MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • TV
  • Brahmamudi Serial Today Episode: ఐశ్వర్య చెంప చెల్లుమనిపించిన రేఖ, రాజు..అపర్ణ కంట పడకుండా అడ్డుపడ్డ భూషణ్

Brahmamudi Serial Today Episode: ఐశ్వర్య చెంప చెల్లుమనిపించిన రేఖ, రాజు..అపర్ణ కంట పడకుండా అడ్డుపడ్డ భూషణ్

Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. రాజు..అపర్ణ కంటపడకుండా లోపలికి తీసుకెళ్లిపోయిన భూషణ్, ఐశ్వర్య చెంప చెల్లుమనించిన రేఖ మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో చూసేద్దాం. 

4 Min read
Author : Nandini Arava
Published : Mar 28 2026, 10:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
రాజు..అపర్ణ కంటపడకుండా లోపలికి తీసుకెళ్లిపోయిన భూషణ్
Image Credit : jio hotstar

రాజు..అపర్ణ కంటపడకుండా లోపలికి తీసుకెళ్లిపోయిన భూషణ్

ఇంకో నెక్లెస్ తీసుకొస్తుంది స్వాతి. నీ రూం ముందే దొరికింది ఆంటీ అని చెప్తుంది. భ్రమరాంబ్ షాక్ అవుతుంది. నా గది ముందు పడిపోవడం ఏంటీ అని రేఖ అంటే...ఐశ్వర్య అక్క నగలు తీసుకెళ్తుంటే ఇంకోటి పడిపోయిండొచ్చు అని స్వాతి చెప్తుంది. ఇంతలో రాజ్, లక్కీ..మేం వెళ్లిపోతాం అంటారు. అప్పుడు రేఖ...రాజును ఆపి, నీతో మాట్లాడాలని చెప్తుంది. అప్పుడే అపర్ణ గది నుంచి బయటకు వస్తుంటే...వాళ్లని లోపలికి తీసుకెళ్లు అని భూషణ్‍కు చెప్తుంది. అపర్ణ ఎక్కడ రాజును చూస్తే గుర్తుపట్టేస్తుందని వాళ్లని తీసుకెళ్లమని చెప్తుంది. భూషణ్ వెళ్లి అపర్ణ బయటకు రాకుండా లోపలికి తీసుకెళ్లిపోతాడు. రాజును చూడకుండా చేస్తాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
రాజును ఆరాతీసిన రేఖ
Image Credit : jio hotstar

రాజును ఆరాతీసిన రేఖ

ఇక రేఖ...రాజును పక్కకు తీసుకెళ్లి నువ్వుండే బస్తీ ఎక్కడా అని అడుగుతుంది. నువ్వు ఎవరితో ఉంటావ్ అని అడుగుతుంది. దానికి రాజు విసిగిపోయి...నేను మా అమ్మానాన్నలతో ఉంటానని చెప్పి వెళ్లిపోతాడు. ఎవరు తప్పు చేశారో తెలిసిపోయింది కదా...ఇక నేను వెళ్తా అంటూ ఇందు లోపలికి వెళ్లిపోతుంది.

39
ఐశ్వర్య చెంప చెల్లుమనించిన రేఖ
Image Credit : jio hotstar

ఐశ్వర్య చెంప చెల్లుమనించిన రేఖ

ఐశ్వర్య..రేఖకు సారీ చెప్తుంది. అయినా రేఖ ఐశ్వర్యను చెంపచెల్లుమనేలా కొడుతుంది. నువ్వు చేసిన తప్పుకు నేను తలదించుకోవాల్సి వచ్చింది, నా పెంపకాన్ని అవమానించేలా చేశావ్ అని తిడుతుంది. ఎంత గొప్ప లైఫ్ ఇచ్చినా కుక్క తోక వంకర అని నువ్వు నిరూపించుకున్నావ్, ఎంతైనా మీ నాన్న రక్తమే కదా నీలో ఉన్నది కూడా, వాడు కూడా అంతే ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఇలాంటి చిల్లర పనులు చేస్తుండేవాడు, నువ్వు మా అన్నయ్యకు ఏమాత్రం తీసిపోవని నువ్వు ప్రూవ్ చేసుకున్నావ్ అని రేఖ తిట్టి ఐశ్వర్య చేతిలో నెక్లెస్ లాక్కుని వెళ్లిపోతుంది.

49
భ్రమరాంబకు చుక్కలు చూపించిన స్వాతి
Image Credit : jio hotstar

భ్రమరాంబకు చుక్కలు చూపించిన స్వాతి

మరోవైపు భ్రమరాంబ...స్వాతిని గదిలోకి లాక్కుని వెళ్తుంది. ఆ నెక్లెస్ నువ్వు రేఖకు ఎందుకిచ్చావ్ అని అడుగుతుంది. అది రేఖా ఆంటీదే కదా అందుకే ఇచ్చా అని చెప్తుంది. అసలు నీకెక్కడ దొరికింది అంటే...చెప్పా కదా రేఖా ఆంటీ రూం బయటే దొరికింది అని స్వాతి చెప్తుంది. అది అబద్ధం అని భ్రమరాంబ అంటే...మరి నిజమేంటీ అని స్వాతి అడుగుతుంది. నిజం చెప్తే బయటపడిపోతుంది కాబట్టి మీ అమ్మ చెప్పదు అని శేషం అంటాడు. అయినా నీకు నెక్లెస్ దొరికితే...నేరుగా ఇవ్వకుండా ఇంట్లో పెద్దదాన్ని నేను ఉన్నా కదా నాకు చెప్పాలిగా అని భ్రమరాంబ అంటుంది. అయినా ఆ నెక్లెస్ నీది కాదు, నాది కాదు...మరి అలాంటప్పుడు రేఖా ఆంటీకే ఇవ్వాలి కదా అని అంటుంది స్వాతి.

59
అపర్ణను తిట్టిన భూషణ్
Image Credit : jio hotstar

అపర్ణను తిట్టిన భూషణ్

ఇంతలో భూషణ్..అపర్ణను తిడతాడు. చెప్పాపెట్టకుండా ఎందుకు బయటకు వస్తున్నారని అడుగుతాడు. మా పర్మిషన్ లేకుండా బయటకు వస్తే బాగోదని వాళ్ల మీద ఫైర్ అయి వెళ్లిపోతాడు. అప్పుడే ఇందు వస్తుంది, ఏమైంది ఇందు, ఎందుకంతా హడావిడిగా ఉందని అపర్ణ అడుగుతుంది. ఏం లేదు నాన్నమ్మ, ఎప్పుడూ ఉండేదే, లైట్ తీసుకోండి అంటుంది ఇందు. 

69
వెంకీ లవ్ కోసం నందు కష్టాలు
Image Credit : jio hotstar

వెంకీ లవ్ కోసం నందు కష్టాలు

వెంకీ...రోజా ఇంటి దగ్గర వెయిట్ చేస్తుంటాడు. ఇంతలో నందు మూవీ టికెట్స్ తీసుకొస్తుంది. ఏంటీ ఇంత లేటుగా వచ్చావ్ అని వెంకీ అంటే...పవన్ కల్యాణ్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ సో టికెట్లు దొరకడం ఎంత కష్టమో తెలుసా, మళ్లీ తీసుకొస్తే నన్ను అంటావా అని నందు అంటుంది. రోజానే టికెట్లు అడిగింది. మేం జాలీగా సినిమా చూస్తామంటాడు. ఎక్కువ ఊహించుకోకు...ముందెళ్లి రోజాను పిలువు, మీ లవ్ ఎంత వరకూ ఉందో చూస్తానని నందు అంటుంది. తీరా టికెట్లు ఇస్తే...మా కజిన్‍తో సినిమాకు వెళ్తున్నా అంటూ బై చెప్పేస్తుంది. హగ్ ఇచ్చి లోపలికి వెళ్లిపోతుంది. ఇంతలో నందు వచ్చి ఆ అమ్మాయి...వాడెవడితోనో సినిమాకు వెళ్లడానికి నీతో టికెట్లు తెప్పించుకుందని నందు చెప్తుంది. అది నిన్ను వాడుకుంటోదని నందు చెప్పినా వెంకీ వినిపించుకోడు. సరే ఈసారి రెస్టారెంట్‍కు పిలుపు అక్కడ మిమ్మల్ని ఇద్దరిని కలుపుతా అని నందు చెప్పి వెళ్లిపోతుంది.

79
దొంగలు ఇక్కడికి వచ్చేలా చేసింది నేనేనన్న ఇందు
Image Credit : jio hotstar

దొంగలు ఇక్కడికి వచ్చేలా చేసింది నేనేనన్న ఇందు

మరోవైపు స్వాతి...ఆకలేస్తోంది, వడ్డించక్కా అని అడుగుతుంది. వాళ్లతో తిను అని చెప్తే వినవు అని ఇందు అంటే...వాళ్లతో నాకు పడదులే అక్కా అని స్వాతి అంటుంది. నీకోసమే వెయిట్ చేశానంటూ ఇందుకు తినిపిస్తుంది. ఏంటే నీకు ఆకలేస్తుందని నీకు పెడితే నాకు పెడుతున్నావ్ అని ఇందు అడుగుతుంది. వాళ్లు నువ్వు మనిషిలానే చూడరు, నీకోసం పట్టించుకోరు అని స్వాతి అంటుంటే...ఇందు కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏమైందక్కా అని అడిగితే...నందు గుర్తొచ్చింది, తను కూడా ఉంటే ఎంత బాగుండేది కదా అని ఇందు అంటుంది.అంతేలే నేను నీ సొంత చెల్లెలిని కాదు కదా అని స్వాతి అంటే...నందు ఉన్నా కూడా ఇంత సపోర్ట్ చేసేది కాదేమో, నువ్వు మీ అమ్మను కూడా కాదని నాకోసం నిలబడ్డావ్ అని ఇందు అంటుంది. 

నా సంగతి సరే గానీ...ఇందాకట్నుంచి ఒక విషయం అర్థం కావడం లేదక్కా, మా అమ్మ నెక్లెస్ దాయడం నేను చూశాను కాబట్టి తీసుకొచ్చి ఇచ్చా, మరి ఐశ్వర్య తీసుకెళ్లిన నెక్లెస్ వాళ్లు ఇంటికి తీసుకురావడమేంటీ...ఈరోజుల్లో కూడా ఇంత మంచివాళ్లు ఉన్నారా అని స్వాతి అంటే...వాళ్లు మంచివాళ్లు ఏంటీ, వాళ్లు పక్కా దొంగలు, ఇక్కడికి వచ్చేలా చేసింది నేనే అని ఇందు చెప్తుంది.

89
రాజు, లక్కీని బెదిరించిన ఇందు
Image Credit : jio hotstar

రాజు, లక్కీని బెదిరించిన ఇందు

ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది ఇందు. రాజు, లక్కీ..నెక్లెస్ కోసం మాట్లాడుకుంటుంటే..మధ్యలో ఇందు వస్తుంది. ఏంటీ లెక్కతేలడం లేదా అని ఇందు అడుగుతుంది. ఐశ్వర్యకు లిఫ్ట్ ఇచ్చి తన దగ్గర నెక్లెస్ కొట్టేశారు కదా అని ఇందు అంటుంది. లిఫ్ట్ ఇవ్వడం కరెక్ట్ గానీ, దొంగతనం చేయలేదు అని రాజు అంటాడు. కాకమ్మ కబుర్లు చెప్పకండి, అక్కడున్న నందుకు చెప్తే మిమ్మల్ని పోలీష్ స్టేషన్‍కు తీసుకెళ్తుందని ఇందు బెదిరిస్తుంది. ఐశ్వర్యకు నెక్లెస్ ఇచ్చేద్దామని అనుకుంటున్నాం అని లక్కీ అంటే ....అడ్రస్ తెలుసా అని ఇందు అడుగుతుంది. అడ్రస్ కనుక్కుని ఇచ్చేస్తాం అని లక్కీ చెప్తాడు. అంత అవసరం లేదు, లోకేషన్ మీకిస్తా మీరే వెళ్లి ఇవ్వండని ఇందు చెప్తుంది. 

99
మందు తాగుతూ తెగ ఆలోచనలో పడ్డ రేఖ
Image Credit : jio hotstar

మందు తాగుతూ తెగ ఆలోచనలో పడ్డ రేఖ

నిన్ను చూస్తే భయమేస్తుంది అక్కా...ఇద్దరి మగవాళ్లను బెదిరించావంటే నువ్వు మామూలుదానివి కాదక్కా అని స్వాతి అంటుంది. నిన్ను చూస్తే అమాయకురాల్లాగా ఉంటావ్, నోట్లో వేలు పెట్టినా కొరకనట్టుంటావ్ అని స్వాతి అంటుంది. కానీ ఇంత ఫైర్ ఉన్నావ్ ఏంటీ, నా విషయాలన్నీ నీకు తెలుసు కదా, నేను సేఫేనా అని స్వాతి అంటుంది. అటు రేఖ....మందు తాగుతూ తెగ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Recommended image3
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Related Stories
Recommended image1
Brahmamudi Serial Today Episode: ఇందును బలి చేసిన ఐశ్వర్య, నగలు అమ్మేద్దామని రాజ్ ప్లాన్
Recommended image2
Brahmamudi Serial Today Episode: బయటపడ్డ ఐశ్వర్య బండారం, అపర్ణను చూసి షాక్ అయిన రాజు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved