- Home
- Entertainment
- Intinti Gruhalshmi: వచ్చిన అదృష్టన్ని కాదన్నా తులసి.. నందుతో ఆస్తి గురించి గుడ్ న్యూస్ చెప్పిన అభి?
Intinti Gruhalshmi: వచ్చిన అదృష్టన్ని కాదన్నా తులసి.. నందుతో ఆస్తి గురించి గుడ్ న్యూస్ చెప్పిన అభి?
Intinti Gruhalshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalshmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 8 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే గాయత్రి (Gayathri) చాలా మంచి ఐడియా ఇచ్చావ్ లాస్య (Lasya).. థాంక్యూ అని హాగ్ ఇస్తుంది. ఇక అభి మీరు మా అమ్మ ప్లేస్ లో నిలబడ్డారు.. నా కెపాసిటీ ఏంటో గుర్తించారు అని లాస్య ను పొగుడుతాడు. మరోవైపు తులసి ఇంటికి రామచంద్ర వస్తాడు. తులసి ఏమైనా మనసు మార్చుకొని మళ్లీ ఫ్యాక్టరీ తిరిగి తీసుకుంటుందా అని అడుగుతాడు.
ఇక తులసి (Tulasi) మనం ఆ విషయం మర్చిపోదాం అని అంటుంది. నేను మిమ్మల్ని ఇక్కడికి పిలిచింది సుగుణకు డబ్బు అవసరం ఉంది. అందుకని పిలిచాను అని తులసి (Tulasi) అంటుంది. ఇక తులసి కి రామచంద్ర డబ్బులు ఇస్తూ ఉండగా.. ఆ డబ్బులు సుగుణకు అందజేయండి అని అని అంటుంది. ఇక రామచంద్ర ఆ సమయంలో తులసీ మనస్తత్వం చూసి ఆశ్చర్యపోతాడు.
ఇక రామచంద్ర (Rama Chandra) నీ మంచి మనసుకి చేతులెత్తి మొక్కాలి అమ్మా అని అంటాడు. ఇక పరందామయ్య (Parandamaiah) నువ్వు నా కొడుకు గా పుట్టిఉంటే ఎంత బాగుండేది అమ్మా అంటూ తులసి తో చెప్పుకుంటూ బాధపడతాడు. ఇక గాయత్రి తన భర్తతో ఆస్థి మాత్రం అంకిత పేరు మీదకు రాయడానికి వీలు లేదు అని అంటుంది. అంతేకాకుండా ఆస్తిని అల్లుడు పేరుమీద ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటుంది. దాంతో గాయత్రి భర్త స్టన్ అవుతాడు.
ఇక గాయత్రి (Gayathri) భర్త అంకిత ఎందుకిలా చేశారని అవమానంగా ఫీల్ అవ్వదా.. ఎందుకు ఇలా చేశారని ఫీల్ అవ్వదా అని అంటాడు. ఇక గాయత్రి ఆస్తి మొత్తం తెలుసు పేరు మీద రాస్తాను అని నన్ను అంకిత (Ankitha) బెదిరించింది అని గాయత్రి తన భర్తకు చెబుతుంది. అయినా ఆస్తిని అల్లుడు పేరుమీద ట్రాన్స్ఫర్ చేయడానికి మీకు ఉన్న పట్టింపు ఏమిటి? అని గాయత్రి అంటుంది.
ఇక అభి (Abhi) తన తండ్రి నందు కి కాల్ చేసి తనకు కలిసి వస్తున్న అదృష్టాన్ని తన తండ్రితో పంచుకుంటాడు. ఆ క్రమంలో అభి తన తల్లి గురించి నెగిటివ్ గా చెప్పుకుంటూ.. లాస్య గాయత్రి (Gayathri) ల ను ఎంతో పొగుడుతాడు. ఆ మాటతో నందు అభి ను మరింత ప్రశంసిస్తాడు. ఇక అభి లాస్య ఆంటీ కి స్పెషల్ థాంక్స్ చెప్పండి డాడీ అని అంటాడు.
ఇక తరువాయి భాగంలో ఆస్తిని అల్లుడు పేరుమీద ట్రాన్స్ఫర్ చేయమంటే అంకిత పేరుమీద కు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అని అడుగుతుంది. దీనికి ఎవరు సలహా ఇచ్చారు అని అడుగుతుంది. దాంతో గాయత్రి భర్త తులసి అని సమాధానం చెబుతాడు. ఇక అభి తన తల్లి దగ్గరికి వెళ్లి.. నువ్వు నీ కొడుకు ఎదుగుతుంటే చూడలేకపోతున్నావు అని కన్న తల్లి మీద లేనిపోని నిందలు వేస్తాడు.