : కిరాక్ ఆర్పీ మోసం చేసిన జబర్దస్త్ కమెడియన్ ఎవరో తెలుసా? ఏం చేశాడంటే?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: సూపర్ సస్పెన్స్ ఎపిసోడ్- దీపను చంపబోయిన జ్యో- అయోమయంలో కార్తీక్
Related Stories
Recommended image1
Illu Illalu Pillalu April 2 Episode: వల్లి బాగోతం మొత్తం బట్టబయలు.. ఇంటి నుంచి గెంటేసిన చందు
Recommended image2
Illu Illalu Pillalu April 3 Episode: నా కాపురం కూల్చేశారంటూ తల్లిదండ్రులను కడిగి పారేసిన వల్లి, పాపం చందు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved