MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • TV
  • Brahmamudi Serial Today Episode: బయటపడ్డ ఐశ్వర్య బండారం, అపర్ణను చూసి షాక్ అయిన రాజు

Brahmamudi Serial Today Episode: బయటపడ్డ ఐశ్వర్య బండారం, అపర్ణను చూసి షాక్ అయిన రాజు

Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. ఐశ్వర్య బండారం బయటపెట్టిన లక్కీ, అపర్ణను చూసిన రాజ్. మరి ఏం జరిగిందో ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో చూసేద్దాం. 

4 Min read
Author : Nandini Arava
Published : Mar 27 2026, 10:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
ఇందు కోసం ఎదురుచూస్తున్న రేఖ, భ్రమరాంబ
Image Credit : jio hotstar

ఇందు కోసం ఎదురుచూస్తున్న రేఖ, భ్రమరాంబ

ఇంట్లో అంతా ఇందుకోసం ఎదురుచూస్తుంటారు. రాగానే ఇందును ఇరికించేస్తే తాము బయట పడిపోవచ్చని భ్రమరాంబ, ఐశ్వర్య అనుకుంటూ ఉంటారు. ఇంకా రాదేంటీ...ఎంతసేపు ఎదురుచూడాలి, ఫోన్ చేసి రమ్మని చెప్పు అని భ్రమరాంబ అంటుంది. అప్పుడే ఇందు భయంతో ఇంట్లోకి వస్తుంది. ఎందుకు చేశావ్ అని రేఖ ఇందును నిలదీస్తుంది. దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఇందు అంటుంది. నటించకు..ఆ రెండు నెక్లెసులు దొంగిలించింది నువ్వేనని నాకు తెలుసు అంటుంది రేఖ. నీకు అంత ధైర్యం ఎలా వచ్చింది, నా సంగతి తెలిసి కూడా నువ్వు దొంగతనం చేశావంటే నీకు మళ్లీ శిక్ష పడాలి అని రేఖ అంటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
నువ్వు చేసిన తప్పుకు ముసలాళ్లను చంపుతామని బెదిరించిన రేఖ
Image Credit : jio hotstar

నువ్వు చేసిన తప్పుకు ముసలాళ్లను చంపుతామని బెదిరించిన రేఖ

ఆంటీ మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు, నేను ఏ నెక్లెసులు దొంగలించలేదు, నేను ఇప్పుడే శివరాం ఇంటి నుంచి వస్తున్నానని చెప్తుంది రేఖ. నువ్వు ఏడుస్తూ నటిస్తున్నంత మాత్రాన నీ మాటలు ఎవరు నమ్మరని భ్రమరాంబ అంటే, ఇలా అడిగితే నిజం ఎలా చెప్తుంది, అడగాల్సిన పద్ధతిలో అడిగితే చెప్తుందని ఐశ్వర్య అంటుంది. ఇద్దరు తోడు దొంగలు బాగానే ఇందును బలి పశువు చేశారని శేషం మనసులో అనుకుంటాడు. ఆ నెక్లెసులు ఏం చేశావ్, అమ్మేశావా అని రేఖ అంటుంది. ఆ నెక్లెసులు నేనేం చేసుకుంటాను, నాకెందుకు అంత అవసరం ఉంటుంది అని ఇందు అంటుంది. ఆ అవసరం నీకే ఉంది, మీ తాతకు ఆపరేషన్ చేయించడానికి నువ్వే దొంగలించావని మాకు తెలుసని ఐశ్వర్య అంటుంది. నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా ఆంటీ, నా గురించి తెలియదా మీకు అని ఇందు రేఖను అడుగుతుంది. నీ కోసం నువ్వు ఏం చేయకపోయినా, మీ తాత, నాన్నమ్మ కోసం ఎంత దూరమైనా వెల్తావని నాకు బాగా తెలుసని రేఖ అంటుంది. నా నగలు అమ్మేసి మీ తాత కు ఆపరేషన్ చేయించాలనే ఆలోచన చాలా బాగుంది, అందుకే ఆ దొంగతనం విజయవంతంగా పూర్తి చేశావని రేఖ అంటుంది. కానీ నీ దొంగతనం బయటపడితే...ముసలాడు ప్రాణాలతో ఉంటాడనే చిన్న లాజిక్ ఎలా మరిచిపోయావ్ అని రేఖ అడుగుతుంది. నిజం తెలిసే లోపు అన్నిటిని చక్కబెట్టాలని అనుకున్నావ్, నేను ఎన్ని చేస్తున్నా నీలో ధైర్యం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తోందని రేఖ అంటుంది. నువ్వు చేసిన తప్పుకు వాళ్లకి శిక్ష వేస్తానని బెదిరిస్తుంది. ఐశ్వర్య దొంగలించిందని నాకు తెలిసినా నేను చెప్పినా ఎవరూ నమ్మరు, ఇందు అక్కను ఎలా కాపాడుకోవాలని స్వాతి మనసులో బాధపడుతుంది. 

39
నిజం చెప్పు అని భ్రమరాంబను అడుగుతున్న శేషం
Image Credit : jio hotstar

నిజం చెప్పు అని భ్రమరాంబను అడుగుతున్న శేషం

నువ్వు దొంగిలించిన నగలు...మీ తాతయ్య ఆపరేషన్‍కు పనిరాకుండా చేస్తా, ముసలాడు శాశ్వతంగా లేవకుండా చేస్తానని రేఖ అంటుంది. ఆ ముసలాడు చస్తే దీనిలో సగం ధైర్యమే చస్తుంది, ఒకేసారి ఇద్దరిని పైకి పంపించేద్దాం, అప్పుడైనా ఇందులో భయం కనిపిస్తుందేమో చూద్దామని భూషణ్ అంటాడు. ఇప్పుడైనా నిజం చెప్పు లేకపోతే వారి ప్రాణాలు పోతాయని రేఖ బెదిరిస్తుంది. 2 నగల కోసం ఇద్దరిని చంపడానికి రేఖ రెడీ అయిపోయింది, ఇప్పుడైనా నిజం చెప్పు అని శేషం అంటున్నా భ్రమరాంబ పట్టించుకోదు. 

49
ఇందు కోసం ఆలోచిస్తున్న అపర్ణ, సుభాష్
Image Credit : jio hotstar

ఇందు కోసం ఆలోచిస్తున్న అపర్ణ, సుభాష్

మరోవైపు అపర్ణ ఏదో ఆలోచనలో ఉంటుంది. ఏంటీ ఆలోచిస్తున్నావ్ అని సుభాష్ అడుగుతాడు. ఇందు ఇవాళ కూడా ఇంటర్వ్యూకు వెళ్లింది, దానికోసమే ఆలోచిస్తున్నా అని అపర్ణ అంటుంది. ఆ దేవుడు తన తలరాతను ఎందుకు అలా రాశాడో, ఇంకా జీవితమే మొదలవ్వలేదు, అప్పుడే బాధ్యతలు తన భూజాలపై మోస్తోందని సుభాష్ అంటాడు. మన వాళ్లు బతికి ఉంటుంటే...మహారాణిలా ఉండే, మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేవాళ్లమని సుభాష్ అంటాడు. అదే జరిగి ఉంటే...పెళ్లికొడుకుని వెతకాల్సిన పని లేదు, రాజ్ మేనల్లుడినే ఇచ్చి పెళ్లి చేసేవాళ్లమని అపర్ణ అంటుంది. నాకెందుకో అనుమానం వస్తుంది. ఆ అబ్బాయి బతికే ఉంటాడు అంటుంది అపర్ణ. అంత పెద్ద ప్రమాదం జరిగాక కూడా ప్రాణాలతో ఉంటాడనే నమ్మకం నాకు లేదని సుభాష్ అంటాడు. కానీ బతికే ఉంటాడని అపర్ణ నమ్ముతుంది. ఏదో ఒకరోజు మన ఇంటిని వెతుక్కుంటూ వస్తాడని అపర్ణ అంటుంది. 

59
ఇంట్లోకి అడుగుపెట్టగానే రాజ్‍కు గుర్తొచ్చిన చిన్నప్పటి జ్ఞాపకాలు
Image Credit : jio hotstar

ఇంట్లోకి అడుగుపెట్టగానే రాజ్‍కు గుర్తొచ్చిన చిన్నప్పటి జ్ఞాపకాలు

ఇంతలో రాజ్, లక్కీ ఆ ఇంటికి వస్తారు. ఇక్కడ ఇందును నిలదీస్తూ ఉంటుంది రేఖ. ఒకవేళ ఆ అబ్బాయి వస్తే ఇందుకు అండగా నిలబడతాడు అని సుభాష్ అంటాడు. రాజ్ ఆ ఇంటి వాకిట్లో అడుగుపెట్టగానే తనకు చిన్నప్పటి జ్ఞాపకాలు వస్తాయి. ఏంటీ అలా చూస్తున్నావ్ అని లక్కీ అంటే..ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతోంది, ఈ ఇంటిని ఎక్కడో చూసి ఉంటానని రాజ్ అంటాడు. నీకొచ్చే ముష్టి కలలోనే ఈ ఇల్లు చూసుంటావ్ అని లక్కీ అంటాడు. 

69
ఇందును చూసి షాక్ అయిన రాజ్, లక్కీ
Image Credit : jio hotstar

ఇందును చూసి షాక్ అయిన రాజ్, లక్కీ

ఇక్కడ ఐశ్వర్య..ఏం చేసినా ఇందు చెప్పదు, శిక్షపడాల్సిందే అని అంటుంది. అవును రేఖ నీ కళ్లముందే ఆ ముసలాడి నడుం విరగ్గొడితే కానీ ఇది నోరు విప్పదు. వెంటనే ఇందుకు కోపం వచ్చి భ్రమరాంబపై అరుస్తుంది. నేను ఏ తప్పు చేయకపోయినా మీరు అన్న మాటలను భరిస్తాను, కానీ వాళ్ల జోలికి వెళ్తే నేను ఊరుకోను అని ఇందు అంటుంది. చూశావా రేఖ...ఇది దీని విశ్వరూపం, మన ముందు భయపడుతున్నట్లు నటిస్తోంది కానీ, ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందో అని ఎదురుచూస్తోందని భ్రమరాంబ అంటుంది.ముందు ఆ ముసలాళ్లను బయటకు లాక్కొస్తా అని ఐశ్వర్య వెళ్తుంటే రాజ్, లక్కీ ఇంట్లోకి వస్తారు. అప్పుడు ఐశ్వర్య కంగారుపడుతుంది. ఇందును ఈ ఇంట్లో చూసి ఇదేంటీ ఇక్కడుందని లక్కీ, రాజ్ అనుకుంటారు. 

79
అందరిముందు నెక్లెస్ ఇచ్చిన లక్కీ
Image Credit : jio hotstar

అందరిముందు నెక్లెస్ ఇచ్చిన లక్కీ

రేఖ...రాజును చూసి రాజ్ అంటుంది. అరె నాపేరు బాగానే గుర్తుపెట్టారు, కానీ నా పేరు రాజ్ కాదు, రాజు అంటాడు. అసలెవరు మీరు ఇక్కడికి ఎందుకొచ్చారని భ్రమరాంబ అడుగుతుంది. ఐశ్వర్య కోసం వచ్చానని లక్కీ అంటే...వీళ్లు నిజం చెప్తే దొంగతనం గురించి బయటపడిపోతుందని ఐశ్వర్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఐశ్వర్యతో మీకేం పని, తనతో మాట్లాడాలి అంటే ఓ స్టేటస్ ఉండాలి అని భ్రమరాంబ అంటుంది. మీ ముఖాలు చూస్తుంటేనే కేరాఫ్ బస్తీ అని అంటుంది. వెంటనే రాజుకు కోపం వస్తే లక్కీ కంట్రోల్ చేస్తాడు. నువ్వు ఎక్కుడుంటావ్, ఎవరితో ఉంటావ్ అని రేఖ అడిగితే...నేను ఏమైనా అనాథనా అడ్డమైనవాళ్లతో ఉండటానికి అని రాజు కోప్పడతాడు. అసలెందుకు వచ్చారని భ్రమరాంబ అంటే...వాళ్లు నాఫ్రెండ్స్ అంటుంది ఐశ్వర్య. బయటకెళ్లి మాట్లాడదాం పదండి అంటుంది ఐశ్వర్య. అందరూ చూస్తుండగానే నీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నా అని లక్కీ అంటాడు. తన దగ్గరున్న నెక్లెస్ తీస్తాడు లక్కీ. ఐశ్వర్యకు దిమ్మతిరిగిపోతుంది. ఈ నెక్లెస్ నీకెక్కడిది, తను నీకిచ్చిందా అని భ్రమరాంబ అంటే...మా కారులో వస్తుంటే నెక్లెస్ కారులో పడిపోయింది, అందుకే తిరిగి ఇచ్చేద్దామని వచ్చామని లక్కీ అంటాడు. 

89
భ్రమరాంబ దాచిన నెక్లెస్ కొట్టేసిన స్వాతి
Image Credit : jio hotstar

భ్రమరాంబ దాచిన నెక్లెస్ కొట్టేసిన స్వాతి

ఐశ్వర్య ఏదో చెప్పబోతుంటే రేఖకు కోపమొచ్చి, ఇంకో నెక్లెస్ ఎక్కడ అని అడుగుతుంది. ఇంతలో స్వాతి నేను చెప్తానంటూ ఆ నెక్లెస్ తీసుకొచ్చి ఇస్తుంది. భ్రమరాంబ నెక్లెస్ దాయడాన్ని స్వాతి చూస్తుంది. అది తనకు తెలియకుండా స్వాతి తీసుకుని తెస్తుంది. ఇది నీకు ఎక్కడ దొరికిందని రేఖ అడిగితే...మీ రూం ముందే దొరికిందని స్వాతి చెప్తుంది.

99
అపర్ణనూ చూసిన రాజ్
Image Credit : jio hotstar

అపర్ణనూ చూసిన రాజ్

మీరేదో ఫ్యామిలీ డిస్కషన్‍లో ఉన్నారు, మేం వెళ్తాం అని రాజ్, లక్కీ వెళ్లిపోతుంటే...సడెన్‍గా వెనక్కి తిరిగి చూస్తుంటే అపర్ణ కనిపిస్తుంది. అపర్ణను చూసి రాజ్ షాక్ అవుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Recommended image3
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Related Stories
Recommended image1
Brahmamudi Serial Today Episode: ఇందును బలి చేసిన ఐశ్వర్య, నగలు అమ్మేద్దామని రాజ్ ప్లాన్
Recommended image2
Brahmamudi Serial Today Episode: సొంత ఇంటికే కన్నం వేసిన ఐశ్వర్య, దొంగలను చితక్కొట్టిన ఇందు, నందు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved