MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Trisha: త్రిషని స్టార్ హీరోయిన్ చేసిన సినిమాలు ఇవే.. ఈ 5 మూవీస్ లేకపోతే ఆమెకి కెరీర్ లేదు

Trisha: త్రిషని స్టార్ హీరోయిన్ చేసిన సినిమాలు ఇవే.. ఈ 5 మూవీస్ లేకపోతే ఆమెకి కెరీర్ లేదు

దళపతి విజయ్ తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ఆయన టీవీకే పార్టీ తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించింది. ఈ తరుణంలో హీరోయిన్ త్రిష సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 04 2026, 03:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సోషల్ మీడియాలో త్రిష ట్రెండింగ్
Image Credit : Asianet News

సోషల్ మీడియాలో త్రిష ట్రెండింగ్

తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ టీవీకే పార్టీ సరికొత్త చరిత్ర సృష్టించింది. అనూహ్యంగా టీవీకే పార్టీ తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించింది. విజయ్ విజయం సాధించడంతో త్రిష ఈ ఉదయం నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నారు. కొంత కాలంగా విజయ్, త్రిష రిలేషన్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల కారణంగా విజయ్ వ్యక్తిగత జీవితం కూడా సమస్యల్లో చిక్కుకుంది. గెలుపు బాటలో టీవీకే పార్టీ పయనిస్తుండడంతో త్రిష స్వయంగా దళపతి విజయ్ ఇంటికి వెళ్లారు. దీనితో వీరిద్దరి రిలేషన్ పై ఊహాగానాలు మరింతగా పెరిగాయి. ఈ క్రమంలో త్రిష సినీ కెరీర్ గురించి అభిమానులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. తెలుగులో త్రిష నటించిన సూపర్ హిట్ సినిమాలు ఏంటో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వర్షం
Image Credit : Varsham Movie

వర్షం

త్రిషకి తెలుగులో దక్కిన తొలి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ వర్షం. ప్రభాస్ కి కూడా ఇదే ఫస్ట్ పెద్ద హిట్. ఈ సినిమాతో త్రిష యువతలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఎన్నాళ్లకు గుర్తొచ్చానే వాన అనే పాట అప్పట్లో మారుమోగింది.

36
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
Image Credit : sun next

నువ్వొస్తానంటే నేనొద్దంటానా

హీరో సిద్దార్థ్, త్రిష జంటగా నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎన్నారై యువకుడిగా సిద్దార్థ్, పల్లెటూరి అమ్మాయి త్రిష ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. ఈ మూవీతో త్రిష తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

46
అతడు
Image Credit : Hotstar

అతడు

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు, త్రిష జంటగా నటించిన మూవీ అతడు. పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ కథకి ఫ్యామిలీ అంశాలు జోడించి అద్భుతంగా తెరకెక్కించారు త్రివిక్రమ్. ఈ మూవీలో మహేష్, త్రిష జోడి చూడ ముచ్చటగా ఉంటుంది.

56
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
Image Credit : zee5

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే

విక్టరీ వెంకటేష్, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం ఎమోషనల్ లవ్ స్టోరీగా ఆకట్టుకుంది. పాటలు కూడా చాలా బావుంటాయి. ఈ మూవీలో వెంకీ, త్రిష మధ్య ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి.

66
కృష్ణ
Image Credit : Asianet News

కృష్ణ

రవితేజ సరసన త్రిష నటించిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. వివి వినాయక్ ఈ చిత్రానికి దర్శకుడు. వీటితో పాటు త్రిష నటించిన మరికొన్ని సినిమాలు యావరేజ్ గా నిలిచాయి. ఇప్పటికీ త్రిష తమిళ తెలుగు భాషల్లో క్రేజీ హీరోయిన్ అనే చెప్పాలి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
R Madhavan: 'నువ్వు అహంకారిగా ఉండాలి'.. కొడుక్కి మాధవన్ ఎందుకలా సలహా ఇచ్చాడు?
Recommended image2
Namitha: తాళి, బొట్టు ఆడవాళ్లకేనా? మగవాళ్లకు ఎందుకు లేవు?.. దుమారం రేపుతున్న నమిత కామెంట్స్
Recommended image3
Chaitra Rai Remuneration: ఐదు రోజులకు చైత్ర రాయ్‌ ఎంత పారితోషికం అందుకుందో తెలుసా?.. ఆ భ్రమలకు ఫుల్‌ స్టాప్‌
Related Stories
Recommended image1
Tarun: వీళ్ళ దెబ్బకు చిరు, పవన్, వెంకీ లకు చెమటలు..తక్కువ టైంలోనే క్రేజ్, అంతే వేగంగా కనుమరుగైన ఐదుగురు
Recommended image2
OTT Movies: ఈ వారం ఓటీటీలో క్రేజీ సినిమాలు.. అడివి శేష్ డెకాయిట్ నుంచి ప్రదీప్ రంగనాథన్ ఎల్ఐకె వరకు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved