- Home
- Entertainment
- TV
- Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్సే టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్సే టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
Bigg Boss Telugu 9: బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ కి సూట్ కేసు ఇచ్చి వారిని ఆకర్షించే సంప్రదాయం ఉంది. సీజన్ 1 నుంచి ఇది నడుస్తోంది. సీజన్ 4లో సోహెల్ సూట్ కేసు తీసుకోగా, ఓటీటీలో అరియానా తీసుకుంది.ఆ తర్వాత ఆ ఛాన్స్ ఇంకెవరూ తీసుకోలేదు.

బిగ్ బాస్ తెలుగు ఫినాలే..
తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న రియాల్టీ షో బిగ్ బాస్. ప్రస్తుం సీజన్ 9 నడుస్తోంది. ఈ సీజన్ కూడా రేపటి తో ముగియనుంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ జరుగుతోంది. దీంతో.. విన్నర్ ఎవరు అవుతారా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. విన్నర్ ఎవరు అనే విషయం ఆదివారం రాత్రి లైవ్ లో ప్రకటించే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం, సంజన టాప్ 5 పొజిషన్ లో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. సంజనా ఎలిమినేట్ అయిన తర్వాత... టాప్ 4 లో ఉన్న నలుగురికి సూట్ కేస్ ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే... ఎక్కువగా కామనర్స్ ఇద్దరినే ఎక్కువగా టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మొదట రూ.15లక్షలతో మొదలై రూ.25 లక్షల వరకు ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
తనూజ, ఇమ్మాన్యుయల్ నో ఛాన్స్...
ఇప్పుడు ఈ సూట్ కేసు ఎవరు తీసుకుంటారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. మొదట తనూజ విషయానికి వస్తే.. ఆమె కచ్చితంగా ఆ సూట్ కేసు తీసుకోదు. ఎందుకంటే... తాను విన్నర్ రేసులో ఉన్నాను అనే విషయం తనూజకు తెలుసు. మొదటి లేడీ విన్నర్ కావాలనే కోరిక కూడా ఉంది. అందుకే ఆమె... మధ్యలోనే ఆ డబ్బు తీసుకొని ఎలిమినేట్ అవ్వాలని అనుకోదు.
ఇక ఇమ్మాన్యుయల్ విషయానికి వస్తే... తను కూడా పొరపాటున కూడా సూట్ కేసు తీసుకోడు. ఎందుకంటే.. ఇమ్మాన్యుయల్ కూడా తాను విన్నింగ్ రేసులో ఉన్నాను అనుకుంటున్నాడు. ఎందుకంటే.. ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి... అందరూ ఇమ్మూని టాప్ లో ఉన్నావని చెబుతూ వచ్చారు. పొగిడిన వాళ్లే తప్ప... విన్నర్ రేసులో లేవు అనే హింట్ ఇవ్వలేదు. ఒక కమెడియన్ విన్నర్ కావాలి అనే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి.. సూట్ కేసు తీసుకునే అవకాశాలు లేవు.
ఇద్దరు కామనర్సే టార్గెట్...
ఇక.. మిగిలింది హౌస్ లో ఉన్న ఇద్దరు కామనర్స్. వాళ్లే డీమాన్ పవన్, పవన్ కళ్యాణ్. వీరిలో కళ్యాణ్ కి విన్నింగ్ ఛాన్స్ ఉంది. కానీ ఆ విషయం కళ్యాణ్ కి తెలిసే అవకాశం లేదు. ఇక.. డీమాన్ పవన్ కి కూడా తాను విన్నర్ అవుతాను అనే నమ్మకం లేదు. కాబట్టి... వీరిద్దరిలోనే ఎవరో ఒకరు సూట్ కేసు తీసుకునే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. డీమాన్ కనుక ఆ సూట్ కేసు తీసుకుంటే... అతనికి న్యాయం జరిగినట్లే. ఈ సీజన్ లో సూపర్ గా గేమ్ ఆడిన వారిలో డీమాన్ పవన్ ముందు వరసలో ఉంటాడు. కానీ.. సరైన ఎలివేషన్ రాక.. విన్నర్ రేసులో లేడు. కనీసం డీమాన్ సూట్ కేసు అయినా తెచ్చుకుంటే బాగుండు అని అతని అభిమానులు కోరుకుంటారు. కానీ.. డీమాన్ కాకుండా...కళ్యాణ్ పడాలా తీసుకుంటే మాత్రం ఆయన అభిమానులు కచ్చితంగా షాక్ అవుతారు. మరి, వీరిద్దరిలో ఎవరు ఆ సూట్ కేసు గెలుచుకుంటారు..? లేదా అభిమానుల ఓటింగ్ నే నమ్ముకుంటారో చూడాలి.

