- Home
- Entertainment
- Intinti Gruhalashmi: బ్రతుకుతెరువు కోసం తులసి ఆరాటన.. ప్రవళిక సలహాతో ఆ పని చేయడానికి సిద్ధమైన తులసి!
Intinti Gruhalashmi: బ్రతుకుతెరువు కోసం తులసి ఆరాటన.. ప్రవళిక సలహాతో ఆ పని చేయడానికి సిద్ధమైన తులసి!
Intinti Gruhalashmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalashmi) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు మే 4 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే ప్రవళిక (Pravalika) తులసి కోసం పార్క్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది. తులసి జాగింగ్ డ్రెస్ వేసుకొని అది ఎవరికీ కనిపించకుండా శాలువ కప్పుకొని వస్తుంది. ఇక అలా తులసి (Tulasi) ను చూసిన ప్రవళిక నవ్వుతుంది. ప్రవళిక నిన్ను చూసి ఎవరూ నవ్వరు శాలువ తీసెయ్యి అని అంటుంది.
మరో వైపు నుంచి నందు (Nandu), లాస్య లు పార్కులో రన్నింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఇక తులసి ను చూసిన నందు పెద్దరికాన్ని కాపాడు కోవాల్సింది పోయి ఈ వెర్రి వేషాలు ఏంటి అని అడుగుతాడు. దాంతో తులసి (Tulasi) నా బట్టలు గురించి కామెంట్ చేయడానికి మీకున్న హక్కు ఏమిటి అని అంటుంది.
ఇక లాస్య (Lasya) ను మీ ఆయన రోడ్డుమీద వెళ్ళే ప్రతి ఆడదాన్ని డ్రెస్ గురించి ఇలాగే కామెంట్ చేస్తూ ఉంటాడా అని తులసి (Tualsi) అడుగుతుంది. దాంతో లాస్య ఒకసారిగా స్టన్ అయిపోతుంది. అంతేకాకుండా ఎవరైనా మీ ముందు నా గురించి తప్పుగా వాగితే ఉక్రోచ పడడం కాదు వాగిన వాడి చెంప పగల కొట్టండి అని అంటుంది.
ఆ తర్వాత నందు (Nandhu) నువ్వు ఇలాంటి డ్రెస్సులు వేసుకొని మా కుటుంబం పరువు తీయకు అని అంటాడు. దానితో తులసి నేను మీ ఇంటి మాజీ కోడలును ఏమైనా ఉంటే ఇప్పుడు మీ భార్యను సంస్కరించు కొండి అని అంటుంది. మరోవైపు ప్రేమ్ (Prem) శృతి ఫోన్ లిఫ్ట్ చేయడంతో వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి పనిలోకి వస్తున్నావా అంటూ విరుచుకు పడుతుంది.
మరోవైపు తులసి (Tulasi) ను జాగింగ్ డ్రెస్ లో చూసిన దివ్య ఫన్నీగా పాటలు పాడుతూ ఉంటుంది. అంతేకాకుండా తులసి ని గట్టిగా పట్టుకుని వాళ్ల తాతయ్య నానమ్మల కు చూపిస్తుంది. ఇక అనసూయ (Anasuya) దంపతులు తులసి ను అలా చూసి ఆనంద పడతారు.
ఇక తర్వాయి భాగంలో దివ్య (Divya) ల్యాబ్ ఫీ కట్టాలి ఇరవై వేలు చూడు మమ్మీ అని అంటుంది. మరోవైపు అనసూయ సరుకులు అయిపోయాయి అని అంటుంది. దాంతో బ్రతుకుతెరువు కు ఏం చేయాలి అని తులసి ప్రవళిక (Pravallika) ను అడుగుతుంది. మీ అమ్మ ని తలుచుకుని పాడడం మొదలు పెట్టు అంటుంది.