MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Aadarsha Kutumbam: ఆదర్శకుటుంబం స్టోరీ ఇదేనా, చాలా కాంప్లికేటెడ్ గా ఉందే.. వెంకీ మామ, త్రివిక్రమ్ పైనే భారం

Aadarsha Kutumbam: ఆదర్శకుటుంబం స్టోరీ ఇదేనా, చాలా కాంప్లికేటెడ్ గా ఉందే.. వెంకీ మామ, త్రివిక్రమ్ పైనే భారం

Aadarsha Kutumbam: విక్టరీ వెంకటేష్ నటించిన ఆదర్శ కుటుంబం మూవీ అక్టోబర్ 9న రిలీజ్ అవుతోంది. ఈ చిత్ర కథ గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆసక్తికర విషయాలు రివీల్ చేశారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 30 2026, 04:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Adarsha Kutumbam
Image Credit : Asianet News

Adarsha Kutumbam

విక్టరీ వెంకటేష్ నుంచి వరుస సినిమాలు రాబోతున్నాయి. అక్టోబర్ 9న దసరా సీజన్ లో ఆదర్శ కుటుంబం చిత్రం రిలీజ్ అవుతోంది. సంక్రాంతికి జనవరి 12న అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జనవరి 12 విడుదల' రిలీజ్ అవుతుంది. అంటే మూడు నెలల వ్యవధిలో వెంకీ మామ నుంచి 2 సినిమాలు రాబోతున్నాయి. ఆదర్శకుటుంబం చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆదర్శకుటుంబం స్టోరీ ఇదే
Image Credit : Asianet News

ఆదర్శకుటుంబం స్టోరీ ఇదే

త్రివిక్రమ్ మూవీ అంటే దాదాపుగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఫిక్స్ అయిపోవచ్చు. ఇప్పటి వరకు విడుదలైన టీజర్స్ చూస్తే ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్థం అయిపొయింది. కథలో చాలా లేయర్స్ ఉన్నట్లు త్రివిక్రమ్ హింట్ ఇచ్చారు. ఈ సినిమా కథ గురించి తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

35
రెండు వర్గాల గొడవ, మధ్యలో వాళ్లపై ఎఫెక్ట్
Image Credit : Asianet News

రెండు వర్గాల గొడవ, మధ్యలో వాళ్లపై ఎఫెక్ట్

ఆదర్శకుటుంబం స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాలి అంటే రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతుంటే మధ్యలోవాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. ఉదాహరణకు రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే ఆ రెండు దేశాల యుద్ధంగానే అందరూ గుర్తిస్తారు కానీ.. దాని వాళ్ళ ఆ రెండు దేశాల ప్రజల గురించి ఎవరూ పట్టించుకోరు. అలా కాకుండా సమస్యని రెండు వర్గాల మధ్యలో ఉన్న వారి కోణం.. రెండు దేశాల ప్రజల కోణం నుంచి చూస్తే ఎలా ఉంటుంది అనే అంశతో ఆదర్శకుటుంబం కథ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

45
ఊహించని సంఘటన జరిగితే..
Image Credit : Asianet News

ఊహించని సంఘటన జరిగితే..

దీంట్లో మరో లేయర్ కూడా ఉంది. త్రివిక్రమ్ బ్లాక్ స్వాన్ ఎఫెక్ట్ గురించి చెప్పారు. అంటే గొప్పవాళ్ళు కూడా ఊహించలేని ఆపద. మనం ఒక పని ప్రారంభించి అన్నీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి అని అనుకుంటాం. సడెన్ గా కరోనా లాంటిది రావడం వల్ల మొత్తం కొలాప్స్ అవుతుంది. అదే విధంగా రెండు వర్గాల మధ్య ఊహించని సంఘటనతో కథ మొత్తం మారిపోతుంది. అదే ఆదర్శకుటుంబం మూవీ లైన్ అని త్రివిక్రమ్ అన్నారు.

55
నటీనటులు
Image Credit : our own

నటీనటులు

వినడానికి కాస్త కాంప్లికేటెడ్ గా ఉంది కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా త్రివిక్రమ్ సింపుల్ గా చెబుతారనే నమ్మకం ఆడియన్స్ కి ఉంది. ఎంటర్టైన్ చేయడానికి విక్టరీ వెంకటేష్ ఎలాగూ ఉన్నారు. ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. నివేత పేతురాజ్ కీలక పాత్రలో నటిస్తోంది. అదే విధంగా డింపుల్ హయతి స్పెషల్ సాంగ్ చేసింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Urvashi Rautela: ఫోటో వాడినందుకు 7 వేల కోట్ల పరువు నష్టం దావా.. చిరంజీవి హీరోయిన్‌ బిగ్‌ షాక్‌
Recommended image2
ఒక్కపూట మాత్రమే భోజనం, రోజంతా ఏం తినకుండానే ఫిట్ గా ఉండే టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?
Recommended image3
Demon Pavan: రీతూని నేను వాడుకోలేదు... బ్రేకప్ చెప్పి షాకిచ్చిన డెమాన్ పవన్..!
Related Stories
Recommended image1
Jr NTR: ఆ రోజు ధైర్యం చెప్పడానికి కుటుంబ సభ్యులెవరూ రాలేదు, చాలా బాధ పడ్డా.. జూ.ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగం
Recommended image2
Nagarjuna: శోభనం పాటలో 'రాముడు', శివ శివా.. తప్పు అర్థం రాకుండా లిరిసిస్ట్ ఎలా రాశారో తెలుసా, హ్యాట్సాఫ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved