MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • TV
  • Brahmamudi Serial Today Episode: ఇందును అవమానిస్తూ కాళ్ల కింద పెట్టుకున్న రేఖ, నెక్లెస్ కొట్టేయాలని ఐశ్వర్య ప్లాన్

Brahmamudi Serial Today Episode: ఇందును అవమానిస్తూ కాళ్ల కింద పెట్టుకున్న రేఖ, నెక్లెస్ కొట్టేయాలని ఐశ్వర్య ప్లాన్

Brahmamudi Serial Today Episode: బ్రహ్మముడి ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. ఇందును తన కాళ్ల కింద పడేలా చేస్తుంది రేఖ. వ్యాన్ తగలబడిన కల రావడంతో ఉలిక్కిపడతాడు రాజ్. మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో చూసేద్దాం. 

4 Min read
Author : Nandini Arava
Published : Mar 24 2026, 10:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
అపర్ణను రెచ్చగొట్టేలా భ్రమరాంబ సూటిపోటిమాటలు
Image Credit : jio hotstar

అపర్ణను రెచ్చగొట్టేలా భ్రమరాంబ సూటిపోటిమాటలు

నైట్ డిన్నర్ టేబుల్ దగ్గర...అపర్ణను రెచ్చగొట్టేలా భ్రమరాంబ నానా మాటలు అంటుంది. ఆ ముసలాడ్ని కాస్త ఇబ్బంది పెట్టేసరికి...వారిద్దరూ కలిసి మనమీద పగ తీర్చుకుంటున్నారని భ్రమరాంబ అంటుంది. వాళ్లకి అంత సీనుందా అని రేఖ అంటే.. మనసులో ఆ ఉద్దేశమున్న నీ ముందు వాళ్ల ఆటలు సాగవులే అని భూషణ్ అంటాడు. కనీసం సాంబార్ అయినా బాగా చేశావా అని అడుగుతుంది రేఖ. అప్పటికే భ్రమరాంబ, రేఖ..ఇందును కింద పడేయాలని ప్లాన్ వేసుంటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
ఇందు మొఖం దగ్గర కాళ్లు పెట్టిన రేఖ
Image Credit : jio hotstar

ఇందు మొఖం దగ్గర కాళ్లు పెట్టిన రేఖ

ఇందు..రేఖకు సాంబార్ వడ్డిస్తుండగా భ్రమరాంబ అడ్డుగా కాలు పెట్టేస్తుంది. దీంతో ఇందు కిందపడిపోతుంది. సాంబార్ వలికి రేఖ మీద పడుతుంది. ఈ కాస్త దూరం కూడా నడవలేవా అంటూ ఇందును తిడుతుంది. సాంబర్ తుడవాలని ఆర్డర్ వేస్తుంది. తర్వాతా క్లీన్ చేస్తానన్న...ఇప్పుడే తుడవాలని రేఖ చెప్తుంది. అప్పటికే అపర్ణ కోపంతో రగిలిపోతుంటే...ఇందు సైగ చేసి కామ్‍గా ఉండమని చెప్తుంది. ఇందు క్లాత్ తెచ్చి శుభ్రం చేస్తుంటే....రేఖ తన కాలు ఇందు మొఖానికి తగిలేలా పెడుతుంది. నువ్వు పెట్టిన భయం బాగానే పనిచేస్తుంది అని భ్రమరాంబ అంటే.. లేకపోతే ప్రాణం పోతుంది కదా అని రేఖ అంటుంది. 

Related Articles

Related image1
Brahmamudi Serial Today Episode: పాపం ఇందును నానా హింసలు పెట్టిన రేఖ, కాళ్లపై పడ్డ అపర్ణ
Related image2
Brahmamudi Serial Today Episode: ఒట్టు వేయించుకున్న ఇందు, అపర్ణను రెచ్చగొట్టేలా మాట్లాడిన భ్రమరాంబ
38
వెంకీ లవ్‍కు హెల్ప్ చేస్తానన్న నందు
Image Credit : jio hotstar

వెంకీ లవ్‍కు హెల్ప్ చేస్తానన్న నందు

మరోవైపు వెంకీ.. నందు దగ్గరకు వస్తాడు. కోపంతో ఊగిపోతుంటాడు. ఏంటీ నీ గర్ల్ ఫ్రెండ్ పబ్‍కు వచ్చిందా, ఇద్దరు కలిసి బాగా డాన్స్ వేశారా అని నందు అడుగుతుంది. చేసిందంతా చేసి ఇప్పుడేమీ జరగనట్లు మళ్లీ నన్ను ఆట పట్టిస్తున్నారని వెంకీ అంటాడు. నేనేం చేశానని నందు అడిగితే...నా చేతులు పట్టుకుని డాన్స్ చేసింది మీకు గుర్తులేదా అని వెంకీ అడుగుతాడు. అయితే ఏంటీ అని నందు అడిగితే...మీరు నాతో డాన్స్ చేయడం నా గర్ల్ ఫ్రెండ్ చూసి, నన్ను కలవకుండా వెళ్లిపోయిందని చెప్తాడు. అసలు నీ గర్ల్ ఫ్రెండ్ పబ్‍కు వచ్చిందా అని నందు అడుగుతుంది. వచ్చింది అంటే...నీకెవరు చెప్పారు అని నందు అంటే మా అన్నయ్య ఫ్రెండ్ ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. మీ అన్న, అతని ఫ్రెండ్ నిన్ను బోల్తా కొట్టి బిల్ కట్టించుకున్నారని నందు అంటుంది. మీరు చేసిన తప్పుకు మా అన్నయ్యను అంటారేంటీ అని వెంకీ అంటాడు. అసలు నీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను లవ్ చేసిందా అని నందు అడుగుతుంది. వెంకీ తనకు జరిగిన ఇన్సిడెంట్స్ చెప్తాడు. అసలు ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుందో లేదో తెలుసుకో అంటుంది. మీరే నా లవ్‍కు హెల్త్ చేయాలని అడుగుతాడు. పబ్‍లో మీకు హెల్ప్ చేశాను కాబట్టి, నాకు కూడా మీరు హెల్ప్ చేయాలని అడుగుతాడు. సరే హెల్ప్ చేస్తా అంటుంది నందు. 

48
ఇంటర్వ్యూ మెయిల్ వచ్చిందనే సంబరంలో ఇందు
Image Credit : jio hotstar

ఇంటర్వ్యూ మెయిల్ వచ్చిందనే సంబరంలో ఇందు

ఇక అక్కడ కిచెన్లో పనులు చేస్తున్న ఇందు దగ్గరకు స్వాతి వస్తుంది. ఏంటీ ఇంకా పడుకోలేదా స్వాతి అని ఇందు అడిగితే...నిద్ర పట్టడం లేదని అంటుంది. నిన్ను అన్నీ మాటలు అంటుంటే నేనే తట్టుకోలేకపోయా...నువ్వెలా ఇలా ఉంటున్నావని స్వాతి అడుగుతుంది. కొత్తగా జరిగిందేం కాదుగా...చిన్నప్పటి నుంచి నా లైఫ్‍లో జరిగేది ఇదేగా అంటుంది ఇందు. కానీ పరిస్థితులు అర్థం చేసుకున్నాక బాధపడినా, కోప్పడినా ప్రయోజనం లేదని తెలుసుకున్నానని ఇందు అంటుంది. ఇంకా ఏన్నేళ్లు ఇలా భరిస్తావని అంటు స్వాతి అడిగితే...తాతయ్య, నాన్నమ్మ లకు ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండేవరకు తప్పదని ఇందు అంటుంది. ఇంతలో ఇందుకు మేసేజ్ వస్తుంది. మనం పంపిన మెయిల్‍కు రిప్లై వచ్చింది, ఇంటర్వ్యూకు పిలిచారని ఇందు చెప్తుంది. నేను అడుగుతున్నదేంటీ, నువ్వు చెప్తున్నదేంటీ, ఇప్పుడు ఈ జాబ్ అవసరమా అని స్వాతి అడుగుతుంది. రేఖను ఎదురించాలంటే నేను కచ్చితంగా జాబ్ చేయాలని ఇందు అంటుంది. 

58
వ్యాన్ కాలిపోతున్న కల రావడంతో ఉలిక్కిపడ్డ రాజ్
Image Credit : jio hotstar

వ్యాన్ కాలిపోతున్న కల రావడంతో ఉలిక్కిపడ్డ రాజ్

వ్యాన్ కాలిపోతున్న కల రావడంతో రాజ్ ఉలిక్కిపడి లేస్తాడు. ఏమైంది వచ్చింది కలేగా ఎందుకింత కంగారుపడుతున్నావని రాజ్ వాళ్లమ్మ అంటుంది. ఆ వ్యాన్ మంటల్లో కాలిపోతున్నట్లు, తాను ఆ మంటల్లో చిక్కుకున్నట్లు వచ్చిందని చెప్తాడు. ఇంకా ఏమైనా జరిగిందా అని వాళ్లమ్మ అడిగితే...ఇంకేం కనిపించలేదని చెప్తాడు. ఇది వింత కాదు, విచిత్రం కాదు...నీ చిన్నతనం నుంచి ఇవే కలలు వస్తున్నాయని వాళ్ల నాన్న అంటాడు. రాజుకు చిన్నప్పటి నుంచి వస్తున్న కలలు...మళ్లీ ఇన్నాళ్లకు రావడమేంటీ అని వాళ్ల అమ్మ అంటుంది. అంటే వాళ్ల వాళ్లు ఎవరైనా వాడికి దగ్గరవుతున్నారా అని వాళ్లమ్మ అంటుంది. 

68
నెక్లెస్ తెప్పించిన రేఖ
Image Credit : jio hotstar

నెక్లెస్ తెప్పించిన రేఖ

ఇందు ఇంటర్య్వూకు వెళ్లాలని ఇందు బయటకొస్తుంది. అప్పటికే హాల్‍లో రేఖ, భ్రమరాంబ ఉంటారు. అప్పుడొక వ్యక్తి వచ్చి రేఖ..ఐశ్వర్య కోసం ఆర్డర్ పెట్టిన నెక్లెస్ వస్తుంది. అది భ్రమరాంబ తీసుకుంటుంది. ఇంతలో రేఖ సీరియస్‍గా చూస్తుంటే..వెంటనే రేఖకు ఇచ్చేస్తుంది. అప్పుడే ఐశ్వర్య రాగానే ఆ నెక్లెస్ చూపిస్తుంది రేఖ. రూ.10లక్షలు అయిందని చెప్తుంది భ్రమరాంబ. నెక్లెస్ చాలా బాగుందని చూసి ఐశ్వర్య వెళ్లిపోతుంది. అన్నీ నీ మేనకోడలికే బంగారం, నా కూతురికి ఏం లేదా అని భ్రమరాంబ అడుగుతుంది. ఐశ్వర్య అంటే చదువు కంప్లీట్ చేస్తుందని నాకు నమ్మకం లేదు, అందుకే పెళ్లి చేసేద్దామని అనుకుంటున్నా అని రేఖ అంటుంది. నా కూతురు విషయానికి వచ్చేసరికి దీనికి అన్నీ గుర్తొస్తాయి అంటుంది.  

అక్కడే ఉన్న ఇందును నీక్కూడా ఇలాంటి నెక్లెస్ కావాలా అని రేఖ అడుగుతుంది. ఏంటీ దీని ముఖానికి బంగారమే ఎక్కువ, ఇలాంటి నెక్లెస్ కూడా చేయించాలా అని భ్రమరాంబ అంటుంది. ఏంటీ ఇక్కడే ఉన్నావ్, శివరాం ఇంటికి వెళ్లలేదా అని రేఖ అడుగుతుంది. మిమ్మల్ని అడిగివెళ్దామని ఉన్నా అని ఇందు అంటుంది. ఈ ఇందును చూస్తుంటే నీకేం అనిపించడం లేదా అని భ్రమరాంబ అనుమానిస్తుంది. నీకేమని అనిపిస్తుంది రేఖ అంటే..ఇలా వంటకు వెళ్లేటప్పుడు కూడా ఇంత ఆనందంగా వెళ్లడమేంటని భ్రమరాంబ పుల్లలు పెడుతుంది. అందుకే రోజూ ఏదో ఒక వంక పెట్టుకుని శివరాంతో మాట్లాడుతున్నానని రేఖ అంటుంది. 

78
ఆస్తి విషయంలో వట్టి చేతులతో మిగిలిపోతావ్ అని వార్న్ చేసిన శేషం
Image Credit : jio hotstar

ఆస్తి విషయంలో వట్టి చేతులతో మిగిలిపోతావ్ అని వార్న్ చేసిన శేషం

ఏంటీ నీ కూతురికి కూడా నెక్లెస్ చేయిస్తుందని తెగ సంబరపడ్డావ్, ఇప్పుడేంటీ మొండిచేతులతో కూర్చున్నావ్ అని శేషం అంటే...తొందరేందుకు స్వాతి పెళ్లికి ఇంకా టైం ఉందిగా అని భ్రమరాంబ అంటే...నిన్ను బాగానే పిచ్చిదాన్ని చేసింది, చూస్తూ ఉండూ ఆస్తి విషయంలో కూడా నువ్వు వట్టి చేతులతో మిగిలిపోతావ్ అని అంటాడు.

88
డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసిన రాకేష్
Image Credit : jio hotstar

డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసిన రాకేష్

ఇంతలో ఐశ్వర్యకు అప్పు ఇచ్చిన ఫ్రెండ్ రాకేష్ ఫోన్ చేస్తాడు. డబ్బులు ఎప్పుడు ఇస్తావ్ అని రాకేష్ అడిగితే...తప్పకుండా ఇచ్చేస్తాను, కొన్నిరోజులు టైం ఇవ్వు అని అడుగుతుంది ఐశ్వర్య. ఈరోజులోగా డబ్బు ఇవ్వకపోతే మీ ఆంటీని అడగాల్సి వస్తుందని వార్నింగ్ చేస్తాడు. ఇంతలో ఎలా డబ్బు తేవాలని ఐశ్వర్య ఆలోచిస్తుంటే...రేఖ కొన్న నెక్లెస్ గుర్తొస్తుంది. అది నాకోసమే కొన్నది కాబట్టి...నా అవసరాలకు అమ్ముకుంటే తప్పులేదని అనుకుంటుంది. ఇంతలో ఏపిసోడ్ ముగుస్తుంది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Related Stories
Recommended image1
Brahmamudi Serial Today Episode: పాపం ఇందును నానా హింసలు పెట్టిన రేఖ, కాళ్లపై పడ్డ అపర్ణ
Recommended image2
Brahmamudi Serial Today Episode: ఒట్టు వేయించుకున్న ఇందు, అపర్ణను రెచ్చగొట్టేలా మాట్లాడిన భ్రమరాంబ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved