- Home
- Entertainment
- Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?
Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే సందడి స్టార్ట్ అయ్యింది. టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒక్కొక్కిరగా ఎలిమినేట్ చేస్తూ.. ఫైనల్ ఎపిసోడ్ కు విన్నర్, రన్నర్ ను తేల్చబోతున్నారు. ఈరేసులో టాప్ 5 నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసి బయటు పంపించినట్టు తెలుస్తోంది.

బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలే
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కు ఎండ్ కార్డు పడబోతోంది. గ్రాండ్ ఫినాలే ఆఫ్ లైన్ ఈవెంట్ చాలా వరకు కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. దాంతో ఆడియన్స్ లో ఉత్కంఠ మరింత పెరిగింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఉండగా.. వారిలో ఎవరు బయటకు వెళ్తారు.. ఎవరు విన్నర్, రన్నర్ అవుతారన్న ఉత్కంఠ పెరిగిపోతోంది. టాప్ 5 లో ఇమ్మాన్యుయేల్, తనూజ, సంజన, కళ్యాణ్, డీమన్ పవన్ ఉన్నారు. ఫైనల్ ఎపిసోడ్‌లో సీజన్ విన్నర్ ఎవరో అధికారికంగా ప్రకటించనున్నారు. అంతకు ముందే టాప్ 5 నుంచి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తూ చివరకు ఇద్దరిని ఫైనల్‌కు పంపించనున్నారు.
సంజన ఎలిమినేట్..
బిగ్ బాస్ హౌస్ లో ఉన్న టాప్ 5 నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ జరిగినట్లు సమాచారం తెలుస్తోంది. సంజన టాప్ 5 లో చివరి కంటెస్టెంట్ గా ఉండటం వల్ల.. ముందుగా సంజనను బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు. ఆమె ఎలిమినేషన్‌తో ప్రస్తుతం హౌస్‌లో నలుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలి ఉన్నారు. వారిలో కళ్యాణ్, తనూజ, డీమన్ పవన్, ఇమ్మాన్యుయేల్.మిగిలిన నలుగురిలో కళ్యాణ్ , తనూజ విన్నర్ రేస్‌లో ఉన్నట్లు టాక్ ఇక డీమన్ పవన్, ఇమ్మాన్యుయేల్ ఇద్దరికీ భారీ మనీ ప్రైజ్ తో కూడిన సూట్ కేస్ ఆఫర్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
రేసులో డీమాన్ పవన్ ఉంటాడా?
ఈ వీక్ అద్భుతంగా ఆడి.. విన్నర్ రేస్ లోకి వచ్చిన డీమాన్ పవన్.. రేసులో ఉంటాడా లేక.. మూడో ప్లస్ కే పరిమితం అవుతాడా అని ఆడియన్స్ లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇమ్మాన్యుయల్ కు సూట్ కేస్ ఆఫర్ వస్తే.. అతను అది తీసుకుని బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒక వేళ కళ్యాణ్ పడాల, పవన్ కు మధ్య పోటీ ఉంటే.. పవన్ రన్నర్ గా నిలిచే అవకాశం ఉంది. కానీ కళ్యాణ్ , తనూజ మధ్య మాత్రమే ఫైనల్ పోరు జరగబోతున్నట్టు టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇక సంజనా బయటకు వెళ్లిన తరువాత హౌస్ నుంచి బయటకు వచ్చే నెక్ట్స్ కంటెస్టెంట్ ఇమ్మాన్యుయెల్ అని తెలుస్తోంది. లాస్ట్ వీక్ వరకూ టాప్ 3 లో ఇమ్ము ఉండగా.. ఈ వారం ఆ ప్లేస్ ను డీమాన్ పవన్ సంపాదించాడు.
దూసుకొచ్చిన పవన్ కళ్యాన్ పడాల
కామనర్‌గా బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన కళ్యాణ్, తన ఆటతీరుతో, యాటీట్యూడ్ తో అందరిని ఆకట్టుకున్నాడు. బయట సహజంగానే అతనికి భారీగా అభిమాన సంఘాలు తయారయ్యాయి. ప్రతీ సారి తన ట్యాలెంట్ చూపిస్తూ.. ప్లానింగ్ ను మార్చుకుంటూ.. టాస్కుల్లో రెచ్చిపోయాడు కళ్యాణ్. తన మాట తీరుతో హౌస్ లో ఉన్నవారిని, బయట ఉన్న ఆడియన్స్ ను కూడా ఆకట్టుకున్నాడు. హౌస్‌లో కళ్యాణ్, తనూజ స్నేహితులుగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం వారి అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే కొనసాగుతోంది.
కన్నీరు పెట్టిన కంటెస్టెంట్స్
ఫైనల్ వీక్ టాప్ 5 మెంబర్స్ కు మెమరబుల్ గా గడిచింది. ఈ వీక్ లోనే టాప్ 5 కంటెస్టెంట్స్ ఎమోషనల్ జర్నీ వీడియోలను కూడా ప్లే చేశారు. ఈ జర్నీ వీడియోను చూసిన కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు ఎమోషనల్ అయ్యి కంటతడి పెట్టారు. తమ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ విలపించారు. బిగ్ బాస్ హౌస్‌లో గడిపిన క్షణాలు, ఎదురైన సవాళ్లు, సాధించిన విజయాలు వారికి సరికొత్త అనుభూతిని కలిగించింది. బిగ్ బాస్ ను వదిలి వెళ్లాపోతున్నందుకు కూడా వారు బాధపడ్డారు.

