MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Urvashi Rautela: ఫోటో వాడినందుకు 7 వేల కోట్ల పరువు నష్టం దావా.. చిరంజీవి హీరోయిన్‌ బిగ్‌ షాక్‌

Urvashi Rautela: ఫోటో వాడినందుకు 7 వేల కోట్ల పరువు నష్టం దావా.. చిరంజీవి హీరోయిన్‌ బిగ్‌ షాక్‌

Urvashi Rautela: లాస్ ఏంజిల్స్‌కు చెందిన ఒక ఏఐ కంపెనీపై ఊర్వశి రౌటేలా టీమ్ లీగల్ యాక్షన్ తీసుకుంది. అనుమతి లేకుండా ఆమె ఫొటోలు వాడినందుకు ఏకంగా రూ.7 వేల కోట్లకు నోటీసులు పంపినట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 30 2026, 04:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఊర్వశి రౌతేలా పరువు నష్టం దావా
Image Credit : Asianet News

ఊర్వశి రౌతేలా పరువు నష్టం దావా

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా అంటే ముందుగా గుర్తొచ్చేది ఆమె గ్లామర్, ఫ్యాషన్. సోషల్ మీడియాలో కూడా ఆమె ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. కానీ, ఇప్పుడు ఆమె సినిమాల వల్ల కాకుండా ఒక లీగల్ వివాదంతో వార్తల్లో నిలిచింది. లాస్ ఏంజిల్స్‌కు చెందిన ఒక ఏఐ (AI) కంపెనీ తన పేరు, ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా కమర్షియల్ అవసరాల కోసం వాడుకుందని ఊర్వశి టీమ్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణల తర్వాత మరో షాకింగ్ విషయం కూడా బయటకొచ్చింది. ఆ ఏఐ కంపెనీ చేసిన పని వల్ల ఊర్వశికి జరిగిన నష్టాన్ని ఏకంగా రూ.7,000 కోట్లుగా ఆమె టీమ్ అంచనా వేసింది. ఇంత పెద్ద మొత్తంలో లీగల్ నోటీసులు పంపడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ టాపిక్ హాట్ టాపిక్‌గా మారింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అనుమతి లేకుండా ఊర్వశి రౌతేలా ఫొటోలు, వీడియోల వాడకం
Image Credit : Instagram

అనుమతి లేకుండా ఊర్వశి రౌతేలా ఫొటోలు, వీడియోల వాడకం

ఊర్వశి రౌటేలా టీమ్ చెప్పిన దాని ప్రకారం.. లాస్ ఏంజిల్స్‌లోని ఆ ఏఐ కంపెనీ ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండానే ఆమె పేరు, ఫొటోలు, వీడియోలను వాడుకుంది. సాధారణంగా సెలబ్రిటీల ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించడం కామనే. కానీ, ఇక్కడ ఆ కంపెనీ కమర్షియల్ లాభాల కోసం ఆమె డిజిటల్ ఐడెంటిటీని వాడుకుందనేది ప్రధాన ఆరోపణ. ఊర్వశి ఫొటోలు, వీడియోలు వాడుకుని ఆ కంపెనీ భారీగా కమర్షియల్ లాభాలు పొందిందని ఆమె టీమ్ చెబుతోంది. అందుకే దీన్ని సాధారణ విషయంగా వదిలేయకుండా, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.

35
అమెరికా ఏఐ కంపెనీపై ఊర్వశి 7 వేల కోట్ల దావా
Image Credit : Instagram

అమెరికా ఏఐ కంపెనీపై ఊర్వశి 7 వేల కోట్ల దావా

ఈ కేసులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం ఆ రూ.7,000 కోట్ల నష్టపరిహారం. ఏఐ కంపెనీ తన ఫొటోలు వాడుకోవడం వల్ల జరిగిన నష్టాన్ని ఊర్వశి టీమ్ ఈ రేంజ్‌లో అంచనా వేసింది. అయితే, దీనిపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది పక్కన పెడితే.. ప్రస్తుతానికి ఈ భారీ మొత్తం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

సోషల్ మీడియాలో టీమ్ క్లారిటీ

ఈ వివాదంపై ఊర్వశి రౌటేలా టీమ్ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. లాస్ ఏంజిల్స్‌కు చెందిన ఆ ఏఐ కంపెనీపై లీగల్ యాక్షన్ తీసుకున్నామని, ఈ కేసును సీరియస్‌గా ముందుకు తీసుకెళ్తున్నామని స్పష్టం చేసింది. ఎలాంటి పర్మిషన్ లేకుండా తమ బ్రాండ్ ఇమేజ్‌ను వాడుకుని ఆ కంపెనీ భారీగా లాభపడిందని మళ్లీ తేల్చి చెప్పింది.

45
ఏఐ కంపెనీలకు ఊర్వశి టీమ్ వార్నింగ్
Image Credit : Instagram

ఏఐ కంపెనీలకు ఊర్వశి టీమ్ వార్నింగ్

ఈ కేసు ద్వారా ఏఐ రంగంలోని కంపెనీలకు ఊర్వశి టీమ్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. ఎవరైనా సొంతంగా ఏఐ టెక్నాలజీని లేదా బ్రాండ్‌ను డెవలప్ చేసుకోవచ్చు. కానీ, వేరొకరి పేరు, ఫొటో, వీడియో లేదా ఐడెంటిటీని వాడుకునేటప్పుడు కచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఏఐ టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న ఈ రోజుల్లో.. సెలబ్రిటీల డిజిటల్ రైట్స్, ఫొటోలు, వీడియోల వాడకంపై పెద్ద చర్చే నడుస్తోంది. ఇలాంటి టైమ్‌లో ఊర్వశి రౌటేలా టీమ్ చేసిన ఈ ఆరోపణలు హాట్ టాపిక్‌గా మారాయి.ప్రస్తుతం ఈ కేసు లీగల్ ప్రాసెస్‌లో ఉంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. రూ.7,000 కోట్ల నష్టపరిహారం, ఏఐ కంపెనీపై ఆరోపణలు, పర్మిషన్ లేకుండా డిజిటల్ కంటెంట్ వాడకం.. ఈ మూడు పాయింట్స్ చుట్టూ ఇప్పుడు బాలీవుడ్‌లో జోరుగా చర్చ జరుగుతోంది.

55
ఊర్వశి రౌతేలా తెలుగు సినిమాలు
Image Credit : Asianet News

ఊర్వశి రౌతేలా తెలుగు సినిమాలు

బాలీవుడ్‌కి చెందిన ఊర్వశి రౌతేలా తెలుగు ఆడియెన్స్ బాగా పరిచయమే. ఆమె స్పెషల్‌ సాంగ్స్ తో తెలుగు ఆడియెన్స్ కి పరిచయం అయ్యింది. చిరంజీవి `వాల్తేర్‌ వీరయ్య`లో బాస్‌ పార్టీ సాంగ్‌లో మెరిసింది. ఆ తర్వాత ఏజెంట్‌లో `వైల్డ్ సాలా` పాటలో ఆకట్టుకుంది. `బ్రో`, `స్కంద` మూవీ పాటలతో అలరించింది. దీంతోపాటు బాలయ్యతో `డాకు మహారాజ్‌` లోనూ స్పెషల్‌ సాంగ్‌లో నర్తించి దుమ్ములేపింది. అంతేకాదు టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చి `బ్లాక్‌ రోజ్‌` అనే చిత్రంలో నటించింది. కానీ ఈ చిత్రం ఇంకా రిలీజ్‌ కాలేదు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఒక్కపూట మాత్రమే భోజనం, రోజంతా ఏం తినకుండానే ఫిట్ గా ఉండే టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?
Recommended image2
Demon Pavan: రీతూని నేను వాడుకోలేదు... బ్రేకప్ చెప్పి షాకిచ్చిన డెమాన్ పవన్..!
Recommended image3
Ntr: నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్‌ స్ట్రాంగ్‌ స్టేట్‌మెంట్‌? తారక్‌ ఎమోషనల్‌ కామెంట్‌కి కారణం ఇదేనా?
Related Stories
Recommended image1
Ntr: నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్‌ స్ట్రాంగ్‌ స్టేట్‌మెంట్‌? తారక్‌ ఎమోషనల్‌ కామెంట్‌కి కారణం ఇదేనా?
Recommended image2
Venkatesh: వెయ్యి రూపాయలు ఇస్తేనే యాక్ట్ చేస్తా.. సొంత తండ్రికే కండీషన్‌ పెట్టిన వెంకటేష్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved