- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: నీకు మీ ఆయనకే వంకర ఆలోచనలు.. అంకిత ఆస్తి కోసమే కదా మీరు రెండు లక్షలు ఖర్చు పెట్టింది?
Intinti Gruhalakshmi: నీకు మీ ఆయనకే వంకర ఆలోచనలు.. అంకిత ఆస్తి కోసమే కదా మీరు రెండు లక్షలు ఖర్చు పెట్టింది?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు జూన్ 4వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఎపిసోడ్ ప్రారంభంలోనే.. అంకిత కన్నీళ్లు పెట్టుకుంటూ మీరు వెళ్ళమనగానే నేను ఇష్టం లేకుండా బయటకు వచ్చినందుకు మీరు ఇచ్చే బహుమతి ఇదేనా అని ఆడుతుంది. దీంతో అక్కడే ఉన్న దివ్య నువ్వు ఎం చేస్తున్నావో నాకు తెలీదు మామ్ వదినని బాధ పెట్టకు అని చెప్తుంది. నువ్వు రావడం నాకు కాదు మీ ఇంట్లో వాళ్ళకే ఇష్టం లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది తులసి.
మరో సీన్ లో లాస్య తులసి కోసం వెయిట్ చేసి గొడవపడుతుంది. నీకు బాగా జరిగిందిగా అవమానం అని లాస్య అంటే నాకు ఎం జరిగింది.. నాకు అంకిత ఫుల్ సపోర్ట్ ఇచ్చింది.. నీకు కదా అవమానం జరిగింది అని లాస్యకు షాకిస్తుంది. నీది మీ ఆయనది ఒంకర బుద్ది.. నువ్వు మీ అయన అక్కడ కోడలు పుట్టినరోజు ఎందుకు జరిపారో నాకు తెలుసు.
అంకితకు వచ్చిన కోట్ల ఆస్తి కోసం మీరు ఈ ప్లాన్ వేశారు అని అంటుంది తులసి. దీంతో షాకైనా లాస్య త్వరలోనే నీ పిల్లలు నీకు దూరం అవుతారు అని అనగా.. నా భర్త దూరం అవ్వడంలో అతనిది తప్పు ఉంది కాబట్టే నేను వదిలేసా.. నా పిల్లల జోలికి వస్తే మాత్రం రక్తం కళ్ల చూడాల్సి వస్తుంది అని అంటుంది!
అతర్వాత సీన్ లో ప్రేమ్ జరిగిన అవమానాలా గురించి తలుచుకొని బాధ పడుతుంటాడు. శృతి మాట్లాడుతూ ఏం జరిగింది అని అడుగుతుంది.. రాత్రి పార్టీలో అందరూ ఉన్న ఎవరు లేనట్టే ఉంది అంటాడు. అయిన తల్లే దూరం పెట్టినప్పుడు మిగితా వాళ్ళు ఎంత అని అంటే అలా అనకు మీ అమ్మకు నువ్వంటే చాలా ఇష్టం అంటుంది శృతి.
మరోవైపు తులసి అభిని కలుస్తుంది.. నన్ను నిలదీయడానికే అమ్మ పిలిచి ఉంటుంది అని అనుకుంటాడు అభి.. వెళ్ళిపోదామనుకున్నాను సమయంలో తులసి కనిపించడంతో ఆగిపోతాడు. ఇక అభిని కూర్చోబెట్టి చిన్న సలహా ఇస్తుంది. మామ్ తో జాగ్రత్తగా మాట్లాడాలి అనుకుంటడు.
అతర్వాత గాయత్రి ఫోన్ చెయ్యగా మాట్లాడు నాన్న అని చెప్తూ.. మన ఇంట్లో నీకు దొరకని గుర్తింపు ఆ ఇంట్లో దొరుకుతుంది.. మీ అమ్మకు లేని నమ్మకం మీ అత్త గారికి నీమీద ఉంది అంటుంది. నీకు ఆస్తి ఎలా కలిసోస్తుంది మంచిదే అని షాకిస్తుంది. మరీ రేపటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో చూడాల్సి ఉంది!