- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: కళకళలాడుతున్న సామ్రాట్ ఇల్లు... నందుకి తులసి స్ట్రాంగ్ వార్నింగ్?
Intinti Gruhalakshmi: కళకళలాడుతున్న సామ్రాట్ ఇల్లు... నందుకి తులసి స్ట్రాంగ్ వార్నింగ్?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు సెప్టెంబర్ 22వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం...

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...సామ్రాట్,వాళ్ళ బాబాయ్ తో సంతోషంగా ఉన్నప్పుడు మూడు స్పాయిల్ చేస్తావ్. మనకు దొరికిన అదృష్టం చాలు దొరకనీ వాటి గురించి ఎందుకు వెతకడం అని అనగా ట్రై చేయడం మన బాధ్యత రాని అంటాడు వాళ్ళ బాబాయ్, నా భాద్యతలు ఏంటో నాకు తెలుసు అని చెప్పి సామ్రాట్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.ఆ తర్వాత సీన్లో నందు, లాస్య ,లక్కీ కార్ దిగుతారు. అప్పుడు లాస్య లక్కీ తో, నేను చెప్పింది అంతా గుర్తుంది కదా నువ్వు హనీ పక్కనే ఉండాలి, హనీ నీ రోజంతా చూసుకోవాలి సామ్రాట్ గారి ముందు మంచి పేరు తెచ్చుకోవాలి.నిన్ను ఇంట్లోనే ఉండిపోమనే అంత బాగా మెలగాలి అని అనగా, అమ్మ నువ్వు హనీతో స్నేహం చేయడానికి చెప్తున్నావా లేకపోతే నన్ను శాశ్వతంగా వదిలించుకోవడానికి చెప్తున్నావా అని ఎటకరిస్తాడు లక్కీ.
అప్పుడు వాళ్లు లోపలికి వెళ్ళగానే స్కూల్ కి వెళ్ళలేదా అని సామ్రాట్ లక్కీ తో అంటాడు.అప్పుడు లాస్య, స్కూలు దేముందండి ,పాప ముఖ్యం కదా ఆరోగ్యం తగ్గే వరకు వాడు వెళ్లడని ఇక్కడే ఉంటాను అని మారం చేశాడు. అందుకే తీసుకొచ్చాము అని అంటారు. మీరు మా కోసం ఇంతగా ఆలోచిస్తున్నందుకు థాంక్స్ అని చెప్పాడు సామ్రాట్. ఇంతలో తులసి కుటుంబంతో సహా అక్కడికి వస్తుంది.అప్పుడు లాస్య నందు తో, లక్కీ నీ తీసుకొచ్చాను అంటే ఎందుకు అన్నావు ఇక్కడ తులసి బెటాలియన్ తో పాటు దిగిపోయింది అని అంటుంది. ఇంతలో అందరూ వచ్చారు. అప్పుడు సామ్రాట్, మీకు చెప్పలేదు కదా హనీకి తగ్గేంత వరకు తులసి కుటుంబం అంతా ఇక్కడే ఉంటున్నారు అని అంటాడు. అప్పుడు సామ్రాట్, మీ అందరికీ ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి నేను హనీ ని వదిలి ఉండలేను అందుకే ఇలా అంటున్నాను అని అనగా అనసూయ, మేము తులసి నీ వదిలేసిన మాజీ భర్త వాళ్ళ అమ్మానాన్న లము.
అయినా సరే జాగ్రత్తగా చూసుకుంటుంది తులసి. అలాంటి తులసి కోసం మేము ఈ మాత్రం చేయలేమ అని అనగా ఇప్పుడు అవన్నీ ఎందుకు అత్తయ్య అని అంటుంది తులసి. కొన్ని మంది అనవసరంగా గోప్పలు చెప్పుకుంటున్నారు, మనము ఉన్న గొప్పనే కదా చెప్తున్నాము అని అనసూయ లాస్యని చూసి అంటుంది.ఆ తర్వాత హనీ ఎక్కడ అని ప్రేమ్ అడుగుతాడు. లోపల పడుకున్నాది అని అంటాడు సామ్రాట్.మేము వచ్చాక ఇంక ఎవరిని పడుకోబెట్టము అని లోపలికి వెళ్తారు. అందరూ వెళ్లి ఒకేసారి హనీ అని అరుస్తారు.అప్పుడు హనీ లెగిసి మీరందరూ నన్ను చూడడానికి వచ్చార అని అనగా తులసి,లేదమ్మా నీ నొప్పి తగ్గే వరకు ఇక్కడే ఉంటాము అని అంటుంది.అప్పుడు దేవుడా ఈ ఒప్పి నాకు త్వరగా తగ్గకూడదు మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతారు కదా అని అంటుంది.
అయితే జీవితాంతం ఇక్కడే ఉండిపోమంటావా ఏంటి అని నవ్వుతూ అంటుంది తులసి. అప్పుడు లాస్య నందుతో, చూసావా నందు ఇక్కడే ఉండిపోవడానికి ప్లాన్లు వేసింది అని అంటాది. ఇంతలో రండి అయితే మనం ఆడుకుందాం అని హనీ అనగా,ముందు వెళ్లి తయారవ్వమని అంటుంది తులసి.నేను తయారవ్వాలి అంటే నన్ను బుజ్జగించాలి మా నాన్న నాకు ప్రతిరోజు అలాగే చేస్తారు అని అనగా, ఇంట్లో వాళ్ళందరూ కలిసి పాటలు పాడుకుంటూ హనీ ని తయారు చేసి తినిపించి రెడీ చేస్తారు. తర్వాత తులసి ఎవరితోనో ఫోన్లో మాట్లాడి,త్వరగా పని చేయండి అని అంటుంది. ఆ ఫోన్ అయిపోయిన తర్వాత నందు అక్కడికి వచ్చి, నువ్వు కుటుంబంతో సహా వెంటనే ఇక నుంచి బయలుదేరు అని అంటాడు. ఏ అధికారంతో మీరు ఈ మాట అంటున్నారు నందగోపాల్ గారు కారణం ఏంటి అని అడగగా, నాకు నువ్వు ఇక్కడ ఉండడం నచ్చట్లేదు.
నాకు విడాకులు ఇచ్చినప్పుడు, ఇంట్లో వాళ్ళని దగ్గర ఉంచుకొని నన్ను చిన్నచూపు చూసి అందరి దగ్గర చెడ్డవాడిని చేస్తున్నావు. ఇక్కడ ఉండడం నాకు నచ్చలేదు వెళ్లిపో అని అనగా, నేను మీరు చెప్పేవన్నీ వినడానికి మీ భార్యను కాదు కావాలంటే వెళ్లి కుక్క పిల్లని తెచ్చుకోండి కాలు దగ్గర పడుంటుంది నేను ఇక్కడే ఉంటాను అని అనగా, ఇక్కడే ఉంటావా? ఉండిపోతావా? అని నందు అంటాడు. మీ మగబుద్ధి చూపించుకున్నారు మనకు విడాకులు కాకముందే లాస్య అని మీ పడక గదిలో తెచ్చుకున్నారు దానికి మీరు నాకు ఇచ్చిన విలువ ముందు ఇది ఎందుకు పనికిరాదు.అయినా నేను ఎవరితో ఉండాలో నాకు తెలుసు మీ అవసరం నాకేం లేదు.ఒక మగ స్నేహితుడు ఉన్నా ఎప్పుడు ఈ పాడులోకం ఇలాగే అనుకుంటుంది. అయినా మీరు నన్ను ప్రశ్నించే హక్కు మీకు లేదు అని చెప్పి కోపంతో వెళ్ళిపోతుంది తులసి.
ఆ తర్వాత సీన్లో అభి,అంకిత నీ ఇంటి బయటకు తీసుకువచ్చి, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా? పాపం చెయ్యి బాలేదు అంటే ఇక్కడికి వచ్చాము అలాగని అన్ని ఆమ్మ చేతే చేయించుకుంటుంది హనీ.సామ్రాట్ గారు చూస్తూ ఆనందిస్తున్నారు తప్ప ఇవన్నీ చేయించుకోకూడదు అని అనడం లేదు ఎందుకు అని అనగా అంకిత, నాకు అందులో తప్పుగా ఏమి అనిపించట్లేదు అభి, పాపం ఎవరూ లేకుండా ఇంట్లో ఒక్కతే ఉంటుంది కదా. మంచిదో, తప్పేదో పాపం తనకి ఏంటి తెలుసు. అయినా నీ మాటల్లో లాస్య ఆంటీ పోలికలు కనిపిస్తున్నాయి నువ్వు మారు అని అనగా, ఇప్పుడు లాస్య ఆంటీ నీ నాతో ఎందుకు పోలుస్తున్నావు నేను చెప్పేది విను అంకిత అని అభి అంటాడు.కానీ అంకిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో ఇంట్లో వాళ్ళందరూ క్యారమ్స్ ఆడుతూ ఉంటారు.
మరోవైపు సామ్రాట్, నందు, లాస్యలు ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు లాస్య, వాళ్ళ గోల ఎక్కువవుతుంది ఆపమంటారా అని అనగా, వద్దు.హానీ ఆనందంగా ఉండడం కన్నా నాకు ఇంకేమీ ముఖ్యం కాదు. మనమే అడ్జస్ట్ అవుదాము అని అంటాడు సామ్రాట్. ఇంతలో అక్కడ సామ్రాట్ తన బిజినెస్ కి సంబంధించి ఒకరితో మాట్లాడుతూ ఉంటాడు. నాకు మీ మీద నమ్మకం మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి నేను ఎదురు చెప్పను అని అంటాడు సామ్రాట్.అప్పుడు ఆ వ్యక్తి, మీ నమ్మకమే నాకు బాధ్యతను పెరిగిస్తుంది సార్ థాంక్యూ అని అంటాడు.
ఇంతలో హనీ, దివ్య ఇద్దరు ఒక టీం తో ఆడుకుంటూ ఉండగా ప్రేమ్, నువ్వు పొరపాటున దివ్యని సెలెక్ట్ చేసుకున్నావ్ హనీ,ఈవిడకి మాటలే కానీ చేతల్లో ఏమి ఉండదు అని వెటకారుస్తాడు. అలా అందరూ కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఉండగా,లక్కీ హనీతో,వెళ్లి సామ్రాట్ అంకుల్ కూడా ఆడడానికి రమ్మనొచ్చు కదా అని అనగా హనీ వెళ్లి ఈ సామ్రాట్ ని పిలుస్తుంది.అప్పుడు సామ్రాట్, ఆగమ్మా చిన్న పని ఉన్నది కొంచెం సేపట్లో వస్తాను అని అంటాడు. అప్పుడు సామ్రాట్ బిజినెస్ పార్ట్నర్ కి ఒక ఫోన్ వచ్చి ఇప్పుడే వెళ్లి వస్తాను సార్ అని వెళ్తాడు. అప్పుడు లాస్య సామ్రాట్ తో, సర్ మేము ఈ పక్కనే ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాము మీకు దగ్గరగా ఉంటుంది అని నందు చెప్పాడు అని అంటుంది. నందు లాస్య వైపు ఆశ్చర్యంతో చూస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!