MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒక్కపూట మాత్రమే భోజనం, రోజంతా ఏం తినకుండానే ఫిట్ గా ఉండే టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?

ఒక్కపూట మాత్రమే భోజనం, రోజంతా ఏం తినకుండానే ఫిట్ గా ఉండే టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?

ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కంప్లీట్ గా డైట్ ను ఫాలో అవుతుంటారు.. ప్రోటీన్, ఫైబర్ అంటూ.. క్యాలరీలు కౌంట్ చేస్తూ.. తింటుంటారు. కానీ రోజు మొత్తంలో ఒక్క సారి మాత్రమే భోజనం చేసి.. రోజంతా ఏమీ తినకుండా ఉండే హీరో ఎవరో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 30 2026, 03:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టాలీవుడ్ కామెడీ హీరోగా స్పెషల్ ఇమేజ్..
Image Credit : Asianet News

టాలీవుడ్ కామెడీ హీరోగా స్పెషల్ ఇమేజ్..

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కామెడీ హీరోలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్.. ఆతరువాత కాలంలో అల్లరి నరేష్ కు మాత్రమే ఆ ఇమేజ్ వచ్చింది. నరేష్ టాలీవుడ్ కు దొరికిన అరుదైన కామెడీ హీరో అని చెప్పవచ్చు. 10 ఏళ్లకు పైగా తన సినిమాలతో నవ్వించిన నరేష్.. తరువాత కాలంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కొంత కాలానికి ఆయన కామెడీ ఇమేజ్ తగ్గుతూ వచ్చింది. సినిమా అవకాశాలు కూడా లేని రోజుల్లో.. రూట్ మార్చి సీరియస్ పాత్రలు చేయడం స్టార్ట్ చేశాడు, కామెడీ పాత్రలు వదిలి సీరియస్ సబ్జెక్ట్స్ ను తీసుకుని హిట్లు కొడుతున్నాడు అల్లరి నరేష్. చాలా తక్కువ టైమ్ లోనే నరేష్ 50 సినిమాలు కంప్లీట్ చేశాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హీరో అంటే డైట్ పక్కా..
Image Credit : Asianet News

హీరో అంటే డైట్ పక్కా..

సాధారణంగా సినీ నటులు తమ ఫిట్‌నెస్, గ్లామర్, ఆరోగ్యం కోసం కఠినమైన డైట్ ప్లాన్‌లు పాటించడం చూస్తుంటాం. మరికొంత మంది మాత్రం డైట్ పక్కన పట్టి కడుపునిండా తిని.. కసరత్తులు చేస్తుంటారు. అయితే, అల్లరి నరేష్ ఫుడ్ హ్యాబిట్స్ మాత్రం అందరికంటే చాలా భిన్నంగా, ఆసక్తికరంగా ఉంటాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన విషయాలు, తన ఆహారపు అలవాట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

35
రోజుకు ఒక్క పూటే భోజనం (One Meal A Day)
Image Credit : Asianet News

రోజుకు ఒక్క పూటే భోజనం (One Meal A Day)

అల్లరి నరేష్ వెల్లడించిన షాకింగ్ విషయం ఏమిటంటే ఆయన రోజుకు ఒక్కసారి మాత్రమే (One Meal A Day) భోజనం చేస్తారు. రోజంతా మిగిలిన సమయంలో ఎలాంటి ఆహారాన్ని తీసుకోకపోవడం ఆయన అలవాటు. ఒకవేళ మధ్యాహ్నం లంచ్ చేస్తే, ఇక రాత్రికి డిన్నర్ ఉండదు. లేదా ఒకవేళ రాత్రికి డిన్నర్ తింటే, మధ్యాహ్నం లంచ్ ఉండదు. ఈ విధంగా రోజుకు ఒక పూట మాత్రమే ఆహారం తీసుకోవడం వల్ల తనకు శరీరానికి కావాల్సిన శక్తి సరిపోతుందని నరేష్ అభిప్రాయం.

45
స్కాక్స్, జూస్ లాంటివి ఉండవు..
Image Credit : our own

స్కాక్స్, జూస్ లాంటివి ఉండవు..

సాధారణంగా చాలామందికి భోజనానికి, భోజనానికి మధ్యలో ఏదో ఒక స్నాక్ లేదా పండ్లు తినే అలవాటు ఉంటుంది. కానీ నరేష్ విషయంలో మాత్రం ఇలాంటిదేమి ఉండదు. రోజు మొత్తంలో ఒక్క సారి భోజనం చేయడం తప్పించి.. మధ్య గ్యాప్‌లో ఏమీ తినడు. చివరికి షూటింగ్ గ్యాప్ లో కొబ్బరినీళ్లు, హెల్తీ జ్యూస్‌‌లు లాంటివి కూడా ఆయన తీసుకోరు. అంతే కాదు ఇంట్లో సాధారణంగా స్నాక్స్, మురుకులు, కారప్పూస, స్వీట్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. కానీ తినుబండారాల జోలికి అస్సలు వెళ్లరట నరేష్.

55
ఫుడ్ టెంప్టేషన్ లేదు..
Image Credit : our own

ఫుడ్ టెంప్టేషన్ లేదు..

నరేష్ ఇలా తినకపోవడానికి కారణం.. అసలు ఆయనకు ఫుడ్ టెంప్టేషన్ ఉండదు. చాలామందికి నచ్చిన వంటకాలు చూసినప్పుడు లేదా ఇష్టమైన పదార్థాలు ఎదురుగా ఉన్నప్పుడు తినాలనే కోరిక పుడుతుంది. కొంత మంది ఆపుకోలేక తింటుంటారు కూడా. కానీ అల్లరి నరేష్‌కు అలాంటి ఫుడ్ టెంప్టేషన్ (ఆహారపు ఆకర్షణ) అస్సలు ఉండదట. ఆహారాన్ని చూసి టెంప్ట్ అవ్వడం తన జీవితంలో ఎప్పుడూ జరగలేదని ఆయనే స్వయంగా చెప్పారు.తినే ఆ ఒక్క పూట భోజనం మాత్రం చాలా హెవీగా తింటానని నరేష్ తెలిపారు. ఆ ఒక్క మీల్‌లో శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు, రైస్, రొట్టెలు, కూరలు, గుడ్లు, పండ్లు ఉండేలా చూసుకుంటారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Demon Pavan: రీతూని నేను వాడుకోలేదు... బ్రేకప్ చెప్పి షాకిచ్చిన డెమాన్ పవన్..!
Recommended image2
Ntr: నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్‌ స్ట్రాంగ్‌ స్టేట్‌మెంట్‌? తారక్‌ ఎమోషనల్‌ కామెంట్‌కి కారణం ఇదేనా?
Recommended image3
Rajamouli: 3 నెలల్లో సినిమా తీస్తా అని మాటిచ్చి... రెండేళ్లు సాగదీసిన రాజమౌళి, రమా రాజమౌళి చెప్పిన సీక్రెట్..
Related Stories
Recommended image1
Rajamouli: 3 నెలల్లో సినిమా తీస్తా అని మాటిచ్చి... రెండేళ్లు సాగదీసిన రాజమౌళి, రమా రాజమౌళి చెప్పిన సీక్రెట్..
Recommended image2
Udaya Bhanu: 150 ఎకరాలు దానం చేసిన జమీందారు, యాంకర్ ఉదయభాను తండ్రి గురించి మీకు తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved