MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sobhan Babu: ఆ డైరెక్టర్ తో సినిమా అంటే వణికిపోయిన శోభన్ బాబు.. సోగ్గాడిని భయపెట్టిన దర్శకుడెవరు?

Sobhan Babu: ఆ డైరెక్టర్ తో సినిమా అంటే వణికిపోయిన శోభన్ బాబు.. సోగ్గాడిని భయపెట్టిన దర్శకుడెవరు?

Sobhan Babu: టాలీవుడ్ లోకి ఎంత మంది హీరోలు వచ్చినా.. అందాల నటుడు, సోగ్గాడు మాత్రం శోభన్ బాబే. ఆయన గ్లామర్ తో పాటు క్రమశిక్షణ అందరికి సాధ్యం కాదు. అంత హుందాగా ఉండే హీరో కూడా ఓ దర్శకుడంటే భయపడేవారంటే మీరు నమ్ముతారా? ఇంతకీ ఎవరా డైరెక్టర్. ?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 04 2026, 02:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
తెలుగు సినిమా అందాల నటుడు..
Image Credit : our own

తెలుగు సినిమా అందాల నటుడు..

తెలుగు సినీ పరిశ్రమలో అందగాడిగా, సోగ్గాడిగా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న నటుడు శోభన్ బాబు. ఆయన అందం, నటనతో పాటు క్రమశిక్షణకు కూడా ఎంతో పేరు ఉంది. షూటింగ్‌కు సమయానికి రావడం, అనుకున్న సమయానికి పని ముగించడం వంటి విషయాల్లో ఆయన చాలా కచ్చితంగా ఉండేవారు. సాయంత్రం 6 దాటితే పక్కాగా షూటింగ్ కు ప్యాకప్ చెప్పాల్సిందే. షూటింగ్ లో అందరు శోభన్ బాబు అంటే కాస్త భయపడేవారట. అలాంటి శోభన్ బాబును సైతం భయపెట్టిన దర్శకుడు ఎవరో తెలుసా? ఆ డైరెక్టర్ సినిమా షూటింగ్ అంటే చాలా జాగ్రత్తగా వెళ్లేవారట శోభన్ బాబు. ఇంతకీ ఆయన ఎవరో కాదు వి. మధుసూదన రావు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
విక్టరీ ఇంటిపేరుగా చేసుకున్న డైరెక్టర్
Image Credit : Asianet News

విక్టరీ ఇంటిపేరుగా చేసుకున్న డైరెక్టర్

టాలీవుడ్ లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ దర్శకులలో వి. మధుసూదనరావు ఒకరు. 'వి ఫర్ విక్టరీ' అని పిలుచుకునే ఈయన రీమేక్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉండేవారు. అయితే, ఆయన సెట్‌లో ఎంతటి కఠినమైన క్రమశిక్షణ పాటించేవారంటే, టాలీవుడ్ స్టార్ హీరోగా వెలుగొందిన నటభూషన్ శోభన్ బాబు కూడా సైతం ఆయన షూటింగ్‌కి వెళ్లాలంటే కాస్త భయపడేవారట! ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు శివనాగేశ్వరరావు ఒక ఇంటర్వ్యూలో స్వయంగా పంచుకున్నారు.

శోభన్ బాబును కూడా టెన్షన్ పెట్టిన దర్శకుడు

తెలుగు తెరపై విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన శోభన్ బాబు తన సన్నిహితులతో ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకునేవారట. తాను ఏ సినిమా షూటింగ్‌కైనా ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా వెళ్తానని, కానీ మధుసూదనరావు గారి సినిమా షూటింగ్ అంటే మాత్రం మొదటి రోజు షూటింగ్‌కి వెళ్తున్నంతగా టెన్షన్ పడాల్సి వచ్చేదని చెప్పేవారట. దీనిని బట్టి ఆయన సెట్‌లో క్రమశిక్షణ ఎంత కఠినంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

33
సెట్‌లో మధుసూదనరావు పనితీరు
Image Credit : our own

సెట్‌లో మధుసూదనరావు పనితీరు

మధుసూదనరావుకి సెట్‌లో పని విషయంలో ఎక్కడా రాజీపడే తత్వం ఉండేది కాదు. చిన్న పొరపాట్లు జరిగినా ఆయన వెంటనే తీవ్రంగా స్పందించేవారు. డైరెక్టర్ శివనాగేశ్వరరావు 'జగన్నాథ రథచక్రాలు' చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు, ప్రతిరోజూ ఎడిటింగ్ రిపోర్ట్, కెమెరా రన్ అయిన రఫ్ ఫుటేజ్ లెక్కలు పక్కాగా రికార్డ్ చేసేవారు. నిర్మాత బడ్జెట్‌ను, అవుట్‌పుట్‌ను బ్యాలెన్స్ చేయడంలో మధుసూదనరావు ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు. కేవలం ముఖ్యమైన ఆర్టిస్టులే కాకుండా.. చిన్న డైలాగ్ చెప్పే ఆర్టిస్టులను కూడా ముందుగా ఆఫీస్‌కి పిలిపించి వారి సామర్థ్యాన్ని పరీక్షించిన తర్వాతే సెట్‌లోకి అనుమతించేవారు.

బయటకు ఎంత కఠినంగా, కోపంగా కనిపిస్తారో, లోపల మాత్రం సినిమా పట్ల అంతకంటే ఎక్కువ అంకితభావం కలిగి ఉండేవారు మధుసూదనరావుకి. ఆయన పర్యవేక్షణలోనే ఆచార్య ఆత్రేయ పాటలు రాయడం, ఇళయరాజా సంగీతం సమకూర్చడం వంటి అద్భుతమైన విషయాలు అప్పుడు జరిగేవి. అలాంటి ఉద్దండ దర్శకుల క్రమశిక్షణ వల్లే నాటి చిత్రాలు అప్పట్లో అద్భుత విజయాలను సాధించి, తెలుగు సినిమా చరిత్రలో మైలురాళ్లుగా నిలిచాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
శోభన్ బాబు
ఏషియానెట్ న్యూస్
 
1st ODI • NZ vs IND 2026
Rain Delay
NZNZ
185
INDIND
(12.0 ov)64/1
IND need 103 runs in 168 balls
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
King 100: కేజీఎఫ్ రేంజ్ లో టబుకి ఎలివేషన్.. నాగార్జునతో రొమాన్స్ కి ఫుల్ స్టాప్, వార్ మొదలు
Recommended image2
Scene Advance Booking: సూర్య వరుస హిట్ల ఎఫెక్ట్.. అడ్వాన్స్ బుకింగ్స్ లో 'సీన్' జోరు
Recommended image3
Kanika Kapoor: రెండో భర్తతో విడాకులు ప్రకటించిన సింగర్.. 4 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు, 48 ఏళ్ళ వయసులో ఇలా
Related Stories
Recommended image1
Salary: అమెరికాలో డ్రైవర్ల నెల జీతం ఎంత ఉంటుంది? భారీగా సంపాదన.. మరి ఖర్చుల సంగతేంటి?
Recommended image2
Salt Lake: ప్రపంచంలోనే ఏకైక ఉప్పు నీటి చెరువు ఇది.. ఇందులో మనుషులు దూకితే ఏమౌతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved