MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • TV
  • Gunde Ninda Gudi Gantalu: ప్రభావతికి శాపం పెట్టిన మీనా, భార్య అంటే శ్రుతిలా ఉండాలి, పుట్టింటికి మౌనిక

Gunde Ninda Gudi Gantalu: ప్రభావతికి శాపం పెట్టిన మీనా, భార్య అంటే శ్రుతిలా ఉండాలి, పుట్టింటికి మౌనిక

Gunde Ninda Gudi Gantalu: తెలివిగా రోహిణీ.. బాలు ఫోన్ కొట్టేస్తుంది. వీడియో కూడా వెతుకుతుంది. ఆ వీడియో చూసిన తర్వాత తనకు పంపుకోలేకపోతుంది. మరి, నేటి ఎపిసోడ్ లో రోహిణీ ఏం చేస్తుందో టీవీకంటే ముందుగా మీకోసం... 

5 Min read
Author : ramya Sridhar
Published : Feb 20 2026, 08:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గుండె నిండా గుడి గంటలు..
Image Credit : Jio Hotstar

గుండె నిండా గుడి గంటలు..

శ్రుతి డబ్బింగ్ స్టూడియోలో డబ్బింగ్ చెబుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి శ్రుతి వాళ్ల అమ్మ వస్తుంది. దీంతో.. డబ్బింగ్ ఆపేసి.. వాళ్ల అమ్మతో మాట్లాడటానికి శ్రుతి వెళ్తుంది. ‘ ఈ రోజు రవిని నేను షాపింగ్ మాల్ లో చూశాను. పక్కనే ఒక అమ్మాయి కూడా ఉంది. పేరు నీతూ. అది చూసి నేను షాక్ అయ్యాను’ అని శ్రుతి వాళ్ల అమ్మ చెబుతుంది. అయితే ఏంటి? అని శ్రుతి చాలా కాజువల్ గా అడుగుతుంది. కానీ.. ఆ అమ్మాయి సరిగా లేదని.. అల్లుడుగారుతో ఆ అమ్మాయి చాలా చనువుగా ఉందని.. చెబుతుంది. ‘ రవి తనకు అన్ని విషయాలు ముందే చెప్పాడు అని.. నాకు తెలుసు’ అని శ్రుతి చెబుతుంది. ‘ ఆ అమ్మాయి రవిని మార్చేస్తుంది’ అని వాళ్ల అమ్మ చెప్పినా.. శ్రుతి వినిపించుకోదు. తనకు రవి గురించి బాగా తెలుసు అని.. రవి చాలా స్ట్రాంగ్ అని ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది. ఇంకోసారి అల్లుడు గారెని వేరే అమ్మాయిలతో తిరగొద్దని చెప్పమని ఆమె చెప్పినా.. శ్రుతి వినదు. పని మీద పది చోట్లకు వెళ్లాల్సి వస్తుంది.. పది మందితో మాట్లాడాల్సి వస్తుంది.. నేను అవన్నీ చేయద్దని రవికి చెప్పను.. నా రవి ఏంటో నాకు తెలుసు.. అని చెప్పి.. తల్లికి గడ్డిపట్టి.. నాకు పని ఉందని శ్రుతి లోపలికి వెళ్లిపోతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మీనా బొమ్మల కొలువు..
Image Credit : Jio Hotstar

మీనా బొమ్మల కొలువు..

సీన్ కట్ చేస్తే..మీనా కిచెన్ లో వంట చేస్తూ ఉంటుంది.అప్పుడే బాలు వెనక నుండి వచ్చి హగ్ చేసుకుంటాడు. దొంగ అనుకొని మీనా భయపడుతుంది. గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకు బాలు కూడా భయపడతాడు. తర్వాత.. ఏంటి..? తొందరగా వచ్చారు అని మీనా అడుగుతుంది. రావాలనిపించి వచ్చేశాను అని బాలు చెబుతాడు. అయితే.. మిమ్మల్ని ఒకటి అడగాలి అని మీనా అంటుంది.. ఏంటి? ముద్దు కావాలా అని బాలు అంటే.. అది కాదని.. తనకు ఇంట్లో బొమ్మల కొలువు పెట్టుకోవాలని ఉంది అని చెబుతుంది. సరే అని బాలు అంటాడు. కానీ.. ప్రభావతి ఒప్పుకోదు ఏమో అని మీనా తన అనుమానం బయటపెడుతుంది. శ్రుతిని సహాయం చేయమని అడుగు అని సలహా ఇస్తాడు.. ముందు మీనా సరే అంటుంది.. కానీ.. ఇప్పుడు శ్రుతి నాకు సపోర్ట్ గా మాట్లాడితే.. మేమిద్దరం గొడవ పడట్లేదు అని అత్తయ్యకు తెలిసిపోతుంది కదా అని మీనా అనడంతో బాలు కూడా ఆలోచనలో పడతాడు. పార్లరమ్మని అడగమంటాడు.. కానీ.. రోహిణీ హెల్ప్ చేయదు అని మీనా చెబుతుంది. దీంతో.. ఇద్దరూ కలిసి.. సత్యం హెల్ప్ అడగడానికి వెళతారు.

సత్యం దగ్గరకు వెళ్లి.. మీనా బొమ్మల కొలువు పెట్టాలని అనుకుంటుందని.. నువ్వే అమ్మని ఒప్పించాలని సత్యంని బాలు ఇరికిస్తాడు. అదే సమయానికి రోహిణీ, ప్రభావతి అక్కడికి వస్తారు. దీంతో.. ఇంట్లో మీనా బొమ్మల కొలువు పెట్టాలని అనుకుంటుందని సత్యం చెబుతాడు. దీంతో.. ప్రభావతి వెటకారం చేస్తుంది. ‘ పడుకుంటే కాళ్లు చాపుకోవడానికి కూడా మీ ఇల్లు సరిపోదు.. అలాంటి ఇంట్లో ప్రతి సంవత్సరం నువ్వు బొమ్మల కొలువు పెట్టేదానివా?’ అని వెటకారం చేస్తుంది. ‘ అక్కడికి ఇదేదే మైసూర్ ప్యాలెస్ అన్నట్లు మాట్లాడుతున్నావ్ గా’ అని బాలు కౌంటర్ వేస్తాడు. ‘ మనవళ్లు పుట్టాలని ఆశ పడుతున్నావ్ కదా.. బొమ్మల కొలువు పెడితే.. అదే నిజం అవుతుంది’ అని సత్యం అంటాడు.. ‘ అయితే.. రోహిణీతో పెట్టిద్దాం.. అప్పుడు రోహిణీకే ముందు పిల్లలు పుడతారు’ అని ప్రభావతి అంటుంది. ‘ ఎవరు పెట్టినా.. మంచి మనసుతో పెట్టాలి.. ’ అని సత్యం అంటాడు. ముద్దుగా పబ్బీ అని పిలిచి.. ప్రభావతిని మాయ చేస్తాడు. ప్రభావతి ఒప్పుకుంటుంది. అయితే.. ‘బొమ్మల కొలువు పెట్టుకోవడానికి మన ఇల్లు సరిపోతుందా?’ అని రోహిణీ అడిగితే.. ‘ కామాక్షిని ఒక పెద్ద ఇల్లు చూసి పెట్టమని అడుగుతాను’ అని ప్రభావతి అంటుంది. అత్తను ఒప్పించినందుకు మీనా సత్యంకి థ్యాంక్స్ చెబుతుంది.

34
మీనా కంట పడిన ప్రేమ జంట..
Image Credit : Jio Hotstar

మీనా కంట పడిన ప్రేమ జంట..

తర్వాత.. బొమ్మల కొలవు పెట్టడానికి అందరూ ఒప్పుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని బాలుతో మీనా చెబుతుంది. ఇరగదీద్దాం అని బాలు సపోర్ట్ చేస్తాడు. ఈ విషయాన్ని వాళ్ల నానమ్మ సుశీలమ్మకు చెప్పాలని బాలు అంటాడు.సత్యం కూడా వెంటనే చెప్పాలి అంటాడు. ఇద్దరూ కలిసి ఫోన్ చేసి.. ఆమెను బొమ్మల కొలవు పెట్టుకుంటున్నామని.. రమ్మని పిలుస్తారు. ఆమె సరే అంటుంది. వచ్చాక.. పిల్లలు పుట్టడానికి యాగం కూడా చేయిద్దాం అని ఆమె చెబుతుంది. మౌనిక, సంజూని కూడా పిలవమని చెబుతుంది. అందుకు సత్యం సరే అంటాడు.

ఇక..ప్రభావతి.. డ్యాన్స్ స్కూల్ కి వెళ్తుంది. అక్కడ కామాక్షితో బొమ్మల కొలువు విషయం చెబుతుంది. పెద్ద ఇల్లు చూసి పెట్టమని అడుగుతుంది. కామాక్షి సరే అని చెబుతుంది. బొమ్మల కొలువు పెడితే పాటలు పాడాలి కదా ఎవరు పాడతారు? అని కామాక్షి అడిగితే.. నేనే పాడుతున్నాను అని ప్రభావతి చెబుతుంది. అయితే.. ఆ మాటలకు కామాక్షి భయపడుతుంది. మరో వైపు.. డ్యాన్స్ క్లాస్ లో ప్రేమ జంట సీక్రెట్ గా పక్కకు వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరూ చూడట్లేదు కదా అని రొమాన్స్ లో మునిగి తేలుతారు. వాళ్లు అలా ఉండటం మీనా కంట పడుతుంది. వెంటనే.. ఆ ఇద్దరినీ వాయించి వదిలిపెడుతుంది. ఈ విషయం మీనా ఎక్కడ ప్రభావతికి చెబుతుందో అని.. రివర్స్ లో వాళ్లే నాటకం ఆడటం మొదలుపెడతారు. దీంతో.. నిజం తెలుసుకోకుండా.. ప్రభావతి మీనా చెప్పిన నిజాన్ని నమ్మదు. రివర్స్ లో మీనాని తిట్టి ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెబుతుంది. అయితే.. మీనా వెళ్తూ వెళ్తూ... ఇది ఏదో ఒక రోజు మీ మెడకే చుట్టుకుంటుందని వార్నింగ్ ఇచ్చి మరీ మీనా అక్కడి నుంచి వెళ్తుంది. కామాక్షి కూడా.. ప్రభావతిని తిడుతుంది. కానీ.. ప్రభావతి పట్టించుకోదు.

44
బొమ్మల కొలువుకు డబ్బులు ఇస్తానన్న రోహిణీ..
Image Credit : Jio Hotstar

బొమ్మల కొలువుకు డబ్బులు ఇస్తానన్న రోహిణీ..

ఇక.. బొమ్మల కొలువు కోసం కావాల్సిన బొమ్మలు కొన్ని బాలు తెస్తాడు.మీనా తాను కూడా కొన్ని బొమ్మలు తెస్తాను అని చెబుతుంది. వీళ్లు పూజల గురించి మాట్లాడుకుంటూ ఉంటే.. మనోజ్ వస్తాడు. ఏంటి ఇవన్నీ అని అడుగుతాడు. కానీ.. బాలు సరిగా సమాధానం చెప్పకుండా.. సెటైర్లు వేస్తాడు. బాలు సెటైర్లు తట్టుకోలేక.. మనోజ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మనోజ్ రూమ్ లోకి వెళ్లేసరికి.. రోహిణీ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నావ్ అంటే.. విద్యతో అని చెబుతుంది. తర్వాత.. బొమ్మల కొలువు గురించి రోహిణీని అడిగి మనోజ్ తెలుసుకుంటాడు.వాళ్లు పూజ చేసుకుంటే మనల్ని డబ్బులు అడుగుతారేమో అని మనోజ్ అంటే.. వాళ్లు అడగరులే అని రోహిణీ అంటుంది. అయితే.. తనకు దీని కోసం మూడు చీరలు కావాలని మనోజ్ కి టెండర్ పెడుతుంది. మనోజ్ కూడా కాదు అనలేక క్రెడిట్ కార్డు ఉంది కదా కొనుక్కోమని చెబుతాడు.

అయితే.. ఈ పూజ ఇంట్లో అందరి కోసం చేస్తున్నాం కాబట్టి.. ఇంట్లో అందరినీ డబ్బులు అడుగుదాం అని బాలు అంటాడు. మీనా వద్దు అని చెప్పినా బాలు ఆగడు. వెళ్లి డోర్ కొడతాడు. ఏంటి..? బొమ్మల కొలువు పెట్టుకోవడానికి పర్మిషన్ కావాలా అని మనోజ్ అంటే... పర్మిషన్ కాదు..డబ్బులు ఇవ్వమని బాలు అడుగుతాడు. మనోజ్ నేను ఇవ్వను అంటాడు. అయితే.. పూజలో కూర్చోవాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే అని బాలు అంటాడు. అయితే.. రోహిణీ ఆ డబ్బులు నేను ఇస్తాను అని మాట ఇస్తుంది.సరే అని బాలు, మీనా వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లిన తర్వాత.. డబ్బులు ఇస్తాను అని ఎందుకు ఒప్పుకున్నావ్ అని మనోజ్ అంటే...కొన్ని విషయాల్లో మనం తగ్గకూడదు అని రోహిణీ అంటుంది.

ఇక.. రవి, శ్రుతి... వాళ్ల అమ్మ గురించి గొడవపడుతూ ఉంటారు. అప్పుడే.. బాలు, మీనా వచ్చి ఇంట్లో బొమ్మల కొలువు గురించి చెబుతారు. అయితే.. శ్రుతి తన వాటా ఇస్తుంది. మిగిలింది రవి దగ్గర తీసుకోమని చెబుతుంది. మరుసటి రోజు.. బాలు, మీనా బొమ్మలు సర్దుతూ ఉంటారు. అప్పుడే, శ్రుతి, రవి వచ్చి.. మీనాతో ప్రేమగా మాట్లాడతారు. కానీ.. ప్రభావతి వస్తుందని తెలియగానే మళ్లీ గొడవ పడినట్లు నాటకం ఆడతారు. వీళ్ల గొడవ చూసి.. ప్రభావతి చాలా సంతోషపడుతుంది. వీళ్లు మాత్రం.. ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Krishnudu Remueration: రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా? కూర్చొని లక్షలు సంపాదించాడు
Related Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu: బాలు, మీనాలకు యాక్సిడెంట్.. చంపేందుకు గుణ ప్లాన్, రోహిణీకి బెదిరింపులు..!
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: మౌనిక మీద సంజూ కుట్ర, బాలు ఫోన్ కొట్టేసిన రోహిణీ, వీడియో దొరికిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved