- Home
- Entertainment
- TV
- Gunde Ninda Gudi Gantalu:మనోజ్ మాటలకు ఏడ్చేసిన రోహిణీ, అందరి మనసులు గెలిచిన బాలు, మీనా
Gunde Ninda Gudi Gantalu:మనోజ్ మాటలకు ఏడ్చేసిన రోహిణీ, అందరి మనసులు గెలిచిన బాలు, మీనా
Gunde Ninda Gudi Gantalu: కపుల్ కాంటెస్ట్ చాలా రసవత్తరంగా సాగుతోంది. ఈ కాంటెస్ట్ లో పోటీ పడుతూ ప్రభావతి కింద పడిపోతుంది. మరి నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో టీవీ కంటే ముందుగా మీ కోసం...

Gunde Ninda Gudi Gantalu
ప్రభావతి కుర్చీ ఎక్కి, పువ్వు అందుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ.. ఈలోగా సత్యం కి తుమ్ము రావడం, కుర్చీ సరిగా పట్టుకోలేకపోవడంతో ప్రభావతి కాస్త కింద పడిపోతుంది. దీంతో... ముగ్గురు కోడళ్లు వెంటనే స్టేజీ పైకి పరుగులు తీస్తారు. వెంటనే ముగ్గురూ కలిసి.. ఆమె నడుము సరి చేయాలని చూస్తారు. మీనా చెప్పినట్లే చేసి... ప్రభావతి నడుము సరి చేస్తారు. ఇక...ఓడిపోవడంతో ప్రభావతి కిందకు వచ్చేయాల్సి వస్తుంది.
మనోజ్ గెలవాలని ప్రభావతి కోరిక..
ప్రభావతి డల్ గా కూర్చొంటే... బాలు కౌంటర్లు వేయడం మొదలుపెడతాడు. ‘ అమ్మ బరువు అని తెలిసినా బాధ్యతలు మోయాలని వెళ్లావు. కానీ కుర్చీనే మోయలేదు, నువ్వు ఏమీ మోస్తావ్. అమ్మను డైటింగ్ చేయమంటే చేసిందా.. నువ్వు ఏం చేస్తావ్ లే నాన్న’ అంటూ వాళ్ల నాన్నతో బాలు మాట్లాడుతుంటే.. మీనా ఆపేసి.. కూర్చోపెడుతుంది. ‘ కోడళ్లు నడుము సరి చేయకపోతే నీ పరిస్థితి ఏమయ్యేది అమ్మా’ అని బాలు అంటే.. కామాక్షి నవ్వేస్తుంది. అది చూసి ప్రభావతికి కోపం వస్తుంది. కామాక్షి మాత్రం ఛాన్స్ దొరికిందని అనాలి అనుకున్న మాటలన్నీ అనేస్తుంది. ‘ ఈ మధుర క్షణాల కోసమే ఎదురుచూస్తూ కూర్చొన్నాను ఒదిన. నువ్వు ఓడిపోయే క్షణాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూశాను. నా మనసుకు ఇప్పుడు ప్రశాంతంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉందో’ అని ప్రభావతి ఓడిపోయినందుకు కామాక్షి సంబరపడిపోతుంది. వెంటనే ప్రభావతి పౌరుషంగా... ‘ రేయ్ మనోజ్ మీరు ఏం చేస్తారో నాకు తెలీదు.. ఎలాగైనా గెలిచి రూ. లక్షతో ఇంటికి రావాలి’ అని చెబుతుంది. వెంటనే బాలు.. ‘ లక్ష అనగానే వాడు మింగేస్తాడు కదా ’ అని బాలు అంటాడు. ప్రభావతి మనోజ్ కి సపోర్ట్ చేస్తే... సత్యం బాలు, మీనాలకు సపోర్ట్ గా నిలుస్తాడు.‘ బాలు... నువ్వూ, మీనా సరైన జోడి. మీరు తప్పకుండా గెలుస్తారు.’ అని సత్యం మోటివేట్ చేస్తాడు. ‘మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా గెలుస్తాం మామయ్య’ అని మీనా అంటుంది. ఇక ఎలాగూ ఓడిపోయాం కదా అని కామాక్షి జంట, ప్రభావతి జంట అక్కడి నుంచి వెళ్లిపోతారు.
అందరి మనసులు గెలిచిన బాలు, మీనా
ఇక... ఈ కాంటెస్ట్ లో ముగ్గురు అన్నదమ్ముల జంట మాత్రమే ఫైనల్స్ కి చేరుకుంటారు. వాళ్ల పేర్లను ప్రకటిస్తారు. వాళ్లను స్టేజీ మీదకు పిలుస్తారు. ఈ రౌండ్ పేరు ‘ భార్య, భర్త జీతం’ అని యాంకర్ చెబుతుంది. దీంతో.. జడ్జ్ లు ఈ దంపతులను కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వాటికి వీరు సమాధానం చెప్పాలి. ఈ రౌండ్ లో శ్రుతి, రవి తమ పార్ట్ నర్ జీతం ఎంతో తమకు తెలీదని చెబుతారు. మనోజ్ ని అడిగితే.. మీరు ఇలాంటి సీక్రెట్స్ అడగకూడదు అని అంటాడు. తర్వాత తప్పక రూ. పదివేలు ఆదాయం వస్తుందని అంటాడు. ఇక రోహిణీ తనకు నెలకు రూ.50వేలు వస్తాయని, వాటిలో కొన్ని ఇంటి ఖర్చులకు ఇస్తాను అని చెబుతుంది.
మీ భార్య పూలు అమ్మి ఎంత సంపాదిస్తుందో తెలుసా? అని బాలుని అడిగితే... తెలుసు అని చెబుతాడు. ‘ రోజుకి రూ. వెయ్యి నుంచి రూ.15వందలు సంపాదిస్తుంది. ఖర్చులు పోను రూ.500 మిగులుతాయి. ఇంట్లో సరుకులు అయితే తన డబ్బులే వాడుతుంది. నాకు కారు కూడా కొనిపెట్టింది. దాని ఈఎంఐ తనే కడుతుంది.’ అని చాలా గర్వంగా చెబుతాడు. ఇక మీనా‘ నా భర్త బాధ్యత తెలిసిన మనిషి. చెల్లెలు పెళ్లి కి బంగారం చేయించారు. ఇంటి ఖర్చులు చూసుకుంటున్నారు. తన తమ్ముడిని చదివించాడు. ఇక ఆయనకు నెలకు రూ.40-50 వేల ఆదాయం వస్తుంది. దాని ఆధారంగానే వాయిదాలో నాకు ఒక బండి కొనిపెట్టారు. ఆ బండి వాయిదాకి నెలకు రూ.8వేలు కడతారు. చిన్న చిన్న అప్పులు ఉన్నాయి.. వాటికి వడ్డీలు కడుతూ ఉంటారు. ఇంటి ఖర్చులకు డబ్బులు ఇస్తారు. మిగిలిన డబ్బులు మా ఖర్చులకు దాచుకుంటాం’ అని మీనా చెబుతుంది. ఇలా కపుల్స్ ని చాలా ప్రశ్నలు అడుగుతారు. వాటికి కూడా బాలు, మీనా గొప్పగా సమాధానాలు ఇస్తారు. తర్వాత లంచ్ బ్రేక్ ఇస్తారు. ఈ మూడు జంటలు.. తర్వాతి గేమ్స్ లో ఎలా గెలవాలి అనే విషయం గురించి చర్చించుకుంటారు.
ఏడ్చేసిన రోహిణీ..
తర్వాత మళ్లీ కాంటెస్ట్ మొదలౌతుంది. జడ్జ్ లు ప్రశ్నలు అడుగుతారు. ‘ మీ సంసార జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి?’ అని అడుగుతారు. ‘ అడ్జస్ట్ అయిపోవాలి. భర్త ఎన్ని తప్పులు చేసినా సర్దుకుపోవాలి. భర్తతో పాటు అతని బలహీనతను కూడా ప్రేమించాలి’ అని రోహిణీ చెబితే.. ‘ అందరూ బాగుండాలి... అందులో మనం కూడా ఉండాలి’ అని అనుకోవాలని మనోజ్ చెబుటాడు. ‘టేక్ ఇట్ ఈజీగా ఉండాలి, గొడవలు పడకూడదు. మా మధ్య అసలు గొడవలే రావు’ అని రవి అంటే..శ్రుతి కూడా అదే చెబుతుంది. వెంటనే బాలు. ‘ అయ్యయ్యో... వీళ్లు ఏవేవో చెబుతున్నారు. గొడవలు చిలిపి, తగాదాలు లేని సంపారం చప్పగా ఉంటుంది కదా.. మా మధ్య మాత్రం గొడవలు వస్తూనే ఉంటాయి’ అని బాలు చెబుతాడు. మరి ముందు ఎవరు సారీ చెబుతారు? అని జడ్జ్ లు అడిగితే.. ‘ సారీ అనే రెండు అక్షరాలతో గొడవ పోదు కదా.. అందుకే.. నేను తనకు హల్వా కానీ చీర కానీ తీసుకువెళతాను.’అని బాలు చెబితే.. ‘ పొద్దున వచ్చిన ఎండ సాయంత్రానికి పోయినట్లు, సాయంత్రం వచ్చిన చీకటి పొద్దునకు పోయినట్లు.. భార్యభర్తల మధ్య వచ్చే గొడవలు వచ్చిపోవాలి అంతేకానీ.. అలానే ఉండిపోకూడదు’ అని మీనా చెబుతుంది. అందరూ చప్పట్లు కొడతారు.
‘ నీ మనసు నాకు తెలుసు’ అనే కాంటెస్ట్ పెడతారు. ఒకరి మనసులో ఏముందో మరొకరు చెప్పాలి. ముందుగా మనోజ్, రోహిణీ స్టేజీ మీదకు వస్తారు. ఇక.. రోహిణీ చేతులు పట్టుకొని మనోజ్ చాలా గొప్పగా మాట్లాడతాడు. కానీ.. అతని మాటలకు రోహిణీ ముఖం మాడిపోతుంది. మనోజ్ తన గురించి చాలా నమ్మకంగా ఉన్నాడని ఏడ్చేస్తుంది. ఆమె కూడా మనోజ్ గురించి చాలా బాగా మాట్లాడుతుంది. తర్వాత రవి, శ్రుతి లు కూడా ఒకరి గురించి మరొకరు గొప్పగా మాట్లాడతారు. కానీ రవి నలుగురు పిల్లలు కావాలి అని చెప్పగానే శ్రుతికి కోపం వచ్చి.. ఏదోదో తిట్టేస్తుంది. కోపంగా.. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత బాలు, మీనాలు వస్తారు. ఇద్దరు ఒకరినొకరు ఏమని పిలుచుకుంటారు? అని అడిగితే... ‘ పూల గంప, ముళ్ల కంప’ అని చెబుతారు.
రూమ్ మాత్రమే కట్టిన బాలు,మీనా
ఇక.. వీరిద్దరూ కళ్లల్లో చూసుకుంటూ....ఏమీ మాట్లాడకుండా నిలపడిపోతారు. ఏం మాట్లాడుకోవడం లేదేంటని అడిగితే.. కళ్లతో మాట్లాడుకున్నాం అని బాలు చెబుతాడు.కానీ, యాంకర్ జడ్జ్ లతో మాట్లాడి కొన్ని ప్రశ్నలు అడుగుతామని.. కరెక్ట్ సమాధానం చెప్పాలి అని అంటారు. ఇద్దరికీ చెరొక బోర్డు ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు. అన్ని ప్రశ్నలకు ఇద్దరూ సమాధానాలు రాస్తారు. ఇద్దరూ సేమ్ ఆన్సర్స్ రాస్తారు. దీంతో.. అందరూ చప్పట్లు కొడతారు.
ఇక ముగ్గురు జంటలకు చివరి రౌండ్ పెడతారు. పిల్లలు ఆడుకునే బ్లాక్స్ ఇచ్చి.. డ్రీమ్ హౌస్ కట్టమని అడుగుతారు. బాలు, మీనా ఇల్లు కట్టమంటే....కేవలం ఒక రూమ్ మాత్రమే కడతారు. మిగిలిన జంటలు అవి కూడా కట్టరు. కమింగప్ లో బాలు, మీనా విజేతలుగా ప్రకటిస్తారు.

