- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: గాయత్రికి ఫోన్ చేసి గిఫ్ట్ ఇస్తానన్న తులసి.. ప్రేమ్ ను ఘోరంగా అవమానించిన డైరెక్టర్?
Intinti Gruhalakshmi: గాయత్రికి ఫోన్ చేసి గిఫ్ట్ ఇస్తానన్న తులసి.. ప్రేమ్ ను ఘోరంగా అవమానించిన డైరెక్టర్?
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఏప్రిల్ 20న అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే నిన్నటి ఎపిసోడ్ లో జరిగిన విషయాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది దివ్య (Divya). అంతలోనే తులసి అక్కడికి వచ్చి ఓదార్చుతుంది. నీ సంతోషం కంటే ఏది ముఖ్యం కాదు అంటూ.. మా పంతాలా కోసం పిల్లలు ఇష్టాలను అడ్డు పడకూడదు అని నందు (Nandhu) కు ఫోన్ చేయాలని అనుకుంటుంది.
వెంటనే దివ్య (Divya) ఆపుతూ.. నీకు నీ ఆత్మ అభిమానం ఎంత ముఖ్యమో.. నాకు అంతే ముఖ్యం అంటూ.. ఇప్పుడిప్పుడే నీ తప్పులు తెలుసుకొని సరైన దారిలో నడుస్తున్నావంటూ డాడీకి సారీ చెప్పడానికి ఎందుకు రెడీ అయ్యావు అంటూ.. నువ్వు నీలాగే ఉండంటూ తన తల్లి ఆత్మాభిమానానికి సపోర్ట్ చేస్తున్నట్లుగా మాట్లాడుతుంది.
మరోవైపు ప్రేమ్ (Prem) కు పాట రాసే అవకాశం రావడంతో.. అద్భుతమైన పాటను రాసి మ్యూజిక్ డైరెక్టర్ కి చూపిస్తాడు. కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ ప్రేమ్ పాట బాగా లేదంటూ అవమానించి పైగా ఆ పేపర్ ను డస్ట్ బిన్ లో వేస్తాడు. ప్రేమ్ అక్కడి నుంచి ఎమోషనల్ గా వెళ్లిపోగా.. వెంటనే ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఆ పేపర్ తీసి చూస్తాడు.
ప్రేమ్ గాడిని ఏదో అనుకున్నాను.. చాలా బాగా రాశాడు.. ఇందులో కొన్ని పదాలు మార్చి నేనే రాసినట్టుగా ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు లాగేస్తా అని అనుకుంటాడు. ఇక అభి (Abhi) తన ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతూ ఉండగా అక్కడకు తులసి (Tulasi) పాల గ్లాస్ తీసుకొని వస్తుంది. అభి మాత్రం తల్లిని గమనించకుండా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు.
ఒకవైపు అదృష్టదేవత తలుపు తడుతుంది.. మరోవైపు దేవత లాంటి అమ్మ ప్రేమ కట్టిపడేస్తుంది.. అంటూ మాట్లాడతాడు. అంతేకాకుండా తన అత్తయ్య చాలా మారిపోయారు అని.. తన కోసం ఇల్లు కూడా కొన్నదని పైగా హాస్పిటల్ కట్టి తన లైఫ్ సెట్ చేస్తానని అన్నారని అంటాడు. ఈ విషయం అమ్మకు ఎలా చెప్పాలో అని అంటాడు అభి (Abhi).
ఇక తులసి అభి (Abhi) దగ్గరికి వచ్చి పాలు ఇచ్చి ఒక డైలాగ్ కొట్టి అక్కడ నుంచి వెళ్లి పోతుంది. ప్రేమ్ తనకు జరిగిన అవమానాన్ని తలుచుకొని గాయం చేసుకుంటాడు. వెంటనే శ్రుతి (Sruthi) ఎమోషనల్ అవుతుంది ఆ గాయానికి కట్టు కడుతుంది. ఇక ప్రేమ్ తన పాటను నలిపి డస్ట్ బిన్ లో పడేసినందుకు బాధగా ఉంది అంటాడు.
దాంతో శృతి (Sruthi) ప్రేమ్ ను ఓదార్చి ధైర్యం ఇస్తుంది. ఇక అభి మాటలను విన్న తులసి బాగా ఆలోచించుకొని గాయత్రి కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. రేపు శ్రీరామనవమి అంటూ.. నీకు ఇష్టమైన గిఫ్ట్ ఇచ్చి సంతోష పడేలా చేస్తాను అని గాయత్రిని (Gayatri) ఆహ్వానిస్తుంది. దీనిని బట్టి చూస్తే అభిని స్వయంగా తానే పంపించే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమవుతోంది.