MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Brahmamudi Serial Today Episode: ఇందును బలి చేసిన ఐశ్వర్య, నగలు అమ్మేద్దామని రాజ్ ప్లాన్

Brahmamudi Serial Today Episode: ఇందును బలి చేసిన ఐశ్వర్య, నగలు అమ్మేద్దామని రాజ్ ప్లాన్

Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది.  దొంగతనం ఇందు మీదకు నెట్టేస్తుంది ఐశ్వర్య. నగలు అమ్మడానికి షాప్ దగ్గరికి వచ్చి ఎళ్లీ ఎదురుపడతారు…ఇందు, రాజ్.. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో చూసేద్దాం. 

4 Min read
Author : Nandini Arava
Published : Mar 26 2026, 10:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
బంగారం అమ్మేయాలని రాజ్ ప్లాన్
Image Credit : jio hotstar

బంగారం అమ్మేయాలని రాజ్ ప్లాన్

కారులో ఐశ్వర్య పడేసుకున్న నెక్లెస్ రాజ్, లక్కీ కంట పడుతుంది. మొదట ఆ నెక్లెస్ ఐశ్వర్యకే ఇచ్చి ఇంప్రెస్ చేసి లవ్‍లో పడేస్తానని లక్కీ అంటాడు. నెక్లెస్ ఇచ్చినా ఐశ్వర్య పడతాదనే గ్యారెంటీ లేదు కాబట్టి అమ్మేద్దామని రాజ్ అంటే...దానికి ఓకే అంటాడు లక్కీ. దాన్ని తీసుకుని దొంగ బంగారం కొనే జ్యూవెలరీ దుకాణానికి ఇద్దలు వెళ్తారు. 

28
నెక్లెస్ పోయిందన్న రేఖ
Image Credit : jio hotstar

నెక్లెస్ పోయిందన్న రేఖ

ఇంతలో రేఖ తన గదిలోకి వచ్చేటప్పటికీ లాకర్ తెరిచి ఉంటుంది. ఇదేంటీ...నేను తాళం వేసి వెళ్లాను కదా ఎవరు తెరిచారని అనుకుంటుంది. ఇంతలో లాకర్ తీసి చూసేసరికి 2 నెక్లెసులు కనిపించవు. తన రూంలోకి వచ్చేంత ధైర్యం ఎవరకుందని అనుకుంటూ భూషణ్‍ను పిలుస్తూ కిందికి దిగుతుంది. ఇంతలో అక్కడికి భూషణ్, భ్రమరాంబ, శేషం, ఐశ్వర్య వస్తారు. నెక్లెస్ పోయిందని చెప్తుంది. మన లాకర్‍ని తీసి ఎవరో దొంగతనం చేశారని చేప్తుంది. ఐశ్వర్య ఎలా దొరక్కుండా ఉంటుందో చూద్దాం అని భ్రమరాంబ అనుకుంటుంది. ఇంతలో ఇంట్లోనే ఎవరో తీసుంటారని భూషణ్ అంటాడు. ఇంట్లోనే అంటే ఎవరో చెప్పాలని, అప్పుడే మనకు ఒక క్లారిటీ ఉంటుంది, పాపం భ్రమరాంబ చూడు ఎలా టెన్షన్ పడుతుందో అని శేషం అంటాడు. నాకెందుకు కంగారు అని భ్రమరాంబ అంటే.. అలాంటి చేతివాటం అలవాటు నీకే ఉంది కదా, ఈ విషయం మీ తమ్ముడికి కూడా తెలుసుకదా అంటాడు శేషం. మన ఇంట్లో నగలు మనమే దొంగతనం చేస్తామా, ఇలా అనుకుంటే దొంగిలించిన దొంగ ఆ నగలను అమ్ముకుంటాడని భ్రమరాంబ అంటుంది. నేనుండగా నా లాకర్‍లో నగలు దొంగిలించారంటే వారికి చాలా ధైర్యం ఉండాలని రేఖ అంటుంది. నగలు పోయాయి కాబట్టి, ఆ దొంగతననం తన మీదకు రాకూడదని ఐశ్వర్య అనుకుంటుంది. అయినా లాకర్‍లో అన్ని నగలు ఉంటే ఒక్క నెక్లెస్ కొట్టేయడమేంటని ఐశ్వర్య అంటే...ఒక్కటని ఎవరు చెప్పారు, పోయింది 2 నెక్లెస్‍లని రేఖ చెప్తుంది. 

Related Articles

Related image1
Brahmamudi Serial Today Episode: ఇందును అవమానిస్తూ కాళ్ల కింద పెట్టుకున్న రేఖ, నెక్లెస్ కొట్టేయాలని ఐశ్వర్య ప్లాన్
Related image2
Brahmamudi Serial Today Episode: సొంత ఇంటికే కన్నం వేసిన ఐశ్వర్య, దొంగలను చితక్కొట్టిన ఇందు, నందు
38
ఇందుపైకి దొంగతనం నెట్టేసిన ఐశ్వర్య
Image Credit : jio hotstar

ఇందుపైకి దొంగతనం నెట్టేసిన ఐశ్వర్య

అంటే నాకు తెలియకుండా మరో నెక్లెస్ ఎవరు దొంగతనం చేశారని ఐశ్వర్య అనుకుంటుంది. అసల అంత ధైర్యం ఎవరికి వచ్చిందో తెలియాలని రేఖ అంటుంది. ముందు ఆ నెక్లెస్లు దొరకాలని భ్రమరాంబ అంటే...నెక్లెస్లు కాదు దొంగలెవరో తెలియాలి, నా వస్తువులు దొంగిలించాలన్న ఆలోచన వచ్చిన మనిషి ముఖ్యమని రేఖ అంటుంది. ఇలానే వదిలేస్తే నెక్లెస్ పోయింది, రేపు నా మీద భయం పోతుందని రేఖ అంటుంది. వెంటనే ఐశ్వర్య తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి దొంగతనం ఇందు మీదకు నెట్టేస్తుంది. పోనీలే మనం సేఫ్ అనుకుంటుంది భ్రమరాంబ. వాళ్ల తాతకు ఆపరేషన్ చేయించడానికి డబ్బులు అడిగినప్పుడు నువ్వు లేవన్నావ్, అప్పటినుంచి అవకాశం కోసం చూస్తోందని ఇందును బలిచేస్తుంది. నాకు కూడా ఇందు మీద డౌట్ వస్తుందని భూషణ్, భ్రమరాంబ అంటారు. మీ ముందే ఇందు అక్క శివరాం గారి ఇంటికి వెళ్లినప్పుడు, ఇందు అక్క ఎలా దొంగతనం చేస్తుందని స్వాతి అంటుంది. మనం మన పనిలో ఉంటే...ఇందు వచ్చి ఎత్తుకెళ్లి ఉండొచ్చు కదా అని రేఖ అంటుంది. ఇందు వస్తే దాని పని చెప్తా అని కోపంతో ఊగిపోతుంది. 

48
నెక్లెస్ అమ్మడానికి షాప్ దగ్గరికి వెళ్లిన రాజ్, లక్కీ
Image Credit : jio hotstar

నెక్లెస్ అమ్మడానికి షాప్ దగ్గరికి వెళ్లిన రాజ్, లక్కీ

ఆ నెక్లెస్ అమ్మడానికి షాప్ దగ్గరికి వెళ్తారు. అది చూసి సేటు..వీళ్లిద్దరివి దొంగ ముఖాల్లా ఉన్నాయి, ఎక్కడో కొట్టుకొచ్చారని పసిగడతాడు. వీళ్లని భయపెట్టి తక్కువకు కొట్టేయాలని అనుకుంటాడు. ఇలాంటి దొంగ సరుకు ఇక్కడ కొనమని సేట్ అంటాడు. ఒరిజినల్ కదా అని రాజ్ అంటే...కానీ మీరే డూప్లికేట్ ముఖాల్లా ఉన్నారని సేట్ అంటాడు. సరే మీ షాపులో కుదరకపోతే చెప్పు వెళ్లిపోతామని రాజ్ అంటాడు. త్వరగా రేటు చెప్పు అని లక్కీ అంటే...ఈ నెక్లెస్‍కు రూ.2లక్షలు ఇస్తా అంటాడు సేట్. అదెంటీ దీనికి రూ.10లక్షలు వస్తాయి కదా అని రాజ్ అంటే...వస్తుంది గానీ బిల్ లేకుండా అంటే కష్టమని వెళ్లిపోండి అంటారు.

58
దొంగలను తీసుకొచ్చి ఎదురెదురు పడ్డ ఇందు, రాజ్
Image Credit : jio hotstar

దొంగలను తీసుకొచ్చి ఎదురెదురు పడ్డ ఇందు, రాజ్

ఇంతలో దొంగలను పట్టుకుని నందు, ఇందు ఆ దుకాణం దగ్గరకు వస్తారు. ప్రతీసారి ఈమె ఎంట్రీ ఏంటిరా భగవంతుడా అని ఇందును చూసి రాజ్ అనుకుంటారు. ఎవరు వీళ్లు అని నందు అడిగితే...వీళ్లు కూడా ఓ రకం దొంగలని ఇందు ఏం చెప్తుంది. ఇలాంటి దొంగ బంగారం కొనే దుకాణం దగ్గరికి వచ్చావంటే...నువ్వు కూడా ఎక్కడో కొట్టేసిన బంగారం ఇక్కడ కూడా అమ్ముకోవడానికి వచ్చావని అంటుంది ఇందు. అయినా మీకు ఇక్కడ పనేంటని నందు అడుగుతుంది. కష్టంలో ఉన్నామని అందుకే బంగారం అమ్ముకోవడానికి వచ్చామని రాజ్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.

68
సేటును బెదిరించిన నందు
Image Credit : jio hotstar

సేటును బెదిరించిన నందు

ఇక ఈ దొంగలు ఇక్కడ బంగారం అమ్మారు కదా, ఏంటిది, దొంగ బంగారం కొనడం తప్పు కాదని తెలీదా అని నందు అడుగుతుంది. దొంగ బంగారం కొంటాను గానీ, అమ్మవారి నగలు కొనను అంటూ నందుకు దొరికిపోతాడు. సరిగ్గా దొరికావ్, ఆ నగలు ఇస్తావా, వీళ్లతో పాటే జైలుకెళ్తావా అని నందు అంటుంది. నేను జైలుకు వెళ్తే నా పరువు పోతుంది, ఇప్పుడే బంగారం తీసుకొచ్చిస్తా అంటాడు సేట్..

78
దొంగతనం విషయం ఇందుకు ఫోన్ చేసి చెప్పిన స్వాతి
Image Credit : jio hotstar

దొంగతనం విషయం ఇందుకు ఫోన్ చేసి చెప్పిన స్వాతి

ఇంతలో స్వాతి...ఇందుకు ఫోన్ చేస్తుంది. ఇంటర్వ్యూ అవ్వగానే ఇంటికి వస్తా కదా, అప్పుడే ఫోన్ చేయాలా అని స్వాతిపై ఇందు ఫైర్ అవుతుంది. నీ ఇంటర్వ్యూ కోసం కాదక్కా, నీ భవిష్యత్ కోసం ఫోన్ చేశా అంటుంది స్వాతి. ఇంట్లో రేఖా ఆంటీ నగలు పోయాయి, ఆ నగలు తీసింది నువ్వేనని మా అమ్మ, ఐశ్వర్య అంటున్నారు. రేఖా ఆంటీ కూడా నువ్వే తీశావని నమ్ముతున్నారు. నేను ఇంట్లో లేనప్పుడు నేనెలా దొంగతనం చేస్తానని ఇందు అంటే...ఆ మాటే నేను అన్నా అక్కా కానీ ఎవరూ నమ్మడం లేదని స్వాతి చెప్తుంది. ముందే చెప్తే నువ్వు ఏదో ఒకటి ఆలోచించుకుంటావని చెప్పా, జాగ్రత్త అక్కా వీళ్లు ఏదో పెద్ద ప్లాన్ వేశారని స్వాతి అని ఫోన్ పెట్టేస్తుంది. 

88
శేషం కంట్లో పడ్డ భ్రమరాంబ
Image Credit : jio hotstar

శేషం కంట్లో పడ్డ భ్రమరాంబ

ఇక మరోవైపు ఆ నెక్లెస్ బీరువాలో పెట్టడానికి భ్రమరాంబ వెళ్తుంటే శేషం వెనుకనుంచి వచ్చి చేయి వేస్తాడు. భ్రమరాంబ కంగారు పడి వెనక్కి తిరిగేసరికి శేషం ఉంటాడు. ఎందుకింత భయపెట్టావ్ అని భ్రమరాంబ అంటే..పోనీలే ఇన్నాళ్లకు నాకు భయపడ్డావ్ అని శేషం అంటాడు. ఎవరో వచ్చారని గుండెజారి చేతులోకి వచ్చింది అని భ్రమరాంబ అంటే...అయితే ఏదో చేసి ఉంటావని శేషం అంటాడు. చేతి నిండా చేశా అని ఆ నెక్లెస్ చూపిస్తుంది. ఏంటిది అని శేషం అడిగితే...రేఖ ఇందాకట్నుంచి అరుస్తుంది కదా, ఆ నెక్లెస్సే ఇది భ్రమరాంబ అంటుంది. ఆ రెండు నెక్లెసులు కొట్టేసింది నువ్వా అని అడిగితే నేను ఒక నెక్లెస్ కొట్టేస్తే...ఇంకో నెక్లెస్ ఐశ్వర్య కొట్టేసింది. మీరిద్దరు దొంగిలించి పాపం ఇందు మీదకు నెట్టేశారా అని శేషం అంటాడు. ఇంతలో ఎపిసోడ్ ముగుస్తుంది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో ఛానెల్లో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: జ్యోకు దిమ్మతిరిగే షాక్- కూతురి పిల్లలకు ఆస్తి- దశరథ వీలునామా
Recommended image2
Brahmamudi Serial Today Episode: సొంత ఇంటికే కన్నం వేసిన ఐశ్వర్య, దొంగలను చితక్కొట్టిన ఇందు, నందు
Recommended image3
Karthika Deepam 2 Today Episode:దీప భయం-మెంటల్ షాక్‍లో సుమిత్ర-దశరథ కంగారు-జ్యోకు కార్తీక్ వార్నింగ్
Related Stories
Recommended image1
Brahmamudi Serial Today Episode: ఇందును అవమానిస్తూ కాళ్ల కింద పెట్టుకున్న రేఖ, నెక్లెస్ కొట్టేయాలని ఐశ్వర్య ప్లాన్
Recommended image2
Brahmamudi Serial Today Episode: సొంత ఇంటికే కన్నం వేసిన ఐశ్వర్య, దొంగలను చితక్కొట్టిన ఇందు, నందు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved