- Home
- Entertainment
- Intinti gruhalakshmi: అంకితకు షాకిచ్చిన ప్రేమ్.. తులసి కోసం కొట్టుకున్న నందు, సామ్రాట్!
Intinti gruhalakshmi: అంకితకు షాకిచ్చిన ప్రేమ్.. తులసి కోసం కొట్టుకున్న నందు, సామ్రాట్!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఆగస్ట్ 17వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... సామ్రాట్ తులసి తలుపు కొడతాడు. ఈ లోగ నందు, లాస్యలు ఎదురు గదిలో నుంచి దొంగ చూపులు చూస్తారు. అప్పుడు లాస్య నందుతో చూసావా నందు పాలోడు కూడా గది బయట ఇంత సభ్యంగా నిల్చోడు అంత పెద్దమనిషి ఒక వంటింటి కుందేలుకి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాడు అని అంటుంది. ఈలోగా తులసి తలుపు తీస్తుంది లోపలికి రండి అని అనగా నేను అలా బయట తిరగడానికి వెళ్తున్నాను మీరు కూడా వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మీకు ఇష్టమైతే రండి అని అంటాడు.
అప్పుడు తులసి బట్టలు మార్చుకొని వస్తాను అని అంటుంది. ఈ లోగ తులసి రెడీ అయి కిందకి వెళ్తుంది.అంతట్లో సామ్రాట్ ఆటో పట్టుకొని వస్తాడు.అప్పుడు నందు లాస్యలు చేసేదేముంది మనం కూడా వాళ్ళని ఫాలో అవ్వాలి అని అనుకుంటారు. ఆ తర్వాత సీన్లో ప్రేమ్ ఏంటి ఇంకా ఇంటికి రాలేదు శృతిని తీసుకొని అని అంకిత ఆలోచిస్తూ చాలా రోజుల తర్వాత కలిశారు కదా అలా తిరగడానికి బయటికి వెళ్తూ ఉండుంటారు అని అనుకుంటాంది. ఈ లోగ ప్రేమ్ అక్కడికి వస్తాడు.
శృతి ఏది అని అంకిత అడగగా ఈరోజు నుంచి నాకు శృతి కి సంబంధం లేదు వదినా కాళ్లు పట్టుకొని స్థితికి వెళ్ళినా సరే నన్ను వద్దని చెప్పేసింది. ఇంక మేము విడిపోవడమే మంచిది అని అనగా శృతి కోపంతో ఇంకా ఆపు ప్రేమ్ విడాకులు ఇచ్చేసి తులసి ఆంటీ ఎంత బాధ పడుతున్నారో చూసావు కదా నువ్వు కూడా అలాంటి బాధని కోరి తెచ్చుకుంటావా అని తిడుతుంది. నేను బతిమిలాడాల్సింది బతిమిలాడను తను ఇంక ముఖం మీద ఒద్దనిసింది ఇంకా ఎవరు చెప్పినా నేను ఎవరి మాట వినను అని అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోతాడు ప్రేమ్.
ఆ తర్వాత సీన్లో తులసి మనం ఎక్కడికి వెళ్తున్నాము అని అనగా మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను రండి అని బీచ్ దగ్గరికి తీసుకెళ్తాడు సామ్రాట్. తులసి ఆ బీచ్ ని చూసి ఎంతో ఆనందపడి సంబరపడి మురిసిపోతూ ఉంటుంది వెంటనే వాళ్ళ మావయ్యకి ఫోన్ చేసి మావయ్య నేను సముద్రం దగ్గరికి వచ్చాను చాలా బాగుంది అని చెప్తూ ఉంటుంది. ఈ లోగ సామ్రాట్ ని కూడా రమ్మనగా నేను దూరం నుంచి చూస్తాను లెండి కానీ ఆ చివర్లో ఉన్న రాయి దగ్గర వరకు వెళ్లొద్దు అక్కడ అలలు ఎక్కువ వస్తాయి.
ఇంతట్లో ఆడుకోండి అని అంటాడు.తులసి అక్కడ గంతులు వేస్తూ ఉండగా సామ్రాట్ గతంలో, మీరు డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు, మీరు డబ్బుకు విలువచే మనిషి ఒకసారి మీ డబ్బు ప్రపంచాన్ని వదిలి బయటికి రండి అని తులసి అన్న మాటలకు భావం ఇప్పుడు అర్థం అవుతుంది అని అనుకుంటాడు. ఈ లోగ తులసి అక్కడ మట్టితో ఆడుకుంటూ ఉంటుంది. ఇంతట్లో సామ్రాట్ కి ఫోన్ వచ్చి మాట్లాడడానికి వెళ్లగా చాలామంది అక్కడికి వస్తారు ఏమైంది అని అనగా ఒక ఆవిడ ఇక్కడ నీళ్లలో కొట్టుకుని వెళ్లిపోయిందట అని అంటారు.
సామ్రాట్ కంగారుగా నీటిలోకి వెళ్దామని చూసేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ అడ్డుకుంటారు. సామ్రాట్ అప్పుడు తులసి అని అరుస్తూ ఉంటాడు. ఇంతట్లో ఎపిసోడ్ ముగుస్తుంది. ఎపిసోడ్ చివరిలో తులసికి ఏమైనా అయితే బాగోదు అని నందు సామ్రాట్ని తిడతాడు.అడగడానికి నువ్వెవరు అని సామ్రాట్ అనగా తులసి మాజీ భర్తని అని అంటాడు. అంటే తులసి గారిని హింసించింది నువ్వేనా? అని ఇద్దరు కొట్టుకున్న భాగాన్ని చూపిస్తారు.తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!