MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • King 100: కేజీఎఫ్ రేంజ్ లో టబుకి ఎలివేషన్.. నాగార్జునతో రొమాన్స్ కి ఫుల్ స్టాప్, వార్ మొదలు

King 100: కేజీఎఫ్ రేంజ్ లో టబుకి ఎలివేషన్.. నాగార్జునతో రొమాన్స్ కి ఫుల్ స్టాప్, వార్ మొదలు

నాగార్జున వందో చిత్రం కింగ్100లో టబు మహంతి ఝాన్సీ రాణి అనే రాజకీయ నాయకురాలి పాత్రలో నటిస్తున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం పాత్ర పరిచయ వీడియోను విడుదల చేసింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 04 2026, 01:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కింగ్100లో టబు పాత్ర పరిచయం
Image Credit : Asianet News

కింగ్100లో టబు పాత్ర పరిచయం

తెలుగు సినిమాలో నాగార్జున, టబు తెరపై కనిపించిన జంటకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వీరిద్దరూ కలిసి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా ‘నిన్నే పెళ్లాడతా’ భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ జంట ప్రేక్షకుల జ్ఞాపకాల్లో నిలిచిపోయింది. ఇప్పటివరకు ఎక్కువగా ప్రేమజంటగా కనిపించిన నాగార్జున, టబు ఇప్పుడు ప్రత్యర్థులుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నాగార్జున నటిస్తున్న వందో చిత్రం ‘కింగ్100’లో వీరిద్దరూ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టబు పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆమె పాత్రను పరిచయం చేస్తూ ప్రత్యేక వీడియో గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇందులో ఆమె మహంతి ఝాన్సీ రాణి అనే రాజకీయ నాయకురాలి పాత్రలో కనిపించనున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అదృష్టాన్ని నమ్మని రాజకీయ నాయకురాలిగా టబు
Image Credit : Asianet News

అదృష్టాన్ని నమ్మని రాజకీయ నాయకురాలిగా టబు

విడుదల చేసిన గ్లింప్స్‌లో టబు తన పాత్ర స్వభావాన్ని తెలియజేసేలా ఓ మాట చెబుతారు. ఈ ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులు ఉంటారని, ఒకరు కష్టాన్ని నమ్మేవారని, మరొకరు అదృష్టాన్ని నమ్మేవారని వివరిస్తారు. తాను మాత్రం అదృష్టాన్ని నమ్మే వ్యక్తిని కాదని స్పష్టం చేస్తారు. ఈ వీడియో ద్వారా సినిమాలో రాజకీయ నేపథ్యం కూడా ఉంటుందని చిత్ర బృందం వెల్లడించింది. అంతకుముందు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేశారు. అందులో డబ్బు సంపాదించడం కోసం అన్ని రకాల జూదాలు, మోసాలకు పాల్పడే వ్యక్తిగా నాగార్జున కనిపించారు. ఇప్పుడు కష్టాన్ని నమ్మే రాజకీయ నాయకురాలిగా టబు, డబ్బు కోసం జూదాలు, మోసాలు చేసే వ్యక్తిగా నాగార్జున పాత్రలు కథలో ఎలా ఎదురుపడతాయి, వారి మధ్య ఎలాంటి ఘర్షణ చోటుచేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఈ గ్లింప్స్ తో టబుకి కేజీఎఫ్ 2లో రవీనా టాండన్ తరహాలో ఎలివేషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు నాగార్జున తో రొమాన్స్ పండించిన టబు తోసారి ఆయనకు వ్యతిరేకంగా నటిస్తోంది.

33
డిసెంబర్ 24న కింగ్100 విడుదల
Image Credit : Asianet News

డిసెంబర్ 24న కింగ్100 విడుదల

‘కింగ్100’ చిత్రానికి రా కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్కినేని కుటుంబం ఈ సినిమాను నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. నాగార్జున కెరీర్‌లో వందో చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబర్ 24న విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. టబు పాత్ర పరిచయ వీడియోతో సినిమాలో ఆమె ప్రాధాన్యం ఏమిటనే అంశంపై స్పష్టత వచ్చినప్పటికీ, నాగార్జునతో ఆమె పాత్రకు ఎలాంటి సంబంధం ఉంటుందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో ప్రేమజంటగా అలరించిన ఈ ఇద్దరు నటులు ఈసారి ప్రత్యర్థులుగా కనిపించనుండటం ‘కింగ్100’లో ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలవనుంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 
1st ODI • NZ vs IND 2026
Rain Delay
NZNZ
185
INDIND
(10.5 ov)54/1
IND need 132 runs in 235 balls
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Scene Advance Booking: సూర్య వరుస హిట్ల ఎఫెక్ట్.. అడ్వాన్స్ బుకింగ్స్ లో 'సీన్' జోరు
Recommended image2
Kanika Kapoor: రెండో భర్తతో విడాకులు ప్రకటించిన సింగర్.. 4 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు, 48 ఏళ్ళ వయసులో ఇలా
Recommended image3
Renu Desai: పవన్ కళ్యాణ్ కోసం రేణు దేశాయ్ లండన్ లో ఏం చేశారో తెలుసా.. అక్కడికి వెళ్ళేది వాళ్లిద్దరు మాత్రమే
Related Stories
Recommended image1
Renu Desai: పవన్ కళ్యాణ్ కోసం రేణు దేశాయ్ లండన్ లో ఏం చేశారో తెలుసా.. అక్కడికి వెళ్ళేది వాళ్లిద్దరు మాత్రమే
Recommended image2
Rajamouli: రాజమౌళి స్టామినా ఆ ఇంటర్వెల్ సీన్ తో తెలిసింది.. ఒక్కొక్కరికీ మైండ్ పోయింది, రాజీవ్ కనకాల
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved