MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • TV
  • Brahmamudi Serial Today Episode: సొంత ఇంటికే కన్నం వేసిన ఐశ్వర్య, దొంగలను చితక్కొట్టిన ఇందు, నందు

Brahmamudi Serial Today Episode: సొంత ఇంటికే కన్నం వేసిన ఐశ్వర్య, దొంగలను చితక్కొట్టిన ఇందు, నందు

Brahmamudi Serial Today Episode:బ్రహ్మముడి ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. రేఖ కొన్న నెక్లెస్ కొట్టేసి అప్పు తీర్చేయాలనుకుంటుంది ఐశ్వర్య, మళ్లీ జాబ్ రాక ఇందు బాధపడుతుంది. మరి తర్వాత ఏం జరిగిందో, ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో చూసేద్దాం.  

2 Min read
Author : Nandini Arava
Published : Mar 25 2026, 09:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
చెరో నెక్లెస్ కొట్టేసిన ఐశ్వర్య, భ్రమరాబం
Image Credit : jio hotstar

చెరో నెక్లెస్ కొట్టేసిన ఐశ్వర్య, భ్రమరాబం

రాకేష్ డబ్బులు ఇవ్వాలని బెదిరించడంతో ఐశ్వర్య ఏం చేయాలో తెలియక కంగారు పడుతుంది. ఇంతలో రేఖ తీసుకొచ్చిన నెక్లెస్ గుర్తొస్తుంది. ఆ నెక్లెస్ తన కోసమే తెచ్చింది కాబట్టి....తను అమ్ముకోవడం కాదనుకుంటుంది. అందుకే అది అమ్మేసి రాకేష్ అప్పు తీర్చేయాలనుకుంటుంది. ఇంతలో రేఖ తన గదికి వెళ్లడం చూసి...ఐశ్వర్య కూడా వెళ్తుంది. రేఖ తన లాకర్‍లో నెక్లెస్ పెట్టడం చూస్తుంది. ఐశ్వర్య నక్కి నక్కి చూస్తుండగా భ్రమరాంబ కనిపెడుతుంది. రేఖ గదిలోకి ఎందుకిలా చూస్తోందని అనుకుంటుంది. ఇక రేఖ వెళ్లిపోగా ఆ నెక్లెస్ ఐశ్వర్య తీసుకుని వెళ్లిపోతుంది. ఇది చూసిన భ్రమరాంబ...సొంత మేనకోడలే దొంగతనం చేస్తుంటే మన చేతివాటం కూడా ప్రదర్శించాలని అనుకుంటుంది. ఐశ్వర్య వెళ్లిపోగానే భ్రమరాంబ కూడా వెళ్లి మరో నెక్లెస్ ఎత్తుకెళ్లిపోతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మళ్లీ జాబ్ రాక అసంతృప్తిలో ఇందు
Image Credit : jio hotstar

మళ్లీ జాబ్ రాక అసంతృప్తిలో ఇందు

ఇక మరోవైపు ఇందు ఇంటర్వ్యూకు వెళ్తుంది. అక్కడ HR తలతిక్కగా మాట్లాడుతుంటాడు. జాబ్ కోసం వస్తే ఇలా గందరగోళంగా మాట్లాడుతున్నారని ఇందు కంగారుపడుతుంది. చివరకు ఈ HR తిక్క కుదుర్చుతుంది ఇందు. నీ ధైర్యం, స్మార్ట్ నెస్ నాకు నచ్చాయి...ఈ జాబ్ నీకు వస్తుందని HR అంటాడు. ఇందు సర్టిఫికేట్స్ చూస్తాడు. డిగ్రీ సర్టిఫికేట్ ఏదని అడుగుతాడు. ఇప్పుడే కంప్లీట్ అయింది, కొన్ని రోజుల్లో సర్టిఫికేట్ వస్తుందని ఇందు చెప్తుంది. అలా అయితే జాబ్ ఇవ్వలేం, నీకు సర్టిఫికేట్ వచ్చి నువ్వు తెచ్చి ఇస్తే అప్పుడు నీకు జాబ్ పక్కా ఇస్తానని HR చెప్తాడు. ఇందు అసంతృప్తితో అక్కడినుంచి వెళ్లిపోతుంది. 

36
ఐశ్వర్యను కారులో ఎక్కించుకున్న లక్కీ
Image Credit : jio hotstar

ఐశ్వర్యను కారులో ఎక్కించుకున్న లక్కీ

ఐశ్వర్య కారు ఆగిపోయి రోడ్ పై నిల్చుని ఉంటుంది. అటువైపు కారులో లక్కీ, రాజ్ వెళ్తుంటారు. రిచ్ అమ్మాయిల కోసం యాప్స్ లో వెతుకుతుంటారు. ఇంతలో రోడ్‍పై ఉన్న ఐశ్వర్యను చూసి లిఫ్ట్ ఇస్తారు. అప్పటికీ రాజ్ వద్దని చెప్పినా వినిపించుకోడు. లక్కీ కారు ఎక్కిస్తుండగా ఇందు చూస్తుంది. మళ్లీ ఏం పెంట తీసుకొస్తుందని అనుకుని....ఆ కారను ఫాలో అవుతుంది. 

46
ఇద్దరు దొంగలను చితకబాదిన ఇందు, నందు
Image Credit : jio hotstar

ఇద్దరు దొంగలను చితకబాదిన ఇందు, నందు

ఇంతలో ఇద్దరు దొంగలను తరుముకుంటూ వస్తుంది నందు. ఇందు వచ్చిన ఆటోకు ఎదురుపడతారు. ఆ దొంగ నందును కొట్టేందుకు ప్రయత్నిస్తుండగా ఇందు అడ్డుకుని వారిని చితకబాదుతుంది. ఎక్కడ కలిశామో గుర్తుకుతెచ్చుకుంటారు. ఆ రోజు పోలీస్ స్టేషన్‍లో ఎదురుపడ్డామని అనుకుంటారు. దొంగలు మీ వెనుక పడుతున్నారేంటీ అని ఇందు అడిగితే...నేనే వాళ్ల వెంట పడ్డానని నందు చెప్తుంది. అమ్మవారి నగలు దొంగిలించి పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారని, అందుకే నేను పట్టుకోవాల్సి వచ్చిందని నందు చెప్తుంది. ఆ దొంగలు ఎక్కడ నగలు పెట్టారో తెలుసుకుందాం, అందుకు మీరు హెల్ప్ చేయాలని నందు అడుగుతుంది. సరే అంటుంది ఇందు. అమ్మవారి నగలు ఎక్కడ దాచారు, ఎవరికి అమ్మేసారని దొంగలను అడుగుతుంది. గోల్డ్ షాపులో అమ్మేసామని దొంగలు చెప్పడంతో వారిని అక్కడికి తీసుకెళ్తుంది.

56
కనిపించకుండా పోయిన నెక్లెస్
Image Credit : jio hotstar

కనిపించకుండా పోయిన నెక్లెస్

కారులో ఉన్న ఐశ్వర్య బుర్ర తింటాడు లక్కీ. నీ అడ్రస్ ఏంటీ, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అంటూ విసిగిస్తాడు. ఇక్కడ కారు ఆపు, నేను దిగాల్సిన ప్లేస్ వచ్చిందని ఐశ్వర్య చెప్పి దిగిపోతుంది. అప్పుడు కూడా పిచ్చి పిచ్చి ప్రశ్నలతో లక్కీ ఐశ్వర్యకు చికాకు తెప్పిస్తాడు. ఐశ్వర్య మార్వాడీ షాప్ దగ్గరికి వచ్చి బ్యాగు ఓపెన్ చేస్తే అందులో నెక్లెస్ కనిపించదు. ఎక్కడ పోయిందని అనుకుంటుంది. ఇంట్లో దొంగనయ్యా...ఇప్పుడు ఈ రాకేష్ అప్పు తీర్చేద్దామనుకుంటా ఇలా అయిందేంటీ టెన్షన్ పడుతుంది.

66
కారులో ఉన్న నెక్లెస్ చూసి సంతోషంలో రాజ్, లక్కీ
Image Credit : jio hotstar

కారులో ఉన్న నెక్లెస్ చూసి సంతోషంలో రాజ్, లక్కీ

దాహం వేస్తుందని ఓ షాప్ దగ్గర ఆగుతారు లక్కీ, రాజ్. డ్రింక్ తాగుతూ మాట్లాడుకుంటారు. ఇంతలో కారులో ఐశ్వర్య పడేసుకున్న నెక్లెస్ కనిపిస్తుంది. నెక్లెస్ దొరికిందని తెగ సంబరపడిపోతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Recommended image2
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో క్రేజీ లవ్‌ ట్రాక్‌.. వర్కౌట్‌ అయితే టీఆర్‌పీ బ్లాస్టే
Recommended image3
Chaitra Rai Remuneration: ఐదు రోజులకు చైత్ర రాయ్‌ ఎంత పారితోషికం అందుకుందో తెలుసా?.. ఆ భ్రమలకు ఫుల్‌ స్టాప్‌
Related Stories
Recommended image1
Brahmamudi Serial Today Episode: ఒట్టు వేయించుకున్న ఇందు, అపర్ణను రెచ్చగొట్టేలా మాట్లాడిన భ్రమరాంబ
Recommended image2
Brahmamudi Serial Today Episode: ఇందును అవమానిస్తూ కాళ్ల కింద పెట్టుకున్న రేఖ, నెక్లెస్ కొట్టేయాలని ఐశ్వర్య ప్లాన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved