MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Anupama Parameswaran: రష్మికలా వెయ్యి కోట్ల సినిమాలు చేయలేదు, కానీ కోట్ల హృదయాలను కొల్లగొట్టింది.. 6 సినిమాలతో విశ్వరూపం

Anupama Parameswaran: రష్మికలా వెయ్యి కోట్ల సినిమాలు చేయలేదు, కానీ కోట్ల హృదయాలను కొల్లగొట్టింది.. 6 సినిమాలతో విశ్వరూపం

రష్మిక మందన్నా ఈ ఏడాది భారీ సినిమాలతో అలరించింది. కానీ అనుపమా పరమేశ్వరన్‌ మాత్రం కంటెంట్ బేస్డ్ చిత్రాలతో ఈ ఏడాది తన విశ్వరూపం చూపించింది. వాహ్‌ అనిపించింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 30 2025, 06:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రష్మికకి షాక్‌ ఇచ్చిన అనుపమా పరమేశ్వరన్‌
Image Credit : instagram/@anupamaparameswaran96

రష్మికకి షాక్‌ ఇచ్చిన అనుపమా పరమేశ్వరన్‌

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా వరుసగా వందల కోట్ల సినిమాలు చేసింది. ఈ ఏడాది ఏకంగా ఆరు సినిమాలు చేసింది. `ఛావా` సుమారు ఎనిమిది వందల కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది రష్మిక సినిమాల కలెక్షన్లు వెయ్యి కోట్లకుపైగానే ఉంటాయని చెప్పొచ్చు. అయితే రష్మికని మించి మెప్పించింది అనుపమా పరమేశ్వరన్‌. చేసింది చిన్న బడ్జెట్‌ చిత్రాలే అయినా ఆడియెన్స్ హృదయాలను గెలుచుకుంది. డిఫరెంట్‌ మూవీస్‌తో మెప్పించింది. ఇండియాలోనే మరే హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా ఈ ఏడాది సినిమాలు చేసి మెప్పించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఆరు సినిమాలతో విశ్వరూపం చూపించిన అనుపమా పరమేశ్వరన్‌
Image Credit : instagram/@anupamaparameswaran96

ఆరు సినిమాలతో విశ్వరూపం చూపించిన అనుపమా పరమేశ్వరన్‌

అనుపమా పరమేశ్వరన్‌ ఈ ఏడాది ఏకంగా ఏడు సినిమాలు చేయడం విశేషం. కానీ అందులో ఒకటి విడుదల వాయిదా పడింది. ఆమె చేసిన అన్ని చిత్రాలు కంటెంట్‌ బేస్డ్ మూవీస్‌ కావడం మరో విశేషం. ఎక్కడా గ్లామర్‌కి ఛాన్స్ లేదు. కానీ అద్భుతమైన నటనతో మెప్పించింది. డీ గ్లామర్ లుక్లో మెప్పించింది. కోట్ల ఆడియెన్స్ హృదయాలను గెలుచుకుంది. అనుపమా పరమేశ్వరన్‌ ఈ ఏడాది తమిళంలో `డ్రాగన్‌`తో తన సినిమాల జాతర స్టార్ట్ చేసింది. ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా నటించిన ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. వంద కోట్లకుపైగా వసూళ్లని రాబట్టింది. ఇందులో హీరోకి లవర్‌గా లెక్చరర్‌గా నటించి మెప్పించింది.

Related Articles

Related image1
Anasuya: `రంగస్థలం`లో రంగమ్మత్త పాత్రని వదులుకున్న స్టార్ హీరోయిన్‌ ఎవరో తెలుసా? సినిమా చూసి ఆమె రియాక్షన్‌ ఇదే
Related image2
New Year Movies: కొత్త ఏడాది స్పెషల్‌గా థియేటర్లో విడుదలయ్యే సినిమాలివే.. చిన్నోడు, పెద్దోడి మధ్య ఫైట్‌
36
లైంగిక బాధితురాలిగా అనుపమా
Image Credit : instagram/@anupamaparameswaran96

లైంగిక బాధితురాలిగా అనుపమా

ఆ తర్వాత మలయాళంలో `జేఎస్‌కే: జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళా` చిత్రంలో నటించింది. ఇది లైంగిక వేధింపులకు గురైన ఒక మహిళకి న్యాయం కోసం జరిగే కథతో రూపొందింది. ఇందులో లైంగిక బాధితురాలిగా అనుపమా పరమేశ్వరన్‌ నటించింది. కోర్ట్ రూమ్‌ డ్రామాగా సాగే ఈ మూవీలో అనుపమా నటన కట్టిపడేస్తుంది. ఇంటెన్సిటీ ఉన్న పాత్రలో అదరగొట్టింది అనుపమా. విశేష ప్రశంసలందుకుంది. ఇది టైటిల్‌ విషయంలో వివాదంలో నిలిచిన విషయం తెలిసిందే.

46
మూఢ విశ్వాసాలపై పోరాటం
Image Credit : instagram/@anupamaparameswaran96

మూఢ విశ్వాసాలపై పోరాటం

అనంతరం `పరదా` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మూఢ ఆచారాలకు ఒక గ్రామం కేరాఫ్‌గా నిలుస్తుంది. ముఖంపై పరదా తీసేయడం వల్ల చోటు చేసుకున్న పరిణామాలు, దాని కారణంగా హీరోయిన్‌ ప్రాణాలే తీయాల్సి రావడంతో ఆ మూఢ సాంప్రదాయంపై హీరోయిన్‌ చేసిన పోరాటం ప్రధానంగా సాగే చిత్రమిది. ఇది బాగానే ఆకట్టుకుంది. కానీ కమర్షియల్‌గా ఆడలేదు. ఇందులో అనుపమా నటన అదిరిపోయింది.

56
దెయ్యంగా భయపెట్టిన అనుపమా
Image Credit : instagram/@anupamaparameswaran96

దెయ్యంగా భయపెట్టిన అనుపమా

ఆ వెంటనే తెలుగులో హర్రర్‌ థ్రిల్లర్‌ `కిష్కిందపురి` మూవీలో నటించింది. ఇందులో హర్రర్‌ అడ్వెంచర్‌కి తీసుకెళ్లే హీరో టీమ్‌లో పనిచేస్తుంది. అదే సమయంలో దెయ్యంగా మారి మెప్పించింది. ఆమె పాత్ర చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. తెలుగు లో బౌన్స్ బ్యాక్‌ అయ్యింది అనుపమా పరమేశ్వరన్‌.  అలాగే మలయాళంలో `ది పెట్‌ డిటెక్టివ్‌` అనే కామెడీ ఫిల్మ్ చేసింది. ఈ చిత్రం మామూలుగానే ఆడింది. ఓటీటీలో మంచి ఆదరణ పొందింది.

66
డీ గ్లామర్ లుక్‌లో అనుపమా రచ్చ
Image Credit : instagram/@anupamaparameswaran96

డీ గ్లామర్ లుక్‌లో అనుపమా రచ్చ

ఇక తమిళంలో `బైసన్‌` అనే చిత్రంలో నటించింది. ఇందులో డీ గ్లామర్‌ లుక్‌లో మెరిసింది. విక్రమ్‌ కొడుకు ధృవ్‌ విక్రమ్‌ సరసన నటించి మెప్పించింది. ప్రేమ కోసం ఫైట్‌ చేసే అమ్మాయిగా అద్భుతమైన నటనని కనబరిచి ఆకట్టుకుంది. వాహ్‌ అనిపించింది. ఇందులో విక్రమ్‌ కంటే పెద్ద ఏజ్‌ అమ్మాయిగా అనుపమా నటించడం విశేషం. ఈ చిత్రం కూడా మంచి వసూళ్లని రాబట్టింది. ఇక ఇటీవల `లాక్‌ డౌన్‌` అనే చిత్రంలో నటించింది అనుపమా. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. ఆ సమయంలో చోటు చేసుకున్న సంఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందించారు. ఈ మూవీ ఈ ఏడాది విడుదల కావాల్సింది, కానీ విడుదల వాయిదా పడింది. ఇందులోనూ ఇంటెన్స్ రోల్‌ చేసింది. ఇలా విభిన్నమైన సినిమాలు, విభిన్నరకాల పాత్రలతో మెప్పించింది. నటిగా విశ్వరూపం చూపించింది అనుపమా.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mystery Movies: సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే టాప్ 5 మిస్టరీ థ్రిల్లర్స్.. చివరి వరకు మతిపోగొట్టే సస్పెన్స్
Recommended image2
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Recommended image3
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Related Stories
Recommended image1
Anasuya: `రంగస్థలం`లో రంగమ్మత్త పాత్రని వదులుకున్న స్టార్ హీరోయిన్‌ ఎవరో తెలుసా? సినిమా చూసి ఆమె రియాక్షన్‌ ఇదే
Recommended image2
New Year Movies: కొత్త ఏడాది స్పెషల్‌గా థియేటర్లో విడుదలయ్యే సినిమాలివే.. చిన్నోడు, పెద్దోడి మధ్య ఫైట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved