- Home
- Entertainment
- TV
- Gunde Ninda Gudi Gantalu: రొమాంటిక్ బాలు, ప్రభావతి దొంగ బుద్ధి..మీనా హార్ట్ బ్రేక్ చేసిన బాలు
Gunde Ninda Gudi Gantalu: రొమాంటిక్ బాలు, ప్రభావతి దొంగ బుద్ధి..మీనా హార్ట్ బ్రేక్ చేసిన బాలు
Gunde Ninda Gudi Gantalu: రోహిణీ ప్రవర్తనపై ప్రభావతిలో అనుమానం మొదలౌతుంది. మనోజ్ అడిగిన ప్రశ్నలకు కూడా రోహిణీ నిజం చెప్పదు. మరి, నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో టీవీ కంటే ముందుగా మీ కోసం..

Gunde Ninda Gudi Gantalu
బాలు, మీన హాల్ లో నిద్రపోవడానికి రెడీ అవుతారు. అయితే.. ఆ సమయంలో బాలు.. రొమాంటిక్ గా మీనాకి దగ్గర అవ్వాలని చూస్తాడు. కానీ.. మీనా ‘ మనం హాల్ లో ఉన్నాం’ అని అంటుంది. దానికి బాలు.. ‘ ఈలావతి ఈల వేసుకుంటూ వస్తుందిలే’ అంటాడు. కానీ మీనా దగ్గరకు రానివ్వదు.ఆ తర్వాత కాసేపు వాదించుకుంటారు. ‘ నిజం చెప్పాలంటే..నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాతే మనిషిలా ఎలా బతకాలో తెలిసింది’ అని బాలు అంటే.. ‘ మనం మామయ్య సంతోషపడేలా ఉండాలి.మీ అన్నా, వదిన సంతోషపడేలా ఉండకూడదు’ అని మీనా బదులిస్తుంది. ‘ అవును, ముఖ్యంగా మా అమ్మ సంతోషపడేలా అస్సలు ఉండకూడదు’ అని బాలు అంటే.. ‘ రూమ్ కట్టేసుకుందాం అండి.. మామయ్య చెప్పినట్లు రూమ్ కట్టుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు’ అని మీనా చెబుతుంది. ‘ అవును మొన్న వచ్చిన ఇంజినీర్ ని రేపు మళ్లీ తీసుకువస్తాను’ అని బాలు అంటాడు. ‘ ఏమండీ.. ఇంజినీర్లు అంటే చాలా ఎక్కువ చెబుతారు. ఇంజినీర్లు చెప్పిన పనే కదా మేస్త్రీలు చేసేది.. మా అమ్మ వాళ్ల ఇంటి ఓనర్ ఉన్నారు కదా.. ఆయనకు చాలా మంది మేస్త్రీలు తెలుసు’ అని మీనా సలహా ఇస్తుంది. ‘ అవును కదా.. అలాంటి మేస్త్రీకి పని అప్పగిస్తే.. తక్కువ ఖర్చులో మన రూమ్ రెడీ అవుతుంది. అప్పుడు మనం.. మన గదిలో...’ అంటూ ఓ సాంగ్ కి డ్యాన్స్ వేస్తారు. వీళ్లు డ్యాన్స్ చేస్తూ ఉంటే ప్రభావతి వస్తుంది. వాళ్లను చూస్తూనే ఉంటుంది. అది గమనించిన మీనా డ్యాన్స్ ఆపి..బాలుని కూడా ఆపుతుంది. తల్లిని చూసి బాలు డ్యాన్స్ ఆపేస్తాడు.
‘ చెయ్యి రా.. చెయ్యి.. లక్ష రూపాయలు వచ్చాయి కదా నిన్ను ఎవరు ఆపుతారు చెయ్యి..’ అని ప్రభావతి అంటే.. ‘ డ్యాన్స్ కీ లక్షకు ఏంటి సంబంధం నాట్యావతి’ అని బాలు అడుగుతాడు. ‘ అర్థరాత్రి డ్యాన్స్ లు వేస్తున్నాడు డ్యాన్సులు’ అంటూ ఎక్కిరిస్తుంది. ‘ నువ్వు ఇలా ఈల వేసుకుంటూ వచ్చేస్తే.. మా బతుకుల్లో మిగిలేది కాలరాత్రి కాకపోతే ఇంకేం ఉంటాయి నా బొంద’ అని బాలు అంటే.. ప్రభావతి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ప్రభావతి దొంగ బుద్ధి..
మరుసటి రోజు బాలు బయట నుంచి వచ్చి మీనా ని పిలుస్తాడు. మేస్త్రీని తీసుకువచ్చాను అని చెబుతాడు. వీళ్లను ప్రభావతి దూరం నుంచి నక్కి నక్కి చూస్తూ ఉంటుంది. ఇక.. బాలు... ఆ మేస్త్రీకి గది ఎక్కడ కట్టాలో చూపిస్తాడు. అతను అన్నీ లెక్కేసి.. కొలతలు చూసి.. ఎస్టిమేషన్ చెబుతా అంటాడు. ఆలోపు ప్రభావతి అక్కడికి వచ్చి దూరం నుంచి వాళ్లను చూస్తూ ఉంటుంది. ఆ మేస్త్రీ రూ.4 లక్షలు అవుతుందని చెబుతాడు. అయితే.. ముందు లక్ష రూపాయలు ఇస్తానని.. తర్వాత మిగిలినవి సర్దుతాను అని బాలు అంటే.. అలా కుదరదని.. మెటీరియల్ మొత్తం ఒకేసారి కొనాలని దానికే రూ.3లక్షలు అవుతాయని అతను చెబుతాడు.అయితే.. మొదలుపెడితే డబ్బులు అరేంజ్ చేస్తామని బాలు, మీనా చెప్పి.. అతనికి అడ్వాన్స్ ఇచ్చి పంపించేస్తారు.
అతను వెళ్లిన తర్వాత.. అంత డబ్బు ఎలా అరేంజ్ చేయాలని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ల మాటలను దొంగచాటుగా ప్రభావతి వింటూ ఉంటుంది.కచ్చితంగా డబ్బులు సర్దుబాటు చేయగలం అని బాలు అంటే..అంత ధైర్యంగా ఎలా చెబుతున్నారు అని మీనా అంటుంది.‘ ఉందిగా మా అమ్మ లక్షావతి.. ప్రభావతి’ అని అంటాడు. ఆ మాటకు ప్రభావతి షాక్ అవుతుంది. వీడేంటి..? నా గురించి అంటున్నాడు అని మనసులోనే అనుకుంటుంది.‘ అత్తయ్య ఏం చేస్తారు?’అని మీనా అడిగితే.. ‘ మా నాన్న మాట వింటుంది’ అని చెబుతాడు. ‘ మామయ్య ఏం చేస్తారు?’అని మీనా అంటే.. ‘ మా నాన్న మా అమ్మని అడిగి.. ఆవిడ నగలన్నీ తెచ్చి ఇస్తారు’ అని అంటాడు. ఆ మాటకు ప్రభావతి షాక్ అవుతుంది.‘ ఏంటి..? అత్తయ్య నగలు తాకట్టు పెడతారా’ అని మీనా ఆశ్చర్యంగా అడిగితే... ‘ తాకట్టు అని చెబుతాం.. సరిపోకపోతే అమ్మేస్తాం.. మనోజ్ గాడు నీ నగలు అమ్మేసినట్లు’ అని బాలు అంటాడు. అది విని ప్రభావతి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
‘ ఇంతసేపు అత్తయ్య చాటుగా మన మాటలు విని.. ఇప్పుడే అక్కడి నుంచి వెళ్లిపోయారు’ అని మీనా అంటే.. ‘ తెలుసు.. కావాలనే బెదరగొట్టాను. లేకపోతే చాటుగా వింటుందా? ఆవిడ నగలు మనకు ఎందుకులే కానీ...ఏదో ఒకటి చేసి డబ్బులు రెడీ చేసుకోవాలి’అని బాలు చెబుతాడు. ఎలా అని మీనా అంటే.. ఏదో ఒక దారి దొరుకుతుందిలే అని బాలు చెబుతాడు.
భర్త మీద నమ్మకంతో బెట్ కట్టిన మీనా
మీనా పూల వ్యాపారం కోసం దుకాణం దగ్గరకు వెళితే.. అక్కడ కొందరు స్నేహితులు కలుస్తారు. వాళ్లంతా కలిసి మీనా గెలిచిన దంపతుల పోటీ గురించి అడుగుతారు.మాటల్లో మాటగా... భార్య చేసిన వంటను భర్త ఎప్పుడూ పొగడరు అని అంటారు. అయితే.. మీనా మాత్రం.. తన వంటను తన భర్త మెచ్చుకుంటాడని చెబుతుంది. వాళ్లు ఒప్పుకోరు. దీంతో.. వాళ్లు అందరూ మీనాతో బెట్ కడతారు.బాలు మీద నమ్మకంతో.. మీనా రూ.500 బెట్ కడుతుంది.మీనా.. బీట్రూట్ దోశ చేసి పెడితే.. ఆమె అడక్కుండానే బాలు ఆ వంట బాగుందని చెప్పాలి అని వాళ్లు బెట్ కడితే.. కచ్చితంగా చెబుతారు అని మీనా నమ్మకంగా వాళ్లకు ఒకే చెబుతుంది.
మీనాని పట్టించుకోని బాలు..
ఉదయాన్నే మనోజ్ షోరూమ్ కి వెళ్లడానికి ముందు దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే సత్యం వచ్చి బ్రేక్ ఫాస్ట్ పెట్టమని అడుగుతాడు. మీనా బీట్రూట్ దోశ పెడుతుంది. చాలా బాగుంది అని సత్యం తింటూ ఉంటాడు. అప్పుడే రోహిణీ, ప్రభావతి కూడా టిఫిన్ తినడానికి వస్తారు. వాళ్ల వెనకే రవి, శ్రుతి కూడా వస్తారు. అందరికీ మీనా తాను చేసిన బీట్రూట్ దోశలు పెడుతుంది.అందరికీ ఆ దోశలు చాలా బాగా నచ్చుతాయి.అప్పుడే బాలు ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ వస్తాడు.ఈ రోజు పందెంలో గెలుస్తానా లేదా అని మీన ఆశగా చూస్తుంది. కానీ.. బాలు అదేమీ పట్టించుకోకుండా ఫోన్ లో మాట్లాడుతూ తినేస్తూ ఉంటాడు. దోశ గురించి తప్ప అన్నీ మాట్లాడతాడు. ఏం చెబుతాడా అని మీనా ఆశగా ఎదురు చూసినా.. ఏం చెప్పకుండా బాలు అక్కడి నుంచి వెళ్లిపోబోతాడు. ఏమైనా చెప్పాలా అని మీనా ఆశగా అడిగినా.. క్యారేజ్ కట్టివ్వమని.. లంచ్ కి ఇంటికి రాను అని చెబుతాడు. మీనా చాలా హర్ట్ అవుతుంది.
చింటూ బర్త్ డే..
ఇక.. రోహిణీకి ఆమె కొడుకు చింటూ ఫోన్ చేసి తన బర్త్ డే గురించి చెబుతాడు. కచ్చితంగా వస్తాను అని రోహిణీ ప్రామిస్ చేస్తుంది.తన బర్త్ డేకి డ్రెస్ తెమ్మని చింటూ చాలా ప్రేమగా అడుగుతాడు. అయితే.. కాదనలేక రోహిణీ సరే అని చెబుతుంది.అప్పుడే మనోజ్ వచ్చి.. ఎవరితో మాట్లాడుతున్నావ్ అని అడిగితే..ఏదో అబద్దం చెబుతుంది. మనోజ్ నమ్మేస్తాడు. తర్వాత ఇద్దరం కలిసి ట్రిప్ కి వెళ్దామా అని అడుగుతాడు. రోహిణీ సిగ్గుపడుతూ వెళ్దాం అని అంటుంది. ఇక..మనోజ్ కి మేకప్ వేయాలని చెప్పి..అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఇక, మీనా పోటీలో ఓడిపోయిందని.. వాళ్ల ఫ్రెండ్స్ ఆటపట్టిస్తారు.మొగుళ్లే అంత..అస్సలు మెచ్చుకోరు అని వాళ్లు అంటారు. కానీ, మీనా ఒప్పుకోదు. తన భర్త అందరిలాంటి వాడు కాదు అని అంటుంది. వాళ్లు ఆమెకు మరో ఛాన్స్ ఇస్తారు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

