- Home
- Entertainment
- Sigma Day 1 Box Office: నెగిటివ్ టాక్ లో సిగ్మా మూవీ కొలాప్స్ అయిందా ? నిలబడిందా ?..తొలి రోజు కలెక్షన్స్ ఇవే
Sigma Day 1 Box Office: నెగిటివ్ టాక్ లో సిగ్మా మూవీ కొలాప్స్ అయిందా ? నిలబడిందా ?..తొలి రోజు కలెక్షన్స్ ఇవే
సిగ్మా మూవీ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జేసన్ సంజయ్ డైరెక్షన్‌లో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన 'సిగ్మా' సినిమా తొలిరోజు బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూలు చేసిందో ఇక్కడ చూద్దాం.

జేసన్ సంజయ్ సిగ్మా
దళపతి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ డైరెక్టర్‌గా పరిచయమైన సినిమా 'సిగ్మా'. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. సంపత్ రాజ్, రాజు సుందరం మాస్టర్ కీలక పాత్రలు పోషించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ కొడుకు సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. థమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు ప్రస్తుతం మిక్స్‌డ్ టాక్ వస్తోంది.
సిగ్మా సినిమా కథేంటి?
గురు (సందీప్ కిషన్) తన తల్లి జ్ఞాపకార్థం ఒక లైబ్రరీ నడుపుతుంటాడు. అతనికి పీకల్లోతు అప్పులు ఉంటాయి. ఎలాగైనా డబ్బు సంపాదించాలని అతను అనుకుంటాడు. మరోవైపు వీరయ్య రెడ్డి (సంపత్ రాజ్), విన్సెంట్ కలిసి మాఫియా, క్యాసినో బిజినెస్ చేస్తుంటారు. దీని వెనుక పెద్ద మాదక ద్రవ్యాల దందా నడుస్తుంటుంది. ఒక కంటైనర్‌లో 1000 కోట్ల రూపాయలు ఉంటాయి.
దాని తాళం, పెన్ డ్రైవ్ విన్సెంట్ దగ్గర ఉంటాయి. ఈ టైమ్‌లో రెడ్డి, విన్సెంట్ విడిపోతారు. రెడ్డి మీద పోలీసుల అటాక్ జరుగుతుంది, కానీ అతను తప్పించుకుంటాడు. ఆ తాళం కోసం వేట మొదలవుతుంది. ఈ 1000 కోట్ల మ్యాటర్ గురు టీమ్‌కి (ఫరియా, రాజు సుందరం) తెలుస్తుంది. వాళ్లు ఆ డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ఏమైందనేదే మిగతా కథ.
సిగ్మాకు మిక్స్‌డ్ రివ్యూలు
డైరెక్టర్ జేసన్ సంజయ్ 1000 కోట్ల చుట్టూ తిరిగే కథను ఎంచుకున్నాడు. ఒకవైపు క్రైమ్, మరోవైపు హీరో అప్పుల బాధ.. ఈ రెండింటినీ ప్యారలల్‌గా నడిపించాడు. కథ చాలా సింపుల్. కానీ స్క్రీన్‌ప్లేను జేసన్ బాగా కాంప్లికేట్ చేశాడు. స్టార్టింగ్‌లో సినిమా కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపించినా, పోను పోను ఏం జరుగుతుందో అర్థం కాదు. సంబంధం లేని క్యారెక్టర్లు చాలా వస్తాయి.
సందీప్ - ఫరియా లవ్ ట్రాక్ ఉంటుంది. క్యాసినో క్రైమ్ గురించి హీరోకి తెలిశాకే అసలు కథ మొదలవుతుంది. కానీ సీన్స్ బాగా సాగదీశారు. ఫస్ట్ హాఫ్ స్లో అయితే, సెకండ్ హాఫ్ మరీ స్లో. లాజిక్ అస్సలు లేదు. క్లైమాక్స్ అయితే ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడుతుంది. థ్రిల్లర్ ఫీల్, సీరియస్‌నెస్ ఏదీ సినిమాలో వర్కౌట్ కాలేదు.
సిగ్మా బాక్సాఫీస్
సిగ్మా సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్ బయటకు వచ్చింది. దీని ప్రకారం ఈ సినిమా తొలిరోజు ఇండియాలో రూ.2.7 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా కలిపితే ఫస్ట్ డే వసూళ్లు రూ.3 కోట్లు దాటుతాయి. అక్టోబర్ 1న రిలీజైన 'బత్తా' సినిమా కంటే సిగ్మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బత్తా సినిమా తొలిరోజు కేవలం రూ.2 కోట్లు మాత్రమే రాబట్టింది. కానీ సిగ్మా రూ.3 కోట్లకు పైగా వసూలు చేసి, ఈ వారం బాక్సాఫీస్ దగ్గర నంబర్ 1 ప్లేస్‌లో నిలిచింది.

