MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • TV
  • Gunde Ninda Gudi Gantalu:గుణకి వీడియో పంపిన రోహిణీ..‘మౌనిక కడుపులో బిడ్డకు నేను కారణం కాదు’ బాంబు పేల్చిన సంజూ

Gunde Ninda Gudi Gantalu:గుణకి వీడియో పంపిన రోహిణీ..‘మౌనిక కడుపులో బిడ్డకు నేను కారణం కాదు’ బాంబు పేల్చిన సంజూ

Gunde Ninda Gudi Gantalu:పిల్లలు పుట్టరు అనే సాకుతో మౌనికను ఇంటి నుంచి గెంటేయాలని సంజూ ప్లాన్ వేస్తాడు. కానీ, వాళ్ల ప్లాన్ మొదలుకాకముందే మౌనిక తల్లికాబోతుందని తెలుస్తుంది. మరి నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో టీవీ కంటే ముందుగా మీకోసం... 

4 Min read
Author : ramya Sridhar
Published : Mar 02 2026, 09:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గుండె నిండా గుడి గంటలు..
Image Credit : Jio Hotstar

గుండె నిండా గుడి గంటలు..

బాలు, మీనా.. ఫంక్షన్ బాగా జరిగినందుకు చాలా సంతోషిస్తారు. ముఖ్యంగా మౌనిక తల్లి అవుతున్నందుకు బాలు సంబరపడిపోతూ ఉంటాడు. మౌనిక మనకు అల్లుడిని ఇస్తుంది కదా.. మనం తనకు ఒక కోడలిని ఇవ్వాలి కదా అని బాలు అడుగుతాడు.అయితే.. పూజ అయ్యే వరకు అలాంటివి ఏమీ ఉండవు అని బాలుని ఆపేస్తుంది మీనా. తాను తెచ్చిన బెల్లం పాలు తాగమని చెబుతుంది.

మరోవైపు.. నీలకంఠం మౌనికకు పిల్లలు పుట్టరు అనేలా హాస్పిటల్ నుంచి రిపోర్ట్స్ తెప్పిస్తాడు.‘ నేను కోరుకున్నట్లే రిపోర్ట్స్ లో వచ్చింది.. పవర్ అస్త్ర నా చేతికి దక్కింది. దీనిని వాడుకొని మౌనికను పుట్టింటికి పంపించి.. నా కొడుక్కి ఇంకో పెళ్లి చేస్తాను. నాకు తిరుగులేదు. రాజకీయాల్లో చక్రం తిప్పుతాను’ అని నీలకంఠం సంబరపడిపోతాడు. ఇదే విషయం తన భార్య సువర్ణకు చెప్పడానికి పిలుస్తాడు. కానీ చెప్పకుండా.. కాఫీ తెమ్మని ఆర్డర్ వేస్తాడు. ఆమె కాఫీ తేవడానికి వెళ్తుంటే సంజూ, మౌనిక ఎంట్రీ ఇస్తారు. ‘ రేయ్ సంజూ.. గుడ్ న్యూస్ రా’ అంటాడు. అయితే.. ‘ మీకు కూడా తెలిసిపోయిందా మామయ్యగారు? ఏమండీ మీరే చెప్పారా’ అని మౌనిక అంటుంది.‘ అది ఎందుకు అంత సంతోషపడుతుంది?’ అని నీలకంఠం కొడుకును అడుగుతాడు. ఈ లోగా.. తాను తల్లిని కాబోతున్నాను అనే విషయం మౌనిక చెబుతుంది. అది విని సువర్ణ సంబరపడిపోతే.. నీలకంఠం షాక్ అవుతాడు. ఇక.. సువర్ణ తన కోడలికి స్వీట్ తినిపిస్తుంది. ఇక.. మౌనికను జాగ్రత్తగా చూసుకోవాలని సంజూకి చెబుతుంది.ప్లాన్ రివర్స్ అయినందుకు నీలకంఠం కోపంతో ఊగిపోతాడు. బుద్ధి ఉందా అని కొడుకును చెడామడా తిట్టేస్తాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మీనా స్నేహితులను అవమానించిన ప్రభావతి...
Image Credit : Jio Hotstar

మీనా స్నేహితులను అవమానించిన ప్రభావతి...

బొమ్మలకొలువు రెండో రోజు కూడా మీనా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అక్కడే పిల్లలు డ్యాన్స్ నేర్చుకుంటూ ఉంటారు. అందరూ డ్యాన్స్ చేస్తుంటే.. ప్రేమ జంట మాత్రం... డ్యాన్స్ చేయకుండా ప్రపంచాన్ని మర్చిపోయి ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే.. అక్కడ ఓ బుడ్డది వాళ్లకు టీచర్ కి చెబుతాను అంటూ వార్నింగ్ ఇస్తుంది.

మరోవైపు పూలతో అలంకరించమని ప్రభావతికి సుశీలమ్మ చెబుతుంది. ఆమె పూలు పట్టుకోగానే.. బాలు వచ్చి ఏడిపిస్తూ ఉంటాడు. అది తట్టుకోలేక ప్రభావతి పూలు అమ్మినట్లు నటిస్తుంది.వీళ్లు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా.. సుశీలమ్మకు తెలిసిన ఓ అమ్మాయి వస్తుంది. ఆమెను ఫ్యామిలీ మొత్తానికి పరిచయం చేస్తుంది. అయితే.. ఆమె ఓ డాక్టర్. రోహిణీని చెక్ చేయమని ప్రభావతి అడుగుతుంది. పూజ అయిపోయిన తర్వాత చెక్ చేస్తాను అని డాక్టర్ చెబుతుంది. అయితే..తనకు ఏదో సమస్య రాబోతుందని గమనించిన రోహిణీ.. ప్రభావతిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటుంది. పనిలో పనిగా.. చీర తెచ్చి.. అత్తయ్య మీకోసం మలేషియా నుంచి తెప్పించాను అని చెబుతుంది. ఆ చీర కట్టుకోవడానికి ప్రభావతి వెళ్తుంది. అప్పుడే.. మీనా కోసం బస్తీ నుంచి స్నేహితులు వస్తారు. వాళ్లను అవమానించేలా ప్రభావతి మాట్లాడుతుంది. కనీసం సోఫాలో కూడా కూర్చోనివ్వదు. దీంతో.. సత్యం ప్రభావతి మీద చిరాకుపడతాడు. కోడలి తరపున వచ్చిన వాళ్లను అవమానించడం కరెక్ట్ కాదు అని చెప్పినా ప్రభావతి వినదు. వాళ్లేమైనా కోటీశ్వరులా అంటూ తక్కువ చేసి మాట్లాడుతుంది.దీంతో.. సుశీలమ్మ ఊరు నుంచి వచ్చిన డాక్టర్.. ప్రభావతి ప్రవర్తన నచ్చక.. మీరు డాక్టర్ కి చూపించుకోవాలి అని గట్టిగా కౌంటర్ ఇస్తుంది. అది విని అందరూ క్లాప్స్ కొడతారు.అయితే.. ప్రభావతి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Related Articles

Related image1
Gunde Ninda Gudi Gantalu: మౌనిక ప్రెగ్నెంట్, సంజూ కి ఫ్యూజులు ఔట్..ఉడకని రోహిణి పప్పులు
Related image2
Gunde Ninda Gudi Gantalu:ప్రభావతితో పూలు అమ్మించిన మీనా,బొమ్మల కొలువులో రోహిణీ నెత్తిన మరో బాంబు
34
గుణకు వీడియో పంపేసిన రోహిణీ...
Image Credit : Jio Hotstar

గుణకు వీడియో పంపేసిన రోహిణీ...

గుణ.. బొమ్మల కొలువు దగ్గరకు వస్తాడు. వెంటనే రోహిణీకి ఫోన్ చేస్తాడు. ‘ బాలు ఫోన్ నుంచి వీడియో తీసుకొని నాకు పంపిస్తే.. నేను లోపలికి వచ్చి రచ్చ చేస్తాను. బాలు పరువు తీస్తాను’ అని గుణ చెబుతాడు. ‘ అయితే.. వీడియో లేకపోయినా నువ్వు రచ్చ చేయచ్చు కదా.. వీడియో తీసుకోవడం కష్టంగా ఉంది’ అని రోహిణీ చెబుతుంది.‘ నీ మరిది గురించి తెలుసుకదా.. ఆధారం లేకుండా మనం ఏమీ చేయలేం’ అని గుణ అనడంతో.. వీడియో పంపడానికి ప్రయత్నిస్తాను అని రోహిణీ చెబుతుంది. కానీ.. ఇలా అబద్ధాలు చెప్పడం తన వల్ల కావడం లేదని.. తన ఫ్రెండ్ వింధ్యతో తన బాధను చెప్పుకుంటుంది. వీడియో కొట్టేయడానికి ఏం చేయాలో చూడు అని వింధ్య చెబుతుంది. అదే చేస్తాను అని రోహిణీ చెబుతుంది.

ఇక, సుశీలమ్మ బాలుతో మాట్లాడుతూ ఉంటుంది. ఎలాగైనా తొందరగా మనవడిని ఇవ్వమని అడుగుతూ ఉంటుంది. అప్పుడే.. డ్యాన్స్ క్లాసులో బుడ్డది వచ్చి.. రోహిణీ, వింధ్య దొంగలని.. ఫోన్ కోసం తన వెనక తోకలా తిరిగారు అని బాలుతో చెబుతుంది. కానీ, రోహిణీ అబద్ధం చెప్పి కవర్ చేస్తుంది. అప్పుడే ప్రభావతి వచ్చి.. మీనా స్నేహితులను తక్కువ చేసి మళ్లీ మాట్లాడుతుంది. ప్రసాదం తీసుకున్నారుగా.. ఇక వెళ్లిపోండి అంటూ మాట్లాడుతుంది.అయితే.. వాళ్లకు విపరీతంగా కోపం వస్తుంది. రివర్స్ కౌంటర్ ఇస్తారు. ప్రభావతి దుమ్ము దులిపేస్తారు. అప్పుడే డాక్టర్ వచ్చి.. రోహిణీకి చెకప్ చేస్తాను అని వస్తుంది. తన పని అయిపోయింది అని రోహిణీ అనుకునేలోగా.. ఆ డాక్టర్ కి ఎమర్జెన్సీ కాల్ వచ్చి వెళ్లిపోతుంది.

ఇక.. రోహిణీ ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే.. వింధ్య వచ్చి బాలు ఫోన్ తెచ్చి ఇస్తుంది. రోహిణీ అందులో వీడియో వెతుకుతుంది. వీడియో దొరకగానే తన ఫోన్ కి పంపించుకుంటుంది. ఆ వీడియోని గుణకి ఫార్వర్డ్ చేస్తుంది. వెంటనే గుణకి ఫోన్ చేసి.. ఈ వీడియోతో బాలు, మీనా సంతోషం చెడగొట్టమని చెబుతుంది. సరే అని గుణ ఒప్పుకుంటాడు. ఈ లోగా.. బాలు, మీనా అటుగా వచ్చి రోహిణీకి తలుగుతారు. బాలు ఫోన్ కింద పడిపోతుంది. ఆ ఫోన్ బాలు.. తనదే అని తీసుకుంటాడు. నా ఫోన్ మీ దగ్గరకు ఎలా వచ్చింది అని బాలు అడుగుతాడు. కానీ, వింధ్య, రోహిణీ కవర్ చేస్తారు. ఫోన్ తీసుకొని బాలు, మీనా వెళ్లిపోతారు. అయితే.. రోహిణీ కంగారులో శివ వీడియో కాకుండా.. మనోజ్ వీడియో పంపుతుంది.ప్లాన్ రివర్స్ అయినందుకు రోహిణీ తలబాదుకుంటుంది.

44
మౌనికను అనుమానించిన సంజూ...
Image Credit : Jio Hotstar

మౌనికను అనుమానించిన సంజూ...

తల్లికాబోతున్నందుకు మౌనిక చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ల అత్తయ్య వచ్చి చాలా జాగ్రత్తలు చెబుతుంది. బలమైన ఆహారం తినాలని.. ఎంత కష్టం వచ్చినా ఏడ్వకూడదు అని సలహాలు చెబుతుంది. అప్పుడే సంజూ వచ్చి మౌనిక మీద అరుస్తాడు. దీంతో.. వాళ్ల అమ్మకు కోపం వస్తుంది.అంతేకాదు.. మౌనిక కడుపుకు తనకు సంబంధం లేదు అన్నట్లుగా మాట్లాడతాడు. ఆ మాట విన్న వాళ్ల కోపంతో సంజూ చెంప పగలకొడుతుంది. కొడుకును దారుణంగా తిట్టి, గడ్డి పెడుతుంది. మౌనిక కూడా చాలా బాధపడుతుంది. తాగిన తర్వాత ఏం జరిగిందో మీకు గుర్తు లేదా.. ఈ బిడ్డ మీది అని ఒప్పుకోవడానికి మీకు మనసు అంగీకరించడం లేదా అని అడుగుతుంది. సువర్ణ మాత్రం ఊరుకోదు.బాలుకి తెలిస్తే.. నిన్ను చంపేస్తాడు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.

మరోవైపు బాలు.. చింటూకి ఫోన్ చేస్తాడు. బొమ్మల కొలువుకు రమ్మని చింటూ వాళ్ల అమ్మమ్మను పిలుస్తాడు.ఆమె రాను అని చెబుతుంది. కానీ.. బాలు వదిలిపెట్టడు.. నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను, రమ్మని బతిమిలాడుతాడు.కారు పంపిస్తాను.. మీరు రావాలి అని చెప్పేస్తాడు. ఈ గండం నుంచి ఎలా బయటపడాలా అని ఆమె ఆలోచనలో పడుతుంది. వెంటనే ఈ విషయాన్ని రోహిణీకి చెబుతుంది. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేశావ్ అని రోహిణీ తిడుతుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది..

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్‌ వార్నింగ్‌
Recommended image2
Ram Prasad Remuneration: రామ్‌ ప్రసాద్‌కి మైండ్‌ బ్లాక్‌ అయ్యే పారితోషికం.. బుల్లితెర స్టార్‌కి ఝలక్‌
Recommended image3
Bigg Boss10: కంటెస్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?
Related Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: మౌనిక ప్రెగ్నెంట్, సంజూ కి ఫ్యూజులు ఔట్..ఉడకని రోహిణి పప్పులు
Recommended image2
Gunde Ninda Gudi Gantalu:ప్రభావతితో పూలు అమ్మించిన మీనా,బొమ్మల కొలువులో రోహిణీ నెత్తిన మరో బాంబు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved