- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: దివ్య పార్టీకి వెళ్ళింది అని తెలుసుకున్న తులసి.. లాస్యపై కోపంతో రగిలిపోతున్న తులసి?
Intinti Gruhalakshmi: దివ్య పార్టీకి వెళ్ళింది అని తెలుసుకున్న తులసి.. లాస్యపై కోపంతో రగిలిపోతున్న తులసి?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు జనవరి 20వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో లాస్య తులసి దగ్గరికి వచ్చి బోన్లో ముద్దాయిని నిలదీసినట్టు తనను ఎలా నిలదీస్తావ్ ఏంటి తులసి అని అడుగుతుంది. అడగకూడదా స్పెషల్ క్లాస్ అంటే ముందుగానే చెబుతారు ఇప్పటికిప్పుడు చెబుతోంది అందుకే నేను అడుగుతున్నాను అంటుంది తులసి. సినిమాకు షికార్ కు వెళ్తాను అంటే నిలదీస్తే అర్థం ఉంది కానీ చదువుకోడానికి వెళ్తాను అంటే ఎవరైనా నిలదీస్తారా అంటుంది లాస్య. మామూలుగా అడిగితే బాగుంటుంది కానీ తన ఫ్రెండ్స్ ముందు ఎప్పుడైనా అడగకు బాగుండదు ఇన్సల్టింగ్ గా ఉంటుంది అంటుంది లాస్య. అప్పుడు తులసి ఏదో పార్టీకి వెళ్తున్నట్టు పార్టీకి ఆ డ్రెస్ ఎందుకు అనగా దివ్య టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు లాస్య అబద్ధాలు చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత తులసి సరే వెళ్ళు అని చెప్పి శృతిని లోపలికి పిలుచుకొని వెళ్తుంది.
అప్పుడు దివ్య థాంక్స్ చెప్పి అక్కడి నుంచి ఆనందంగా వెళ్లిపోతుంది. ఆ తర్వాత దివ్య పార్టీకి వెళ్లి అక్కడ అందరిని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఇద్దరూ యువకులు దివ్యకి తెలియకుండా దివ్యకి మత్తుమందు కలిపి అందులో టాబ్లెట్ కలిపి దివ్యకీ ఇస్తారు. అప్పుడు దివ్య అది తాగి మత్తుగా ఉండడంతో ఫుల్ గా డాన్స్ చేస్తూ ఉంటుంది. మరోవైపు లాస్య 10 నిమిషాల్లో వస్తా గంటలో వస్తాను వెళ్ళింది ఇప్పటివరకు రాలేదు కొంపదీసి పార్టీకి వెళ్లిందా ఎవరితో అయినా లేచిపోయిందా తను ఇంటికి రాకపోతే నాకు ఇంకా రామ భజన అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఉత్తమ ఇల్లాలు అవుదామని ఆశ పడితే ఇలా జరిగింది ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది.
అప్పుడు దివ్య కి ఫోన్ చేయక దివ్య ఫోన్ చేసి ఇంకా గంట పడుతుంది అనడంతో లాస్య గా టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు దివ్య ఫోన్ పక్కన పెట్టేసి ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మరొకవైపు తులసి దివ్య కోసం ఇంటి బయట ఎదురు చూస్తూ ఉంటుంది. 10 అవుతున్న ఇంటికి రాకపోయేసరికి టెన్షన్ పడుతూ ఉంటుంది. తులసి చూసి ఎదురుచూస్తోంది ఇంట్లో అందరూ లేచారంటే నాకు అయిపోతుంది నాకేమో ఇక్కడ గుండెల్లో అలజడి మొదలైంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది లాస్య. శృతి అక్కడికి వచ్చి దివ్య గురించే నా అంటీ టెన్షన్ పడకండి తన చిన్న పిల్ల కాదు కదా వస్తుంది కదా అనగా తల్లి మనసు కదా టెన్షన్ పడుతూ ఉంటాను ఎంత పెద్ద పిల్ల అయినా తల్లికి చిన్న పాప అంటుంది తులసి.
అప్పుడు అంకిత అక్కడికి వచ్చి ఫోన్ చేయలేదా ఆంటీ అనగా బయటకు వెళ్లిన ప్రతిసారి అర్థగంటకు ఒకసారి ఫోన్ చేస్తుంది నాకు ఇంతవరకు ఫోన్ చేయలేదు అని అంటుంది. దివ్య పార్టీలో ఎంజాయ్ చేస్తూ అంకిత ఫోన్ చేసిన కూడా లిఫ్ట్ చేయదు. మరోవైపు దివ్యని ఏదో ఒకటి చేయాలి అని యువకులు ప్లాన్ చేస్తూ ఉంటారు. మరోవైపు తులసి వాళ్ళందరు టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ తర్వాత పార్టీ అయిపోగానే అందరూ వెళ్లిపోగా దివ్య మాత్రం బయట క్యాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు ఇద్దరు యువకులు మేము మీ ఇంటి దగ్గర డ్రాప్ చేద్దాం అనగా వద్దు వద్దు నేను వెళ్ళిపోతాను అని అంటుంది దివ్య. అప్పుడు క్యాంపు కోసం ఎదురు చూస్తుండగా క్యాబ్ రాకపోయేసరికి దివ్య ఆ యువకులు మాతో పాటు రా దివ్య అనగా వద్దు మా మమ్మీ బయట ఎదురు చూస్తుంటుంది చూస్తే తిడుతుంది అని అంటుంది.
అప్పుడు ఆ యువకులు మా మాట విను ఈ టైంలో ఎవరూ రారు మాతో పాటు రా సేఫ్గా ఇంటిదగ్గర దించేది మేము వెళ్ళిపోతాము మాకు ఏమి శ్రమ లేదు అని అంటారు. సరి ఇంటిదాకా వద్దు ఇంటిదగ్గర దూరంలో ఆపండి చాలు అని దివ్య వెళ్లి వాళ్ళతో పాటు వెళ్ళి కార్లో కూర్చుంటుంది. మరొకవైపు ఇంట్లో దివ్య కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు ప్రియమ శృతి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అంకిత అక్కడికి రావడంతో అసలు ఈ రోజు ఏ క్లాసు లేదంట నేను వాచ్మెన్ కి ఫోన్ చేశాను అనడంతో వాళ్లు టెన్షన్ పడుతూ ఉంటారు. మరొకవైపు నందు కూడా దివ్యకి ఫోన్ మీద ఫోన్ చేస్తుండగా దివ్య ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అప్పుడు లాస్య అక్కడికి వచ్చి నంది వైపు చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది. నందు కోపంగా ఉంటాడు.
అప్పుడు లాస్య భయపడుతూ నందు దివ్య వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీ అంటే నేనే అబద్ధం చెప్పి తులసి నుంచి తప్పించి పంపించాను అనడంతో నిన్ను అని లాస్యను కొట్టబోతాడు నందు. వెళ్ళి తులసికీ చెప్పు అనడంతో నాకు చాతగాక నేను నీకు చెప్పాను అనడంతో సరే నేనే చెప్తాను అని నందు అక్కడి నుంచి బయలుదేరుతాడు. మరోవైపు తులసి ఎందుకో ఈరోజు దివ్య తేడాగా ప్రవర్తించింది లాస్య కూడా తనకే సపోర్ట్ చేసింది అని అంటుంది. దివ్య బాధపడుతుందేమో నా గురించి తప్పుగా అనుకుంటుందేమో అని బయటకు వెళ్లడానికి ఇష్టం లేకపోయినా తల ఊపాను అనగా అదే నువ్వు చేసిన పెద్ద తప్పు అని నందు అక్కడికి వస్తాడు. నువ్వు గా ఉండాల్సింది నీ జాగ్రత్త తీసుకోవాల్సింది నువ్వు వెనక్కి తగ్గడం వల్ల ఈ తలనొప్పి అంటాడు నందు.
అప్పుడు తలనొప్పింటి ఏం జరిగింది అనడంతో దివ్య పార్టీకి వెళ్లింది అనడంతో తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మీకు ఎలా తెలుసు అని తులసి అడగడంతో నందు లాస్య వైపు చూడగా లాస్య టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు అందరూ లాస్య వైపు కోపంగా చూస్తూ ఉంటారు. గంటలో వస్తానని చెప్పింది ఇంత లేట్ అవుతుందని నాకు తెలియదు అనడంతో నోరు మూయి అని గట్టిగా అరుస్తుంది. నీ భర్త నా జీవితంతో ఆడుకుంటే నువ్వు నా పిల్లలతో ఆడుకుంటున్నావా అంటుంది తులసి. అప్పుడు చూడు ఏం జరిగిందో నీవల్ల నాకు ఆ అదృష్టం కూడా దక్కింది అని తులసి ఉంటుంది.
అప్పుడు నందు లాస్యకు సపోర్ట్ గా మాట్లాడడంతో కాదు నీ భార్య నా కూతుర్ని నాకు దూరం చేయడానికి అలా చేసింది అదే మాట గుండె మీద చేయి వేసుకొని చెప్పమనండి అనడంతో లాస్య తడబడుతూ ఉంటుంది. మరోవైపు దివ్య మా ఇంటికి పిలుచుకొని వెళ్తున్నారా అనగా వాళ్ళు మీ ఇంటికి వెళ్తున్నాము నీకు కొంచెం తలనొప్పిగా ఉంది కాబట్టి అలా అనిపిస్తుంది అనీ అబద్ధాలు చెబుతాడు. మరోవైపు లాస్య ముందు జాగ్రత్తతో దివ్యతో అడ్రస్ ని లొకేషన్ షేర్ చేయించుకున్నాను అనడంతో అప్పుడు ప్రేమ్ తులసి నందు ముగ్గురు లాస్యతో లొకేషన్ షేర్ చేయించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు.