6 నెలల్లో 3 డిజాస్టర్లు, త్రిష కు తలనొప్పిగా మారిన వరుస ఫ్లాపులు
ఈమధ్య హీరోయిన్ త్రిషకు సినిమాలు కలిసిరావడంలేదు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో భారీ రెమ్యునరేషన్ తీసుకునే ఈ హీరోయిన్, రీ ఎంట్రీలో దూసుకుపోతుంది అనుకుంటే.. హ్యాట్రిక్ ప్లాపులతో ఇబ్బందుల్లో పడింది.

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది త్రిష. 25 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తుంది. 42 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల అమ్మాయిలా మెరిసిపోతుంది. దీంతో త్రిషకు సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ ఏడాది 6 నెలల్లో త్రిష నటించిన నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో గుడ్ బ్యాడ్ అగ్లీ తప్ప మిగిలిన మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి.
అందులో మొదటి సినిమా ఐడెంటిటీ. మలయాళ సినిమాలో టొవినో థామస్‌కు జంటగా నటించారు త్రిష. ఈ సినిమా ఈ ఏడాది జనవరి మొదటి వారంలో విడుదలైంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఐడెంటిటీ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత అజిత్‌కు జంటగా త్రిషా నటించిన విడాముయర్చి ఫిబ్రవరిలో విడుదలై డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాకు మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు.
ఇక త్రిష నటించిన మూడో ఫ్లాప్ సినిమా థగ్ లైఫ్. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమల్ హాసన్ కి జంటగా త్రిష నటించారు . ఆమె పాత్ర తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. అంతేకాకుండా ఈ సినిమాలో త్రిష నటించిన చాలా సన్నివేశాలు తొలగించారని మరో వివాదం చెలరేగింది. దీంతో త్రిష కూడా అప్ సెట్ అయినట్టు తెలుస్తోంది. ఇక థగ్ లైఫ్ విడుదలైన వారంలోనే జనాలు లేక థియేటర్లు ఖాళీ అయ్యాయి.
ఆరు నెలల్లో మూడు ఫ్లాప్‌లను చవిచూసిన త్రిష, తర్వాత సూర్య 45 సినిమాలో నటిస్తోంది. ఆర్.జె.బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సూర్యకు జంటగా నటిస్తున్నారు త్రిష. ఈ సినిమా అక్టోబర్‌లో దీపావళి కానుకగా విడుదల కానుంది. సూర్య కూడా కంగువ, రెట్రో వంటి వరుస ఫ్లాప్‌లను చూశారు. దీంతో ఇద్దరూ సూర్య 45 సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు.