Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Bigg Boss 9: బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ ఫినాలే జరుగుతోంది. ఆదివారం ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ టీవీలో టెలికాస్ట్ కానుంది. కానీ.. దీనికి సంబంధించిన లీక్స్ మత్రం బయటకు వచ్చేస్తున్నాయి. 5వ స్థానంలో సంజన ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చింది

Bigg Boss Finale Update
బిగ్ బాస్ తెలుగు సీజన్ చివరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం గ్రాండ్ ఫినాలే షూటింగ్ జరుగుతోంది. ఈ ఎపిసోడ్ మనకు ఆదివారం సాయంత్రం నుంచి టెలికాస్ట్ అవుతుంది. అయితే... ముందుగానే లీక్స్ బయటకు వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ సంజన గల్రానీ.. 5వ స్థానంలో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాలుగో స్థానంలో ఎవరు బయటకు వచ్చారో కూడా తెలిసిపోయింది.
సీజన్ మొత్తం నడిపించిన ఇమ్మూ..
మొదట నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఆయన తర్వాత సీజన్ ఓల్డ్ కంటెస్టులు కూడా ఎంట్రీ ఇచ్చారు. వారి డ్యాన్సులు , పలకరింపుల తర్వాత... సంజన ఎలిమినేషన్ పూర్తి అయ్యింది. ఆ తర్వాత.. డైరెక్టర్ అనిల్ రావి పూడి.. సూట్ కేసు తో హౌస్ లోకి వెళ్లినట్లు సమాచారం. ఆయన హౌస్ లోని కంటెస్ట్ లకు దాదాపు రూ.15 లక్షల వరకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే..ఆ డబ్బులు తీసుకోవడానికి ఎవరూ అంగీకరించలేదని సమాచారం. చివరకు అనిల్ రావి పూడి చాలా సేపటి తర్వాత ఇమ్మాన్యుయల్ ని ఎలిమినేట్ చేసి... బయటకు తీసుకువచ్చారని సమాచారం బయటకు వచ్చింది.
నిజానికి... ఇమ్మాన్యుయల్ టైటిల్ విన్నర్ అవ్వాలనే ఈ సీజన్ కి ఎంట్రీ ఇచ్చారు. విన్నర్ అవ్వాలని అనుకోవడమే కాదు... అందుకోసం చాలా కష్టపడ్డాడు. సీజన్ మొత్తాన్ని చాలా వరకు తన భుజాలపై మోసుకొచ్చాడు. ఇమ్యూ కామెడీ కూడా లేకపోతే.. ఈ సీజన్ కి కనీస గుర్తింపు కూడా వచ్చేది కాదు అనే చెప్పాలి. ఇమ్మూ అంత కష్టపడినా.. విన్నర్ కాలేకపోయాడు. విన్నర్ కావడం పక్కన పెడితే టాప్ 3 లో కూడా చోటు దక్కించుకోలేదు. కమెడియన్స్ ని విన్నర్ చేయరు అని ఆడియన్స్ మరోసారి నిరూపించారు.
టాప్ 3 లోకి డీమాన్ పవన్...
ఇమ్మాన్యుయల్ 4 వస్థానంలో ఎలిమినేట్ అయ్యాడనే వార్త బయటకు రావడంతో..డీమాన్ పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. డీమాన్ టాప్ 3 కి కూడా రాకుండా చేయాలని చాలా మంది ప్రయత్నించారు. అసలు డీమాన్ కి ఓట్లు వేయద్దంటూ కొందరు క్యాంపైన్లు కూడా చేయడం గమనార్హం. ఇంత నెగిటివ్ చేసినా కూడా.. డీమాన్ పవన్ తట్టుకొని టాప్ 3 కి చేరుకోవడం చాలా గొప్ప విషయం. టాప్ 3 కి అయితే చేరుకున్నాడు కానీ.. టైటిల్ మాత్రం కళ్యాణ్ కానీ, తనూజకీ కానీ దక్కే అవకాశం ఉంది. వీరిద్దరిలో విజేత ఎవరో తెలియాలంటే మాత్రం రేపటి వరకు ఆగాల్సిందే.

