MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Intinti gruhalakshmi: నెట్టింట్లో సామ్రాట్, తులసిల ఫోటోలు.. ఇంట్లో గృహాలక్ష్మిపై రచ్చ!

Intinti gruhalakshmi: నెట్టింట్లో సామ్రాట్, తులసిల ఫోటోలు.. ఇంట్లో గృహాలక్ష్మిపై రచ్చ!

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు ఆగస్ట్ 23వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం...  

3 Min read
Author : Navya G
Published : Aug 23 2022, 01:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... శృతి అక్కడికి వచ్చి తాతయ్య ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది.అమ్మా శృతి, ఎన్నాళ్ళయిందో నేను చూసి అని అందరూ అంటారు. అప్పుడు లాస్య, చిన్న కోడలు కూడా వచ్చేసింది ఇంక మనల్ని ఎవరు పట్టించుకుంటారు అని అనుకుంటుంది.ఇంతట్లో పరంధామయ్య తులసి తో నాకు కాఫీ కావాలి అని అంటారు. అప్పుడు తులసి నాకు శృతి కాఫీ తాగి చాలా రోజులైంది వెళ్లి కలపమ్మ అని అంటుంది. అప్పుడు దివ్య, శృతి కాఫీ కలపడానికి వెళ్తారు. ఆ తర్వాత సీన్లో నందు లాస్యలు అనసూయని ఇంటి బయటకు పిలుస్తారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఎందుకు పిలిచారు అని అడగగా తులసి, సామ్రాట్ వైజాగ్ లో ఉన్నపుడు తీసిన కొన్ని ఫోటోలు అనసూయకి చూపిస్తూ ఈ ఫోటోలు చూడండి అత్తయ్య గారు మీకు మేం చేసిన మోసాలే కనిపిస్తాయి కానీ మీ పక్కనే ఉండి నవ్వుతూ మాట్లాడుతూ మీకు మోసాలు చేసిన వారు కనిపించరు అని లాస్య అంటుంది.అప్పుడు నందు,తులసిని వైజాగ్ వెళ్లనివ్వొదు అంటే పంపించావు నా కోడలు అని, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత ఘోరం జరిగింది. ఇది అందరికీ తెలిస్తే మన కుటుంబానికి ఏమైనా విలువ ఉంటుందా. ఇంక నీ ఇష్టం చెప్పాల్సిందే చెప్పాము నిర్ణయం తీసుకోవడం తీసుకోకపోవడం నీ ఇష్టమే అని అప్పటినుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. అనసూయ ఆలోచనలలో పడుతుంది. 

36

ఆ తర్వాత సీన్లో హనీ వాటర్ తీసుకొని అందరి మీద జలుతూ ఆడుకుంటూ ఉంటుంది. ఈ లోగా సామ్రాట్ అక్కడికి కోపంగా వస్తాడు అందరి మీద నీళ్ళు జల్లితున్నావు అని అరుస్తాడు. అప్పుడు సామ్రాట్ వాళ్ళ బాబాయ్,  పోనీలే రా చిన్నపిల్ల కదా సీరియస్ అవ్వద్దు అని అంటాడు. అప్పుడు సామ్రాట్ అందరి మీద నీళ్లు జల్లుతావు కదా అని చెప్పి ఒకేసారి ఆ పైప్ తీసుకొని హనీ మీద నీళ్లు జల్లుకుంటూ ఆడుకుంటాడ. అలాగా వాళ్ళిద్దరూ నీళ్లతో కొంచెం సేపు ఆడుకుంటారు.ఆ తర్వాత సామ్రాట్ వాళ్ళ బాబాయ్,సామ్రాట్ ఏంటి ఇంత మంచిగా మారిపోయాడు అని అనుకుంటారు. ఆ తర్వాత సీన్లో శృతి,ఇంక నేను బయలుదేరుతాను అని అనగా ఎక్కడికమ్మా వెళ్తున్నావు నువ్వు ఉండిపోవడానికి రాలేదా అని తులసి అంటుంది.  
 

46

అప్పుడు తులసి, మొన్న అభి బయటికి వెళ్లినప్పుడు కూరగాయల కొట్టు దగ్గర కౌసల్య కనిపించారు అని చెప్పాడు. అలాగైతే కౌసల్య గారికి బాగా ఉండాలి కదా మరి ఎందుకమ్మా వెళ్ళిపోతున్నావు అని తులసి అడుగుతుంది. ఇంతట్లో పరంధామయ్య, కౌసల్య ఉండమంటున్నాదేమో కానీ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి అడగడానికి శృతి మొహమాటపడుతుందేమో ఒకసారి మనం ఫోన్ చేసి అడుగుదాము అని అంటారు. వద్దు ఫోన్ చేయొద్దు అని అంటుంది శృతి. అయితే నువ్వు ఇక్కడే ఉండి పోతున్నావు. నీకు నామీద ఏమాత్రం గౌరవంగా ఉండిపో అని అంటుంది తులసి.

56

ఆ తర్వాత సీన్లో సామ్రాట్ హనీతో ఆడుకుంటూ ఉండగా సామ్రాట్ వాళ్ళ బాబాయ్ అక్కడికి వచ్చి ఫోన్లో ఒక ఆర్టికల్ని చూపిస్తారు. అక్కడ "బిజినెస్ మాన్ సామ్రాట్ వైజాగ్ లో ప్రేయసితో ప్రేమలు" అని ఉంటుంది. అప్పుడు సామ్రాట్ కోపంతో ఇలా ఇష్టం వచ్చిందంతా రాసిస్తారా. మేము వెళ్ళాము కానీ నాతోపాటు మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఈ విషయం తులసి వాళ్ళ ఇంట్లో తెలిస్తే మీడియాలో ఇదంతా హల్చల్ అవుతుంది. తులసి ఇంట్లో సంగీతానికి ఒప్పుకోరు అని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్ లో అభి ఆ ఫోటోలను ఇంటిలో అందరికీ చూపిస్తూ, అసలు ఈ ఫోటోలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని అనగా, ప్రేమ్, నీకు అమ్మ మీద నమ్మకం ఉందా లేదా. 

66

ఒకవేళ నీకు అమ్మ మీద నమ్మకం ఉంటే ఈ విషయం చర్చించొద్దు, ఒకవేళ నమ్మకం లేకపోతే అమ్మ గురించి అడిగే హక్కు నీకు లేదు అని అంటాడు. అప్పుడు పరంధామయ్య కరెక్టుగా చెప్పావు ప్రేమ్ అభికి అప్పుడప్పుడు వాళ్ళ నాన్న పునుతూ ఉంటాడు అని అంటారు. అప్పుడు అభి, ప్రేమ్ తో, ఎప్పుడూ  నీకే మీ అమ్మ మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడతావు,ఏ నాకు అమ్మ మీద ప్రేమ ఉండదా అని అరుస్తాడు.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi 9 Days Collections: బాక్సాఫీసు వద్ద పెద్ది బిగ్‌ డ్రాప్‌.. 9 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎంతంటే?
Recommended image2
Allu Arjun: కేరళలో అల్లు అర్జున్ మూవీ ప్రభంజనం.. 20 ఏళ్ల పాత సినిమాకు థియేటర్లలో జాతర
Recommended image3
Chiranjeevi: ఆమెని టెర్రస్ మీదికి తీసుకెళ్లిన చిరు, దెబ్బకు మైండ్ బ్లాక్.. మణిరత్నం మూవీలో మెగాస్టార్ క్రేజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved