MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Nuvvu Naaku Nachav చూసి ఇక సినిమాల నుంచి తప్పుకుందామనుకున్న త్రివిక్రమ్‌.. అసలు ఏం జరిగిందంటే?

Nuvvu Naaku Nachav చూసి ఇక సినిమాల నుంచి తప్పుకుందామనుకున్న త్రివిక్రమ్‌.. అసలు ఏం జరిగిందంటే?

వెంకటేష్‌ హీరోగా వచ్చిన `నువ్వు నాకు నచ్చావ్` మూవీ జనవరి 1న రీ రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా త్రివిక్రమ్‌కి సంబంధించిన షాకింగ్‌ విషయాన్ని రివీల్‌ చేశారు నిర్మాత స్రవంతి రవి కిశోర్‌. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 31 2025, 07:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇండస్ట్రీ హిట్‌గా `నువ్వు నాకు నచ్చావ్‌`
Image Credit : Jio Hotstar

ఇండస్ట్రీ హిట్‌గా `నువ్వు నాకు నచ్చావ్‌`

వెంకటేష్‌, ఆర్తి అగర్వాల్‌ జంటగా నటించిన మూవీ `నువ్వే నాకు నచ్చావ్‌`. కే.విజయ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. దీనికి త్రివిక్రమ్‌ కథ, మాటలు అందించారు. స్రవంతి రవి కిశోర్‌ నిర్మించారు. ఈ మూవీ విడుదలై 25ఏళ్లు అవుతుంది. 2001 సెప్టెంబర్‌ 6న విడుదలైంది. అప్పట్లోనే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఏడు కోట్లతో రూపొందిన ఈ మూవీ రూ.18కోట్ల డిస్ట్రిబ్యూషన్‌ షేర్‌ని సాధించింది. పెట్టినదానికి త్రిబుల్ లాభాలు తెచ్చిపెట్టింది. అప్పట్లోనే తెలుగు సినిమాల్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వెంకటేష్‌ కెరీర్లోనే పీక్ కామెడీ ఫిల్మ్ `నువ్వు నాకు నచ్చావ్‌`
Image Credit : Nuvvu Naaku Nachav

వెంకటేష్‌ కెరీర్లోనే పీక్ కామెడీ ఫిల్మ్ `నువ్వు నాకు నచ్చావ్‌`

ఈ చిత్రం 93 సెంటర్లలో 50 రోజులు, 57 సెంటర్లలో వంద రోజులు, మూడు సెంటర్లలో 175 రోజులు పూర్తి చేసుకుంది. సక్సెస్‌ సెలబ్రేషన్‌ కూడా నిర్వహించారు. ఇది వెంకటేష్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆయన కామెడీ టైమింగ్‌ ఇందులో పీక్‌లో ఉంటుందని చెప్పొచ్చు. వెంకీ చేసిన కామెడీ చిత్రాల్లో దీనికి ఫస్ట్ ప్లేస్‌ దక్కుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆర్తి అగర్వాల్ తో లవ్‌ ట్రాక్‌ కూడా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. నవ్వులు పూయిస్తూనే చివరికి ఎమోషనల్‌కి గురి చేస్తుందీ మూవీ. 

Related Articles

Related image1
Anushka Favorite Food: అనుష్కకి ఇష్టమైన ఫుడ్‌ ఏంటో తెలుసా? ప్రభాస్‌ ఇష్టంగా తినేదే స్వీటి కూడా
Related image2
Anupama Parameswaran: రష్మికలా వెయ్యి కోట్ల సినిమాలు చేయలేదు, కానీ కోట్ల హృదయాలను కొల్లగొట్టింది.. 6 సినిమాలతో విశ్వరూపం
35
సినిమాలు వదిలేద్దామనుకున్న త్రివిక్రమ్‌
Image Credit : Asianet News

సినిమాలు వదిలేద్దామనుకున్న త్రివిక్రమ్‌

ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు నిర్మాత స్రవంతి రవికిశోర్‌. త్రివిక్రమ్‌ సినిమా చూశాక ఇక సినిమాలు వదిలేద్దామనుకున్నాడట. స్రవంతి రవికిశోర్‌ మాట్లాడుతూ, `నువ్వు నాకు నచ్చావ్‌` విడుదలైన మొదటి రోజుకి వచ్చిన టాక్‌ చూసి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ చాలా డిజప్పాయింట్‌ అయ్యారు. అంతేకాదు ఆయన ఇక సినిమాలు వదిలేద్దామనే ఆలోచనకు వచ్చారు. అప్పుడు తాను శాంతి థియేటర్‌కి తీసుకెళ్లి ఆడియెన్స్ మధ్యలో త్రివిక్రమ్‌కి సినిమాని చూపించాను. వారి స్పందన చూసి ఆలోచనను మార్చుకున్నారు. ఆ రోజు త్రివిక్రమ్‌ ఆలోచననే మార్చేసింద`ని నిర్మాత తెలిపారు.

45
వెంకటేష్‌దే `నువ్వు నాకు నచ్చావ్` క్రెడిట్‌
Image Credit : Asianet News

వెంకటేష్‌దే `నువ్వు నాకు నచ్చావ్` క్రెడిట్‌

`నువ్వు నాకు నచ్చావ్‌` మూవీని ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్‌ చేస్తున్నారు. కొత్త ఏడాది స్పెషల్‌గా జనవరి 1న ఈ చిత్రాన్ని 4కే లోకి మార్చి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో నిర్మాత స్రవంతి రవికిశోర్‌ ఈ విషయాన్ని చెప్పారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ, ఈ సినిమా క్రెడిట్‌ మొత్తం వెంకటేష్‌ దే అన్నారు. ఆయన స్క్రిప్ట్ విన్న వెంటనే మరో ఆలోచన లేకుండా ఓకే చేశారని, అలా ఓకే చేయడం ఫస్ట్ టైమ్‌ అని, ఆయన ఎలా రియాక్ట్ అవుతారో అని ముందుగా తాను చాలా టెన్షన్‌ పడ్డానని తెలిపారు త్రివిక్రమ్‌.

55
సినిమాలో ఇన్ వాల్వ్ అయి చేసిన వెంకటేష్‌
Image Credit : Jio Hotstar

సినిమాలో ఇన్ వాల్వ్ అయి చేసిన వెంకటేష్‌

అంతేకాదు సినిమా షూటింగ్‌ టైమ్‌లో డైలాగ్‌ పేపర్స్ ముందుగానే తీసుకునే వారట. ఇది హీరో క్యారెక్టర్‌ బేస్డ్ ఫిల్మ్ శ్రీను.. డైలాగ్స్ చాలా ఇంపార్టెంట్‌, ముందే నాకు డైలాగ్‌ పేపర్స్ ఇవ్వు, వాటిని చదివి ఇంకా బెటర్‌ చేసుకుంటాను అని అడిగాడట వెంకటేష్‌. సినిమాలో చాలా ఇన్‌ వాల్వ్ అయి చేశాడని త్రివిక్రమ్ చెప్పారు. ఈ మూవీ రష్‌ మూడు 14 నిమిషాలు వచ్చిందని, చివరికి మూడు గంటల 9 నిమిషాలతో విడుదల చేసినట్టు తెలిపారు నిర్మాత స్రవంతి రవికిశోర్. మొత్తంగా 25ఏళ్ల తర్వాత ఆడియెన్స్ ముందుకు వస్తోన్న `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీని ఈ జనరేషన్‌ ఆడియెన్స్ ఎలా ఆదరిస్తారో చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
దగ్గుబాటి వెంకటేష్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mokshagna: మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీపై క్లారిటీ? ముహూర్తం ఫిక్స్ చేసిన బాలకృష్ణ, రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image2
Krishna Movies: కృష్ణాష్టమికి చూడాల్సిన 7 యానిమేటెడ్ సినిమాలు ఇవే!
Recommended image3
భయపెడుతూ నవ్వించి, 180 కోట్లు కొల్లగొట్టిన హారర్ సినిమా.. ఓటీటీలో ఇప్పటికీ ట్రెండింగే!
Related Stories
Recommended image1
Anushka Favorite Food: అనుష్కకి ఇష్టమైన ఫుడ్‌ ఏంటో తెలుసా? ప్రభాస్‌ ఇష్టంగా తినేదే స్వీటి కూడా
Recommended image2
Anupama Parameswaran: రష్మికలా వెయ్యి కోట్ల సినిమాలు చేయలేదు, కానీ కోట్ల హృదయాలను కొల్లగొట్టింది.. 6 సినిమాలతో విశ్వరూపం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved