- Home
- Entertainment
- TV
- షారుఖ్ ఖాన్ తో సినిమాను రిజెక్ట్ చేసిన ముగ్గురు హీరోయిన్లు ఎవరో తెలుసా? కారణం ఏంటి?
షారుఖ్ ఖాన్ తో సినిమాను రిజెక్ట్ చేసిన ముగ్గురు హీరోయిన్లు ఎవరో తెలుసా? కారణం ఏంటి?
షారుఖ్ ఖాన్ నవంబర్ 2, 2025న 60 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నారు. ఇండస్ట్రీలో ప్రతి హీరోయిన్ షారుఖ్‌తో పనిచేయాలనుకుంటుంది, ఓ ముగ్గరు హీరోయిన్లు మాత్రం ఆయనతో జతకట్టడానికి ఇష్టపడలేదని సమాచారం. ఇంతకీ ఎవరా ముగ్గురు బ్యూటీస్

60 లోకి షారుఖ్ ఖాన్ ఎంట్రీ
షారుఖ్ ఖాన్ నవంబర్ 2న 60వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ ఏజ్ లో కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ.. ఫిట్ గా మెంటేన్ చేస్తున్నారు షారుఖ్. యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా తగ్గేది లేదంటున్నారు. ఇప్పటికీ ఆయన బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. గత 30 ఏళ్లలో ఆయన స్టార్‌డమ్ తగ్గలేదు.
కింగ్ ఆఫ్ రొమాన్స్
షారుఖ్ ఖాన్‌ను కింగ్ ఆఫ్ రొమాన్స్ అంటారు. ఆయనకు 60 ఏళ్లు వస్తున్నా, రొమాంటిక్ సీన్లలో యువకుడిలాగే కనిపిస్తారు. సిక్స్ ప్యాక్ చూపిస్తూ.. రొమాంటిక్ లుక్ లో మెరిసిపోతుంటారు బాద్ షా. షారుఖ్ ఖాన్ తో సినిమా అంటే ఎవరైనా ఎగిరి గంతేసి ఒప్పుకోవలసిందే.. కానీ కానీ కొందరు హీరోయిన్లు మాత్రం కింగ్ ఖాన్‌తో నటించడానికి నిరాకరించారు.
ముగ్గురు ఖాన్ లకు దూరంగా కంగనా
షారుఖ్ సినిమాను రిజెక్ట్ చేసిన వారిలో కంగనా రనౌత్ కూడా ఒకరు. ముక్కుసూటితనానికి ఫేమస్ ఈ హీరోయిన్. ఎంత పెద్దవారైనా.. ముఖం మీదే ఉన్నది ఉన్నట్టు చెపుతుంది. బాలీవుడ్‌పై తరచూ విమర్శలు చేస్తుంటుంది కంగన. ఈక్రమంలో షారుఖ్ ఖాన్‌తో పనిచేయడానికి ఆమె నిరాకరించారు. షారుఖ్ మాత్రమే కాదు..బాలీవుడ్ లోని ముగ్గురు ఖాన్‌లతో ఆమె ఏ సినిమా చేయలేదు.
జంట బాగోేదు అనిపించి..
షారుఖ్ తో సినిమాకు నో అన్న హీరోయిన్లలో అమిషా పటేల్ కూడా ఉన్నారు. 'కహో నా ప్యార్ హై'తో అరంగేట్రం చేసిన ఈ నటికి షారుఖ్ ఖాన్‌తో తన ఆన్-స్క్రీన్ జోడీ సెట్ కాదని అనిపించిందట. అందుకే కింగ్ ఖాన్‌తో ఆమె ఏ సినిమా చేయలేదని సమాచారం.
వయసు తేడా వల్ల
అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్‌కు కూడా షారుఖ్ ఖాన్‌తో తన జోడీ సరిపోదని అనిపించిందట. స్క్రీన్‌పై వయసు తేడా స్పష్టంగా కనిపిస్తుందని, అందుకే ఆమె షారుఖ్‌తో సినిమా చేయడానికి ఆసక్తి చూపలేదు. ఇలా ముగ్గురు హీరోయిన్లు షారుఖ్ ఖాన్ తో సినిమా చేయడానకిి ఆసక్తి చూపించలేదు.