MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Brahmamudi Serial Today Episode: రాకేష్‍తో మాట్లాడుతూ దొరికిపోయిన ఐశ్వర్య, రాజు గురించి తెలుసుకునేందుకు రేఖ ప్లాన్

Brahmamudi Serial Today Episode: రాకేష్‍తో మాట్లాడుతూ దొరికిపోయిన ఐశ్వర్య, రాజు గురించి తెలుసుకునేందుకు రేఖ ప్లాన్

Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. రాకేష్‍తో మాట్లాడుతూ ఐశ్వర్య దొరికిపోయింది., రాజు గురించి తెలుసుకునేందుకు రేఖ ప్లాన్ వేస్తుంది. మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో చూసేద్దాం. 

3 Min read
Author : Nandini Arava
Published : Mar 30 2026, 09:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
రేఖ మందు తాగుతుండగా అడ్డుకున్న భ్రమరాంబ
Image Credit : jio hotstar

రేఖ మందు తాగుతుండగా అడ్డుకున్న భ్రమరాంబ

రేఖ మందు తాగుతూ పదే పదే గత జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకుంటుంది. ఇంతలో భ్రమరాంబ వచ్చి రేఖ చేతిలో మందు బాటిల్ లాక్కుంటుంది. నీకేమైంది రేఖ...ఎందుకు టెన్షన్ పడుతూ తాగతున్నావ్ అని అడుగుతుంది. ఆ అబ్బాయి వచ్చినప్పటి నుంచి కంగారు పడుతున్నావ్, అసలు ఆ అబ్బాయికి, నీకు సంబధమేంటీ అని ప్రశ్నిస్తుంది. కొన్నేళ్ల క్రితం చనిపోయినవాడు కళ్లముందు కనిపిస్తే భయపడనా అంటుంది రేఖ. దుగ్గిరాల వారసుడు స్వరాజ్ ను మా అమ్మ చంపేసిందని చెప్తుంది. యాక్సిడెంట్ లో అంతా చనిపోతే వాడెలా బతుకుతాడని భ్రమరాంబ అంటుంది. ఒకే పోలికలతో ఎలా ఉంటాడని అడుగుతుంది. అయినా ఒకవేళ వాడు బతికినా, వాడు ఒక్కడే ఏం చేస్తాడు అని భ్రమరాంబ అంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
ఆస్తి దక్కదేమోననే భయంలో భ్రమరాంబ
Image Credit : jio hotstar

ఆస్తి దక్కదేమోననే భయంలో భ్రమరాంబ

ఏం మాట్లాడుతున్నావ్ వదిన, రాజ్ మేనల్లుడు అంటే ఈ ఇంటికి మరో వారసుడు అవుతాడు, ఇప్పటి వరకు మనకు ఒకరే శత్రువు, ఇప్పుడు వాడు కూడా తోడైతే ఇద్దరితో పోరాడాల్సి ఉంటుంది. ఇందుకు బావగా అండగా నిలబడితే మన పరిస్థితి అంతే అంటుంది రేఖ. ఇక భ్రమరాంబ కంగారుపడి..ఇన్నేళ్లు పడిన శ్రమ వృథానేనా, ఆస్తి మన చేతికి రాదా అని అడుగుతుంది. ఇది నా ఊహ మాత్రమే. ముందు వాడు నిజమా, అబద్ధమా అన్నది తెలుసుకోవాలని రేఖ అంటుంది. ఇన్ని రోజులుగా ఎందుకు ఇంటికి రాలేదు, ఎందుకు దూరంగా ఉన్నాడు అని రేఖ అంటే...అలా అయితే వాడు నిజమైన వారసుడు కాదేమో అని భ్రమరాంబ అంటుంది. అలా అని కొట్టిపారేయలేం. వాడు చిన్నప్పటి నుంచి ఎక్కడ పెరిగాడు, వాడి ఫ్యామిలీ ఏంటో తెలుసుకోవాలి, అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటానని రేఖ అంటుంది. 

Related Articles

Related image1
Brahmamudi Serial Today Episode: ఐశ్వర్య చెంప చెల్లుమనిపించిన రేఖ, రాజు..అపర్ణ కంట పడకుండా అడ్డుపడ్డ భూషణ్
Related image2
Brahmamudi Serial Today Episode: బయటపడ్డ ఐశ్వర్య బండారం, అపర్ణను చూసి షాక్ అయిన రాజు
38
నిద్రలో ఉలిక్కిపడి లేచిన రాజు
Image Credit : jio hotstar

నిద్రలో ఉలిక్కిపడి లేచిన రాజు

ఇక రాజు...నిద్రలో మళ్లీ ఉలిక్కిపడి లేస్తాడు. వ్యాన్ కాలిపోయినట్లు కల వచ్చింది. అక్కడే ఉన్న వాళ్ల అమ్మా, నాన్న మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ల పనిలో వాళ్లుంటారు.ఏంటీ నేను ఇంత కంగారుపడితే...మీరు అసలు పట్టించుకోరు అని రాజు అడుగుతాడు.నీకొచ్చే ఫాంటసీ కలలకు మేం చేస్తాం, మంటలు వచ్చాయని, లక్ష్మీ దేవి కలలో కనిపించందని చెప్తావ్, మాకు ఇది మామూలేగా అని వాళ్ల నాన్న అంటాడు. ఈసారి కూడా అదే కల వచ్చింది. వ్యాన్ కాలిపోయినట్లు, ఎవడో ఒకడు ఎగురుకుంటూ పడ్డట్టూ వచ్చాడని రాజు చెప్తాడు.

48
రాజు బంధువులు బతికే ఉంటారన్న లక్ష్మీ
Image Credit : jio hotstar

రాజు బంధువులు బతికే ఉంటారన్న లక్ష్మీ

ఒకే కల వారంలో మూడుసార్లు రావడం అనుమానంగా ఉందని వాళ్ల అమ్మ అంటుంది. వాడికి చిన్నప్పుడు జరిగిన విషయాలు గుర్తుకువస్తున్నాయని వాళ్ల నాన్న అంటాడు. మనకు వాడు దొరికిన విషయం వాడికి చెప్పకుండా దాచడం తప్పేమో అనిపిస్తుందని లక్ష్మీ అంటుంది. నాకు అలానే అనిపిస్తుంది. కానీ ఒక వేళం నిజం చెప్తే..వాళ్ల కోసం వెళ్తాడు. వాళ్లు బతికిలేకపోతే ఆ బాధను జీవితాంతం మోయాలి వాడు అని రాజు నాన్న అంటాడు. వాడికి సంబంధించి వాళ్లు ఎవరో ఒకరు బతికే ఉంటారని లక్ష్మీ అంటుంది. 

58
రాజు వివరాలు తెలుసుకునేందుకు రేఖ ప్లాన్
Image Credit : jio hotstar

రాజు వివరాలు తెలుసుకునేందుకు రేఖ ప్లాన్

ఇంతలో రేఖ రాజు వాళ్ల ఇంటికి వస్తుంది. రాజు వాళ్ల నాన్నమీద అరుస్తుంటాడు.మొక్కల మీద నీళ్లు పోస్తుంటే నా బండి మీద మట్టి పడుతోందని అరుస్తాడు. జనాభా లెక్కల పేరుమీద ఒక వ్యక్తిని రాజు వాళ్ల ఇంటికి పంపిస్తుంది. అతను చెప్పిందంతా వినేలా బ్లూటూత్ పెట్టుకుంటుంది.

68
జనాభా లెక్కల పేరుమీద డిటెయిల్స్ తెలుసుకున్న రేఖ పంపిన వ్యక్తి
Image Credit : jio hotstar

జనాభా లెక్కల పేరుమీద డిటెయిల్స్ తెలుసుకున్న రేఖ పంపిన వ్యక్తి

జనాభా లెక్కల పేరుమీద డిటెయిల్ అడుగుతాడు. ఈ అబ్బాయి ఎవరు అని అడిగితే....ఎక్కడో రోడ్డు మీద దొరికితే తెచ్చుకున్నానని అంటాడు. రేఖ కంగారుపడుతుంది. అదేంటీ అని ఆ వ్యక్తి అడిగితే...లేకపోతే ఏంటీ, వాడు నా కన్న కొడుకు, నా కష్టార్జితం అని చెప్తాడు. అన్ని విషయాలు అడుగుతాడు. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, మీ నాన్న, మీ తాతయ్య అందరూ ఇక్కడే పుట్టారా అని అడుగుతాడు. వీళ్లు చెప్పినదాన్ని బట్టి చూస్తే అసలు వీడికి, వాడికి పోలిక లేదని అనుకుంటుంది రేఖ.

78
రాకేష్‍తో మాట్లాడుతూ దొరికిపోయిన ఐశ్వర్య
Image Credit : jio hotstar

రాకేష్‍తో మాట్లాడుతూ దొరికిపోయిన ఐశ్వర్య

ఇటు ఐశ్వర్య...రాకేష్‍కు డబ్బులివ్వలేక నానా అవస్థలు పడుతుంది. ఇంతలో మళ్లీ రాకేష్ ఫోన్ చేసి తిడతాడు. మరో రెండు రోజుల్లో ఇవ్వకపోతే మీ ఆంటీని కలుస్తానని రాకేష్ బెదిరిస్తాడు. రాకేష్‍ను టైం ఇవ్వమని ఐశ్వర్య బతిమాలుతూ ఉంటుంది. ఐశ్వర్య మాటలన్నీ...వెనుకనుంచి ఇందు అంటుంది. ఐశ్వర్య వెనక్కి తిరిగి ఇందును చూసి కంగారు పడుతుంది. నువ్వేం చేస్తున్నావ్ ఐశ్వర్య...నువ్వు చేసిన దొంగతనానికి, నామీద నింద ఎందుకు వేశావ్ అని ఇందు అడుగుతుంది. నేను నెక్లెస్ తీసాక, ఇంకో నెక్లెస్ నువ్వే తీసుంటావని అనిపించింది. అందుకే నీమీద చెప్పానని చెప్తుంది. నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేయడమేంటీ, ధైర్యంగా నువ్వు చెప్పలేకపోయావంటే...నువ్వు ఏదో తప్పు చేస్తున్నావని అర్థమైందని ఇందు అంటుంది. ఇంక ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి..మీ అమ్మ లాగే నువ్వు కూడా తయారయ్యావని ఐశ్వర్య అంటుంది. మీ అమ్మ కూడా ఆస్తి లాక్కుని, మా అమ్మకు చిల్లర వేసిందని ఐశ్వర్య అంటుంది. నువ్వు రేఖ మాయలో ఉన్నావ్, ఏదో ఒకరోజు నువ్వే నా దగ్గరకు వచ్చి తప్పు చేశావని బాధపడతావ్ అని ఇందు అంటుంది. చావనైనా చస్తాను గానీ, నీ దగ్గరకు రాను అని ఐశ్వర్య అంటుంది. 

88
రెస్టారెంట్‍కు వచ్చిన నందు, వెకీ
Image Credit : jio hotstar

రెస్టారెంట్‍కు వచ్చిన నందు, వెకీ

మరోవైపు రెస్టారెంట్ దగ్గరకు వెంకీ, నందు వస్తారు. రోజాను ఇంప్రెస్ చేసి నా లవ్ సక్సెస్ చేయాలని వెంకీ అంటాడు. నిన్ను వదిలించుకోవడానికైనా మీ ప్రేమ గెలిపిస్తా అని నందు అంటుంది. ఇద్దరు కలిసి రోజా దగ్గరకు వెళ్తారు..ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Patas Praveen: ఫైమాతో లవ్‌ బ్రేకప్‌పై ఓపెన్‌ అయిన పటాస్‌ ప్రవీణ్‌.. దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్‌
Recommended image2
Suma Kanakala: కారు దిగి నడిరోడ్డు మీద పరిగెత్తిన యాంకర్ సుమ, కారణం ఏంటో తెలుసా?
Recommended image3
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌తో చివరి సినిమా.. బ్యానర్ ను క్లోజ్ చేయబోతున్న నిర్మాత ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
Brahmamudi Serial Today Episode: ఐశ్వర్య చెంప చెల్లుమనిపించిన రేఖ, రాజు..అపర్ణ కంట పడకుండా అడ్డుపడ్డ భూషణ్
Recommended image2
Brahmamudi Serial Today Episode: బయటపడ్డ ఐశ్వర్య బండారం, అపర్ణను చూసి షాక్ అయిన రాజు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved