- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: పాపకు యాక్సిడెంట్ చేసిన నందు, లాస్య.. శిక్ష అనుభవిస్తున్న తులసి!
Intinti Gruhalakshmi: పాపకు యాక్సిడెంట్ చేసిన నందు, లాస్య.. శిక్ష అనుభవిస్తున్న తులసి!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 14 ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.

ఎపిసోడ్ ప్రారంభంలోనే.. హనీ (Honey) పనివాళ్లను లోపలికి పంపించి తను సైకిల్ వేసుకొని రోడ్డు మీదికి వస్తుంది. అదే సమయంలో లాస్య, నందులు పెద్ద బిజినెస్ మాన్ అయినా హనీ తండ్రి సామ్రాట్ దగ్గరకు హెల్ప్ అడగటానికి వస్తారు. కానీ నందు (Nandhu) మాత్రం అంతగా ఆశలు పెట్టుకోడు.
అదే సమయంలో హనీ సైకిల్ పై వస్తుండగా చూసుకోకుండా నందు తన కారుతో యాక్సిడెంట్ చేస్తాడు. వెంటనే హాని (Honey) తలకు పెద్ద గాయం.. నందు కంగారుపడుతూ అక్కడికి వెళ్లాలని అనుకుంటాడు. కానీ లాస్య (Lasya) ఇక్కడుంటే మనం దొరికిపోతాము అని భయంతో నందుని పక్కకు తీసుకొని వెళుతుంది.
అదే సమయంలో అక్కడికి తులసి (Tulasi) ఆటో లో వస్తుంది. వెంటనే హనీ ని హాస్పిటల్ తీసుకొని వెళ్తుంది. అదంతా నందు చూసి తప్పు చేసింది నేను అంటూ.. కాని తులసి ఇబ్బంది పడుతుంది అని అంటాడు. మనం కూడా హాస్పిటల్ కి వెళ్దాము అని అనటంతో లాస్య ఒప్పుకోదు. కానీ నందు (Nandhu) మాత్రం హాస్పిటల్ కి వెళ్ళాలి అని హాస్పిటల్ కి వెళ్తాడు.
ఇక హాస్పిటల్లో తులసి (Tulasi) ముందస్తు ఆలోచనతో ఆ పాప తన కూతురు అని చెప్పి ట్రీట్మెంట్ చేయిస్తుంది. తానే స్వయంగా డబ్బులు కడుతుంది. అది చూసిన నందు (Nandhu) తాను చేసిన తప్పుకు తులసి శిక్ష అనుభవిస్తుంది అని బాధపడతాడు. వెంటనే వెళ్లి ఆక్సిడెంట్ నేనే చేశాను అని చెబుతాను అనటంతో..
లాస్య (Lasya) తులసి తిరిగి నీపై కేసు పెడుతుంది అని అంటుంది. ఇక పనివాళ్లంతా ప్రమాదం జరిగిన చోటకు వచ్చి పాపని ఎవరో కిడ్నాప్ చేశారు అని ఆ విషయాన్ని సామ్రాట్ (Samrat) కి చెబుతారు. ఇక వెంటనే సామ్రాట్ వారిపై ఓ రేంజ్ లో అరుస్తాడు.
అన్ని సౌకర్యాలు ఇచ్చిన కూడా పాపని చూసుకోలేకపోయారు అంటూ బాగా కోపంతో రగిలిపోతాడు. ఆ తర్వాత అందరిని పిలిపించి తన కూతురు ఎక్కడ ఉందో వెతకమని చెబుతాడు. హనీ (Honey) ప్రాణాలతో బయటపడగా తనకు ఊరంతా తిరగాలన్న ఆశతో తన ఇంటి అడ్రస్ చెప్పకుండా..
నేనే చూపిస్తాను అంటూ తులసి (Tulasi) ని వెంటబెట్టుకొని ఊరంతా తిప్పిపిస్తుంది. ఇక తరువాయి భాగంలో తులసి దగ్గర తన కూతురు ఉందని తెలియడంతో వెంటనే సామ్రాట్ (Samrat) తులసి కి గన్ తో గురి పెడతాడు. మరి తరువాయి భాగంలో తులసి సామ్రాట్ కు జరిగిన విషయం చెబుతుందో లేదో చూడాలి.