MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • TV
  • ఇళయరాజాను ఒక్క ఓటుతో ఓడించిన ఎఆర్ రెహమాన్

ఇళయరాజాను ఒక్క ఓటుతో ఓడించిన ఎఆర్ రెహమాన్

ఒక్క ఓటు తేడాతో ఇళయరాజాను ఓడించి ఏ.ఆర్.రెహమాన్ జాతీయ అవార్డు గెలుచుకున్న ఆసక్తికర సంఘటన గురించి మీకు తెలుసా? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 14 2025, 04:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇళయరాజాను ఓడించిన రెహమాన్
Image Credit : our own

ఇళయరాజాను ఓడించిన రెహమాన్

సినిమా ప్రముఖులకు గుర్తింపునిచ్చేవి అవార్డులే. అందులోనూ భారతీయ సినీ ప్రముఖులు అందరూ గెలుచుకోవాలని కలలు కనేే  అవార్డు ఏదైనా ఉందంటే.. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జాతీయ అవార్డు. ఇంతటి విలువైన ఈ జాతీయ అవార్డును ఒక్కసారి కూడా గెలుచుకోని దిగ్గజాలు కూడా చాలా మంది ఉన్నారు. 

ముఖ్యంగా చిరంజీవి, రజనీకాంత్ లాంటి  స్టార్స్ కూడా ఇంత వరకూ  ఒక్క జాతీయ అవార్డు కూడా గెలుచుకోలేదు. హీరోలు మాత్రమే కాదు దర్శకులు, సంగీత దర్శకుల్లో కూడా చాలామంది దిగ్గజాలు ఈ అవార్డ్ ను అందుకోలేదు. ఇక ఇప్పటి వరకు  సంగీత ప్రపంచంలో   అత్యధిక జాతీయ అవార్డులు గెలుచుకున్న సంగీత దర్శకులు ఇద్దరే. ఒకరు ఇళయరాజా, మరొకరు ఏ.ఆర్.రెహమాన్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇళయరాజా vs ఏ.ఆర్.రెహమాన్
Image Credit : our own

ఇళయరాజా vs ఏ.ఆర్.రెహమాన్

ఇళయరాజా ఇప్పటివరకు 5 సార్లు, ఏ.ఆర్.రెహమాన్ 7 సార్లు జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. ఏ.ఆర్.రెహమాన్ గెలుచుకున్న తొలి జాతీయ అవార్డు వెనుక ఒక చిన్న కథ ఉంది. ఏ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడిగా పరిచయమైన సినిమా రోజా. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. 

చేసిన మొదటి సినిమాకే జాతీయ అవార్డ్ అందుకున్నారు రెహమాన్. ఈ  చిత్రంలోని అన్ని పాటలూ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అప్పటి వరకు ఇళయరాజాపైనే ఆధారపడిన దర్శకులకు రోజా చిత్రం ద్వారా కొత్త దారి చూపించారు ఏ.ఆర్.రెహమాన్.

Related Articles

Related image1
నయనతార ఎంతో ఇష్టంగా చూసే టీవీ సీరియల్ ఏంటో తెలుసా?
Related image2
6 నెలల్లో 3 డిజాస్టర్లు, త్రిష కు తలనొప్పిగా మారిన వరుస ఫ్లాపులు
34
జాతీయ అవార్డు కోసం రెహమాన్ తో పోటీ పడ్డ ఇళయరాజా
Image Credit : X

జాతీయ అవార్డు కోసం రెహమాన్ తో పోటీ పడ్డ ఇళయరాజా

రోజా చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ జాతీయ అవార్డుకు నామినేట్ అయిన సమయంలోనే ఇళయరాజా సంగీతం అందించిన క్లాసిక్ మూవీ దేవర్ మగన్ కూడా పోటీలో ఉంది. రెండు సినిమాలు పాటల పరంగా సూపర్ హిట్ అయ్యాయి.   దీంతో ఎవరికి జాతీయ అవార్డు ఇవ్వాలనేది నిర్ణయించాల్సిన జ్యూరీ సభ్యులు కూడా తికమక పడ్డారు.

44
ఒక్క ఓటు తేడాతో జాతీయ అవార్డును కోల్పోయిన ఇళయరాజా
Image Credit : Google

ఒక్క ఓటు తేడాతో జాతీయ అవార్డును కోల్పోయిన ఇళయరాజా

ఇందులో జ్యూరీ సభ్యులు రెండు సినిమాలకు  చెరో 6 ఓట్లు వేశారట. చివరగా విజేతను నిర్ణయించే ఒక ఓటును అప్పటి జ్యూరీ సభ్యుడైన ప్రముఖ దర్శకుడు బాలు మహేంద్ర వేయాల్సి వచ్చింది. ఆ ఒక్క ఓటును ఆయన ఏ.ఆర్.రెహమాన్‌కు వేయడంతో, ఒక్క ఓటు తేడాతో ఇళయరాజా జాతీయ అవార్డును కోల్పోయారు. ఈ విషయాన్ని బాలు మహేంద్ర ఒక పాత ఇంటర్వ్యూలో చెప్పారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Related Stories
Recommended image1
నయనతార ఎంతో ఇష్టంగా చూసే టీవీ సీరియల్ ఏంటో తెలుసా?
Recommended image2
6 నెలల్లో 3 డిజాస్టర్లు, త్రిష కు తలనొప్పిగా మారిన వరుస ఫ్లాపులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved